new secretariat
-
ప్రజల చెంతకే వైద్య సేవలు అందుతున్నాయి: ఎమ్మెల్యే శ్రీనివాసరావు
-
హైదరాబాద్ : కొత్త సచివాలయం వద్ద వర్షపు నీరు (ఫొటోలు)
-
దశాబ్ది ఉత్సవాలు.. విద్యుత్ వెలుగుల్లో సచివాలయం, అమరవీరుల స్ధూపం (ఫొటోలు)
-
రెండు కళ్ళు సరిపోవు అబ్బా ...
-
ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం
-
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ నూతన సచివాలయం వద్ద గోషామహల్ ఎమ్మెల్యేను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. రాజాసింగ్‌ను కొత్త సెక్రటేరియట్‌లోకి అనుమతించలేదు. ఈ సందర్బంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లా అభివృద్ధికి చర్చలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనను ఆహ్వానించారని అన్నారు. తలసాని ఆహ్వానం మేరకు తాను సెక్రటేరియట్‌కు వచ్చినట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. భద్రతా సిబ్బంది.. రాజాసింగ్‌ను లోపలికి అనుమతించకపోవడంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. పొంగులేటి కొత్త పార్టీ? -
సచివాలయానికి నీలకంఠాభరణం...!
-
TS New Secretariat Latest Images: తెలంగాణ కొత్త సెక్రటేరియట్ లోపలి లుక్ చూసేయండి (ఫొటోలు)
-
TS New Secretariat: కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ (ఫొటోలు)
-
కొత్త సచివాలయం ప్రారంభ సంబరాలు (ఫొటోలు)
-
Secretariat : నూతన సచివాలయంలో చాంబర్లను స్వీకరించిన మంత్రులు ( ఫొటోలు)
-
విద్యుత్ దీపాల ధగధగలతో తెలంగాణ కొత్త సచివాలయం.. ఫోటోలు వైరల్
-
సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తమిళిసై గైర్హాజరు.. రాజ్‌భవన్ క్లారిటీ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొత్త సచివాలయాన్ని ప్రారంభమైంది. కాగా, ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి రాకపోవడంపై గవర్నర్ తమిళిసై వివరణ ఇచ్చారు. సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం పంపలేదు. దీనిపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు. గవర్నర్‌కు ఆహ్వానం పంపామని ప్రభుత్వం అనడం తప్పు. ఆహ్వానం రాకపోవడం వల్లే సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లలేదు అంటూ రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ పేరుతో మరో కొత్త పార్టీ.. -
Video: కొత్త సచివాలయానికి రేవంత్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయంకు బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఓఆర్ఆర్ టెండర్లపై ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా.. విషయం తెలుసుకున్న పోలీసులు కిలోమీటర్ దూరంలోనే సెక్రటేరియట్ సమీపంలోని టెలిఫోన్ భవన్ దగ్గర అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అంతేగాక సెక్రటేరియేట్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి విజిటర్స్ గేటును మూసేశారు. కాగా ఔటర్ రింగ్ రోడ్డు లీజు అంశంపై ఫిర్యాదు చేసేందుకు రేవంత్ రెడ్డి.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ అపాయింట్మెంట్ కోరారు. అయితే ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరు. అనుమతిఅరవింద్ కుమార్ లేకపోవడంతో సచివాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. అందుకే రేవంత్‌రెడ్డిని టెలిఫోన్ భవన్ వద్దే అడ్డుకున్నారు. చివరకు ఆయన వెళ్లాల్సిన డిపార్ట్మెంట్ కొత్త భవనంలో లేదంటూ పోలీసులు ఆయన వాహనాన్ని మాసబ్ ట్యాంక్‌లోని అడ్మినిస్ట్రేషన్ భవన్‌కు తరలించారు. చదవండి: ఎమ్మెల్సీ కవితపై ఈడీ కీలక అభియోగాలు.. తెరపైకి భర్త అనిల్ పేరు.. పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక ఎంపీగా సచివాలయానికి వెళ్తే పోలీసులకు అభ్యంతరమేంటి? అని మండిపడ్డారు. ఎంపీని సచివాలయానికి వెళ్లకుండా రోడ్డుపైనే అడ్డుకోవడం, అప్రజాస్వామికం, దుర్మార్గమన్నారు. నడిరోడ్డుమీదే కారులోంచి డీజీపీతో ఫోన్లో మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం ప్రకారం ఫిర్యాదు అందించడానికి సచివాలయం వెళ్తున్నానని, స్పెషల్ సెఎస్ లేకుంటే సంబంధిత శాఖలో ఏ అధికారినైనా కలిసి పేపర్ అంస్తానని అందిస్తానని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన అవినీతి బయటపడుతుందనే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నిన్నటి నుంచే సెక్రటేరియట్ నుంచి పరిపాలన సాగుతుందని కేసీఆర్ చెప్పారు. అంబేద్కర్ సిద్ధాంతాల గురించి ఉపన్యాసం ఇచ్చి.. 24గంటలు తిరక్కముందే మరిచారు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఎమ్మెల్యేలు, ఎంపీలను సచివాలయానికి రాకుండా అడ్డుకోలేదు. టోల్‌కు సంబంధించి టేండర్ ప్రక్రియలో పాల్గొన్న కంపెనీల వివరాలు ఆర్టీఐ ద్వారా అడిగేందుకు వెళ్లా. కానీ పోలీసులు చుట్టుముట్టి నన్ను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ను ప్రజలు బొంద పెట్టే రోజు దగ్గర్లోనే ఉంది. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొత్తం టెండర్లపై విచారణ చేయిస్తాం. ఇందులో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు.’ అని మండిపడ్డారు. -
విద్యుత్ దీపాల ధగధగలతో తెలంగాణ కొత్త సచివాలయం.. ఫోటోలు వైరల్
విద్యుత్ దీపాల ధగధగలతో తెలంగాణ కొత్త సచివాలయం.. ఫోటోలు వైరల్ -
పాలమూరు ఎత్తిపోతల పథకలపై అధికారులతో రివ్యూ
-
మంత్రులు.. తొలి సంతకాలు
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయ ప్రారంభం అనంతరం మంత్రులు వారికి కేటాయించిన చాంబర్లకు చేరుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సిద్ధం చేసిన ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. ఏ మంత్రి.. ఏ ఫైలుపై సంతకం చేశారంటే.. కేటీఆర్ (ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ): డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం. హరీశ్‌రావు (ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి): రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో 1,827 స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ ఫైలుపై తొలి సంతకం. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు సాయం కింద రూ.151.64 కోట్ల నిధుల విడుదల ఫైలుకూ క్లియరెన్స్. గంగుల కమలాకర్ (పౌరసరఫరాల, బీసీ సంక్షేమ శాఖ): అంగన్వాడీలకు పోషకాలతో కూడి న సన్నబియ్యం పంపిణీ ఫైలుపై తొలి సంతకం. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల వార్షిక ప్రణాళికల ఫైలుపై మరో సంతకం. తలసాని శ్రీనివాస్ యాదవ్ (పశుసంవర్థక, మత్య్స శాఖ): ఉచిత చేపపిల్లల పంపిణీ ఫైలుపై తొలిసంతకం చేశారు. గొర్రెల పంపిణీ కోసం ఎన్సీడీసీ నిధుల విడుదల, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సమీపంలో నిర్మిస్తున్న విజయ మెగా డెయిరీ పనులకు రూ.75కోట్ల గ్రాంటు విడుదల ఫైళ్లకు ఆమోదం. సత్యవతి రాథోడ్ (గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ): అంగన్వాడీల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సంపూర్ణ ఆహార పథ కానికి ఇకపై బలవర్ధక సన్నబియ్యంతో కూడిన ఆహారాన్ని అందించే ఫైలుపై తొలి సంతకం. మల్లారెడ్డి (కార్మిక, ఉపాధి కల్పన శాఖ): కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవ్వనున్న శ్రమశక్తి అవార్డుల ఫైలుపై తొలి సంతకం. కొప్పుల ఈశ్వర్ (ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ): దళితబంధు పథకం రెండో విడత లబ్దిదారుల ఎంపిక ఫైలుపై తొలి సంతకం. ఎర్రబెల్లి దయాకర్‌రావు (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ): రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త మండలాల్లో ఐకేపీ భవన నిర్మాణాలకు సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం. మహమూద్ అలీ (హోంమంత్రి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో జోన్ల పునర్వ్యవస్థీకరణ, కొత్త పోలీస్ స్టేషన్లలో పోస్టుల మంజూరు ఫైలుపై తొలి సంతకం. శ్రీనివాస్‌గౌడ్ (ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖ): రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ కప్ క్రీడాపోటీల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (వ్యవసాయ, సహకార శాఖ): రైతులకు రాయితీపై పచి్చరొట్ట విత్తనాల పంపిణీ ఫైలుపై తొలి సంతకం. అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెక్‌డ్యాంల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై రెండో సంతకం. వేముల ప్రశాంత్‌రెడ్డి (రోడ్లు, భవనాల శాఖ): రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ పునర్వ్యవస్థీకరణ ఫైలుపై తొలి సంతకం. జగదీశ్‌రెడ్డి (విద్యుత్ శాఖ): వ్యవసాయానికి రూ.958.33 కోట్ల విద్యుత్ రాయితీ విడుదల ఫైలుపై తొలి సంతకం. ఇంద్రకరణ్‌రెడ్డి (దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణ శాఖ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో వంద ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేసే ఫైలుపై తొలి సంతకం. ప్రధాన దేవాలయాల్లో తృణధాన్యాలతో కూడిన ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చే ఫైలుపై రెండో సంతకం. సబితారెడ్డి (విద్యాశాఖ): ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 19,800 మంది టీచర్లకు రూ. 34. 25 కోట్లతో ట్యాబ్‌లు అందజేసే ఫైలుపై తొలి సంతకం. 5వేల ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్ల ఏర్పాటు ఫైలుపై మరో సంతకం. అజయ్‌కుమార్ (రవాణాశాఖ): కొత్త జిల్లాల్లో రవాణాశాఖ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం. -
6వ అంతస్తులో.. 6 ఫైళ్లపై సంతకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కొత్త సచివాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 1.24 గంటల సమయంలో ప్రారంభించారు. తర్వాత 6వ అంతస్తులోని తన చాంబర్‌కు వెళ్లి సీట్లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా తన సెంటిమెంట్ లక్కీ నంబర్ 6కు తగ్గట్టుగా 6 ఫైళ్లపై సంతకాలు చేశారు. ♦ 2023–24లో దళితబంధు పథకం అమలుకు సంబంధించిన ఫైల్‌పై సీఎం కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో అమలు చేసిన హుజూరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగతా 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున లబ్దిదారులకు ఈ పథకాన్ని వర్తింపచేసే ప్రతిపాదనలను ఆమోదించారు. ♦ పోడుభూముల పట్టాల పంపిణీకి సంబంధించిన ఫైలుపై రెండో సంతకం చేశారు. మే నెల నుంచి జిల్లాల వారీగా పోడు పట్టాల పంపిణీ చేపట్టనున్నారు. మొత్తంగా లక్షా 35 వేల మందికి దాదాపు 3.9 లక్షల ఎకరాలకు సంబంధించి పట్టాలు ఇవ్వనున్నారు. ♦ సీఎంఆర్ఎఫ్ నిధుల పంపిణీకి సంబంధించిన ఫైలుపై సీఎం మూడో సంతకం చేశారు. ♦గర్భిణులకు పౌష్టికాహారం అందించే.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు సంబంధించిన ఫైలుపై నాలుగో సంతకం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేపట్టనున్నారు. ఈ ఏడాది 6.84 లక్షల మంది గర్భిణులకు 13.08 లక్షల కిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో కిట్ విలువ రూ.రెండు వేలు. ఈ పథకానికి ప్రభుత్వం మొత్తం రూ.277 కోట్లు ఖర్చు చేయనుంది. ♦ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైలుపై సీఎం ఐదో సంతకం సంతకం చేశారు. ♦ పాలమూరు లిఫ్టు ఇరిగేషన్‌కు సంబంధించిన ఫైలుపై ఆరో సంతకం చేశారు. కరివెన, ఉద్ధండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణపూర్, కొడంగల్, వికారాబాద్‌లకు తాగునీటిని సరఫరా చేసే కాల్వల పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశారు. -
Telangana: రాష్ట్ర పునర్నిర్మాణ ప్రతీక
చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం, పాలమూరు, ఇతర ప్రాజెక్టులన్నీ తెలంగాణ పునర్నిర్మాణ ప్రతీకలే.. వేసవిలోనూ మత్తడి దూకే చెరువులే సాక్ష్యం సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం నడిబొడ్డున తలెత్తుకుని నిలిచిన కొత్త సచివాలయం తెలంగాణ పునర్మిర్మాణానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, అతి తక్కువ కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలవడమే.. తెలంగాణ సాధించిన ప్రగతి అన్నారు. హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ తీరాన నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. తర్వాత ఆయనతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులై.. కొత్త సచివాలయం నుంచి తొలి సంతకాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రసంగం సారాంశం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ అవతరణకు ముందు అనేక వాదోపవాదాలు, అనేక చర్చలు చూశాం. తెలంగాణ అవతరించిన తర్వాత కూడా పునర్నిర్మాణం కోసం అంకితభావంతో అడుగులు వేస్తున్న సందర్భంలో.. తెలంగాణ భావాన్ని, అర్థాన్ని, పునర్నిర్మాణ కాంక్షను జీర్ణించుకోలేని కొందరు పిచ్చివాళ్లు కారుకూతలు కూశారు. ఉన్నయన్ని కూలగొట్టి కడతారా? మొత్తం తెలంగాణనే కూలగొట్టి మళ్లా కడతారా? అని కొందరు మరుగుజ్జులు చిల్లర వ్యాఖ్యలు చేశారు. అవేవీ పట్టించుకోకుండా ఈ రోజు ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది తెలంగాణ రాష్ట్రం. వేసవిలోనూ మత్తడి దూకే చెరువులతో.. పునర్నిర్మాణం అంటే ఏమిటో తెలియని మరుగుజ్జులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సమైక్య పాలనలో చిక్కిశల్యమై శిథిలమై రంధ్రాలు పడి వచ్చిన కాస్త నీటిని కూడా కోల్పోయిన పరిస్థితుల్లో.. కాకతీయ రాజుల స్ఫూర్తితో మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నింటినీ పునరుద్ధరించుకోవడమే పునర్నిర్మాణం. నాడు సమైక్య రాష్ట్రంలో గోదావరిలో నీళ్లు ఎక్కడున్నాయో వెతుక్కునే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లే. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టుకున్నాం. ఇదీ పునర్నిర్మాణం. ఉప నదుల మీద, వాగుల మీద నిర్మించిన చెక్‌డ్యామ్‌లతో ఎక్కడ చూసినా నీళ్లే. ఏప్రిల్, మేలో కూడా చెరువులు మత్తడి దూకడమే పునర్నిర్మాణం. నాడు నెర్రెలుబారి బీళ్లుగా మారిన లక్షల ఎకరాల తెలంగాణ భూములు.. నేడు నిండుగా వెదజల్లుతున్న హరితకాంతులే తెలంగాణ పునర్నిర్మాణం. ఈ యాసంగిలో దేశంలో 94 లక్షల ఎకరాల్లో వరి వేస్తే.. అందులో 56లక్షల ఎకరాలు తెలంగాణలోనివే. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఒక కాళేశ్వరం, ఒక పాలమూరు, ఒక సీతారామ ప్రాజెక్టు. దేశానికే ఆదర్శంగా వెలుగుతూ.. పరిపాలనా సంస్కరణలతో, ఆచరణాత్మకంగా 33 జిల్లాలతో అలరారుతూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ వెలుగుతోంది. సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమంతోపాటు పారిశ్రామిక విధానంతో లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇండస్ట్రియల్, ఐటీ విధానంలో బెంగళూరును కూడా దాటేసి తారాజువ్వలా దూసుకుపోతోంది. మత కల్లోలాల ఊసే లేకుండా.. అరాచక శక్తులను అణచివేస్తూ.. శాంతి భద్రతలను కాపాడుతూ తెలంగాణ పోలీసులు దేశానికి మార్గదర్శకులుగా మారారు. గత పదేళ్లుగా తెలంగాణలో ఒక చిన్న మత కల్లోలం కూడా లేకుండా చేశాం. మహిళలకు భరోసానిస్తూ షీ టీమ్‌లు పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయికి హైదరాబాద్ అంతర్జాతీయ నగరాలకు దీటుగా హైదరాబాద్.. ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, ఎన్నోరకాల సౌకర్యాలతో ముందుకుపోతోంది. నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు, అద్భుతమైన వరంగల్ హెల్త్ సిటీ.. ఇవన్నీ తెలంగాణ పునర్మిర్మాణానికి ప్రతీకలు. భూలోక వైకుంఠంగా యాదాద్రి ఆలయ పునర్మిర్మాణం జరిగింది. మహనీయుడి స్ఫూర్తితో.. అంబేడ్కర్, గాంధీజీ చూపిన బాటలో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. ఆకాశమంత ఎత్తున అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. సెక్ర టేరియట్కు వచ్చే సీఎం, మంత్రులు, అధికారులందరికీ నిత్యం బాబాసాహెబ్ ఆదర్శాలు స్ఫురణకు రావాలని, అంకితభావంతో పనిచేయాలనే ఉద్ధేశంతో సచివాలయానికి ఆయన పేరు పెట్టుకున్నాం. ఇదే కోవలో భవిష్యత్తుకు బాటలు వేసుకుంటామని అందరికీ హామీనిస్తున్నాం. తెలంగాణ సాధన పోరాటంలో అసువులు బాసిన వారికి అంజలి ఘటిస్తున్నాం’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అభివృద్ధి కొలమానాల్లో మనమే టాప్ ప్రపంచంలో అభివృద్ధిని, పునర్నిర్మాణాన్ని కొలమానంగా తీసుకునే సూచికలు రెండే రెండు. ఒకటి తలసరి ఆదాయం (పర్‌క్యాపిటా ఇన్కమ్), రెండోది తలసరి విద్యుత్ వినియోగం (పర్ క్యాపిటా పవర్ యుటిలైజేషన్). ఇప్పుడు తెలంగాణ రూ.3,00,017 తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్ వన్‌గా ఉంది. ఒకనాడు సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,100 యూనిట్లుగా ఉంటే.. నేడు 2,140 యూనిట్లతో దేశంలోనే అగ్రభాగానికి చేరింది. ఇదే తెలంగాణ పునర్మిర్మాణం. నిరాదరణకు గురైన వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎందరో బాధితులు రూ.2,016 ఆసరా పింఛన్లు అందుకుంటూ చిరునవ్వుతో బతుకుతున్నారు. తెలంగాణ పునర్మిర్మాణంలో భాగంగా చేపట్టిన సచివాలయం అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఈ నిర్మాణంలో పాలుపంచుకున్న వివిధ రాష్ట్రాల కూలీలు, కార్మికులకు తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు. అడవులను తిరిగి తెచ్చుకున్నాం నాడు క్షీణించిపోయి ఆగమైన అడవులు ఇప్పుడు అటవీశాఖ పీసీసీఎఫ్‌లు, ఇతర అధికారుల పట్టుదల, కృషితో దేశంలోనే రికార్డు స్థాయిలో పునరుద్ధరణ అయ్యాయి. కోల్పోయిన అడవులను తిరిగి తెచ్చుకోడమే పునర్నిర్మాణం. వలసపోయిన పాలమూరు కూలీలంతా తిరిగొచ్చి సొంత పొలాల గట్ల మీద కూర్చుంటే.. ఇతర రాష్ట్రాల కూలీలు తెలంగాణ పొలాల్లో పనిచేస్తున్న దృశ్యాలే తెలంగాణ పునర్నిర్మాణం. ఒకనాడు దాహంతో అల్లాడి ఫ్లోరైడ్‌తో నడుం వంగి లక్షలాది మంది జీవితాలు కోల్పోయిన తెలంగాణలో మిషన్ భగరీథ ద్వారా ఇంటింటికీ నీరందిస్తున్నాం. హైదరాబాద్ బంజారాహిల్స్ ఏ నీళ్లు ఉంటాయో.. ఆదిలాబాద్ గోండు గూడెంలో అదే నీరందిస్తున్న మిషన్ భగరీథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక. కరెంటు వెలుగులతో.. కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియక.. పారిశ్రామికవేత్తల ధర్నాలు, ప్రజల గగ్గోలు, జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లతో ఉన్న రాష్ట్రంలో.. ఇప్పుడు అవన్నీ మాయమయ్యాయి. తెలంగాణ కరెంటు వెలుగుజిలుగులతో విరాజిల్లుతోంది. నాడు పొలాల బోర్లు ఆన్ చేసుకునేందుకు అర్ధరాత్రి పొలాలకు వెళ్లి కరెంటు షాకులు, పాము, తేలు కాట్లతో చనిపోయిన రైతులు.. నేడు పొద్దున్నుంచి సాయంత్రం 6 గంటల దాకా పొలాలకు నీరు పారించుకొని.. దర్జాగా ఇంటికి వచ్చి కంటినిండా కునుకుతీస్తున్నారు. ఇదీ తెలంగాణ పునర్నిర్మాణం. గ్రామాలు, పట్టణాలు ఎంత అద్భుతంగా అలరారుతున్నాయో, ఎన్ని అవార్డులు సొంతం చేసుకుంటున్నాయో అందరికీ తెలుసు. -
Secretariat : నూతన సచివాలయంలో చాంబర్లను స్వీకరించిన మంత్రులు ( ఫొటోలు)
-
కొత్త సచివాలయం ప్రారంభ సంబరాలు (ఫొటోలు)
-
TS New Secretariat: కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ (ఫొటోలు)
-
కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వేళ కాంటాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కాంటాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్‌కు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఎంతోకాలంగా రెగ్యులరైజ్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల ఎట్టకేలకు తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సాకారమైంది. రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లోని 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్న సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. చదవండి: కొంతమంది పిచ్చి కూతలు కూశారు: సీఎం కేసీఆర్ నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ శుభవార్త. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ పై మొదటి సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందరికీ శుభాకాంక్షలు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. — Harish Rao Thanneeru (@BRSHarish) April 30, 2023 ప్రభుత్వం నిర్ణయంతో 2,909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు(ఒకేషనల్), 390 మంది పాలిటెక్నిక్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్యశాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులతో పాటు పలు విభాగాలకు సంబంధించిన పోస్టులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: కొత్త సచివాలయం వారి ప్రేమకు చిహ్నం: బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు మొత్తం 40 విభాగాల్లో, 5544 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఉత్తర్వులు విడుదల. https://t.co/w0TPP3QJp2 pic.twitter.com/hxTzoUoqBs — Harish Rao Thanneeru (@BRSHarish) April 30, 2023 నూతన సచివాలయంలోని తన ఛాంబర్లో సీఎం కేసీఆర్ సంతకాలు చేసిన ఫైళ్ల వివరాలు.. 1. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు సంబంధించిన ఫైలుమీద సిఎం కేసీఆర్ సంతకం చేశారు. 2. దళితబంధు పథకం 2023-24 సంవత్సరంలో అమలుకు సంబంధించిన ఫైలు మీద నూతన సచివాలయంలో సంతకం చేశారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో అమలు చేసిన హుజూరాబాద్ మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజక వర్గానికి 1100 లబ్ధిదారుల చొప్పున దళిత బంధు పథకాన్ని వర్తింపచేయాలనే ఫైలుమీద సీఎం కేసీఆర్ సంతకం చేశారు. 3. పోడుభూముల పట్టాల పంపిణీ కి సంబంధించిన ఫైలుమీద కేసీఆర్ సంతకం చేశారు. మే నెల నుంచి జిల్లాల వారీగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. తద్వారా 1 లక్షా 35 వేల మంది లబ్ధిదారులకు దాదాపు 3.9 లక్షల ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలు అందచేయనున్నారు . 4 సీఎంఆర్ఎఫ్ నిధులు లబ్ధిదారులకు సంబంధించిన ఫైలు మీద కేసీఆర్ సంతకం చేశారు. 5. గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అందించే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు సంబంధించిన ఫైలు మీద సీఎం సంతకంచేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ జరుగనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 13.08 లక్షల కిట్స్ పంపిణీ చేయాలని లక్ష్యంగా ఎంచుకున్న నేపథ్యంలో 6.84 లక్షల మంది గర్భిణిలు లబ్ధి పొందనున్నారు. కాగా ఒక్కో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ విలువ రెండు వేల రూపాయలు. ఇందుకు గాను ప్రభుత్వం మొత్తం రూ. 277 కోట్లు ఖర్చు చేయనున్నది. 6. పాలమూరు లిఫ్టు ఇరిగేషన్‌కు సంబంధించిన ఫైలు మీద సిఎం కేసీఆర్ సంతకం చేశారు. -
తెలంగాణ పరిపాలన కేంద్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది
-
కొత్త సచివాలయంలో తొలి సంతకం చేసిన కేటీఆర్, సీఎస్
-
కొత్త సచివాలయంలో హరీష్ రావు తొలి సంతకం
-
తెలంగాణ కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్
-
కొంతమంది పిచ్చి కూతలు కూశారు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణ కాంక్షను అర్థం చేసుకోలేక కొంతమంది పిచ్చికూతలు కూశారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. సచివాలయం కూలుస్తారా అంటూ తప్పుడు ప్రచారం చేశారని.. ఇప్పుడు వారికి బుద్ధి వచ్చేలా ఆకాశమంతా అద్భుతమైన సచివాలయాన్ని నిర్మించామని తెలిపారు. అంబేద్కర్, గాంధీజీ చూపించిన మార్గంలోనే తెలంగాణ సాధించామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ పల్లెలు కూడా అద్భుతంగా విరాజిల్లుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. కొత్త సెక్రటేరియట్‌కు వచ్చిన కేసీఆర్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. పోలీసులు తమ గౌరవవందనంతో సీఎంను ఆహ్వానించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్లోకి అడుగుపెట్టిన కేసీఆర్.. నిర్ణీత ముహూర్తానికి తన కుర్చీలో కూర్చున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. మొత్తం ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. చదవండి: సచివాలయాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా: సీఎం కేసీఆర్ ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంతో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణకు గుండెకాయలాంటి సచివాలయాన్ని ప్రారంభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అందరికీ నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పరిపాలన కేంద్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుందని అన్నారు. తనతో పనిచేసిన, కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. మరుగుజ్జులు, కళ్ళున్న కబోధులు అభివృద్ధిని చూడలేరంటూ ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ పునర్నిర్మాణంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ చురకలంటించారు. తెలంగాణ పునర్నిర్మాణ కాంక్షను అర్థం చేసుకోలేని కొంతమంది కారు కూతలు కూశారని మండిపడ్డారు. వాళ్లకి పాలన సౌలభ్యం కనబడదని విమర్శించారు. కొంతమంది మరుగుజ్జుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇది తెలంగాణ పునర్నిర్మాణం అంటే.. ‘పెద్ద ఎత్తున నీటి ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఎర్రటి ఎండకాలంలో మత్తడి దూకుతున్న ప్రాజెక్టులు కళ్లున్న కబోదులకు కనపడదు. 24 గంటల కరెంట్‌తో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు లేని తెలంగాణ ఏర్పడింది. వ్యవసాయానికి ఇస్తున్న కరెంట్ వల్ల రైతులు ఆనందంగా ఉంది. కోల్పోయిన అటవీ సంపద సాధించుకున్నాం. ఫ్లోరైడ్‌ను శాశ్వతంగా తొలగించి ఇంటింటికి నీళ్ళు అందించాం. ఆర్ధిక పరిపుష్టి పాటిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. నాడు బీళ్లుగా మారిన పంటలు, నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ప్రపంచ ఇంజనీదింగ్ అద్భుతాలుగా ప్రాజెక్టులు కట్టాం తెలంగాణ రైతుల దర్పమే తెలంగాణ పునర్నిర్మాణం. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, పునరంకితం, పునర్నిర్మణంలో బాగంగా కొత్త నిర్మాణాలు కట్టుకున్నాం. అడ్డదిడ్డంగా, ఎండలో ఫైళ్లు పట్టుకుని అక్కడికి ఇక్కడికి వెళ్లే భవనాల నుంచి కొత్త శోభాయమానంగా కొత్త సచివాలయం ఏర్పాటయింది. తెలంగాణ సచివాలయంవలె తెలంగాణ పల్లెలను అభివృద్ది చేసిన ప్రజా ప్రతినిదులను అభినందిస్తున్నాను. ఆకాశమంత ఎత్తున ఉన్న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తెలంగాణ సచివాలయానికి పెట్టుకున్నాం. తెలంగాణ అమరులకు నేను నివాళులు అర్పిస్తున్నా’ నని పేర్కొన్నారు. Inauguration of Dr. B.R. Ambedkar Telangana State Secretariat. Watch live as CM Sri KCR addresses the State. #PrideOfTelangana #TriumphantTelangana https://t.co/xVrEqBVec2 — Telangana CMO (@TelanganaCMO) April 30, 2023 -
పోడు భూముల పంపిణీపై కేసీఆర్ తొలి సంతకం
-
హైదరాబాద్ లో లక్ష బెడ్ రూం ఇళ్ల పంపిణీపై కేటీఆర్ తొలి సంతకం
-
కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
-
సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం ప్రారంభం
-
కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
Updates.. సచివాలయాన్ని ప్రారంభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందరికీ నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పరిపాలన కేంద్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుందని అన్నారు. సచివాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తూ తొలి సంతకం చేశారు. మొత్తం 6 ఫైళ్లపై సంతకాలు చేశారు. తమ చాంబర్లలో కొలువుదీరిన మంత్రులు హైదరాబాద్‌లో లక్ష బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ఫైల్‌పై మంత్రి కేటీఆర్ తొలి సంతకం 6వ అంతస్తులోని తన చాంబర్లో కొలువుదీరిన సీఎం కేసీఆర్ పోడు భూములు పంపిణీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన సీఎం కేసీఆర్ తన కార్యాలయంలో 6 ఫైల్స్‌పై సంతకం చేసిన సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీనిలో భాగంగా యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కొత్త సచివాలయంలో ప్రారంభోత్సవంలో భాగంగా మధ్యాహ్నం గం. 1.15 నిమిషాల ప్రాంతంలో సీఎం కేసీఆర్ అక్కడకు చేరుకున్నారు. - కొత్త సచివాలయం చేరుకున్న మంత్రి కేటీఆర్. - మూడో అంతస్తును కేటీఆర్ పరిశీలించారు. - ట్యాంక్ బండ్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్నాయి. - హుస్సేన్‌సాగర్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. - తెలుగు తల్లి జంక్షన్లో వాహనాల దారి మళ్లింపు. - ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై వాహనాలకు నో ఎంట్రీ. ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి, బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో వాహనాలకు అనుమతి నిరాకరణ. - ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పార్కులు మూసివేత. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం వద్ద సందడి నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన కొత్త సెక్రటేరియట్‌ను ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. తర్వాత సీఎంతోపాటు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులై.. కొత్త సెక్రటేరియట్ నుంచి తొలి సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత అతిథులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. - గృహలక్ష్మీ సహా కీలక ఫైళ్లపై సంతకాలు చేయనున్న సీఎం కేసీఆర్, మంత్రులు. - హైదరాబాద్‌లో లక్ష బెడ్ రూం ఇళ్ల పంపిణీపై కేటీఆర్ తొలి సంతకం. - మధ్యాహ్నం 2:15 గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగం. కొత్త సచివాలయం విస్తీర్ణం వివరాలివీ.. మొత్తం భూ విస్తీర్ణం: 28 ఎకరాలు భవనం నిర్మించిన ప్రాంతం: 2.45 ఎకరాలు ల్యాండ్ స్కేపింగ్: 7.72 ఎకరాలు సెంట్రల్ కోర్ట్ యార్డ్ లాన్: 2.2 ఎకరాలు పార్కింగ్ సామర్థ్యం: 560 కార్లు, 700 బైకులు ప్రధాన భవన కాంప్లెక్స్ బిల్టప్ ఏరియా: 8,58,530 చదరపు అడుగులు లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, ఆరు అంతస్తుల్లో ఒక్కోదాని ఎత్తు: 14 అడుగులు మొత్తం ఎత్తు: 265 అడుగులు నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి ఉక్కు: 8,000 టన్నులు సిమెంటు: 40,,000 టన్నులు ఇసుక: 30,000 టన్నులు (5 వేల లారీలు) కాంక్రీట్: 60,000 క్యూబిక్ మీటర్లు ఇటుకలు: 11 లక్షలు ఆగ్రా రెడ్ స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు గ్రానైట్: మూడు లక్షల చదరపు అడుగులు మార్బుల్: లక్ష చదరపు అడుగులు ధోల్పూర్ రెడ్‌స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు కలప: 7,500 క్యూబిక్ అడుగులు పనిచేసిన కారి్మకులు: మూడు షిప్టుల్లో 12,000 మంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొత్త సచివాలయంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకంగా సచివాలయ నిర్మాణం చేపట్టారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక మార్పులు చేస్తామని తెలిపారు. సచివాలయంలో హిందువుల వాటా రెండు గుంటలేనని.. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన కొత్త సచివాలయంలోకి తాము అడుగుపెట్టమని తేల్చి చెప్పారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనం ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ఉదయం 4నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. వీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వరకు ఇరువైపుల అప్పటి పరిస్థితులను బట్టి ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు. ఆహ్వానితుల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించామని, సచివాలయానికి వచ్చే ఆహ్వానితులు తమ పాస్‌లను కార్ డోర్లకు అతికించుకోవాలని సూచించారు. చదవండి: హైదరాబాదీలకు అలర్ట్.. రేపు పార్కుల మూసివేత -
హైదరాబాదీలకు అలర్ట్.. రేపు పార్కుల మూసివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం (30వ తేదీన) మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రకటించింది. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డాక్టర్ ఆపరిసరాల్లో నెలకొనే రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఆదివారం నాడు లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షో లను మూసి వేస్తున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది. చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వాన.. హెచ్చరికలు జారీ -
తెలంగాణ కొత్త సచివాలయం భవనం డ్రోన్ విజువల్స్
-
తెలంగాణ వైట్ హౌస్
-
ఈనెల 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం
-
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ లోపలి లుక్ చూసేయండి (ఫొటోలు)
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ లోపలి లుక్ చూసేయండి (ఫొటోలు) ] -
తెలంగాణ ఔన్నత్యం.. పాలన వేగం
సాక్షి, హైదరాబాద్: దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిన తెలంగాణ ఔన్నత్యాన్ని దేశం ముందు సగర్వంగా నిలిపేలా.. ప్రజలకు పాలన అత్యంత వేగంగా అందేలా.. ఆధునిక సచివాలయ భవనాన్ని అందుబాటులోకి తెస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక్కో కార్యాలయం ఒక్కోచోట ఉండి ఫైళ్లు కదిలేందుకు రోజుల సమయం పట్టే పరిస్థితిని మార్చుతున్నామని చెప్పారు. వాన నీళ్లు కారుతూ, ఎప్పుడు కూలుతాయో తెలియని భవనాల స్థానంలో.. మంత్రులు, కార్యదర్శులు, ఇతర అధికారులు అంతా ఒకేచోట ఉండేలా సమీకృత సచివాలయం ప్రజల ముంగిటికి వస్తోందన్నారు. కొత్త సచివాలయం నిర్మాణ ఆలోచన మొదలు.. ప్రారంభోత్సవం దాకా కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్‌రెడ్డి గురువారం రాత్రి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే.. ‘‘ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచింది. అన్ని రాష్ట్రాలు మనవైపు చూస్తున్న తరుణంలో తెలంగాణ స్థాయికి తగ్గ సచివాలయ భవనం అవసరమని సీఎం కేసీఆర్ భావించారు. అసౌకర్యాలతో ఉన్న పాత సచివాలయ భవనాలు, మంత్రి ఓచోట, అధికారులు ఓచోట ఉండే అస్తవ్యస్థ పరిస్థితిని సరిదిద్దే ఆలోచన చేశారు. సచివాలయ భవనం ఎలా ఉండాలనే ప్లాన్ అంతా సీఎందే. ఆయన సూచనల మేరకే భవనం ఇంత అద్భుతంగా సిద్ధమైంది. రాత్రింబవళ్లు కష్టపడి కేవలం 26 నెలల్లో దీనిని సిద్ధం చేశాం. పునాది రాయి వేసిన రోజే.. భవనానికి అవసరమైన సామగ్రి అంతటికి వెంటనే ఆర్డర్ ఇచ్చి సమకూర్చుకోవాలని.. అన్ని పనులను ఒకే ఏజెన్సీ ద్వారా చేయాలని కేసీఆర్ సూచించారు. దీనితో నిర్మాణంలో జాప్యం లేకుండా 26 నెలల్లో పూర్తయింది. లేకుంటే ఐదేళ్లకంటే ఎక్కువ కాలం పట్టేది. విమర్శలను పట్టించుకోం ఉన్న భవనాలను కూల్చికట్టారని, అనవసరంగా భారీ వ్యయం చేశారని, గుమ్మటాల నిర్మాణ శైలిని అనుసరించారని.. ఇలాంటి విమర్శలను పట్టించుకోం. ప్రజలకు పాలన ఫలితాలు వెంటనే అందేందుకు, తెలంగాణ ఔన్నత్యం ఇనుమడింపచేసేందుకు కొత్త సచివాలయం నిర్మించాం. దీనికి అయిన ఖర్చుతో పోల్చుకుంటే కొన్ని వందల రెట్లు ప్రజలకు మేలు జరగబోతోంది. అంబేడ్కర్‌కు, అమరవీరులకు మధ్య.. ఇటీవలే ఆకాశమంత అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఆవిర్భావం కోసం అమరులైన వీరులకు గుర్తుగా స్మారకాన్ని నిర్మించుకున్నాం. దాన్ని జూన్ 2న ప్రారంభించనున్నాం. ఈ రెండింటికీ మధ్య కొత్త రాష్ట్ర ప్రధాన పాలనా భవనాన్ని నిర్మించుకున్నాం. ఈ నెల 30న ప్రారంభించుకోబోతున్నాం. ఇక ఆస్పత్రులపై దృష్టి.. సచివాలయ భవనం ప్రారంభమయ్యాక.. ఆస్పత్రులపై దృష్టి పెట్టబోతున్నాం. త్వరలో 24 అంతస్తులతో అతి గొప్పగా, దేశం మొత్తం మనవైపు చూసేస్థాయిలో వరంగల్‌లో ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించుకోనున్నాం. దానితోపాటు హైదరాబాద్ నలుదిక్కులా కొత్త మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను సిద్ధం చేసుకుంటాం. కేసీఆర్ మొదటి టర్మ్ పాలనలో సాగు, తాగునీరు, కరెంటు లక్ష్యంగా ప్రణాళికలు అమలయ్యాయి. రెండో విడతలో విద్య, వైద్యం లక్ష్యాలుగా పాలన సాగుతోంది. రీజనల్ రింగురోడ్డు విషయంలో కేంద్రం పేచీ ఆర్ఆర్ఆర్ను పట్టాలెక్కించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ కావాలనే కేంద్రం పేచీ ధోరణితో వ్యవహరిస్తోంది. భూసేకరణ కాకుండానే 50% రాష్ట్ర వాటా డబ్బు కట్టాలని వింత వాదనకు దిగింది. ఏ ప్రాజెక్టులోనూ∙అలా ఉండదు. అయినా మంచి ప్రాజెక్టు విషయంలో కేంద్రంతో పేచీ వద్దని, అవార్డ్ పాస్ చేయకుండానే రూ.100 కోట్లు చెల్లించాలని సీఎం చెప్పడంతో నిధులు విడుదల చేశాం. ఆర్ఆర్ఆర్ను వేగంగా చేపట్టేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఈ నెల 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం
-
కొత్త సచివాలయంలో బ్యాటరీ వాహనాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయంలో బ్యాటరీ వాహనాలు సందడి చేస్తున్నాయి. బుధవారం నాలుగు కొత్త బ్యాటరీ వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. వాటిని సచివాలయ ప్రారంభోత్సవం రోజు వీఐపీల కోసం వినియోగిస్తారని సమాచారం. ఆ తర్వాత కూడా వాటిని కొనసాగిస్తారని, లోపలికి సాధారణ ప్రజల వాహనాలకు అనుమతి లేనందున గేటు వద్ద నుంచి భవనం వరకు బ్యాటరీ వాహనంలో సందర్శకులు వెళ్లేందుకు వినియోగిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కేవలం ప్రారంభోత్సవం కోసం మాత్రమే తెప్పించారని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. బుధవారం రాత్రి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, జీఏడీ కార్యదర్శి శేషాద్రి తదితరులు వాటిని పరిశీలించారు. కాగా, ఈనెల 30న సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ రోజు ఉదయం సుదర్శనయాగం నిర్వహించనున్న ప్రాంతంలో నిర్మించిన యాగశాల, సభా ప్రాంగణం, వీఐపీల వాహనాల పార్కింగ్ ప్రాంతాలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతి రెడ్డి, ఈఈ శశిధర్, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. భవనానికి రంగురంగుల లైటింగ్, ఫౌంటెయిన్లు, పూల మొక్కల ఏర్పాటు తదితరాలపై అధికారులకు సూచనలు చేశారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. ట్యాంక్ బండ్లో తప్పిన పెను ప్రమాదం ఇక్కడ క్లిక్ చేయండి: తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్! -
కొత్త భవనంలోకి సచివాలయ శాఖల షిఫ్టింగ్.. కేసీఆర్ ఆఫీస్ ఏ ఫ్లోర్లో ఉంటుందంటే?
సాక్షి, హైదరాబాద్: రేపటి(బుధవారం) నుంచి సమీకృత కొత్త సచివాలయానికి శాఖల షిఫ్టింగ్ షురూ కానుంది. ఈ నెల 28వ తేదీ వరకు షిఫ్టింగ్ కొనసాగనుంది. ఒక్కో ఫ్లోర్‌కు మూడు శాఖల కేటాయింపు జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్లో హోమ్ శాఖ, రెండో అంతస్తులో ఆర్థిక శాఖ, మూడో ఫ్లోర్లో అగ్రికల్చర్ అండ్ ఎస్సీ డెవలప్మెంట్కు కేటాయించారు. నాలుగో అంతస్తులో ఇరిగేషన్ అండ్ లా, ఐదవ అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ, ఆరో ఫ్లోర్లో సీఎం, సీఎస్‌లకు కేటాయించారు. ఈ మేరకు శాఖల వారీగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 30న నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు ఉదయం కొత్త సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎస్ నేతృత్వంలో ఈ రోజు కో ఆర్డినేషన్ సమావేశం జరిగింది. చదవండి: సాగర తీరాన పాలనా సౌధం.. ధగధగల సచివాలయం.. వైరల్ ఫోటోలు -
సాగర తీరాన పాలనా సౌధం.. ధగధగల సచివాలయం.. వైరల్ ఫోటోలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన నూతన సచివాలయం ఈ నెల 30న ప్రారంభానికి సిద్ధమవుతోంది. తెలంగాణ సాంస్కృతిక సంపద ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన సచివాలయ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున 8 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో ఇంధ్రభవనాన్ని తలపించే నూతన భవన సముదాయాన్ని నిర్శించారు. పార్లమెంట్ తరహాలో రెడ్‌శాండ్ స్టోన్‌తో రెండు ఫౌంటెయిన్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి. సర్వమత సమ్మేళనానికి సంకేతంగా మసీద్, మందిర్, చర్చిల నిర్మాణాలు.. వందలాది వాహనాలు నిలిపేందుకు విశాలమైన పార్కింగ్ స్థలంతో అద్భుతంగా సచివాలయాన్ని అద్భుతంగా నిర్మించారు. అత్యాధునిక వసతులతో హంగులతో దక్కన్-కాకతీయ ఆర్కిటెక్చర్, సంస్కృతి తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తుంది. సచివాలయ ప్రారంభం నేపథ్యంలో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ.. యాక్ ఛీ! బాత్రూం బిర్యానీ! -
HYD: తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలో తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహల తొలగింపు వివాదాస్పదంగా మారింది. నూతన సచివాలయం ముందున్న విగ్రహాలను అధికారులు తొలగించడంతో వివాదం చోటుచేసుకుంది. కాగా, కొత్త సచివాలయం ఏర్పాటు సందర్భంగా రోడ్డు వెడెల్పులో భాగంగా విగ్రహాలను తొలగించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహల తొలగించడంపై పలువురు భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, అధికారులు విగ్రహాలను మరోచోట ప్రతిష్టిస్తామని చెప్పారు. అయితే, విగ్రహాలను ఎక్కడ పెడతారనే దానిపై మాత్రం అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. -
సుప్రీంకోర్టులో కేఏ పాల్‌కు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాశాంతి పార్టీ నాయకుడు కెఏ పాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాదంపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ ఘటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కేఏపాల్ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన దర్మాసనం.. ఈ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ దాఖలైందా అని ప్రశ్నించింది. దేశంలో జరిగే అగ్నిప్రమాదాలపై సీబీఐతో విచారణ జరపమానాలా? అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఇటీవల తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై కేఏ పాల్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తెలంగాణ నూతన సచివాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని, నర బలి జరిగిందని ఆయన కోర్టుకు తెలిపారు. ఆయనే సొంతంగా వాదనలు వినిపించారు. తన భద్రతను ప్రభుత్వం తొలగించిందని, దీంతో తన జీవితానికి భద్రత ఉందని కేఏపాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ. ‘మీరొక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి. మీ ఉద్దేశం వేరు. ఒక దానికి మరొక దానికి ముడిపెట్టొద్దు ’అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన వేసిన పిటిషన్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. చదవండి: టిస్టు.. హైకోర్టు ఆదేశాలు.. దొరకని జగిత్యాల స్ట్రాంగ్ రూం తాళాలు -
మరింత జోరుగా బీఆర్ఎస్..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. వరుసగా సభలు, సమావేశాలు నిర్వహించడంతోపాటు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. ఈ నెల 14న జరిగే భారీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ మొదలుకుని.. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు వరుసగా సభలు, సమావేశాల నిర్వహణకు షెడ్యూల్ సిద్ధం చేసింది. అన్ని నియోజకవర్గాల నుంచి పాల్గొనేలా.. ఈ నెల 14న హుస్సేన్‌సాగర్ తీరంలో జరిగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా నిర్వహించా లని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అంబేద్కర్ మన వడు ప్రకాశ్ అంబేడ్కర్‌ను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా నిర్వహించే సభకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున 35,700మంది పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 30న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమంలో సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, గ్రంథాలయ సంస్థల చైర్పర్సన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, ఇతరులు కలుపుకొని 2,500 మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ గత రెండేళ్లుగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ప్లీనరీని ఈ ఏడాది ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మారిన తర్వాత జరుగుతున్న తొలి ప్లీనరీ ఇది. ఈ క్రమంలో జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించే అవకాశం ఉంది. సుమారు 8 వేల మంది ప్రతినిధులు ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ ప్లీనరీకి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో స్థానిక నేతలు పార్టీ జెండాలను ఆవిష్కరిస్తారు. మరిన్ని రోజులు ఆత్మీయ సమ్మేళనాలు ఎన్నికల సన్నద్ధతలో భాగంగా క్షేత్రస్థాయిలో చేపట్టిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను మే నెలలోనూ కొనసాగించాలని పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. ఆత్మీయ సమ్మేళనాలకు కేడర్ నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకుని విస్తృతంగా నిర్వహించేందుకు మాజీ స్పీకర్ మధుసూదనాచారి నేతృత్వంలో పది మందితో కూడిన పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేశారు. అంటే మరో నెలన్నర పాటు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగనున్నాయి. ఇక జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సచివాలయం ఎదురుగా నిర్మించిన అమరుల స్మారకాన్ని ప్రారంభించనున్నారు. -
చాంబర్లోకి తొలుత సీఎం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 30న జరిగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయ భవన సముదాయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం సచివాలయం ప్రారంభం కాగానే ముందుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన చాంబర్లో ఆసీనులు కానున్నారు. ఆ తర్వాత మంత్రులు, కార్యదర్శులు సీఎంవో, సచివాలయ సిబ్బంది వారి చాంబర్లలోకి వెళ్లి కూర్చోనున్నారు. సచివాలయ ప్రారంబోత్సవం సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఉదయం శాస్త్రోక్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం జరగనుంది. సంబంధిత సమయాన్ని త్వరలో ప్రకటించనున్నారు. సచివాలయ ప్రారంబోత్సవ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు మేయర్లు తదితరులు కలిపి దాదాపు 2,500 మంది హాజరవుతారని అంచనా. నాలుగు ద్వారాలు నూతన సచివాలయంలో రక్షణ సహా పలు రకాల పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సచివాలయం నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలున్నాయి. తూర్పు ద్వారాన్ని (మెయిన్ గేట్) ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహా్వనితులు, దేశ, విదేశీ అతిథులు, ప్రముఖుల కోసం మాత్రమే వినియోగించనున్నారు. వాయవ్య (నార్త్–వెస్ట్) ద్వారాన్ని అవసరం వచ్చినప్పుడే తెరవనున్నారు. ఈశాన్య (నార్త్–ఈస్ట్) ద్వారం గుండా సచివాలయ సిబ్బంది కార్యదర్శులు, అధికారుల రాకపోకలు సాగించనున్నారు. అదే వైపు పార్కింగ్ కూడా ఉండనుంది. ఆగ్నేయ (సౌత్–ఈస్ట్) ద్వారాన్ని కేవలం సందర్శకుల కోసమే తెరవనున్నారు. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉండనుంది. వికలాంగులు, వృద్ధుల కోసం విద్యుత్‌తో నడిచే బగ్గీల ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు వాహనాలకు సచివాలయంలోకి అనుమతి లేదు. సచివాలయ రక్షణకు సంబంధించి డీజీపీ విధివిధానాలు రూపొందించి పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో సీఎం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు... ♦ ఖాళీ జాగలున్న వారికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం అమలుకు సత్వరమే విధివిధానాలను రూపొందించాలి. ♦ పోడు భూముల పట్టాల పంపిణీని త్వరలో ప్రారంభించాలి. ♦ దళితబంధు పథకాన్ని కొనసాగించాలి. ♦ గొర్రెల పంపిణీని సత్వరమే ప్రారంభించాలి. -
ఏప్రిల్ 30న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం
-
ఏప్రిల్ 30న కొత్త సచివాలయం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారకం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభించే ముహూర్తాలను రాష్ట్ర ప్రభు త్వం ఖరారు చేసింది. కొత్త సచివాలయాన్ని ఏప్రిల్ 30న ప్రారంభించాలని, ఆలోపు అన్ని పనులు పూర్తి చేసి సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంతకన్నా ముందే అంబేడ్కర్ జయంతి అ యిన ఏప్రిల్ 14న 125 అడుగుల అంబేడ్కర్ వి గ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన జూన్ 2న అమరవీరుల స్మారక జ్యోతిని ప్రారంభించనున్నారు. ఈ 3 నిర్మాణాలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం వాటిని పరిశీలించారు. అనుకున్నట్టే అద్భుతంగా.. తొలుత సచివాలయాన్ని సందర్శించిన కేసీఆర్.. ప్రధాన ద్వారం, దానికి భోపాల్ నుంచి తెచ్చి ఏర్పాటు చేసిన వుడ్ కార్వింగ్, ఫౌంటెయిన్లు, పచ్చిక బయళ్లు, గుమ్మటాల పనులను.. ప్రహరీ, దాని అవతల వెడల్పు చేస్తున్న రోడ్లు, పార్కింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంతకుముందు పర్యటించినప్పుడు ఆరో అంతస్తులోని సీఎం చాంబర్లో చేయాల్సిందిగా సూచించిన మార్పులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లిన సీఎం కేసీఆర్.. విగ్రహం దిగువన సిద్ధమవుతున్న విశాలమైన హాళ్లు, ఫౌంటెయిన్లు, పచ్చి క బయళ్లను పరిశీలించారు. పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని, నాణ్యతలో లోపం లేకుండా చూ డాలని ఆదేశించారు. తర్వాత తెలంగాణ అమరవీరుల స్మారక భవనం వద్దకు సీఎం చేరుకున్నారు. ఆడిటోరియం, ప్రదర్శనశాల, లేజర్‌షో ప్రాంగణం, ర్యాంప్, సెల్లార్ పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుమన్, జీవన్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితరులు ఉన్నారు. వరుసగా వాయిదా పడుతూ.. తొలుత దసరాకు, ఆ తర్వాత సంక్రాంతికి కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు భావించింది. కానీ పనులు పూర్తి కాకపోవటంతో వాయిదా వేసుకుంది. తర్వాత సీఎం కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17ను ముహూర్తంగా ఖరారు చేసింది. పనులు పూర్తి కాకున్నా ప్రారంభించేందుకు సిద్ధమైంది. అయితే సీఎం కార్యాలయం తప్ప మిగతావి పూర్తిస్థాయిలో సిద్ధం కావని అధికారులు పేర్కొనడంతో పునరాలోచించింది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో మరోసారి వాయిదా వేసింది. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టినందున ఆయన జయంతి అయిన ఏప్రిల్ 14న ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ ఆ రోజు కాకుండా ఏప్రిల్ 30ని ముహూర్తంగా ఎంచుకుంది. మార్చి 23 తర్వాత శూన్యమాసం మొదలై ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుందని.. ఆ తర్వాతి రోజు (ఏప్రిల్ 30) వైశాఖ శుద్ధ దశమి నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయని పండితులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 30ను కొత్త సచివాలయ ప్రారంభోత్సవం జరగనుంది. -
CM KCR: కొత్త సెక్రటేరియెట్‌కు.. పనుల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయాన్ని ఇవాళ(శుక్రవారం) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సందర్శించారు. సచివాలయ పనులను పరిశీలించడంతో పాటు సచివాలయ ప్రారంభ తేదీపైనా ఆయన అధికారులతో చర్చించనున్నారు. మరోవైపు ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా.. భారీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అదే సమయంలో నెల వ్యవధిలోనే విగ్రహంతో పాటు కొత్త సచివాలయం, అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో.. సచివాలయ పనులను సైతం ఆయన వేగవంతం చేయాలని అధికారులకు సూచించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలు సార్లు ఆయన సచివాలయాన్ని సందర్శించి.. పనులను పర్యవేక్షించారు. త్వరలోనే కొత్త ప్రారంభ తేదీని ప్రకటించే ఛాన్స్ ఉంది. దాదాపుగా సచివాలయం పనులు పూర్తికాగా, మొన్నీమధ్యే అగ్నిప్రమాదం చోటు చేసుకుంది కూడా. -
TS: నూతన సచివాలయ భవనం ఏరియల్ వ్యూ అదిరిందిగా..
హుస్సేన్ సాగర్ తీరాన ఒక పక్క జ్జానబోధి బుద్ధుడు, మరో పక్క రాజ్యాంగ నిర్మాత, కర్తవ్యదీక్షాపరుడు డా. బిఆర్ అంబేద్కర్, ఎదురుగా త్యాగాలను గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలు. కనీవిని ఎరుగని రీతిలో, అత్యంత వైభవోపేతంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటేలా ప్రారంభోత్సవానికి సిద్ధమైన తెలంగాణ ప్రజాపాలనా సౌధం.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం భవనం. తెలంగాణ కొత్త సచివాలయం ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుక వాయిదా పడిన సంగతి పక్కనపెడితే.. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ట్యాంక్ బండ్ పరిసరాలను ప్రభుత్వం అత్యంత సుందరరీకరణగా తీర్చిదిద్దుతోంది. ఒకవైపు సచివాలయ నిర్మాణం ఇప్పటికే తుది మెరుగులు దిద్దుకోగా, ట్యాంక్ బండ్ పరిసరాలు కొత్త రూపును సంతరించుకోనున్న క్రమంలో ఆ ప్రాంతం మరింత ఆహ్లాదంగా మారనుంది. ఇందుకు నూతన సచివాలయం యొక్క ఏరియల్ వ్యూనే సాక్షంగా నిలుస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు. -
Hyderabad: తటాక తీరాన.. మణి మకుటాలు..
అటు చూస్తే తుది దశకు చేరిన నూతన సచివాలయ నిర్మాణం.. ఇటు చూస్తే పూర్తి కావస్తున్న అమర వీరుల స్మారకం. ఆ వంక రూపుదిద్దుకుంటున్న అంబేడ్కర్ విగ్రహం. భాగ్యనగరి కీర్తి కిరీటంలో మణిమకుటాలుగా విరాజిల్లనున్నాయి. హుస్సేన్‌సాగర్ తీరానికి సరికొత్త సొబగులను అద్దనున్నాయి. నగరవాసులకు, పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. -
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. అయితే, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా సచివాలయం ప్రారంభ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. -
తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్/ ఖైరతాబాద్: హుస్సేన్‌సాగర్ తీరాన తుది మెరుగులు దిద్దుకుంటున్న తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీనివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని, కేవలం నాలుగు ఫ్లోర్లు పొగ చూరాయని పోలీసులు తెలిపారు. స్వల్ప మరమ్మతులు మాత్రమే అవసరమవుతాయని, సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. సచివాలయ ప్రారంభోత్సవ సమయం దగ్గరపడుతుండటంతో భవన నిర్మాణ సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనులు చేస్తున్నారు. మింట్ కాంపౌండ్ వైపు ఉన్న డూమ్ పనులతో పాటు ఇతర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎలక్ట్రికల్, ఉడ్ వర్క్, పెయింటింగ్, ఫాల్ సీలింగ్ తదితర పనులు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పేరుకుపోతున్న చెక్క, ఫోమ్, థర్మకోల్ తదితర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాల్సి ఉంది. కాగా శుక్రవారం తెల్లవారుజామున సచివాలయం వెనుక వైపు లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే అకస్మాత్తుగా ఆ వైర్లలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు మొదలయ్యాయి. క్షణాల్లోనే అక్కడున్న వ్యర్థాలకు అంటుకుని వ్యాపించాయి. ఈ పరిణామంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పరుగులు తీశారు. థర్మకోల్ వ్యర్థాలకు మంటలు అంటుకోవడంతో నల్లని పొగలు పెద్ద ఎత్తున కమ్ముకున్నాయి. లోయర్ గ్రౌండ్‌తో పాటు గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ల వరకు వ్యాపించాయి. ఓ డోమ్ కూడా నల్లగా మారింది. సీఎంవో ఉన్న భవనంలోనే.. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న 11 అగ్నిమాపక శకటాలు మంటల్ని అదుపులోకి తెచ్చాయి. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మంటలు పూర్తిగా ఆరిపోయాయి. మంటలు చెలరేగిన భవనం ఆరో అంతస్తులోనే సీఎం కార్యాలయం సిద్ధమవుతోంది. ఈ భారీ భవన నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం, అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. భవనం తుది మెరుగుల్లో ఉండటంతో ఫైర్ సేఫ్టీ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే భారీయెత్తున సచివాలయం నిర్మాణమవుతున్నా.. ఫైర్ ఇంజన్‌ను సమీపంలో అందుబాటులో ఉంచకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ భవన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, అగ్నిప్రమాదంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ప్రమాద కారణాలను, ఇతర వివరాలను బయటకు రానీయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు వెల్లడించేందుకు విముఖత చూపుతున్నారు. ఓ దశలో ఇదో మాక్‌డ్రిల్ అంటూ నమ్మించడానికి ప్రయత్నించారు. మింట్ కాంపౌండ్ రోడ్డులో పనులు జరుగుతుండటం, సచివాలయం వెనుక వైపు రోడ్లపై నిర్మాణ సామాగ్రి ఉండటం, ఎక్కడికక్కడ తవ్వకాల వల్ల ఫైర్ ఇంజన్లు లోపలికి, వెనుక వైపునకు వెళ్లడం కష్టసా«ధ్యమైంది. ఫైర్ సరీ్వసెస్ డైరెక్టర్ జనరల్ వై.నాగిరెడ్డి తెల్లవారుజామునే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మింట్ కాంపౌండ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌ల్లో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు ఎవరినీ సచివాలయం సమీపానికి అనుమతించలేదు. -
6వ అంతస్తులోకి నో ఎంట్రీ !
సాక్షి, హైదరాబాద్: మరో 17 రోజుల్లో కొత్త సచివాలయ భవనం ప్రారంభంకానుంది. 8 అంతస్తులున్న ఈ భవనంలోని ఆరో అంతస్తు మినహా మిగిలినవాటిలోకి సందర్శకులను పరిమితంగా అనుమతించనున్నారు. ఈ చాంబర్లో ముఖ్యమంత్రి కొలువుదీరనున్న దృష్ట్యా అధికారులు భద్రతాపరమైన ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌లో ఈ నెల 17న ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయ భవనసముదాయంలో 300 సీసీ టీవీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీసీటీవీలతోపాటు ఇతర భద్రతాచర్యల పర్యవేక్షణకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయ సందర్శకులకు కార్పొరేట్ కార్యాలయాల తరహాలో ప్రత్యేకంగా గుర్తింపుకార్డులను జారీ చేసి, వారి కదలికలను కనిపెట్టాలని సూచించారు. సీఎం చాంబర్ ఉండే 6వ అంతస్తు మినహా అన్ని అంతస్తుల్లో సందర్శకులను పరిమితంగా అనుమతించాలని నిర్ణయించారు. కొత్త సచివాలయంలో భద్రతా ఏర్పాట్లతోపాటు ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ–రేసింగ్ ఏర్పాట్లపై మంగళవారం ఆమె డీజీపీ అంజనీకుమార్‌తో కలిసి బీఆర్కేఆర్ భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. 5 నుంచి రోడ్ల మూసివేత! ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ–రేస్ జరగనున్న నేపథ్యంలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఖైరతాబాద్ బ్రిడ్జీ, మింట్ కాంపౌండ్ నుంచి ఐ–మాక్స్ వరకు రోడ్లను ఫిబ్రవరి 5 నుంచి మూసివేయాలని సమీక్షలో నిర్ణయించారు. ప్రత్యామ్నాయ మార్గాలపై నగరవాసులకు అవగాహన కల్పించాలని సీఎస్ ఆదేశించారు. ఫార్ములా ఈ–రేస్ సందర్భంగా సచివాలయ పనులకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉన్నతస్థాయి సమీక్షలోని నిర్ణయాలు ►ఫిబ్రవరి 17న ప్రారంభించనున్న కొత్త సచివాలయానికి విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి. ►పోలీస్, రోడ్లు, భవనాలు, జీఏడీ, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఐటీ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ►3 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, 300 మంది సిటీ పోలీస్ అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి. ►సిటీ ట్రాఫిక్ విభాగం నుంచి 22 మంది ట్రాఫిక్ అధికారుల కేటాయింపు ►భద్రతలో భాగంగా బ్యాగేజ్, వెహికిల్, బాడీ స్కానర్లు, ఇతర పరికరాలను సమకూర్చుకోవాలి. ►మొత్తం 28 ఎకరాల్లో 9.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ నూతన సచివాలయంలో 560 కార్లు, 900పైగా ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు సదుపాయం ►సచివాలయం చుట్టూ ఆరు సెంట్రీ పోస్టులు ►34 సిబ్బందితో రెండు ఫైరింజన్ల ఏర్పాటు. సచివాలయ భవనంలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు, ►దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు ►ఇప్పటికే జలమండలి ద్వారా నీటి సరఫరాకు చర్యలు. సీవరేజ్ పనుల పురోగతి. -
నూతన సచివాలయాన్ని పరిశీలించిన కేసీఆర్ (ఫోటోలు)
-
Hyderabad: బీఆర్ఎస్ 'పరేడ్'!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ బల ప్రదర్శనకు సిద్ధమవుతోంది. 13న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ప్రధాని మోదీతో సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అంతకు మించేలా 17వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి భారీగా జన సమీకరణ చేయడంతోపాటు పలు రాష్ట్రాల సీఎంలు, జాతీయ స్థాయి నేతలను ఆహ్వానించనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ త్వరలోనే నేతలతో భేటీ కానున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు మోదీ సభ కోసం బీజేపీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. మొత్తంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఫిబ్రవరిలో సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా భారీ బహిరంగ సభలతో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాయి. కేసీఆర్ పుట్టినరోజున ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయాన్ని వచ్చే నెల 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం కొత్త సచివాలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం నిర్విరామంగా శ్రమిస్తోంది. వేద పండితుల సూచన మేరకు ఫిబ్రవరి 17వ తేదీ శుక్రవారం ఉదయం వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆహ్వానిత ముఖ్యమంత్రులతో పాటు ఇతర నేతలు పాల్గొంటారు. ఖమ్మం సభ తరహాలో.. కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం, కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలతోపాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్, వామపక్షాల జాతీయ నేతలు పాల్గొన్నారు. అదే తరహాలో సచివాలయ ప్రారంభోత్సవం, పరేడ్‌గ్రౌండ్స్ సభను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తోపాటు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌కుమార్ తరఫున జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు మరికొందరు ముఖ్య నేతలు పాల్గొంటారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. నాలుగు రోజుల తేడాలోనే.. పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ మోదీ సభకు, బీఆర్ఎస్ సభకు మధ్య కేవలం నాలుగు రోజులే గడువు ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే భారీగా జన సమీకరణతో సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ సభకు తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఇతర నేతలు హాజరుకానుండటం బీఆర్ఎస్కు జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత పెరిగేందుకు దోహదం చేస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సభకు జన సమీకరణ, ఏర్పాట్లకు సంబంధించి సీఎం కేసీఆర్.. త్వరలో గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది. -
కొత్త సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
హుస్సేన్ సాగర్ తీరాన ఒక పక్క జ్జానబోధి బుద్ధుడు, మరో పక్క రాజ్యాంగనిర్మాత, కర్తవ్యదీక్షాపరుడు డా. బిఆర్ అంబేద్కర్, ఎదురుగా త్యాగాలను గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలతో, దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో, అత్యంత వైభవోపేతంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటేలా నిర్మితమౌతూ మరికొద్ది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధమౌతున్న తెలంగాణ ప్రజాపాలనా సౌధం.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవనం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. సీఎం కేసీఆర్ దార్శనికతతో, అత్యంత సహజమైన రీతిలో, నలు దిశలనుంచి సహజమైన గాలి వెలుతురు ప్రసరించేలా, ఆహ్లాదకరమైన వాతావరణంలో సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించేలా దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో నిర్మితమౌతున్న రాష్ట్ర సచివాలయం ముఖ్యమంత్రి గారి పుట్టిన రోజు ఫిబ్రవరి 17 న ప్రారంభోత్సవానికి సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా... తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. తుదిమెరుగులు దిద్దుకుంటున్న సచివాలయ ముఖద్వారం మొదలుకొని నలు దిక్కులా కలియ తిరిగి అణువణువునూ సీఎం కేసీఆర్ పరిశీలించారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన సచివాలయ పనుల పురోగతి పరిశీలనలో, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహా ఇంజనీర్లకు వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ ప్రధాన ద్వారం గుండా పరిశీలన ప్రారంభించారు. రక్షణ వ్యవస్థలను అమరుస్తూ తుది దశకు చేరుకున్న కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగారు. ప్రధాన కట్టడానికి బయటి దిశగా నిర్మితమౌతున్న రోడ్లను పరిశీలించారు. అక్కడనుంచి నేరుగా నైరుతి దిక్కుగా నడుచుకుంటూ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్, అక్కడ బ్యాంకులు, క్యాంటీన్, ఏటీఎంలు, మీడియా సెంటర్ కోసం చేపట్టిన నిర్మాణాలను, సందర్శకుల కోసం నిర్మిస్తున్న వెయిటింగ్ గదులను కలియ తిరిగారు. అక్కడి సౌకర్యాలను తదితర వివరాలను, ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌కు తెలియజేశారు. సచివాలయ ఉద్యోగుల కోసం నైరుతి దిక్కున నిర్మితమౌతున్న ప్రార్థనా మందిరాన్ని సీఎం పరిశీలించారు. ఆ తర్వాత పడమటి దిక్కున ఉన్న అంతర్గత రోడ్లు, వాటి వైశాల్యం, తుది నిర్మాణాలకు వాడుతున్న సిమెంటు తదితర నాణ్యతా అంశాల గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. సచివాలయం పడమటి భాగంలో సెక్రటేరియట్ ఉద్యోగుల ఉపయోగార్థం నిర్మితమవుతున్న భవనాన్ని కూడా సీఎం పరిశీలించారు. దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలించారు. వెహికల్ పార్కింగులను కూడా సీఎం కేసీఆర్ సందర్శించారు. అక్కడనుంచి తిరిగి నేరుగా సచివాలయ ప్రధాన ద్వారం గుండా మెట్లెక్కి మొదటి ఫ్లోరుకు చేరుకున్నారు. మెట్లకు కుడి ఎడమ పక్కన ఏర్పాటు చేయాల్సిన అంశాల గురించి ఇంజనీర్లకు సూచించారు. మొదటి ఫ్లోరు కలియదిరిగిన సిఎం కేసీఆర్ లిఫ్టు ద్వారా 6వ ఫ్లోరులోని సీఎం చాంబర్ కు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న ఫాల్స్ సీలింగ్, వుడ్ పానెలింగ్, ఎసీ ఫిట్టింగ్స్, తదితర తుది మెరుగుల పనులను సీఎం కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం , చీఫ్ సెక్రటరీ ఛాంబర్‌ను సీఎంఓ కార్యదర్శులు, పీఆర్వోలు, తదితర సీఎంవో సిబ్బంది సహా ప్రభుత్వ సలహాదారుల కోసం నిర్మించిన కార్యాలయాలను సిఎం పరిశీలించారు. సిఎం చాంబర్ లో మార్పులు చేపట్టాలని సూచనలు చేశారు. అదే ఫ్లోర్ మీద ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్‌లను వాటిల్లో చేపట్టిన ఫాల్స్ సీలింగ్ పనులను పరిశీలించారు. కారిడార్లలో తుది దశకు చేరుకున్న మార్బుల్ పాలిషింగ్, పెయింటింగ్ పనులను, ఎలివేషన్ లో భాగంగా జిఆర్సీ తో చేసే కళాకృతులను, చివరిదశ పనులను మరింత సృజనాత్మకంగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. సచివాలయంలో నిరంతరం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా ఏర్పాటు చేసిన సిగ్నల్ బూస్టింగ్ సిస్టమ్ ను సిఎం పరిశీలించారు. ఆరవ అంతస్తు నుండి అటు హుస్సేన్ సాగర్ తీరం వైపు నిర్మితమౌతున్న కట్టడాలను కిటికీ నుండి బయటికి వంగి క్షుణ్ణంగా పరిశీలించి చూసారు. ఇంటీరియర్ డిజైన్లు, కరెంటు పనులు, ఏసీల ఫిటింగ్, పిల్లర్లకు, స్థంభాలకు జరుగుతున్న కళాత్మక ఆర్ట్ వర్కు పనులు, పెయింటింగ్ పనులను పరిశీలించిన సీఎం నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ప్రీమియం మార్బుల్ స్టోనింగ్ పనులను, వుడ్ వర్క్స్ లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రానైట్ ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్, జీఆర్సి పనులు, లిఫ్టుల పనులతీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆరవ ఫ్లోర్ నుంచి లిఫ్టు ద్వారా కిందికి దిగిన సీఎం కేసీఆర్ మొదటి అంతస్తుకు చేరుకున్నారు. అక్కడనుంచి మెట్లు దిగి ప్రధాన ద్వారానికి ఎదరుగా రెండు వైపుల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫౌంటేన్లను పరిశీలించారు. ఉత్తర తూర్పు ఈశాన్య దిశగా నిర్మితమౌతున్న లాన్ లను, రోడ్లు, పార్కింగ్, తో పాటు గార్డెనింగ్ పనులను పరిశీలించారు. మ్యాపు ద్వారా అన్ని నిర్మాణాల తీరును పరిశీలిస్తూ, వర్క్ ఏజెన్సీలను, మంత్రిని అడిగి తెల్సుకున్నారు. అక్కడి నుంచి కాలి నడకన కలియదిరుగుతూ రాళ్లమీద నడుస్తూ, నిర్మాణానానికి ఉపయోగించే కర్రలు, ఇనుప సామాగ్రిని దాటుతూ ముందుకు సాగారు. వీఆర్వీ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఏసీ ప్లాంట్లను, జనరేటర్లను, అత్యున్నతస్థాయి రక్షణ కోసం నెలకొల్పిన ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ను సిఎం పరిశీలించారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను పరిశీలించారు. ల్యాండ్ స్కేప్ పనులు, సివరేజ్ వర్క్స్,రెడ్ సాండ్ స్టోన్, ఫైర్ వర్క్స్,ఎలక్ట్రికల్ వర్క్ ఫ్లోర్ పనులపై ఇంజనీర్లకు, మంత్రి ప్రశాంత్ రెడ్డికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనా చారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఆరూరి రమేశ్, దివాకర్ రావు బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, షాపూర్ జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సచివాలయానికి ముహూర్తం ఖరారు
-
తెలంగాణ సచివాలయానికి ముహుర్తం ఖరారు
-
కేసీఆర్ జన్మదినం రోజున సచివాలయం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్ట ర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయ భవన ప్రారంభబోత్సవం ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభ తేదీని ఖరారు చేయ డంతో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి సీఎం జన్మదినం నాటికి భవ నాన్ని సిద్ధం చేయడంపై అధికారులు దృష్టి సారించారు. రూ.617 కోట్ల వ్య యంతో నిర్మిస్తున్న ఈ సచివాలయ పనులకు 2019 జూన్‌లో సీఎం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. పనులను పరిశీలించిన మంత్రి: ఉమ్మడి రాష్ట్రంలో పలు భవనాలతో కూడిన సచివాలయ సముదాయం సేవలందించగా, అవి విడివిడిగా ఉండటం అంత అనుకూలంగా లేదన్న కారణంతో వాటిని కూల్చేసి 10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో జీ ప్లస్ 6 అంతస్తులుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని తరహాలో అత్యంత విశాలంగా, పూర్తి ఆధునిక వసతులతో చేపట్టారు. గతేడాది దసరాకు ప్రారంభించాలనుకున్నా పనులు పూర్తి కాలేదు. తాజాగా సంక్రాంతికి అనుకున్నా సిద్ధం కాలేదు. ఇప్పుడు ఫిబ్రవరి 17ను ముహూర్తంగా ఖరారు చేయడం విశేషం. అప్పటివరకు పనులు పూర్తి కావడం కొంత ఇబ్బందిగానే ఉన్నా పది రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధికారులను సోమవారం ఆదేశించారు. ఇండో–పర్షియన్ నమూనాలో...: గతంలో భాగ్యనగరంలో ఇండో–పర్షియన్ నమూనాలో గుమ్మటాలతో హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి సహా ఎన్నో భవనాలు నిజాం కాలంలో రూపుదిద్దుకున్నాయి. మళ్లీ ఇప్పుడు అదే నమూనాలో కొత్త సచివాలయ భవనం సిద్ధమవుతోంది. ఈ నిర్మాణంలో కాకతీయ శైలి కూడా ఉందని నిర్మాణ సంస్థ చెబుతోంది. ఈ భవనంలో 34 గుమ్మటాలను తీర్చిదిద్దారు. ఇందులో రెండు గుమ్మటాలు 82 అడుగుల ఎత్తుండటం విశేషం. మధ్యలో కోర్ట్‌యార్డు.. దానికి ముందు వెనక రెండు బ్లాకులపై ఉండే ఈ భారీ గుమ్మటాలపై నాలుగు సింహాలుండే అశోక చిహ్నం ఏర్పాటు చేశారు. ►ఈ ప్రాంగణం 28 ఎకరాల్లో విస్తరించి ఉంది. కోర్టు యార్డు లాన్ రెండు ఎకరాల్లో ఉండగా, భవనం ముందువైపు ఐదెకరాల్లో పచ్చిక బయళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ముందు పచ్చికలో రెండు వైపులా పార్లమెంటు ముందున్న ఫౌంటెయిన్ నమూనాలో రెండు ఫౌంటెయిన్లు ఏర్పాటు చేశారు. ►ప్రధాన భవనం 265 అడుగుల ఎత్తుంటుంది. ప్రధా న గుమ్మటాలుండే సెంట్రల్ టవర్ 8 అంతస్తులుగా ఉంటుంది. ముఖ్య మంత్రి కార్యాలయం, కేబినెట్ సమా వేశ మందిరం ఆరో అంతస్తులో ఉంటాయి. ►రెండు నుంచి ఐదో అంతస్తు వరకు ప్రతి ఫ్లోర్లో నాలుగు చొప్పున మంత్రులు, కేబినెట్ ర్యాంకులో ఉండే ముఖ్యుల కార్యాలయా లుంటాయి. ఒకటి, రెండు అంతస్తు ల్లో జీఏడీ, ఆర్థిక శాఖ కార్యాలయా లుంటాయి. ►ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శు లకు 59 కార్యాలయాలు సిద్ధం చేశా రు. అదనపు, ఉప, సహ కార్యదర్శు లకు 90 గదులు, సహాయ కార్యదర్శి స్థాయి వారి కోసం 121 కార్యాల యాలు ఏర్పాటు చేశారు. ఇతర సిబ్బందికి 1,550 గదులు ఏర్పాటు చేశారు. ►ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన ద్వారాన్ని, 2 లిఫ్టులను ఏర్పాటు చేశారు. సీఎం, మంత్రులకు విడిగా పార్కింగ్ వసతి కల్పించారు. ∙బిర్లామందిర్ రోడ్డు వైపు దేవాలయాన్ని, వెనకవైపు చర్చి, మసీదులను నిర్మిస్తున్నారు. -
కొత్త సచివాలయంలో.. సరికొత్త ఫౌంటెయిన్లు!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని పార్లమెంటు ముందు ధోల్పూర్ ఎర్రరాతితో నిర్మించిన ఫౌంటెయిన్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. పార్లమెంటు సభ్యులు సహా సందర్శకులు దాని ముందు నిలబడి ఫొటోలు దిగుతుంటారు.. ఇప్పుడు అచ్చుగుద్దినట్టు అలాంటి ఫౌంటెయినే తెలంగాణ కొత్త సచివాలయంలో సిద్ధమైంది. పార్లమెంటు ముందు ఒకటే ఫౌంటెయిన్ ఉండగా, సచివాలయంలో రెండు రూపుదిద్దుకున్నాయి. ఇప్పుడు ఇవి ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. –ఇండోపర్షియన్ ఆకృతిలో గుమ్మటాలతో రూపుదిద్దుకుంటున్న సచివాలయానికి మరో ప్రత్యేకత కూడా ఉండాలన్న ఉద్దేశంతో పార్లమెంటు ముందున్న ఆకృతిలో ఫౌంటెయిన్లను డిజైన్ చేశారు. సచివాలయ భవనం ముందు రెండు వైపులా విశాలమైన లాన్లు ఉంటాయి. వాటి మధ్యలో రెండు వైపులా రెండు ఫౌంటెయిన్లు నిర్మించాలని భావించి రకరకాల ఆకృతులు పరిశీలించారు. కానీ, చివరకు పార్లమెంటు ముందున్న ఆకృతిని ఎంపిక చేశారు. ►దిగువ 47 అడుగుల వెడల్పుతో భారీ వేదిక.. దానిమీద 25 అడుగుల వెడల్పుతో సాసర్ ఆకృతిలో నీటి తొట్టె, దాని మీద 9 అడుగుల వెడల్పుతో మరో తొట్టె.. ఈ మూడింటిని అనుసంధానిస్తూ దాదాపు 27 అడుగుల ఎత్తున్న శిల.. అంతా ఎరుపు రంగు.. ఇది దీని ఆకృతి. ►అప్పట్లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ దీన్ని డిజైన్ చేయగా పార్లమెంటు భవనం ముందు నిర్మించారు. ఇప్పుడు అదే డిజైన్‌ను వినియోగించి ఇక్కడ నెలకొల్పారు. పార్లమెంటు ముందున్న ఫౌంటెయిన్‌కు మొత్తం రాజస్థాన్‌లోని ధోల్పూర్ ఎర్రరాతి ఫలకాలను వాడారు. ఆ నిర్మాణానికి ప్రత్యేకంగా రంగు ఉండదు. ఇక్కడ కూడా అదే రాతిని వినియోగించటం విశేషం. ►సచివాలయం బేస్‌కు పూర్తిగా ఈ ఎర్రరాయినే వాడారు. ఇందుకోసం రాజస్థాన్ ధోల్పూర్ క్వారీలకు వెళ్లి అక్కడ రాయిని ఎంపిక చేసి తెప్పించిన విషయం తెలిసిందే. పార్లమెంటు ముందున్న ఫౌంటెయిన్ తరహాలోనే పాటా్నలో ఇటీవల ఫౌంటెయిన్‌ను రూపొందించిన శిల్పిని కలిసి చర్చించి సలహాలు తీసుకున్నారు. ఇప్పుడు అదే డిజైన్‌తో రెండు ఫౌంటెయిన్ల నిర్మాణం పూర్తయింది. దీంతో సచివాలయ ప్రధాన నిర్మాణం పనులు పూర్తయినట్టయింది. ఈ ఫౌంటెయిన్ నుంచి నీళ్లు ధారలుగా ఎగజిమ్మి దిగువకు పడుతుండగా, వాటిపై లైట్ల కాంతులు ప్రసరిస్తూ అందాన్ని రెట్టింపు చేస్తాయి. -
సంక్రాంతికి కాదు.. ఉగాదికి సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయాన్ని సంక్రాంతి వేళ ప్రారంభించాలనుకున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. ఉగాది నాటికి సిద్ధం కానున్నట్టు తెలుస్తోంది. దీంతో సంక్రాంతి వేళ కొత్త సచివాలయ భవనం ప్రారంభోత్సవం సందిగ్ధంలో పడింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి దాని ప్రారంభోత్సవంపై అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. ఆ దిశగా ఆదేశాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. ►సంక్రాంతి నాటికి ప్రారంభం అన్నట్టుగా తనిఖీల సందర్భంలో ముఖ్యమంత్రి సూచించటం, సంక్రాంతికి ప్రారంభించనున్నట్టు మంత్రులు పలు సందర్భాల్లో పేర్కొనటంతో అధికారులు పనుల్లో వేగం పెంచుతూ వచ్చారు. కానీ.. ప్రధాన భవన నిర్మాణం పూర్తయినా, భవనం లోపల వసతులు కల్పించే పనులు, డ్రైనేజీ, టెలిఫోన్, లైటింగ్, ఏసీ, నీటి పైప్‌లైన్.. ఇలాంటి ఏర్పాట్లు ఏవీ పూర్తి కాలేదు. దీంతో ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించే పరిస్థితి లేదు. ఒకవేళ సంక్రాంతికి ప్రారంభించాలన్న అభిప్రాయంతోనే సీఎం ఉంటే, దానికి ఆటంకం కలగకుండా అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ప్రారంభోత్సవం అంటూ నిర్వహిస్తే, ఆ కార్యాలయంలోనే పూజ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, ఆ పూజా కార్యక్రమానికి సంబంధించి కూడా అధికారికంగా సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. భవనం పూర్తి స్థాయిలో సిద్ధం కావటానికి మరో రెండు నెలల సమయం పడుతుందని, ఉగాది నాటికి అన్ని పనులూ పూర్తయి ప్రారంభించేందుకు వీలుగా సంసిద్ధమవుతుందంటూ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే రోడ్లు భవనాల శాఖ మంత్రికి విన్నవించారు. ఒకవేళ సంక్రాంతి వేళ పూజా కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఆదేశిస్తే, సీఎం కార్యాలయంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాన్ని కూడా సిద్ధం చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో సీఎం కార్యాలయం సిద్ధం కాగా, సీఎస్ కార్యాలయంలో ఆయన ఛాంబర్ వరకు పూర్తయింది. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించేందుకు సీఎస్ కార్యాలయంలో భాగంగా నిర్మిస్తున్న హాలు సిద్ధం కాలేదు. గత దసరాకు ప్రారంభించాలని ప్రభుత్వం గట్టిగా ఆదేశించినప్పటికీ, భవనం పూర్తి కాకపోవటంతో అది కుదరలేదు. అప్పట్లో సంక్రాంతి వేళ ప్రారంభించాలనుకున్నారు. ఇప్పుడూ సిద్ధం కాకపోవటంతో మళ్లీ ఉగాదికి మారింది. దాదాపు 3 వేల మంది కార్మికులు, ఇంజనీర్లు మూడు షిఫ్టుల్లో రాత్రింబవళ్లూ పనిచేస్తున్నా, భారీ నిర్మాణం, అనుబంధంగా ఎన్నో ఏర్పాట్లు ముడిపడి ఉండటం, ఇటీవల ఫార్ములా ఈరేసింగ్ కోసం ఆ ప్రాంగణంలోని కార్మికుల వసతి తొలగించడంతో వారు దూర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లాల్సిన పరిస్థితితో కొంత ఇబ్బంది ఏర్పడటం.. ఇలా రకరకాల కారణాలతో పనుల్లో జాప్యం జరిగింది. లుంబినీపార్కు ఎదురుగా ప్రధాన ద్వారం.. కొత్త సచివాలయం ప్రధాన ద్వారం లుంబినీ పార్కు ఎదురుగా నిర్మితమవుతోంది. తెలంగాణ రాకముందు ఇక్కడే ప్రధాన ద్వారం ఉండేది. వాస్తుపరంగా అదే కుదరటంతో ఇప్పుడు అక్కడే ఆర్చితో కూడిన ప్రధాన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కాన్వాయ్ ఇందులో నుంచే సచివాలయంలోకి ప్రవేశిస్తుంది. మూడు దిశలు.. నాలుగు ప్రవేశ ద్వారాలు.. కొత్త సచివాలయానికి మొత్తం నాలుగు ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ద్వారం తూర్పు దిశలో లుంబినీకి ఎదురుగా రానుండగా, ఎన్టీఆర్ గార్డెన్స్ వైపు ఉన్న గేటు వద్ద ఉద్యోగుల ప్రవేశ ద్వారం నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం బిర్లామందిరం వైపు రోడ్డులో ఉన్న పౌరసరఫరాల శాఖ పెట్రోలు బంకును తొలగించారు. దాన్ని సికింద్రాబాద్ ఆర్.పి.రోడ్డులోకి మారుస్తున్నారు. తొలగించిన పెట్రోలు బంకు ఉన్న ప్రాంతంలో సందర్శకుల కోసం గేటు నిర్మిస్తున్నారు. దానికి తెలుగుతల్లి ఫ్లైఓవర్ దిగువ కూడలి నుంచి నేరుగా ఓ రోడ్డు నిర్మించారు. వాస్తుపరంగా మూడు ద్వారాలు ఉండటం సరికాదన్న ఉద్దేశంతో, భవనం వెనకవైపు మింట్ దిశలో నాలుగో ద్వారాన్ని నిర్మిస్తున్నారు. దాన్ని అత్యవసర ద్వారంగా వాడతారు. అత్యవసర పరిస్థితిలో తప్ప సాధారణ రోజుల్లో దాన్ని వినియోగించరు. -
బుల్లెట్ ప్రూఫ్‌తో సీఎం ఛాంబర్.. అత్యాధునిక హంగులతో నూతన సచివాలయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న నూతన సచివాలయ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్స్ కొనసాగుతుండగా.. సంక్రాంతికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం ఛాంబర్‌కు బుల్లెట్ ప్రూఫ్‌ను ఏర్పాటు చేశారు. రాజ్‌పథ్ తరహాలో ఫౌంటేన్లు, అత్యాధునిక సదుపాయాలతో నూతన సెక్రటరియేట్‌ను నిర్మిస్తున్నారు. సెక్రటేరియట్ కాంపౌడ్ బయట గుడి, మసీదు, చర్చిని నిర్మిస్తున్నారు. మూడు షిఫ్టుల్లో నాలుగు వేల మందితో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ పర్యటనలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్అండ్బీ శాఖ అధికారులతో పాటు తదితరులు ఉన్నారు. చదవండి: (తెలంగాణలో ఎన్నికల వేడి.. కారు ఫైరింగ్.. అనూహ్యంగా ఎదిగిన కమలం) -
సంక్రాంతికి కొత్త సచివాలయం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి నాటికి కొత్త సచివాలయ భవనం సిద్ధం కాబోతోంది. డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తి కావాలన్న సీఎం ఆదేశాల మేరకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 90 శాతం నిర్మాణం పూర్తయింది. ఎనిమిది అంతస్తుల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. కీలకమైన భారీ గుమ్మటాల నిర్మాణం.. సమాంతరంగా భవనం లోపలి ఫినిషింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. చుట్టూ రహదారులు, ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్లు, పచ్చికబయళ్లు పూర్తి కావాల్సి ఉంది. వేగంగా లోపలి పనులు కొత్త సచివాలయం లోపల ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిబ్బంది కార్యాలయాల్లో ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వాల్ ప్యానలింగ్, ఫాల్స్ సీలింగ్, ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఫర్నిచర్ సిద్ధంగా ఉంది. రాజస్తాన్‌లోని ధోల్పూర్ గనుల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఎర్ర రాయి, లేత గోధుమ రంగు రాయిని ప్రధాన నిర్మాణం దిగువ, పైభాగంలో వెలుపలి వైపు అమరుస్తున్నారు. సచివాలయానికి నైరుతి భాగంలో దేవాలయం నిర్మిస్తున్నారు. ప్రధాన నిర్మాణం పూర్తికాగా పైన గోపురం నిర్మించాల్సి ఉంది. వెనుకభాగంలో నిర్మిస్తున్న మసీదు గుమ్మటం పనులు చేపట్టాల్సి ఉంది. దానికి పక్కనే నిర్మిస్తున్న చర్చి శ్లాబ్ పనులు మొదలవుతున్నాయి. ఆరో అంతస్తులో సీఎం ఆఫీసు భవనం ఎనిమిది అంతస్తులతో ఉంటుంది. ఇందులో లోయర్ గ్రౌండ్, గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు పైన ఆరు అంతస్తులు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ మొదలు ప్రతి అంతస్తులో మంత్రుల కోసం నాలుగు చాంబర్లు ఉంటాయి. మంత్రులు, కేబినెట్ స్థాయిలో ఉండే వారికి వాటిని కేటాయిస్తారు. మంత్రి చాంబర్‌ను ఆనుకునే ఆ శాఖ కార్యదర్శి, ఇతర అధికారుల చాంబర్లు ఉంటాయి. సచివాలయంలో సీఎం కార్యాలయాన్ని ఆరో అంతస్తులో సిద్ధం చేస్తున్నారు. ఆయన తన కార్యాలయానికి వచ్చేందుకు వీలుగా ప్రధాన ద్వారం నుంచి కాకుండా నైరుతి భాగంలో రెండు లిఫ్టులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా భవన సముదాయంలో మరో 22 లిఫ్టులు ఏర్పాటు చేశారు. సీఎం కార్యాలయాన్ని బుల్లెట్ ప్రూఫ్‌తో సిద్ధం చేస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ బిగించాల్సిందిగా ఇటీవలే అధికారులు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రతినిధులకు లేఖ రాశారు. త్వరలో ఆ పనులు మొదలుకాబోతున్నాయి. కొత్త సచివాలయంలో రెండు భారీ ఫౌంటెయిన్లు నిర్మిస్తున్నారు. పార్లమెంటు ఫౌంటెయిన్ తరహాలో వీటిని రాజస్తాన్ ధోల్పూర్ ఎర్ర రాతి ఫలకాలతో సిద్ధం చేస్తున్నారు. ఈ పనులు తుది దశలో ఉన్నాయి. -
సచివాలయానికి అంబేడ్కర్ పేరు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. భారత నూతన పార్లమెంటు భవనానికి సైతం అంబేడ్కర్ పేరు పెట్టాలని ఆయన మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని గత మంగళవారం రాష్ట్ర శాసనసభ ఏకగీవ్రంగా తీర్మానం చేసిందని గుర్తుచేశారు. ఏదో ఆశామాషీకి అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరడం లేదని స్పష్టంచేశారు. దేశ గౌరవం మరింతగా ఇనుమడించాలంటే, భారత సామాజిక తాత్వికుడు, రాజ్యాంగ నిర్మాతకు మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరుతూ త్వరలో ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజలందరికీ గర్వ కారణం రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్‌కు అంబేడ్కర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని కేసీఆర్ పేర్కొన్నారు. ‘దేశ ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేడ్కర్ తాత్వికతను రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ స్వయంపాలన కొనసాగించడం వెనక అంబేడ్కర్ ఆశయాలు ఇమిడి ఉన్నాయి. అంబేడ్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ ఏర్పాటైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తోంది’ అని సీఎం పేర్కొన్నారు. మమ్మల్ని అంబేడ్కర్ స్ఫూర్తే నడిపిస్తోంది.. ‘అంబేడ్కర్ కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉంది. ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించబడతాయనే అంబేడ్కర్ స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తోంది. దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడటమే నిజమైన భారతీయత. అప్పుడే నిజమైన భారతం ఆవిష్కృతమౌతుంది. అందుకోసం మా కృషి కొనసాగుతుంది. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేడ్కర్ పేరును సెక్రటేరియట్‌కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. జై భీం. జై తెలంగాణ. జై భారత్’ అని సీఎం తన ప్రకటనను ముగించారు. ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? -
సచివాలయానికి అంబేడ్కర్ పేరుపెట్టండి
సాక్షి, మేడ్చల్ జిల్లా: తుది దశకు చేరుకున్న కొత్త సచివాలయ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే మంత్రి కేటీఆర్ పార్లమెంట్ భవన్ పేరు మార్పు గురించి మాట్లాడాలని సూచించారు. అసెంబ్లీలో అంబేడ్కర్ ఫొటో తీసేసి సీఎం కేసీఆర్ తన ఫొటో పెట్టించుకున్న విషయం వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో బండి సంజయ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. సభలో సీఎం రాజకీయాలా? ప్రధాని మోదీపట్ల సీఎం కేసీఆర్ సంస్కారహీనంగా మాట్లాడారని.. అందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలు, రాష్ట్ర పరిస్థితులపై చర్చించాల్సిన శాసనసభలో సీఎం కేసీఆర్ రాజకీయాలు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌కు అసెంబ్లీని నడిపే అర్హత లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ ఎమ్మెల్యేలు ఎండగడుతున్నందుకే ఒక ఎమ్మెల్యేను (రాజాసింగ్) జైలుకు పంపించారని... ఇప్పుడు మరో ఎమ్మెల్యేను సభ నుంచి సస్పెండ్ చేశారని సంజయ్ దుయ్యపట్టారు. మోదీని ఫాసిస్టు అన్నందుకు మాకెంత కోపం రావాలి.. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేయడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. ఈటల సస్పెన్షన్‌ను ఖండిస్తున్నానని, ఈ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని బండి తెలిపారు. అసెంబ్లీ బయట స్పీకర్‌ను మరమనిషి అని ఈటల విమర్శించినందుకే అధికార పార్టీ సభ్యులకు అంత కోపం వస్తే... నిండు సభలో ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ఫాసిస్టు ప్రధాని అన్నందుకు తమకు ఎంత కోపం రావాలన్నారు. హామీలను అమలు చేయలేని వాళ్లను మరమనిషి అనడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు. వీఆర్ఏలను బర్ల లెక్క కొట్టారు.. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 50 రోజులుగా సమ్మె చేస్తున్న వీఆర్ఏలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నిస్తే పోలీసులు వారిని బర్ల లెక్క కొట్టి తీసుకెళ్లారని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రగతి భవన్ సందర్శకుల జాబితాలో ఒవైసీ సోదరులు తప్ప ఇతరుల పేర్లేవీ కనిపించవని.. ఇంకెవరినీ లోనికి రానీయరని విమర్శించారు. దమ్ముంటే ఆ జాబితాను బయట పెట్టాలన్నారు. -
సచివాలయం శ్వేతసౌధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కొత్త సచివాలయ భవనం హుస్సేన్‌సాగర తీరాన శ్వేతసౌధంగా మెరిసిపోనుంది. 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడంతస్తులతో పర్షియన్ గుమ్మటాల డిజైన్, కాకతీయుల శైలితో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ భవనం యావత్తు తెలుపు రంగులో తళతళలాడనుంది. ఎన్నో ప్రత్యేకతలతో నిర్మిస్తున్న ఈ భవనానికి రంగుల్లోనూ ప్రత్యేకతలు చూపాలని తొలుత భావించినా భవన ఆర్కిటెక్ట్ మాత్రం సంప్రదాయ డంగు సున్నం నిర్మాణపు సొగసు కనిపించాలంటే తెలుపు రంగు మాత్రమే వేయాలని కోరారు. ఈ సూచనను ముఖ్యమంత్రి అంగీకరించారు. దీంతో కేవలం తెలుపు రంగుతో ఈ భవనం శ్వేతసౌధంగా ప్రత్యేకతను చాటుకోనుంది. నగిషీలు అద్దనున్న ధోల్పూర్ రంగురాళ్లు.. భవనమంతా తెల్లగా మెరవనున్నప్పటికీ సున్నపు గోడకు జాజు అద్దినట్టుగా నూతన సచివాలయానికి రాజస్తాన్‌లోని ధోల్పూర్ రంగురాళ్లు నగిషీలద్దనున్నాయి. భవనం దిగువన బేస్మెంట్ అంతా ధోల్పూర్ నుంచి తెప్పించిన ఆగ్రా ఎరుపు రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. 14 అడుగుల ఎత్తుతో ఈ రాళ్లను పరుస్తున్నారు. పైభాగంలో జాజు పట్టీ తరహాలో మరో వరుస ఎరుపు రాళ్లు ఏర్పాటు చేశారు. ఈ భవనానికి ప్రత్యేకంగా నిలవనున్న 82 అడుగుల ఎత్తు, 45 అడుగుల డయాతో రూపుదిద్దుకోనున్న భారీ గుమ్మటం దిగువ భాగమంతా ధోల్పూర్ నుంచి తెప్పించిన లేత గోధుమ రంగు (బీజ్ý )æ రాళ్లను పరవనున్నారు. గుమ్మటం దిగువ నుంచి దానంత వెడల్పుతో బేస్మెంట్ వరకు ఈ రాళ్లే ఉంటాయి. పెద్ద గుమ్మటాలు సహా మొత్తం 34 గుమ్మటాలు కూడా తెలుపు వర్ణంలో ఉండనున్న సంగతి తెలిసిందే. 3 వేల కి.మీ. నుంచి 500 ట్రక్కుల్లో.. రాజస్తాన్‌లోని ధోల్పూర్ గనుల నుంచి ఆగ్రా ఎరుపు, లేత గోధుమ రంగు రాళ్లను ప్రత్యేకంగా తెప్పించారు. పార్లమెంటు సహా రాష్ట్రపతి భవన్ లాంటి చారిత్రక నిర్మాణాలకు ఇదే రాయిని వాడారు. ఆ ఠీవీ కనిపించేందుకు సచివాలయానికి కూడా వాటినే ఎంపిక చేశారు. సచివాలయానికి 3 వేల క్యూబిక్ మీటర్ల ధోల్పూర్ రాళ్లను తెప్పించారు. 3 వేల కి.మీ. దూరంలోని గనుల నుంచి రాళ్లను ఏకంగా 500 కంటైనర్ ట్రక్కుల్లో తీసుకురావడం విశేషం. వాటి కటింగ్ కూడా పూర్తి కావడంతో రాళ్లను అమర్చే పని కొనసాగుతోంది. పైభాగంలో పట్టీ తరహాలో కనిపించే అమరిక పూర్తవగా దిగువ బేస్మెంట్కు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద డోమ్ దిగువన లేత గోధుమరంగు రాళ్లను అద్దే పని జరగాల్సి ఉంది. భవనానికి భారీ కిటికీలు ఉండనున్నాయి. వాటి అద్దాలు లేత నీలిరంగులో ఏర్పాటు చేయనుండడంతో, తెలుపు వర్ణం భవనంపై ధోల్పూర్ ఎరుపు రాళ్ల వరుస, నీలిరంగు అద్దాలు ప్రత్యేకంగా కనిపించనున్నాయి. -
సచివాలయ పనుల్లో జాప్యం వద్దు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయ పనుల్లో ఎట్టి పరిస్థి తుల్లో జాప్యం జరగొద్దని, ఏకకాలంలో అన్ని విభాగాల పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వేగంగా పనులు జరుపుతూనే నాణ్యతలో రాజీపడొద్దని సూచించారు. సీఎం బుధవారం సాయంత్రం సచివాలయ పనులను పరిశీలించారు. అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించి, పలు సూచ నలు చేశారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కలియదిరి గారు. నిర్దేశించిన డిజైన్లలో రూపొందుతున్నాయా లేదా తనిఖీ చేశారు. శ్లాబులు, భవనంపై గుమ్మటాల నిర్మాణం, ఇంటీరియర్ పనులు, ఫర్నిచర్ ఎంపిక తదితరాలపై పలు సూచనలు చేశారు. భవనం మధ్య ఉండే కోర్టుయార్డు, ముందు భాగంలోని ల్యాండ్ స్కేప్, ఇతర పచ్చిక బయళ్లను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. రాజస్తాన్ నుంచి తెప్పించిన ధోల్పూర్ ఎర్రరాయి ఏర్పాటు, మురుగునీటి పారుదల వ్యవస్థ, సందర్శకులు వేచిచూసే ప్రాంతం, గోడ వెంబడి మట్టి నింపే పనులు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా, ఎవరికీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. నాణ్యమైన ఫర్నిచర్‌ను ఎంపిక చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీ దామోదర్‌రావు, పలువురు ప్రజాప్రతి నిధులు, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుధాకర్‌తేజ, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. -
గడువులోపు సచివాలయం, స్మారక భవనాలు పూర్తవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోపు కొత్త సచివాలయం, అమరవీరుల స్మార కభవన నిర్మాణాలు పూర్తి కావాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. సచివాలయ పనులు జరుగుతున్న తీరుపట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. అయితే ఇంకా పనుల్లో వేగం పెంచాలని పేర్కొన్న ఆయన.. సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రుల చాం బర్లు, అధికారుల కార్యాలయాలకు సంబంధించిన డిజైన్లను అంతస్తులవారీగా పరిశీలించారు. గతంలో సీఎం చేసిన మార్పులకు తగ్గట్టు తుది ప్లాన్స్‌ను సమర్పించాలని వేముల ఆదేశించారు. అమరవీరుల స్మారక భవనం ఎలా ఉండబోతుందనే విషయంలో అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. భవనం పైభాగంలో నిరంతరం జ్వలించేలా చేసే ఏర్పాట్లు ప్రత్యేకంగా ఉం డాలని, దానిపై దృష్టి సారించాలని సూచించారు. ప్రవేశమార్గం వద్ద అమరవీరులకు చిన్నారులతో నివాళులర్పించేలా ఉండే డిజైన్, పచ్చిక బయళ్లు, ఆడియో వీడియో ప్రాంగణం తదితర డిజైన్లపై చర్చించారు. ప్రవేశంలో తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం తెలుగులో ఉండాలన్నారు. అమరుల ఫొటో ఎగ్జిబిషన్ ప్రాంగణం, కాన్ఫరెన్స్ హాలు, రెస్టారెంట్ ప్లాన్లను పరిశీలించారు. సమావేశంలో రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఇతర ఇంజ నీరింగ్ అధికారులు పద్మనాభరావు, లింగారెడ్డి, సత్యనారాయణ, శశిధర్, నర్సింగరావు, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ, ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని పాల్గొన్నారు. -
టర్కీ డిజైన్‌లో సచివాలయం మసీదులు
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయంలో కొత్తగా నిర్మించే మసీదుల నమూనాలు ఖరారయ్యాయి. టర్కీ డిజైన్‌లో వీటి నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టినట్లు హోం మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ఆయన ఆదివారం తన చాంబర్లో మైనారిటీ వ్యవహారాల సలహాదారుడు ఏకే ఖాన్ తదితరులతో కలిసి మసీదుల డిజైన్లను పరిశీలించారు. పాత సచివాలయంలో మసీదు ఉన్న చోటే వీటిని నిర్మించనున్నారు. నమూనాలపై నిపుణుల సలహాలు తీసుకున్నారు. సచివాలయంలో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో పెద్ద మసీదు, 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో చిన్న మసీదులను అత్యంత సుందరంగా నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మహమూద్ అలీ చెప్పారు. పెద్ద మసీదు లోపల 400 మంది, బయట ఆవరణలో సుమారు 1,000 మంది ప్రార్థనలు చేసేలా నిర్మాణాలు ఉంటాయన్నారు. మహిళలు ప్రత్యేకంగా ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి అంతస్తులో వజూఖానా దానిపై ప్రత్యేకంగా ఇమామ్ కోసం నివాస వసతి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా మసీదు నిర్మాణాలకు శంకుస్థాపన చేసి 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి మసీదులను అందుబాటులోకి వచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. చదవండి: 4 కోట్ల ఆస్తులు: బుక్కెడు బువ్వ పెట్టరూ.. -
కొత్త సచివాలయం ముందు 2 భారీ ఫౌంటెయిన్లు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: గంభీరంగా కనిపించే పార్లమెంటు భవన సముదాయం ముందు రాచఠీవీ ఒలకబోస్తూ నీటిని విరజిమ్మే 50 అడుగుల ఎత్తున్న ఫౌంటెయిన్ నమూనా తెలంగాణ కొత్త సచివాలయం ముందు సాక్షాత్కారం కానుంది. ఆ ఫౌంటెయిన్ నమూనాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆసక్తి చూపటంతో అదే డిజైన్‌తో కొత్త సచివాలయ ప్రాంగణంలో ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే పార్లమెంటు భవనం ఎదుట పచ్చిక మైదానంలో ఒకటే ఫౌంటెయిన్ ఉండగా, సచివాలయ ప్రాంగణంలో ఒకే తరహావి రెండు ఏర్పాటు కానున్నాయి. అక్కడ 50 అడుగుల ఎత్తుంటే ఇక్కడ మాత్రం 16 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకోనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ పార్లమెంటు భవనం ముందున్న ఫౌంటెయిన్ నిర్మాణాలను రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆ శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఈఈ శశిధర్, ఆర్కిటెక్ట్ ఆస్కార్, నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి లక్ష్మణ్‌లతో కలసి పరిశీలించారు. ధోల్పూర్ ఎర్ర రాయి వినియోగం.. పార్లమెంటు భవనం ముందున్న ఫౌంటెయిన్‌కు రాజస్తాన్‌లోని ప్రఖ్యాత ధోల్పూర్ ఎర్ర ఇసుక రాతిని వినియోగించారు. అదే రాయిని తెలంగాణ సచివాలయ ఫౌంటెయిన్‌కు కూడా వాడనున్నారు. ఈ రాతితో ఇటీవల పట్నాలో అదే నమూనా ఫౌంటెయిన్‌ను రూపొందించిన శిల్పిని కూడా అధికారులు పిలిపించి దీనిపై మాట్లాడారు. సచివాలయ ఫౌంటెయిన్ తయారీ బాధ్యత కూడా అతనికే అప్పగించాలని భావిస్తున్నారు. పార్లమెంట్ భవనం వద్ద మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఇతర అధికారులు ‘రీజనల్ రింగ్ రోడ్డు’మంజూరు చేయండి.. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ సెక్రటరీ గిరిధర్‌ను మంత్రి ప్రశాంత్‌రెడ్డి కలిశారు. తెలంగాణకు నూతన జాతీ య రహదారులు, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మంజూరు చేయాలని ఆయనను మంత్రి కోరారు. హైదరాబాద్‌కు ఉత్తరాన ఉన్న బోయిన్పల్లి–మేడ్చల్ మధ్య, దక్షిణాన ఉన్న శంషాబాద్–కొత్తూరు మధ్య రహదారులను మెరుగుపర్చే అంశం ప్రస్తుతం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ వద్ద పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. కల్వకుర్తి–నంద్యాల మధ్య నూతన జాతీయ రహదారి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి గడ్కరీ, శాఖ సెక్రటరీ గిరిధర్‌కు ప్రశాంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నేరుగా ధోల్పూర్ క్వారీ నుంచి రాయి.. సచివాలయ భవనం దిగువ భాగానికి ధోల్పూర్ ఎర్రరాతి ఫలకాలనే ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ భవన ఆకృతిపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలోనే ఈమేరకు నిర్ణయించారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు రాజస్తాన్‌లోని ధోల్పూర్లో ఉన్న క్వారీల నుంచి నేరుగా ఆ రాయికి ఆర్డర్ ఇవ్వనున్నారు. ఈమేరకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికారులు ధోల్పూర్ వెళ్లారు. సచివాలయ భవనానికి 2 వేల క్యూబిక్ మీటర్ల మేర ధోల్పూర్ ఎర్ర రాతి ఫలకాలను, గోడలు, ఫుట్‌పాత్‌లకు ధోల్పూర్ క్వారీలో లభిం చే లేత గోధుమ రంగు రాయిని వినియోగించనున్నారు. దాదాపు లక్ష చదరపు అడుగుల మేర ఆ రాతిని వినియోగించనున్నారు. కావాల్సిన రాతిని నేరుగా క్వారీలకే ఆర్డర్ ఇచ్చి తెప్పించనున్నారు. దీనివల్ల నాణ్యమైన రాయి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అంతకుముందు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికారులు.. ఢిల్లీలోని పార్లమెంటు, నార్త్‌బ్లాక్, సౌత్‌బ్లాక్, రాష్ట్రపతి భవనం, అశోకా హాల్‌లను సందర్శించారు. ఈ భవనాలకు ఆ ఎర్ర రాయినే వినియోగించటంతో వాటి నిర్మాణ ప్రత్యేకతలను పరిశీలించారు. శని, ఆదివారాల్లో ఆగ్రా ఎర్రకోట, తాజ్‌మహల్, ధో ల్పూర్, కరోలీ క్వారీలను పరిశీలించనున్నారు. చదవండి: (ఆర్టీసీలో మరో సరికొత్త వ్యవస్థ..!) (10,673 టీచర్ పోస్టులు ఖాళీ) -
కొత్త సచివాలయ పనులు సీఎం కేసీఆర్ పరిశీలన
సాక్షి, హైదరాబాద్: అత్యాధునికంగా.. సకల సౌకర్యాలతో కొత్త సచివాలయ నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన పనులను షాపూర్ పల్లోంజీ చేపడుతోంది. రూ.617 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే ఈ పనులను మంగళవారం సీఎం కేసీఆర్ ఆకస్మికంగా పరిశీలించారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ ట్యాంక్‌బండ్‌కు చేరుకుని సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సచివాలయ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ నిర్మాణ పనులను అక్కడున్న సిబ్బందిని అడిగి కొన్ని సూచనలు చేశారు. త్వరితగతిన ఈ పనులను పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. -
సర్వ మతాలకు సమ ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించే సచివాలయంలో మందిరం, మసీదులు, చర్చిని పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో నిర్మిస్తామని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత గంగా జమునా తహజీబ్‌కు అద్దం పట్టేలా ఒకే రోజు అన్ని ప్రార్థన మందిరాలకు శంకుస్థాపన చేసి, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కొత్త సచివాలయంలో మసీదుల నిర్మాణం, ఇతర అంశాలపై ఎంఐ ఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలో వివిధ ముస్లిం సంస్థల ప్రతినిధులతో కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణ యాలు తీసుకున్నారు. కేసీఆర్ మాట్లా డుతూ.. పాత సచివాలయం భవనాలు కూల్చివేస్తున్న సందర్భంలో అక్కడున్న మందిరం, రెండు మసీదులకు నష్టం వాటిల్లిందని.. వాటిని ప్రభుత్వ ఖర్చుతో అన్ని సౌకర్యాలతో నిర్మిస్తామ న్నారు. ఒక్కొక్కటి 750 చదరపు గజాల విస్తీర్ణంలో ఇమామ్ క్వార్టర్‌తో సహా రెండు మసీదులు (మొత్తం 1,500 చ.గ.) ప్రభు త్వం నిర్మిస్తుందని చెప్పారు. పాత సచివాల యంలో ఉన్న స్థలంలోనే వీటి నిర్మాణం జరుగుతుందని, నిర్మాణం పూర్తయ్యాక వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తామన్నారు. అలాగే, 1,500 చ.గ. విస్తీర్ణంలో మందిర నిర్మాణాన్ని ప్రభు త్వం చేపడుతుందని, నిర్మాణం పూర్తయ్యాక దేవాదాయ శాఖకు అప్పగిస్తుందని వెల్లడిం చారు. కొత్త సచివాలయంలో తమకూ ప్రార్థన మందిరం కావాలన్న క్రిస్టియన్ల కోరిక మేరకు చర్చిని కూడా ప్రభుత్వమే నిర్మిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మతాలకు సమ ఆదరణ... రాష్ట్రం అన్ని మతాలను సమానంగా ఆదరి స్తుందని.. అందుకే కొత్త సచివాలయంలో అన్ని మతాల ప్రార్థన మందిరాలు నిర్మిస్తా మని కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్నింటికీ ఒకేరోజు శంకుస్థాపన చేస్తామన్నారు. ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయమిచ్చి, విద్య నేర్పించే అనీస్–ఉల్–గుర్భా నిర్మాణం 80 శాతం పూర్తయిందని, మిగతా నిర్మాణం కోసం అవసరమైన మరో రూ.18 కోట్లు వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఇస్లామిక్ సెంటర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. స్థలం కేటాయించినా కరోనా పరిస్థితుల వల్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నారు. వెంటనే ఈ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. నగరం చుట్టూ ఖబ్రస్థాన్లు.. హైదరాబాద్ చుట్టూ ఖబ్రస్థాన్ లు రావాల్సిన అవసరం ఉందని, స్థలాల గుర్తింపు జరుగుతోందని ముఖ్యంంత్రి అన్నారు. నగరంలోని వివిధ చోట్ల 150 నుంచి 200 ఎకరాల్లో ఖబ్రస్థాన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే నారాయణపేటలో రోడ్ల వెడల్పుతో పీరీల చావడి అయిన అసుర్ ఖానాకు నష్టం వాటిల్లిందని అన్నారు. దీనికి స్థలం కేటాయించి, నిర్మాణం చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించామని చెప్పారు. రాష్ట్రంలో ఉర్ధూను రెండవ అధికార భాషగా గుర్తిస్తున్నామని, దీని పరిరక్షణ, అభివృద్ధికి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. అధికార భాష సంఘంలో ఉర్ధూ భాషకు సంబంధించిన వ్యక్తిని ఉపాధ్యక్షుడిగా నియమిస్తామని సీఎం కేసీఆర్ వివరించారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్ మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్ సాహెబ్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సెక్రటరీ మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్, మజ్లిస్ ఉలేమా ఇ డెక్కన్ ప్రెసిడెంట్ మౌలానా సయ్యద్ కుబూల్ బాద్ షా షట్టారి, మౌతమీమ్ దారుల్ ఉలూమ్ రహ్మానియా, ప్రెసిడెంట్ జామియత్ ఉలేమా ఇ హింద్ మౌలానా ముఫ్తీ ఘ్యాసుద్దీన్ రహ్మానీ, అమీర్ ఈ జామియా నిజాయా మౌలానా సయ్యద్ అక్బర్ నిజాముద్దీన్ హుస్సేనీ, అమీర్ ఇ జమాత్ ఈ ఇస్లామియా మౌలానా హమీద్ మొహమ్మీద్ ఖాన్ సాహబ్, తామీర్ ఇ మిల్లత్ వైస్ ప్రెసిడెంట్ మౌలానా జియాఉద్దీన్ నాయ్యర్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్, హైదరాబాద్ నాజిమ్ దారుల్ ఉలూమ్ మౌలానా రహీముద్దీన్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. శనివారం ప్రగతి భవన్లో ముస్లిం మత పెద్దలతో సమావేశమైన సీఎం కేసీఆర్. చిత్రంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు సీఎం హామీ ఇచ్చారు మసీదుల పునర్నిర్మాణంపై ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు వెల్లడి సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించే సచివాలయంలో రెండు మసీదులతో పాటు చర్చి నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టమైన హామీ ఇచ్చారని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు తెలిపారు. శనివారం హైదరాబాద్ దారుస్సలాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఐఎంఐ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలసి వారు మాట్లాడారు. వచ్చే నెలలో గంగా జమునా తహజీబ్‌కు అద్దం పట్టేలా ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేస్తామని సీఎం వెల్లడించారన్నారు. మసీదులను ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి, ఆ తర్వాత వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తామని చెప్పారన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరంలో తలపెట్టిన ఇస్లామిక్ సెంటర్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారన్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ వివిధ చోట్ల ముస్లిం శ్మశాన వాటికల కోసం 150 నుంచి 200 ఎకరాల భూమిని కేటాయించేందుకు అంగీకరించారని వారు వెల్లడించారు. రోడ్ల వెడల్పులో ప్రార్థనా మందిరాలకు నష్టం వాటిల్లకుండా ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేశారన్నారు. అలాగే క్రిస్టియన్ల కోరిక మేరకు సచివాలయంలో ప్రార్థనా మందిరం కూడా నిర్మిస్తామని చెప్పారన్నారు. మీరు సమాధానాలివ్వరు.. కానీ వారిని రాయమంటారు.. వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తి వేయడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. ‘పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేస్తారు.. కానీ జేఈఈ, నీట్ పరీక్షల్లో మాత్రం విద్యార్థులను సమాధానాలు రాయమంటారు. ఇదే మోదీ పాలన’అని విమర్శించారు. క్వొశ్చన్ అవర్ ఎత్తి వేయడంతో దేశంలో విజృంభిస్తున్న కోవిడ్‌పై తాము ప్రశ్నలు అడగగలమా.. తూర్పు లడఖ్‌లో ఏమీ జరుగుతుందో చర్చించగలమా అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా ప్రశ్నోత్తరాల సమయం ఉండాలన్నారు. పలు దేశాల ప్రధానులు కరోనా వైరస్ ప్రభావం, సమస్యలపై విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారని, అయితే మోదీ మాత్రం వీడియో సందేశాలు ఇస్తున్నారని విమర్శించారు. -
తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
-
సచివాలయం కూల్చివేతకు హైకోర్టు ఓకే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతపై వేర్వేరుగా దాఖలైన 10 పిటిషన్లపై న్యాయస్థానంలో సోమవారం విచారణ జరగగా.. చివరికి ప్రభుత్వ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. నూతన సచివాలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని తేల్చిచెప్పింది. సచివాలయం కూల్చివేయొద్దంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పిటిషన్లు వాదనలు వినిపించగా, ప్రభుత్వ పాలసీ విధానాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో సరైన సదుపాయాలు లేవని, ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వ వాదనలతో ఏఖిభవించిన ధర్మాసనం.. సచివాలయ కూల్చివేతకు అనుమతి ఇచ్చింది. దీంతో నూతన సచివాలయ నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్ని తొలిగిపోయాయి. -
సచివాలయ నిర్మాణానికి 400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయ భవనాల నిర్మాణానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అంచనా వేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నిర్మాణానికి 12 నెలల సమయం పడుతుందని పేర్కొంది. సచివాలయాన్ని కూల్చి నూతనంగా అన్ని హంగులతో అత్యాధునిక వసతులతో భావితరాలకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పింది. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. సచివాలయ భవనాల్ని కూల్చరాదంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాల మేరకు ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. -
క్లిష్ట పరిస్థితుల్లో కొత్త సచివాలయమా? : హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతిక్లిష్టంగా ఉన్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో కోట్లు ఖర్చు చేసి కొత్త సచివా లయం నిర్మించాలా? ప్రజాహితం కోసమే కావచ్చు. కొత్తగా నిర్మాణం చేస్తే కనీసం అయిదారేళ్లు సమయం పడుతుంది. ఇందుకు వ్యయం చేశాక ఆదాయం ఏమీ రాదు. ఇలాంటప్పుడు కొత్తగా నిర్మాణం చేయాలా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నగరంలోని వేర్వేరు చోట్లకు సచివాలయ కార్యాలయాన్ని తరలించేస్తే, అధికారిక రహస్య ఫైళ్ల పరిస్థితి ఏమిటి? ఆ ఫైళ్లు తరలించే దారిలో అవి కనిపించకుండా పోతే? ఆ ఫైళ్లు తారుమారయ్యే అవకాశం లేదా? వేర్వేరు చోట్ల సచివాలయ కార్యాలయాలు ఉంటే కీలకఫైళ్లకు కాళ్లు వస్తే పరిస్థితి ఏమిటి? అని ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. గందరగోళంగా మంత్రివర్గ నిర్ణయం.. సచివాలయ అంశంపై మంత్రివర్గం 2019 ఫిబ్రవరి 18న తీసుకున్న నిర్ణయం చూస్తే అంతా గందరగోళంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్థాయికి తగినట్లుగా అన్ని హంగులతో భావితరాలకు సరిపడేలా ఉన్నతస్థాయి నిర్మాణం చేయడమే కొత్త సచివాలయ ఉద్దేశం అని ఒక చోట ఉంది. పాత సచివాలయానికే మార్పులు చేర్పులు చేసి ఆధునీకరించి వినియోగించుకోవాలని మరోచోట ఉంది. పరస్పర విరుద్ధంగా అంతా అయోమయంగా కేబినెట్ నిర్ణయం ఉంది. ఇంతకీ ఆ ద్వంద్వ నిర్ణయాలేమిటో, వాటి ఆచరణలో అమలయ్యేదేమిటో చెప్పాలి..? అని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. సచివాలయాన్ని కూల్చి కొత్తగా నిర్మాణం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను గురువారం విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం.. పలు ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఉక్కిబిక్కిరి చేసింది. ఎంతకాలంలో కొత్త సచివాలయాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సత్వరమే నిర్మాణం చేయాలనుకున్నా కనీసం మూడేళ్లు పడుతుందని, అప్పటివరకూ వేర్వేరు చోట్ల ఉన్న ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉంటుందని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదిస్తూ మంత్రివర్గం నిర్ణయం తర్వాత మంత్రివర్గ ఉప సంఘం కూడా ఏర్పాటైందని, ఈ అంశంపై అధ్యయనానికి ఆ సంఘం సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిన కారణంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పగానే ధర్మాసనం కల్పించుకుని సచివాలయ భవనాల్ని కూల్చరాదని మాత్రమే తాము స్టే ఉత్తర్తులు జారీ చేశామని, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అంశాలపై కాదని తేల్చి చెప్పింది. ఏఏజీ వాదనలు కొనసాగిస్తూ కొత్తగా సచివాలయ భవనాలు నిర్మించాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, సాంకేతిక కమిటీ కూడా ఆ విధంగా నివేదిక కూడా ఇచ్చిందని చెప్పారు. సచివాలయాన్ని 70 శాతం వరకూ బూర్గుల భవనంలోకి, మిగిలిన 30 శాతాన్ని నగరంలోని వేరువేరు ప్రభుత్వ భవనాల్లోకి తరలించామని తెలిపారు. చాలా వరకూ మంత్రులు, ఆయా శాఖాధిపతులు ఒకేచోట ఉంటున్నారని చెప్పారు. జోక్యం చేసుకోవడానికి వీల్లేదు.. మంత్రివర్గ నిర్ణయాల్లో న్యాయ స్థానాలు జోక్యం చేసుకోడానికి వీల్లేదని చెప్పగానే, నిర్ణయం సహేతుకం కానప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చునని ధర్మాసనం బదులిచ్చింది. అన్నీ ప్రభుత్వం చెబుతోంది గానీ, వాటిని కౌంటర్ పిటిషన్ ద్వారా హైకోర్టుకు తెలియజేయట్లేదని ధర్మాసనం పేర్కొంది. అనంతరం కొత్త సచివాలయ నిర్మాణానికి ఎన్ని రూ.కోట్లు అవసరం అవుతాయి, నిధులు ఎక్కడి నుంచి సమీకరిస్తున్నారు, పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేయడానికి ఎంత కాలం పడుతుందని అంచనా వేశారు, కొత్త భవనాల డిజైన్ ఏది, ఎంత విస్తీర్ణంలో నిర్మాణం చేయాలని భావిస్తున్నారు, శాఖల వారీగా ఎంత స్థలం అవసరం, మొత్తం 25 ఎకరాల స్థలంలో నిర్మాణం ఏ మేరకు చేస్తారు.. వంటి వివరాలతోపాటు సాంకేతిక కమిటీ నివేదిక ఇతర అంశాలపై రోడ్డు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది. -
మాంద్యం మింగేసింది
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత.. ఇంటర్ ఫలితాల్లో లోపాలపై తీవ్ర వివాదం... న్యాయ చిక్కులతో బెడిసికొట్టిన కొత్త సచివాలయం, శాసనసభ భవన సముదాయాల నిర్మాణం, ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘ సమ్మె... దిశ హత్యాచారం, నలుగురు నిందితుల ఎన్కౌంటర్.. వెరసి ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం కొన్ని ఒడిదుడుకులకు, సంచలనాలకు వేదికైంది. అదే సమయంలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడం ప్రభుత్వ అతిపెద్ద విజయంగా, తీపిగుర్తుగా మిగిలింది. 2019 సంవత్సరం మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు, రాష్ట్రానికి ఎదురైన క్లిష్ట పరిస్థితులపై కథనం. ఆర్థిక మాంద్యం దెబ్బ ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పడింది. ఫిబ్రవరిలో రూ. 1,82,087 కోట్ల భారీ అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆర్థిక మాంద్యం దెబ్బకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను సెప్టెంబర్‌లో రూ. 1,46,492.30 కోట్లకు తగ్గించుకుంది. అయినా ఇప్పటికే అమల్లో ఉన్న రైతుబంధు వంటి ప్రతిష్టాత్మక పథకాలకు తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల బిల్లులు పేరుకుపోయాయి. గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన కొత్త హామీల అమలు కూడా ఆర్థిక మాంద్యం వల్ల ప్రశ్నార్థకమైంది. రైతులకు రూ. లక్షలోపు రుణ మాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పీఆర్సీ, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వంటి హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలు ఏడాదంతా నిరీక్షించాల్సి వచ్చింది. రైతుబంధు ఆర్థిక సాయం, ఆసరా పెన్షన్ల పెంపు హామీలను అమల్లోకి తెచ్చినా సకాలంలో పంపిణీ చేయలేకపోయింది. గత ఖరీఫ్‌లో 45 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద రూ. 5,460 కోట్లు చెల్లించగా 8 లక్షల మందికి రూ. 1,500 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇక రబీకి సంబంధించి చెల్లింపులు ఇంకా ప్రారంభం కాలేదు. నిధుల కొరత వల్ల కొత్తగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సవరించిన అంచనాల్లో రూ. 10 వేల కోట్లను భూముల అమ్మకం ద్వారా సమీకరించుకోవాలని నిర్ణయించినా కోకాపేట భూముల అమ్మకంపై హైకోర్టు స్టే విధించడంతో అది నెరవేరట్లేదు. ఇంటర్ ఫలితాల్లో ‘ఫెయిల్’ ఇంటర్మీడియెట్ ఫలితాల ప్రకటనలో దొర్లిన తప్పులు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. రిజల్ట్స్ ప్రాసెసింగ్ కాంట్రాక్టు దక్కించుకున్న గ్లోబరీనా సంస్థ చేసిన తప్పిదాల కారణంగా పాసైన విద్యార్థులు సైతం ఫెయిలైనట్లు ఫలితాలొచ్చాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపింది. ఈ విషయంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదనే విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహించడం, ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీంకోర్టు స్పందించడం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసింది. ‘కాళేశ్వరం’ జాతికి అంకితం.. రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ జూన్ 21న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి ఆయకట్టుకు నీరు అందించేలా యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. 52 రోజుల పాటు.. అక్టోబర్ 5 నుంచి 52 రోజులపాటు సాగిన ఆర్టీసీ సమ్మె యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. సమ్మె విరమణకు కార్మిక సంఘాల జేఏసీ, డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం నిరాకరించడంతో 50 వేల మంది కార్మికులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఐదుగురు కార్మికుల బలవన్మరణాలతో కలిసి మొత్తం 38 మంది కార్మికులు సమ్మె కాలంలో మరణించారు. చివరకు కార్మిక జేఏసీ సమ్మె విరమించడం, కార్మికులను ప్రభుత్వం బేషరతుగా విధుల్లో చేర్చుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. సమ్మె విరమించిన కార్మికులపై సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించడం ఊరట కలిగించింది. ఆర్టీసీ పరిరక్షణ కోసం కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున చార్జీల పెంపును ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సచివాలయం లేని రాష్ట్రం కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణం కోసం ప్రభుత్వం చారిత్రక ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చేసి అక్కడే రూ. 400 కోట్లతో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలనితీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చి రూ. 100 కోట్లతో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. ప్రభుత్వం హుటాహుటిన సచివాలయ భవనాలను ఖాళీ చేయించడంతో పాలనపరంగా కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. సచివాలయ శాఖల్లో కొన్నింటిని సమీపంలోని బీఆర్కేఆర్ భవన్‌కు తరలించగా మిగిలిన శాఖలను వేర్వేరు చోట్లలో ఉన్న ప్రభుత్వ భవనాలకు చేర్చారు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్న చందంగా సచివాలయ శాఖల పరిస్థితి తయారైంది. -
‘ఎర్రమంజిల్’ కూల్చొద్దు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం 150 ఏళ్ల నాటి ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చి వేసేందుకు రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. కేబినెట్ నిర్ణయం ఏకపక్ష నిర్ణయమని, చట్ట విరుద్ధ మని స్పష్టం చేసింది. ఈ విషయంలో చట్ట నిబంధనలు, న్యాయస్థానాల ఆదేశాలు, కీలకమైన విషయాలను విస్మరించిందంటూ కేబినెట్ తీరును హైకోర్టు ఆక్షేపించింది. భవిష్య త్తుకు ప్రణాళి కలు రచించడం ఎంత ముఖ్యమో, గతాన్ని పరిరక్షించు కోవడమూ అంతే ముఖ్యమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది. చారిత్రక ఎర్ర మంజిల్ భవనాన్ని కూల్చేసి, దాని స్థానంలో కొత్త అసెంబ్లీ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను నిర్మించిన నవాబ్ సఫ్జదార్ జంగ్ ముషిర్‌దౌలా ఫర్క్‌ల్లా ముల్క్ వారసుడు మిర్ ఆస్గార్ హుస్సేన్, హెరిటేజ్ భవనాన్ని కూల్చరాదని డెక్కన్ ఆర్కియాలజికల్, కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి కె.జితేంద్రబాబు, సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, ఉస్మానియా విద్యార్థి జె.శంకర్‌లతో పాటు మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో 8 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ జరిపిన ధర్మాసనం.. సోమవారం 111 పేజీల తీర్పు వెలువరించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. తీర్పు సారాంశం ఇలా.. ‘ఓ నగర గుర్తింపు, ఆనవాళ్లు, దాని వారసత్వ సంపదను చారిత్రక భవనాలే నిర్వచిస్తాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. నగరాల్లోని చారిత్రక భవనాలను విధ్వంసాల నుంచి పరిరక్షించడం, వాటిని పునరుద్ధరించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. చారిత్రక కట్టడాల పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన ప్రధానమైన విధి కూడా ప్రభుత్వంపై ఉంది. సంస్కృతి, గుర్తింపు ఇచ్చే చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రభుత్వం తన విలాసత్వంతో చారిత్రక భవనాల విధ్వంసానికి పాల్పడితే, అది నగర ప్రత్యేకతను, గుర్తింపును నాశనం చేయడమే’అని వ్యాఖ్యానించింది. మా ఆదేశాలను కూడా ఉల్లంఘించింది.. ‘జోనల్ నిబంధనల కింద చారిత్రక భవనంగా ప్రకటించిన ఏ భవనాన్ని అయినా కూల్చివేయాలన్నా, ఆధునీకరించాలన్నా, మార్పులు చేయాలన్నా మా అనుమతి తప్పనిసరంటూ పేర్కొంటూ 2016 ఏప్రిల్ 18న ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పూర్తి విస్మరించింది. ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చివేయాలన్న నిర్ణయం హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే. ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేత విషయంలో ప్రత్యక్షంగా సాధించలేని లక్ష్యాన్ని ప్రభుత్వం పరోక్షంగా సాధించేందుకు ప్రయత్నించింది. ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేత నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వం హెచ్ఎండీఏ చట్ట నిబంధనలను, జోనల్ నిబంధనలను ఉల్లంఘించింది’అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎలాంటి అనుమతి తీసుకోలేదు.. ‘ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేత నిర్ణయం తీసుకునే ముందు హెచ్ఎండీఏ నుంచి ప్రభుత్వం ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఎర్రమంజిల్ ప్యాలెస్ 2010 మాస్టర్ ప్లాన్‌లో ఉంది. స్పెషల్ రిజర్వేషన్ జోన్లో కూడా ఉంది. జోనల్ నిబంధనల కింద ఎర్రమంజిల్ ప్యాలెస్‌కు ఉన్న రక్షణ కొనసాగుతోంది. జోనింగ్ రెగ్యులేషన్స్ 1981లోని 13వ రెగ్యులేషన్‌ను 2015లో మార్చారు. దీంతో చారిత్రక భవనాలు, చారిత్రక ప్రదేశాలు ‘రక్షిత’హోదా కోల్పోయాయన్న తప్పుడు భావనకు ప్రభుత్వం వచ్చింది. ఇదే సమయంలో 2010లో జోనింగ్ రెగ్యులేషన్స్‌కు రెగ్యులేషన్ 9(ఏ)(2)ను చేర్చారన్న విషయాన్ని కూడా విస్మరించింది. మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేయాలన్నా, ఆధునీకరించాలన్నా కూడా హెచ్ఎండీఏ చట్ట నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలి. కానీ ఎర్రమంజిల్ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం అలా చేయలేదు. ఎర్రమంజిల్ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం హెచ్ఎండీఏ చట్టాన్ని పూర్తిగా విస్మరించింది. జోనింగ్ నిబంధనల మార్పు, రద్దు చేసే అధికారం పూర్తిగా హెచ్ఎండీఏకే ఉంది తప్ప, ప్రభుత్వానికి కాదు. జోక్యం చేసుకోవచ్చు.. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల విషయంలో న్యాయ సమీక్ష చాలా పరిమితం. అయితే ఈ విధానపరమైన నిర్ణయం తీసుకునే ప్రక్రియలో చట్ట నిబంధనలను, కీలక విషయాలను విస్మరించినప్పుడు, ఆ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. అందుకే ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేయాలన్న నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ప్రభుత్వం చట్ట నిబంధనలను, కీలక విషయాలను విస్మరించిందా.. లేదా.. అన్న దానిపైనే మేం ప్రధానంగా దృష్టి పెట్టాం. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం ఏకపక్షమైనప్పుడు, అందులో జోక్యం చేసుకోకుండా న్యాయస్థానాలు మౌనంగా ఉండవు’అని ధర్మాసనం పేర్కొంది. -
ఢిల్లీ తరహాలో కాన్స్టిట్యూషన్ క్లబ్
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం.. చట్ట సభలకు సరికొత్త భవన సముదాయం.. ఇప్పటికే భూమి పూజ జరుపుకొని నిర్మాణాలకు సిద్ధమైన రెండు కొత్త ప్రాజెక్టులు. ఈ జాబితాలో మరోటి కూడా చేరబోతోంది. అదే రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక క్లబ్. ఢిల్లీలో ఉన్న కాన్స్టిట్యూషన్ క్లబ్ తరహాలో దీన్ని నిర్మించబోతున్నారు. ప్రజాప్రతినిధులకు ఇలాంటి వసతి అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాకాలంగా భావిస్తున్నారు. ఇప్పుడు కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణంపై ప్రభుత్వం ముందడుగు వేసిన నేపథ్యంలో.. దీన్ని కూడా సాకారం చేయాలని ఆయన భావిస్తున్నారు. దీనికి సంబంధించి దాదాపు ఏడాదిగా ఆయన రోడ్లు భవనాల శాఖ అధికారులతో తరచూ ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. హైదర్‌గూడలో ఎమ్మెల్యేలకు కొత్త క్వార్టర్ల భవన సముదాయ ప్రారంభోత్సవం రోజునే ఆయన దీనిపై కొంత స్పష్టతనిచ్చారు. ఇప్పుడు ప్రజా ప్రతినిధులకు కూడా దానిపై కొంత సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంలో చర్చ సందర్భంగా అసెంబ్లీ బీఏసీ సమావేశంలో దీని ప్రస్తావన తెచ్చారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లో కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించినట్టు తెలిసింది. ఆధునిక వసతులతో.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఉన్నట్టుగానే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యుల కోసం ఓ క్లబ్ అవసరమని సీఎం భావిస్తున్నారు. ఢిల్లీలోని ఎంపీల కాన్స్టిట్యూషన్ క్లబ్ తరహాలోనే ఇక్కడి ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు ఆహ్లాదంగా గడిపేందుకు.. ఫంక్షన్లు, గెట్ టు గెదర్లు, సమావేశాలు, సదస్సులు, ఇష్టాగోష్టుల నిర్వహణ... తదితరాల కోసం ఈ ప్రత్యేక క్లబ్ ఉపయోగపడనుంది. ఇందులో అత్యాధునిక సమావేశ మందిరాలు, సౌకర్యవంతమైన గదులు, ఆధునిక వసతులతో ఫంక్షన్ హాలు, రెస్టారెంట్, డైనింగ్ హాళ్లను, స్విమ్మింగ్ పూల్, ఇతర క్రీడా కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. విశాలమైన స్థలం అవసరం కావటంతో ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్ల స్థలాన్ని దీనికి ఎంపిక చేశారు. ప్రస్తుతం అందులోని క్వార్టర్లలో ఇతరులు ఉంటున్నారు. వాటి నిర్వహణ కూడా సరిగా లేదు. కొత్త క్వార్టర్లతో కూడిన సముదాయం అందుబాటులోకి వచ్చినందున దీని అవసరమే లేదు. దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ ప్రాంతం దీనికి యోగ్యంగా ఉంటుందని గతంలోనే నిర్ణయించారు. తాజాగా బీఏసీలో దీని ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మాజీ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, మాజీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కార్యదర్శి, ఇతర సిబ్బంది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులకు ఇందులో సభ్యత్వాలు ఉంటాయని సమాచారం. కానీ దీనిపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది. రెండేళ్ల తర్వాత అందుబాటులోకి.. ఆర్థిక మాంద్యం, ఇతర సమస్యల కారణంగా కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయ నిర్మాణం జాప్యమయ్యే అవకాశం ఉంది. అన్ని అవాంతరాలు అధిగమించి వాటిని పూర్తి చేసిన తర్వాతనే ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణం ఉంటుందని అధికారులంటున్నారు. రెండుమూడేళ్ల తర్వాత గాని అది అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని పేర్కొంటున్నారు. -
‘9 కల్లా సచివాలయం ఖాళీ కావాల్సిందే’
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈనెల 9 నాటికి ప్రస్తుత సచివాలయాన్ని ఖాళీ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ఇంకా ఖాళీ చేయని శాఖల కార్యాలయాలను సోమవారంలోగా వాటికి కేటాయించిన భవనాలకు తరలించాలని స్పష్టం చేసింది. గడువు ముగిసిన తర్వాత సచివాలయ భవనాలకు విద్యుత్, నీటి సరఫరా వంటి సదుపాయాలను నిలిపి వేస్తామని హెచ్చరించింది. సచివాలయంలోని అధిక శాతం కార్యాలయాలను సమీపంలోని బీఆర్కేఆర్ భవనానికి, ఇతర కార్యాలయాలను సంబంధిత శాఖల హెచ్ఓడీల భవనాలకు తరలించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించగా, దాదాపు 90 కార్యాలయాల తరలింపు ప్రక్రియ ముగిసింది. మిగిలిన కార్యాలయాలను ఒకట్రెండు రోజుల్లో తరలించనున్నారు. ఆ తర్వాత సచివాలయంలోని భవనాల కూల్చివేత, కొత్త భవన సముదాయం నిర్మాణ పనులకు సర్కారు శ్రీకారం చుట్టనుంది. -
కూల్చివేయడమే కరెక్ట్..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత సచివాలయ భవనాల కూల్చివేతకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇవి ఉపయోగించడానికి వీలు లేకుండా ఉన్నాయని కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ మేరకు యోచిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం తన నివేదికను సమర్పించింది. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ భవనం ఉపయోగించడానికి వీలు లేకుండా ఉన్నందున, సచివాలయం కోసం కొత్త భవన నిర్మాణం సముచితమేనని ఉపసంఘం తేల్చిచెప్పింది. ప్రస్తుత సచి వాలయం భవనంలో మార్పుచేర్పులు చేసి కొనసాగించ డానికి కూడా ఏమాత్రం అనువుగా లేదని పేర్కొంది. ప్రస్తుత భవన సముదాయంలోని ఎ, బి, సి, డి, జి, హెచ్ నార్త్, జె, కె బ్లాకుల్లో అగ్నిప్రమాదం జరిగితే మంటలు ఆర్పడానికి అగ్నిమాపక వాహనాలు వెళ్లే పరిస్థితి లేదని, మార్పులు చేసినప్పటికీ ఫైరింజన్ వెళ్లడం కుదరదని స్పష్టంచేసింది. అంతేకాకుండా ప్రస్తుత సచివాలంలో వీవీఐపీ, వీఐపీలకు భద్రత సరిగా లేదని.. వీఐపీలకు, అధికారులకు, సందర్శులకు అందరికీ ఒకే ఎంట్రన్స్, ఒకే ఎగ్జిట్ ఉన్నాయని.. ఆయా బ్లాకుల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, ఇది వారి భద్రతకు ఏ మాత్రం క్షేమకరం కాదని అభిప్రాయపడింది. ప్రస్తుతం సీఎంఓ, మంత్రులు, అధికారులు వేర్వేరు బ్లాకుల్లో ఉంటున్నారని.. అత్యంత రహస్యమైన డాక్యుమెంట్లు, ఫైళ్లను వివిధ బ్లాకులకు తిప్పాల్సి వస్తున్నందున అధికార రహస్యాలు బహిర్గతమవుతున్నాయని పేర్కొంది. మంత్రి వేములతో సీఎం చర్చలు తెలంగాణ రాష్ట్ర కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ నేపథ్యంలో సాంకేతిక అంశాలన్నింటినీ పరిశీలించి నివేదిక ఇవ్వాలని పేర్కొంటూ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన నలుగురు ఈఎన్సీలతో ఓ నిపుణుల కమిటీని నియమిస్తూ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సచివాలయ భవనంలో మార్పులు, చేర్పులు చేసి కొనసాగించాలా? లేక కొత్త భవనం నిర్మించాలా? అనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆ కమిటీకి సూచించింది. దీంతో రంగంలోకి దిగిన నిపుణుల కమిటీ.. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్‌తో విస్తృతంగా చర్చించింది. అలాగే సచివాలయ భవన సముదాయం ప్రాంగణాన్ని సునిశితంగా పరిశీలించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మంత్రివర్గ ఉపసంఘానికి తన నివేదిక సమర్పించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ఉపసంఘం.. తన అభిప్రాయాలతో కూడిన నివేదికను నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేసింది. దీనిపై గురువారం రాత్రి సీఎం కేసీఆర్.. ఉపసంఘానికి నేతృత్వం వహించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో చర్చించారు. సబ్ కమిటీ నేవేదిక నేపథ్యంలో సచివాలయ భవనాల కూల్చివేత దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. -
ముహూర్తం.. శ్రావణం!
సాక్షి, హైదరాబాద్: శ్రావణ మాసం... శుభకార్యాలకు మంచి తరుణంగా భావిస్తారు. మరో వారం రోజుల్లో మొదలుకానున్న ఈ మాసంలో కొత్త సచివాలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు శ్రావణ మాసంలోనే కొత్త సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. అయితే నెల రోజుల్లో పనులు ప్రారంభించడం అంత సులభం కానప్పటికీ, మంచి రోజులు కావటంతో ఏదో ఒక పనితో సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మరో నెల రోజుల్లో ప్రస్తుత సచివాలయం పూర్తిగా ఖాళీ కానుంది. ఎక్కువ కార్యాలయాలకు తాత్కాలిక నెలవు కానున్న బూర్గుల రామకృష్ణారావు భవనం దాదాపు ఖాళీ అయింది. ఇందులోకి సచివాలయం తరలాల్సి ఉన్నందున, అందుకు తగ్గట్లుగా రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు ప్రారంభించారు. మిగతా కార్యాలయాలు కూడా ఖాళీ అయ్యాక భవనానికి రంగులు వేసి ఈ పనులు పూర్తి కాగానే సచివాలయ కార్యాలయాలను తరలించనున్నారు. శ్రావణమాసం ప్రారంభంలోనే ఈ తరలింపు మొదలుపెట్టి వీలైనంత తొందరగా పూర్తి చేసి కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులు మొదలుపెట్టాలని నిర్ణయించారు. సచివాలయ భవనం ఎలా ఉండాలన్నది మరో 15 రోజుల్లో తేలుతుంది. -
కాంగ్రెస్ నేతల ముల్లేం పోయిందో?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు ఏదో టైం పాస్ కోసం, టీవీల్లో, పేపర్లలో కనబడాలని సచివాలయాన్ని సందర్శించారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. ఏదో విహార యాత్రకు వచ్చినట్టు ఫొటోలు దిగారని విమర్శించారు. కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం సచివాలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే వీటిపై స్పందించిన తలసాని.. సచివాలయానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు కనీసం అరగంట కూడా అక్కడ లేరని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధంగా కొత్త సచివాలయం, అసెంబ్లీ ఉండాలనేదే సీఎం ఆలోచన అని ఆయన తెలిపారు. కొత్త సచివాలయం నిర్మిస్తే కాంగ్రెస్ నేతల ముల్లేం పోయిందో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు, గురుకులాల నిర్మాణం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ నేతలు ఏనాడూ ఆలోచించలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి కాంగ్రెస్ నేతలు అనేక కేసులు వేశారని తెలిపారు. ఆరునూరైన కొత్త సచివాలయం నిర్మాణం చేసి తీరుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు రాజకీయ ఉద్యోగాలు తీసుకున్నారే తప్ప.. ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఆ పదవి వద్దని పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలతో ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండకూడదని.. ఎమ్మెల్యేలు పోయిన కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడిన విషయాలపై తాను మాట్లాడనని అన్నారు. ఏనుగు వెళ్లేటప్పుడు ఎన్నో మొరుగుతాయని.. వాటిని పట్టించుకుంటామా అని ప్రశ్నించారు. -
కాంగ్రెస్ నేతల ముల్లేం పోయిందో?
-
కొత్త సచివాలయం కట్టి తీరుతం
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనను విరమించుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లేది లేదని, సికింద్రాబాద్‌లోని బైసన్‌పోలో గ్రౌండ్లో కొత్త సచివాలయాన్ని నిర్మించి తీరుతామని చెప్పారు. దానికి పునాదిరాయిని ప్రధానితోనే వేయించి, తెలంగాణకు చారిత్రక కట్టడంగా అందించి తీరుతామన్నారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో కొత్త సచివాలయం అంశంపై బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఇప్పుడున్న రాష్ట్ర సచివాలయం దేశంలోనే చెత్త సచివాలయమని, గత ప్రభుత్వాలు సరైన ఆలోచనతో కట్టలేదని వ్యాఖ్యానించారు. బైసన్‌పోలో గ్రౌండ్స్‌లోని 151 ఎకరాల స్థలంలో కొత్త సచివాలయంతో పాటు అసెంబ్లీ, అన్ని ప్రభుత్వ అధిపతుల కార్యాలయాలు, తెలంగాణ కళాభారతిని నిర్మిస్తామని.. రూ.500 కోట్లలో వాటన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పారు. కొత్త సచివాలయం అవసరమా? కొత్త సచివాలయం అంశంపై బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నలపై తొలుత మంత్రి తుమ్మల సమాధానమిచ్చారు. ప్రస్తుత సచివాలయ భవనాలు పాతవని, హరిత, అగ్నిమాపక ప్రమాణాలు లేకుండా ఉన్నాయని చెప్పారు. కొత్త సచివాలయ ప్రణాళికలన్నీ ఖరారైన తర్వాత అంచనా సమయాన్ని, వ్యయాన్ని నిర్ణయిస్తామన్నారు. దీంతో బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు కొత్త సచివాలయం ఎందుకు? ఉన్న సచివాలయంలోనే మార్పులు చేసి ఆధునీకరించవచ్చు కదా? అయినా బైసన్‌పోలో గ్రౌండ్ ఇచ్చేందుకు కేంద్రం పెట్టిన షరతులను ఎలా ఒప్పిస్తారు? ఇదేమీ ప్రాధాన్యతాంశం కాదు కదా?’’అని ప్రశ్నించారు. వాస్తు ప్రకారం చూస్తే ఇప్పుడున్న సచివాలయంలోనే తెలంగాణ వచ్చిందని బీజేపీ మరో సభ్యుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ సీఎం అయ్యారని, కాంగ్రెస్ ఓడిపోయిందని.. అన్నింటికీ అనుకూలంగా ఉంది కాబట్టి కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనను విరమించుకోవాలని సూచించారు. దీంతో సీఎం కేసీఆర్ కల్పించుకుని బీజేపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కంటోన్మెంట్‌కు ఓ చరిత్ర ఉంది దేశంలోని 54 కంటోన్మెంట్లలో బొల్లారం కంటోన్మెంట్‌కు ఓ చరిత్ర ఉందని కేసీఆర్ చెప్పారు. ‘‘గతంలో లంగర్‌హౌజ్ కంటోన్మెంట్‌గా ఉండేది. అయితే బ్రిటిష్ వాళ్లు నిజాం రాజ్యంపై దండెత్తే పరిస్థితి ఉన్నప్పుడు అప్పటి నిజాం రాజు వారితో చర్చలు జరిపిండు. చర్చల్లో భాగంగా నిజాం రాజ్యంలో తమ కమిషనర్ ఉంటాడని, అన్ని వ్యవహారాలు పర్యవేక్షిస్తాడని బ్రిటిష్ వాళ్లు చెప్పారు. అప్పుడు లంగర్‌హౌజ్‌లో ఉన్న కంటోన్మెంట్‌ను బొల్లారానికి మార్చారు. దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం జరిగినప్పుడు కంటోన్మెంట్ భూహక్కుల బదలాయింపు జరగలేదు. ఇప్పుడది రక్షణ శాఖ పరిధిలో ఉందని గౌరవిస్తున్నం. నేను ఈ విషయాన్ని ప్రధానికి, కేంద్ర మంత్రులకు చెప్పిన. కేంద్రం ఎక్కువ తమాషా చేస్తే కోర్టుకెళతాం. సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటాం..’’అని స్పష్టం చేశారు. ఇంత చెత్తగా ఎక్కడా లేదు దేశంలోని 29 రాష్ట్రాల్లో ఇంతకన్నా చెత్త సచివాలయం ఇంకోటి లేదని, ఏ ఒక్క భవనం కూడా నిబంధనలకు అనుగుణంగా లేదని కేసీఆర్ పేర్కొన్నారు. ‘సాక్షాత్తు సీఎం ఉండే సీబ్లాక్ ఘోరంగా ఉంది. సీఎం, సీఎస్ చాంబర్లు, కేబినెట్ రూం, వీడియో కాన్ఫరెన్స్ రూం అన్నీ ఒక్క భవనంలోనే ఉన్నాయి. ఎక్కడా ఫైరింజన్ నడిపే పరిస్థితి ఉండదు. గత ప్రభుత్వాలు మైండ్ ఓపెన్ చేసి పని చేయలేదు. మన సచివాలయానికి వచ్చిన ఇతర దేశాల వాళ్లు కొత్త సెక్రటేరియట్ కట్టుకోవచ్చు కదా అని మొహం మీదే అన్నారు. సచివాలయాలు రాష్ట్ర ప్రభుత్వ గౌరవానికి, అస్తిత్వానికి ప్రతీకలు. కర్ణాటక, తమిళనాడుల్లో ఇదే తరహాలో సచివాలయాలు ఉంటాయి. అయినా కొత్త సచివాలయం కట్టంగనే ఏదో అయిపోతదని అంటున్నరు. సెక్రటేరియట్ కట్టంగనే హైదరాబాద్ ఆగమైపోతదా? హైదరాబాద్‌లో అసలు భవనాల నిర్మాణమే జరగడం లేదా? సచివాలయంతోపాటు అసెంబ్లీ, అన్ని ప్రభుత్వ శాఖల అధిపతుల కార్యాలయాలు ఒక్కచోట కట్టాలన్నదే మా అభిప్రాయం’ అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో క్రీడాస్థలాలు లేనట్టు, ఉన్నవాటిని తాము చెడగొడుతున్నట్లు మాట్లాడుతున్నారని విపక్షాల తీరును తప్పుబట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో దత్తాత్రేయ కుమార్తె పెళ్లి చేశారని వ్యాఖ్యానించారు. బైసన్‌పోలో గ్రౌండ్ క్రీడా మైదానమే కాదని గుర్తు చేశారు. కొత్త సచివాలయం కోసం చాలా స్థలాలు పరిశీలించి, బైసన్‌పోలో గ్రౌండ్‌ను ఖరారు చేశామని చెప్పారు. అన్నీ ఒక్క చోటే నిర్మిస్తాం.. ప్రస్తుత అసెంబ్లీ భవనాన్ని ఎప్పుడో నిజాం కట్టించాడని, చెన్నారెడ్డి హయాంలో మార్పులు చేసి కొత్తది కట్టారని కేసీఆర్ పేర్కొన్నారు. ‘మీరు, నేను వెళ్లే పోర్టికోలు చూశారా స్పీకర్ గారూ? నా బండి వచ్చే వరకు మీ బండి ఎండలో ఉండాలి. ఇది గొప్పగా కనపడుతోందా వాళ్లకు (విపక్షాలకు). దేశంలోని 6 మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇది అంతర్జాతీయ నగరం. మనకు కనీసం కల్చరల్ సెంటర్ ఉందా? ఎప్పడిదో రవీంద్రభారతి. హైదరాబాద్‌లో చలన చిత్రోత్సవాలు ఎలా జరుగుతాయో చూశాం. ఒక మ్యూజిక్ కన్సర్ట్ ఉందా? ఇవన్నీ 6 లక్షల చదరపు గజాల్లో కట్టినా.. చదరపు గజానికి రూ.3వేల చొప్పున వేసుకుంటే రూ.180 కోట్లు. అదే రూ.4వేల చొప్పున వేసినా రూ.240 కోట్లు అవుతాయి. ఈ మాత్రం పెట్టలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నామా? వృథా ఖర్చు అంటున్నరు’ అని మండిపడ్డా రు. రక్షణ శాఖ నుంచి తీసుకునే 151 ఎకరాల్లోనే రాజీవ్ రహదారి విస్తరణ, ఎక్స్‌ప్రెస్‌వే, స్కైవేలు వస్తాయన్నారు. కొత్త సచివాలయం ఏర్పాటైన తర్వాత పాత భవనా లను ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు, ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటామన్నారు. సచివాలయం మార్పు తన ఆలోచన మాత్రమే కాదని, గతంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి ప్రయత్నం చేశారన్నారు. చారిత్రక కట్టడాన్ని ప్రజలకు అందించి తీరుతామని తేల్చి చెప్పారు. ఇది మంచిదా కాదా అన్నది ప్రజా కోర్టు నిర్ణయిస్తుందన్నారు. సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారు కొత్త సచివాలయ అంశంపై సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. బైసన్‌పోలో గ్రౌండ్ నుంచి క్రీడా కార్యకలాపాలను తప్పించాలంటే ప్రధాని కార్యాలయ అనుమతి కావాలని కేంద్రం చెప్పిందని స్పష్టం చేశారు. అసలు బైసన్ పోలో క్రీడా మైదానమే కాదంటున్నారని.. ప్రస్తుతమున్న మైదానాలను వినియోగించుకోకపోవడం ఎవరి నిర్వాకమని నిలదీశారు. ప్రజల మనోభావాలు గుర్తించి, గౌరవించి ముందుకెళ్లాలని సూచించారు. దీంతో లక్ష్మణ్‌పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘‘అయినా మీరు చెప్పింది చేయడానికి మేమిక్కడ లేము. మాకు మా ఆలోచన ఉంది. మా ప్రతిపాదన విరమించుకునే ప్రసక్తే లేదు. అందరినీ సంతృప్తిపర్చి సచివాలయం కట్టి తీరుతం..’’అని పేర్కొన్నారు. -
ఏపీ డిజైన్లు చూశారా, మనం మారొద్దా?
సాక్షి, హైదరాబాద్ : నూతన సచివాలయ ప్రతిపాదనలపై బుధవారం అసెంబ్లీలో వాడీవేడీ ప్రశ్నోత్తరాలు జరిగాయి. వాస్తు కోసమో, దర్పం కోసమో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దంటూ ప్రతిపక్షాలు నిలదీయగా, ప్రజల ఆమోదంతోనే తాము ముందుకు వెళుతున్నామని అధికార పక్షం ఘాటు సమాధానమిచ్చింది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణాలపై బీజేపీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సుదీర్ఘ సమాధానం చెప్పారు. సీఎం సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. దేశంలోనే చెత్త సెక్రటేరియట్ ఇది : ప్రస్తుత తెలంగాణ సచివాలయం దేశంలోని అతి చెత్త భవనమని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘నాటి పాలకులు ఇష్టారీతగా దానిని నిర్మించారు. పొరపాటున అగ్నిప్రమాదం జరిగితే ఫైరింజన్ తిరగడానికి కూడా స్థలం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సి బ్లాక్ అయితే మరీ దారుణం. ఆ బ్లాక్ వెంనుక కేవలం రెండు ఫీట్ల స్థలం మాత్రమే ఉంది’’ అని తెలిపారు. వాస్తు ఒక కారణమే కానీ : వాస్తు మాయలో పడి సీఎం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారన్న ప్రతిపక్షం వాదనను కేసీఆర్ ఖండించారు. దేశంలో ఎక్కడికెళ్లినా అద్భుతమైన సచివాలయాలు ఉన్నాయని, హైదరాబాద్‌లో ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రతిపాదనలు సిద్ధంచేశామన్నారు. ‘‘ఏపీలో కొత్తగా నిర్మించబోయే భవనాల నిర్మాణాలు చూశారా? మనం మారొద్దా? ఇక వాస్తు అనేది ఒక కారణం మాత్రమే. వాస్తు కోసమే సచివాలయాన్ని మార్చడం లేదు. ఇప్పటికే కొత్త సెక్రటేరియట్ మ్యాప్‌లను సభ్యులకు ఇచ్చాం. అది కట్టబోయే జింఖానా, బైసన్ పోలో మైదానాలు మనవికావు.. ఆర్మీ వాళ్లవి. సీఎం, మంత్రులు, సంబంధిత డిపార్ట్మెంట్ అంతా ఒక్క ఫ్లోర్లో ఉండేట్లు నిర్మాణం ఉంటుంది. హెచ్‌వోడీ కాంప్లెక్స్‌లు ఒక దగ్గర కడితేనే మంత్రులకు అనుకూలంగా ఉంటుంది’ అని సీఎం వివరించారు. హైదరాబాద్ సెంటిమెంట్‌కు దెబ్బ : ఉన్నసచివాలయానికి మరమ్మత్తులు చేసి, ఆధునీకరించకుండా సికింద్రాబాద్‌లో కొత్తది కట్టాలనుకుంటుండటాన్ని ప్రజానీకం గర్హిస్తున్నదని బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, కె. లక్ష్మణ్‌లు అన్నారు. ‘‘ప్రజల కోసం చేయాల్సిన మంచి పనులు చాలా ఉండగా, కొత్త నిర్మాణాలంటూ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఉన్న సెక్రటేరియట్‌ను వాడుకోకుండా కొత్తది కడితేనే ఆఫీసుకు వస్తానని ముఖ్యమంత్రి భావించడం దారుణం. ఖాళీగా ఉన్న ఆటస్థలాలను అలాగే వదిలేయాలి’’ అని వాదించారు. అందుకు ప్రతిగా కేసీఆర్ మోదీ ఉదాహరణను చెప్పుకొచ్చారు.. మోదీ కూడా పాతవి వదిలేసి.. : కొత్త సచివాలయ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములు అడిగేందుకు ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రధాని మోదీని కలిశానని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. కొత్త నిర్మాణాల ఆలోచన అద్భుతమంటూ మోదీ మెచ్చుకున్నారని చెప్పారు. ‘‘మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గాంధీనగర్‌లో అద్భుతమైన సెక్రటేరియట్‌ను కట్టించారు. అంతకుముందే అహ్మదాబాద్‌లో సెక్రటేరియట్ ఉన్నా.. కొత్త భవనాల వల్ల గుజరాత్‌కు ఎక్కడలేని మంచి పేరు వచ్చింది. ఆ నిర్మాణాన్ని ఒక ఐకాన్‌గా వారు ప్రచారం చేసుకున్నారు. తద్వారా పెట్టుబడులను ఆకర్షించారు’’ అని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రి వివరణతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త సెక్రటేరియట్‌పై సీఎం కేసీఆర్ ఏమన్నారో వీక్షించండి -
సెక్రటేరియట్ మార్చవద్దు
హైదరాబాద్: బైసన్ పోలో గ్రౌండ్లో కొత్త సచివాలయం కట్టాలా? వద్దా? అనే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు ప్రజా బ్యాలెట్ ద్వారా చేపట్టిన అభిప్రాయ సేకరణలో 97.13 మంది సెక్రటేరియట్ యథావిధిగా కొనసాగించాలని తీర్పు ఇచ్చారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభించారు. కౌంటింగ్ వివరాలు అమర్ ప్రకటించారు. మొత్తం 18,460 ఓట్లు పోలవ్వగా 17,892 మంది సెక్రటేరియట్ తరలించవద్దని, అక్కడే కొనసాగించాలని ఓటు వేసినట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇది మంచి కార్యక్రమం అని దేవులపల్లి అమర్ అన్నారు. వీహెచ్ మాట్లాడుతూ, సెక్రటేరియట్ మార్చరాదని ప్రజలు ఎంతో ఉన్నతమైన తీర్పు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు మరచి ప్రజాధనం వృథాచేసేందుకు ఉస్మానియా ఆస్పత్రి మారుస్తా, సెక్రటేరియట్ మారుస్తా అనడం సరికాదన్నారు. కేవలం వాస్తు కోసం సెక్రటేరియట్ మార్చడం సరికాదని, యాదగిరి నర్సింహస్వామి ఇప్పటికైనా కేసీఆర్‌కు ఆలోచనలో మార్పు వచ్చేలా చేయాలని అన్నారు. ఇప్పటికీ నిర్ణయం మారకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీలు, ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. -
కొత్త సచివాలయం ఎందుకు: వీహెచ్
-
కొత్త సచివాలయం కట్టి తీరుతాం: కర్నె
-
కొత్త సచివాలయం కట్టి తీరుతాం: కర్నె
సాక్షి, హైదరాబాద్: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కొత్త సచివాలయం నిర్మించి తీరుతామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా కొత్త సచివాలయ నిర్మాణ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ, రక్షణ శాఖ అదీనంలోని 38 ఎకరాల బైసన్ పోలో మైదానాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్రానికి సాధించి పెట్టారని, అందుకు సీఎంను అభినందించాల్సింది పోయి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు చిల్లర రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. బైసన్ పోలో గ్రౌండ్లో కొత్త సచి వాలయ సముదాయాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నిర్మించి తీరుతామని పేర్కొన్నారు. కొత్త సచివాలయ నిర్మాణానికి రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్లు మాత్రమే ఖర్చవుతుందన్నారు. అంటే సచివాలయ సంబంధ భవనాల పదేళ్ల నిర్వహణ ఖర్చులతో సమానమని వివరించారు. -
కొత్త సచివాలయం ఎందుకు: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: విశాలంగా ఉన్న ప్రస్తుత సచివాలయా నికే వెళ్లని ముఖ్య మంత్రి కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుకని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంత రావు ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలో అక్కడి సీఎం చంద్రబాబు బిల్డింగులు కట్టు కుంటున్నారని ఇక్కడ సీఎం కేసీఆర్ కూడా కొత్త బిల్డింగులు కట్టాలని అనుకుంటున్నా రని అన్నారు. ప్రజల సొమ్మును వృథాగా ఖర్చు పెట్టడానికి రాష్ట్రం కేసీఆర్ జాగీరా అని వీహెచ్ నిలదీశారు. కొత్త సచివాలయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడితే సరిపోదని, దమ్ముంటే సీఎం కేసీఆర్ మాట్లాడాలని సవాల్ చేశారు. -
కొత్త సచివాలయం కట్టడం మూర్ఖత్వమే
రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం కట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం మూర్ఖత్వానికి పరా కాష్ట అని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. మంత్రిగా ఉన్న కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని ఈ పని తలపెట్టారని పేర్కొన్నారు. ఇది మూఢనమ్మకమే అవుతుందని అన్నారు. ఇప్పటిదాకా 16 మంది సీఎంలుగా పనిచేసిన సచివాలయంలో వారి కుమారులు ఎవరూ సీఎం కాలేదనే కారణంతోనే కొత్త సచివా లయం కడతారా అని ఆయన గురువారం సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగలేఖలో ప్రశ్నించారు. -
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
-
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారమిక్కడ సమావేశమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. కొత్త సచివాలయం నిర్మాణం, కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. నీటి పారుదల శాఖలో 63 ఇంజినీరింగ్ పోస్టులు, వైద్య ఆరోగ్య శాఖలో 13, అగ్నిమాపక శాఖలో 18 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.అలాగే వ్యాట్ సవరణ, వినోద పన్ను అంశాలపై కేబినెట్ చర్చించనుంది. -
ట్రిబ్యునల్ తీర్పు.. కొత్త సచివాలయం
♦ నేటి మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు అంశాలపైనే ప్రధాన చర్చ ♦ ట్రిబ్యునల్ తీర్పుపై నీటిపారుదల అధికారులతో హరీశ్‌రావు సమీక్ష సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు.. కొత్త సచివాలయం నిర్మాణం.. ఈ రెండు అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం నేడు ప్రత్యేకంగా సమావేశమవుతోంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రంపై పడే ప్రభావం, భవిష్యత్ కార్యాచరణతో పాటు మొత్తం పది అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకే విచారణ పరిమితమైతే తెలంగాణకు ఎనలేని నష్టం జరిగే అవకాశాలున్నాయి. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. తీర్పు వెలువడినందున ఇప్పటికిప్పుడు సుప్రీంకి వెళ్లినా ఇంతకు మించి చేసేదేమీ ఉండదనే వాదనను సైతం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రానికి న్యాయం చేసే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోరాదని, ఈ కేసులో ఏపీని కలుపుకుని సుప్రీంకోర్టుకు వెళ్లాలని రిటైర్డ్ ఇంజనీర్లు ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యంగా బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు అదనంగా కేటాయించిన 254 టీఎంసీలను ఆ రాష్ట్రాలు వాడుకుంటే దిగువకు నీరొచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఖరీఫ్ ఆశలు పూర్తిగా వదులుకోవడమో లేక అక్టోబర్ వరకు ఆగడమో చేయాల్సిందేనని, ఇది రాష్ట్రానికి గొడ్డలిపెట్టేనని అంటున్నారు. రెండు రాష్ట్రాలకే ఈ వాదనలు పరిమితమైతే తెలంగాణ కేవలం క్యారీ ఓవర్ కింద ఇచ్చిన 150 టీఎంసీలు, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అందులో వచ్చే వాటాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కొత్తగా ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల అవసరాలకు ఈ వాటాలు ఎంతమాత్రం సరిపోవు. అందుకే సుప్రీంను ఆశ్రయించి స్టే కోరాలనే వాదనలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ ముఖ్యమంత్రి కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. మరోవైపు ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు గురువారం సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ట్రిబ్యునల్ తీర్పు, కేంద్ర ప్రభుత్వ పాత్ర, తదుపరి అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలు, సుప్రీంలో ఇప్పటికే దాఖలై ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్ల పురోగతిని సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రిని కలసి ఆ వివరాలన్నింటినీ అందించారు. వచ్చే నెలలోనే కూల్చివేత..! ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి.. అదే ప్రాంగణంలో కొత్త సచివాలయం నిర్మించే అంశాన్ని కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇందులో ఉన్న తమ సచివాలయ ప్రాంగణాన్ని తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరించింది. కానీ విభజనకు సంబంధించిన అంశం కావటంతో ఏపీ సచివాలయం స్వాధీనం, మొత్తం సచివాలయంలోని అన్ని భవనాల కూల్చివేతపై మంత్రివర్గంలో చర్చించి తీర్మానం చేయనున్నారు. అదే తీర్మానాన్ని గవర్నర్ ఆమోదానికి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలోనే కూల్చివేత పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. అందుకు వీలుగా సచివాలయంలోని ఆఫీసులన్నీ తాత్కాలికంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న భవనాల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన ఆఫీసులను సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు తరలించాలని, ఏపీ ప్రభుత్వానికి నాంపల్లిలో గాంధీభవన్ పక్కన ఉన్న మనోరంజన్ బిల్డింగ్‌ను అప్పగించాలని నిర్ణయించారు. కేబినెట్ సమావేశం నేపథ్యంలో గురువారం సీఎస్ ఈ రెండు భవనాలను పరిశీలించారు. -
ఉద్యోగులతో కళకళలాడిన సచివాలయం
-
ఉద్యోగులతో కళకళలాడిన సచివాలయం
- 30 శాఖల ఉద్యోగులు రాక - స్వాగతం పలికిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు - దారివెంట పలు చోట్ల ఉద్యోగులకు స్కూలు పిల్లల స్వాగతం - ప్రెస్ వాహనాలు సచివాలయంలోపలికి అనుమతించని పోలీసులు సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగులతో వెలగపూడిలోని నూతన తాత్కాలిక సచివాలయం సోమవారం కళకళలాడింది. ఉదయం నుంచి ఉద్యోగులు డిపార్టుమెంట్స్ వారీగా సచివాలయానికి వచ్చారు. మొత్తం 33 ప్రభుత్వ శాఖలు ఉండగా అందులో 30 శాఖలు ఈరోజు నూతన సచివాలయంలో అడుగుపెట్టాయి. వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, హయ్యర్ ఎడ్యుకేషన్ శాఖలు రాలేదు. ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు తమ చాంబర్లలో కాలుమోపారు. కొందరు సీట్లలో కూర్చోగా మరికొందరు కార్యాలయాలు పరిశీలించి సరిపెట్టారు. కొన్ని చోట్ల పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సచివాలయ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్న కంప్యూటర్ల బిగింపు ఇంకా పూర్తి కాలేదు. దీంతో చాలా మంది ఉద్యోగులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులకు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తరపున రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వెలగపూడికి వస్తున్న ఉద్యోగులకు దారి మధ్యలో ఉండే స్కూళ్ళ విద్యార్థినీ విద్యార్థులు ప్లేకార్డులు పట్టుకొని వెల్కం చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్‌లు సచివాలయానికి వచ్చారు. యనమల రామకష్ణుడు తమ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు ఎంతమంది వచ్చారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. మొత్తం సచివాలయ ఉద్యోగులు సుమారు 1500 మంది వరకు సోమవారం సచివాలయానికి చేరుకున్నారు. మంత్రులు ఒకచోట... కార్యదర్శులు మరోచోట... మొత్తం ఐదు బ్లాక్‌లు సచివాలయానికి నిర్మించారు. ఒక్కోబ్లాక్ విడివిడిగా ఉన్నాయి. ఒక బ్లాక్‌లో నుంచి మరో బ్లాక్‌కు నడిచి వెళ్ళాలంటే కనీసం పావుగంట పడుతుంది. ఒక బ్లాక్‌లో మంత్రి పేషీ ఉంటే మరో బ్లాక్‌లో కార్యదర్శి కార్యాలయం ఉంది. ఉద్యోగుల మరోచోట ఉన్నారు. ఇలా ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఉండటంతో వీటిని సరిచేసే కార్యక్రమంలో కన్స్ట్రక్షన్ వింగ్ నిమగ్నమైంది. మంత్రి పేషీ వద్దే సెక్రటరీ చాంబర్ ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో మార్పులకు శ్రీకారం చుట్టారు. పోలీసుల ఆంక్షలు పోలీసులు విజయవాడ నుంచి వెలగపూడి సచివాలయం వరకు రోడ్డు వెంట ఉన్నారు. వెంకటపాలెం, మందడంలో పోలీసుల ఆంక్షలకు స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. మందడంలో కొందరు ప్రజలు పోలీసు చర్యలు నిరసిస్తూ ఆందోళనకు దిగారు. తర్వాత పోలీసులు వారికి సర్థిచెప్పారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు చెందిన జర్నలిస్ట్‌ల వాహనాలు లోపలికి అనుమతించలేదు. హైదరాబాద్‌లోనే వాహనాలు లోపలికి అనుమతిస్తున్నారని అడిగినా వారు పట్టించుకోలేదు. కాంపౌండ్‌వాల్ బయటనే వాహనాలు ఆపి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ప్రధాన ద్వారం వద్ద చెక్‌చేసి పంపించినా లోపల ప్రతి బ్లాక్‌లోనూ పోలీసులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఉద్యోగులు సైతం పోలీసుల బారిన పడక తప్పలేదు. ఐడీ కార్డులు చూపించినా పలు ప్రశ్నలు వేస్తూ కనిపించారు. మంత్రులకు, కొంతమంది ఉన్నతాధికారులకు సెక్యూరిటీ ఉన్న వారు కాస్త హడావుడి చేశారు. భోజన ఏర్పాట్లు సీఆర్డీఏ వారు ఉద్యోగులకు భోజన ఏర్పాట్లు చేశారు. అయితే భోజనం అందరికీ సరిపోదని, అక్కడ ఎక్కువ మంది జనం ఉన్నారని భావించిన కొన్ని శాఖల వారు నేరుగా భోజనం తెప్పించుకున్నారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఈ ఏర్పాట్లు పరిశీలించారు. ఉద్యోగులతో కలివిడిగా తిరిగారు. మీడియాతో మాట్లాడిన పత్తిపాటి వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు కాసేపు మీడియాతో మాట్లాడారు. సచివాలయ విషయం వదిలిపెట్టి రుణమాఫీ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిలు రాజకీయాలు చేస్తున్నారని, తాము రైతు రుణాలు రద్దు చేసినా చేయలేదని రైతులను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. -
కొత్త సచివాలయంలో 4 ప్రార్థనా మందిరాలు
- ముందుగా సీ, డీ బ్లాక్‌ల కూల్చివేత - మెయిన్ గేట్ పక్కనున్న విద్యుత్ ఎస్ఈ భవనం స్వాధీనం - ఎల్ బ్లాక్ మినహా అన్ని బ్లాక్‌ల అప్పగింతకు ఏపీ ఆమోదం సాక్షి, హైదరాబాద్: వచ్చే శ్రావణ మాసంలో కొత్త సచివాలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది. నిర్మాణ నమూనాకు అనుగుణంగా ప్రస్తుత భవనాల కూల్చివేత, వాటిలోని కార్యాలయాల తరలింపుపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది. ఇప్పుడున్న సచివాలయ స్థలంలోనే ‘యు’ ఆకారంలో కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు అధునాతన డిజైన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆమోదం తెలిపారు. కొత్త నిర్మాణం చేపట్టేందుకు వీలుగా ముందుగా సీఎం కార్యాలయమున్న ‘సి’ బ్లాక్‌తో పాటు ‘డి’ బ్లాక్‌ను కూల్చివేయాలని నిర్ణయించారు. వాటిలోని సీఎం ఆఫీసుతో పాటు మంత్రుల కార్యాలయాలను సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు తరలించాలని తొలుత యోచించిన అధికారులు ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారు. ఏపీ ప్రభుత్వం శరవేగంగా తన కార్యాలయాలను అమరావతికి తరలిస్తున్నందున ఏపీ సచివాలయంలో ఖాళీ అవుతున్న బ్లాక్‌లను వాడుకునే దిశగా యోచిస్తున్నారు. ఏపీ శాఖలు కొన్ని ఇప్పటికే కార్యాలయాలు ఖాళీ చేసి వెళ్లాయి. దాంతో ఎల్ బ్లాక్ మినహా జే, హెచ్, హెచ్ సౌత్ బ్లాక్‌లను నెలాఖరుకల్లా తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. సీ, డీ బ్లాకుల్లోని కార్యాలయాలను వాటిలో సర్దుబాటు చేయాలని అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక భవనాల ఆలోచనను విరమించుకున్నారు. తాజా నిర్మాణ నమూనా: కూల్చివేత తర్వాత సచివాలయ స్థలాన్ని వాస్తుకు అనుగుణంగా మార్చనున్నారు. కొత్త నిర్మాణ నమూనా ప్రకారం ఏ, బీ బ్లాకులను ఖాళీ చేసే అవసరం లేదు. సచివాలయం దక్షిణం వైపున ఉన్న స్థలాన్ని మొత్తంగా వేరు చేయనున్నారు. ఏ, బీ బ్లాకులు, ఏపీ క్యాంటీన్, తెలంగాణ క్యాంటీన్, ఎల్ బ్లాకు వరకు వేరు చేసేలా తూర్పు నుంచి పడమర వరకు గోడ నిర్మిస్తారు. సచివాలయంలో ఇప్పుడున్న ప్రార్థనా మందిరాలను సెక్రటేరియట్ నుంచి వేరు చేసిన దక్షిణ స్థలంలో నిర్మిస్తారు. అమ్మవారి గుడి, మసీదు, చర్చితో పాటు గురుద్వారా నిర్మించాలని యోచిస్తున్నారు. మెయిన్ రోడ్ వైపు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తారు. ప్రత్యామ్నాయంగా తెలంగాణ సచివాలయ మెయిన్ గేట్‌కు కుడి పక్కన నిజాం కాలంలో నిర్మించిన భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతమున్న విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయాన్ని మరో చోటికి తరలిస్తారు. సి, డిబ్లాకులతో పాటు ఈ భవనాన్ని కూల్చివేస్తే మొత్తం స్థలం దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిర్దేశిత డిజైన్ మేరకు ఈ ప్రదేశాన్ని చదును చేసి మూడు బ్లాకులుగా నిర్మాణాలు చేపడతారు. -
ఐదు బ్లాకులు.. ఐదు అంతస్తులు
అధునాతనంగా కొత్త సచివాలయం - సాగర్ తీరంలో లేక్‌వ్యూ డిజైన్ - దసరాకు భూమి పూజ చేయాలని సర్కారు నిర్ణయం - సచివాలయ పునరుద్ధరణ పనుల నిలిపివేత - పరిపాలనకు తాత్కాలిక భవనాల పరిశీలన సాక్షి, హైదరాబాద్: దసరాకు కొత్త సచివాలయ నిర్మాణానికి భూమి పూజ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెక్రటేరియెట్‌లోని ప్రస్తుత భవనాలను కూల్చేసి అక్కడే కొత్త నిర్మాణం చేపట్టే కసరత్తును వేగవంతం చేసింది. సచివాలయ భవనాల పునరుద్ధరణ పనులేవీ చేపట్టొద్దని, ఇప్పటికే కొనసాగుతున్న పనులను నిలిపేయాలని అన్ని విభాగాలకు సర్క్యులర్ జారీ చేసింది. నిర్మాణ కాలంలో పరిపాలన వ్యవహారాలకు ఇబ్బంది తలెత్తకుండా సీఎంవో, జీఏడీ సహా సెక్రటేరియెట్‌లోని అన్ని శాఖల కార్యదర్శులు, అధికారులు, సిబ్బందికి సరిపడే తాత్కాలిక భవనాల కోసం వెతుకుతోంది. ఇప్పటికే పలు భవనాలను పరిశీలించిన ప్రభుత్వం.. సీఎం, సీఎంవో, సీఎస్, జీఏడీ కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు భవన్లో సర్దుబాటు చేయాలని నిశ్చయించింది. మంత్రుల కార్యాలయాలు, మిగతా శాఖల కార్యదర్శుల ఆఫీసులన్నీ సంబంధిత హెచ్వోడీలు ఉన్నచోట సర్దుబాటు చేయాలనుకుంటోంది. హెచ్‌వోడీ కార్యాల యాల్లో కుదరకపోతే మైత్రీవనం, గృహకల్ప, ఎంసీహెచ్ఆర్డీ, ఎక్స్పోటెల్కు తరలించాలని యోచిస్తోంది. అయితే హెరిటేజ్ కట్టడాల జాబితాలో ఉన్న ‘జీ’ బ్లాక్‌ను కూల్చేసేందుకు ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఐదు బ్లాక్‌లతో కొత్త డిజైన్ హుస్సేన్‌సాగర్‌కు అభిముఖంగా లేక్‌వ్యూ ఎలివేషన్‌తో అధునాతనంగా కొత్త సెక్రటేరియె ట్ను నిర్మించాలని సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇప్పటికే వివిధ డిజైన్లను తయారు చేయించారు. ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ వీటిని రూపొందించారు. ‘యూ’ ఆకారంలోని డిజైన్‌కు ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా ఆమో దం తెలిపినట్లు సమాచారం. కొత్త నిర్మాణ సముదాయానికి ఇప్పటికే రూ.200 కోట్ల మేరకు నిధులు మంజూరు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సచివాలయంలో మొత్తం పది బ్లాక్‌లు ఉండగా కొత్తగా నిర్మించే సచివాలయంలో ఐదు బ్లాకు లు మాత్రమే ఉండనున్నాయి. ప్రస్తుతం సీ బ్లాక్ స్థానంలో సీఎంవో బ్లాక్ ఉండనుంది. సీఎం బ్లాక్‌కు ఇరువైపులా రెండు బ్లాక్‌లను నిర్మించనున్నారు. ప్రతి బ్లాక్ కూడా ఐదు అం తస్తులతో ఒక బ్లాక్ నుంచి మరో బ్లాక్‌కు రాకపోకలు సాగించేలా నిర్మితమవనుంది. ఖాళీ స్థలంలో పచ్చదనంతో కళకళలాడేలా ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఫ్లైఓవర్ వైపు షాపింగ్ కాంప్లెక్స్ ప్రస్తుత సచివాలయంలో వాస్తుదోషం ఉందనే కారణంతోనే సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణానికి పట్టుదలతో ఉన్నారు. అందుకే కొత్త నిర్మాణంలో వాస్తుదోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుత సచివాలయానికి వాస్తు దోషం ఉందని, వీధి పోట్లు కూడా ఉన్నాయనే నిపుణుల సూచనలను పరి గణనలోకి తీసుకొని.. వాస్తుదోష నివారణకు సచివాలయ ప్రధాన ప్రాంగణాన్ని వేరు చేస్తూ కొత్త సముదాయానికి ప్రహరీ గోడ నిర్మించనున్నారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపున ఉన్న ప్రదేశంలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. శరవేగంగా సీఎం క్యాంపు ఆఫీస్ మార్చిలో పనులు ప్రారంభమైన సీఎం కొత్త క్యాంపు ఆఫీసును దసరా నాటికి పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ నిర్ణయించింది. దసరా రోజు నుంచే సీఎం కొత్త కార్యాల యం నుంచి పనులు ప్రారంభించేలా నిర్మాణాలను వేగవంతం చేసింది. పక్కనే ఉన్న 34 ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల కూల్చివేత పనులనూ వారం నుంచి ముమ్మరం చేశారు. వీటి స్థానంలో సీఎస్, డీజీపీ, సిటీ కమిషనర్, ఇంటెలిజెన్స్ ఐజీ, సీఎంవో కార్యదర్శులకు నివాసాలను నిర్మించనున్నారు. వీటితోపాటు ఎర్రమంజిల్‌లో ఐఏఎస్ అధికారులకు వంద క్వార్టర్లను నిర్మించేందుకు డిజైన్లు సిద్ధం చేస్తున్నారు. -
ఇక వారికీ కొత్త ఇళ్లు
సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ, సిటీ పోలీస్ కమిషనర్లకూ... ♦ చివరకు సీఎం కార్యదర్శులకూ ♦ కొత్త అధికారిక నివాసాలు ♦ కేసీఆర్ దంపతుల శంకుస్థాపన సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం.. అసెంబ్లీ, మండలికి అధునాతన భవనసముదాయాలు.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గ కేంద్రాల్లో అధికారిక నివాసాలు... బంగారు తెలంగాణలో కొత్త నిర్మాణాలకు కొదవే లేకుండా ప్రణాళిక రూపొందిస్తున్న సీఎం కేసీఆర్... ఎవరికీ తక్కువ కాకుండా చూసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీఎం కార్యదర్శులు, ఇంటెలిజెన్స్ ఐజీ, నగర పోలీసు కమిషనర్ లాంటి కీలక పోస్టుల్లో ఉన్నవారికీ అధునాతన, విలాసవంతమైన అధికారిక నివాసాలు నిర్మించి ఇవ్వాలని నిర్ణయిం చారు. ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరికీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో అధికారిక నివాసాలున్నాయి. అవన్నీ పాతబడ్డాయని, ఉన్నతాధికారులకు కొత్త తరహా ఇళ్లు ఉండాల్సిందేనని బలంగా పేర్కొంటున్న సీఎం వారికీ వరాలు ప్రకటించేశారు. ఈమేరకు రోడ్లు భవనాల శాఖ ఆ పనిలో పడింది. ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయం ఉన్న భవనం వెనకవైపు 13-15 ఎకరాల విస్తీర్ణంలో వీటిని నిర్మించాలని నిర్ణయించారు. పంజగుట్టలోని అధికారుల పాత క్వార్టర్లను కూల్చి కొత్తవాటిని నిర్మించనున్నారు. దీనికి చేరువలోనే సీఎంకు కొత్త అధికారిక నివాస గృహం, క్యాంపు కార్యాలయం, మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఐఏఎస్ అధికారుల సంఘశఢ కార్యాలయం ఉన్న ప్రాంతంతోపాటు కొన్ని పాత క్వార్టర్లను తొలగించి 8.9 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. వేయిమంది కూర్చునే సామర్థ్యంతో పెద్ద సమావేశ మందిరం, 200 కార్లు నిలిపే పార్కింగ్ సముదాయం ఇందులో ఉన్నాయి. ఈ భవనాలకు శనివారం కేసీఆర్ దంపతులు శంకుస్థాపన చేశారు. -
కొత్త సచివాలయంలోనే ‘పరేడ్’
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు.. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవాలు.. తెలంగాణ ఏర్పడ్డాక జాతీయ పండుగల వేళ జెండా వందన కార్యక్రమం ఇలా ఒక్కోచోట జరుగుతూ వస్తోంది! గోల్కొండ కోటపై జెండా రెపరెపలాడటం ఘనంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నా.. అక్కడ స్థలాభావం ఇబ్బంది పెడుతోంది. ఇది కాదంటే మిగిలింది.. రక్షణ శాఖ అధీనంలోని పరేడ్ మైదానం. అసలు ఇవన్నీ ఎందుకు.. సచివాలయం చెంతనే జెండా వందనం నిర్వహిస్తే బాగుంటుంది కదా..! సీఎం మదిలో మెదిలిన ఆలోచన ఇది. కొత్త సచివాలయం ఏర్పడనున్న ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రి ప్రాంగణంలోనే పరేడ్ మైదానం కూడా కొలువుదీరబోతోంది. ఈ మైదానం కోసం ప్రత్యేకంగా కొంత స్థలాన్ని కేటాయించనున్నారు. జెండా వందనం, శకటాల ప్రదర్శన తదితర కార్యక్రమాలను ఇందులోనే నిర్వహించనున్నారు. దేశంలో మరే సచివాలయం లేని తరహాలో కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ దేశంలోనే అత్యంత అధునాతన సచివాలయం రాజధాని నయారాయ్‌పూర్‌లో రూపొందింది. రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ ఆధ్వర్యంలో ఇటీవల అధికారుల బృందం వెళ్లి ఆ సచివాలయాన్ని పరిశీలించి వచ్చింది. అక్కడికన్నా ఎక్కువ ప్రత్యేకతలతో కొత్త సచివాలయం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 20 లక్షల చదరపు అడుగుల్లో భవనాలు ప్రస్తుత సచివాలయంలో భవనాల విస్తీర్ణం 12 లక్షల చదరపు అడుగులు. కొత్తగా నిర్మించబోయే సచివాలయంలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు రాబోతున్నాయి. మంత్రి, కార్యదర్శి, విభాగాధిపతి, సిబ్బంది కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండనున్నాయి. వాటితోపాటు ఒక విశాలమైన సమావేశ మందిరం ఉంటుంది. సీఎం కోసం ప్రత్యేకంగా కేంద్ర సమావేశ మందిరం నిర్మిస్తారు. ఆహ్లాదకర వాతావరణం కోసం ఉద్యానవనాలు, వాటర్ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తారు. వీటన్నింటికీ రూ. 500 కోట్లు ఖర్చువుతుందని అంచనా. ఇక సందర్శకులు ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ పొందే వెసులుబాటు కల్పిస్తారు. అక్కడికి వచ్చేవారికి ప్రధాన ప్రవేశద్వారం వద్ద ఆధునిక లాంజ్ ఏర్పాటు చేయనున్నారు. 5 వేల వాహనాల సామర్థ్యంతో పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడే హెలీప్యాడ్.. కొత్త సచివాలయంలో సీఎం భవనానికి చేరువలోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత సచివాలయంలో అనువైన హెలీప్యాడ్ లేక బేగంపేట విమానాశ్రయంలో దిగాల్సి వస్తోంది. గతంలో ఇక్కడ హెలీప్యాడ్ రూపొందించినా అది భద్రతా ప్రమాణాలకు అనుకూలంగా లేకపోవటంతో వాడటం లేదు. దీంతో హెలీకాప్టర్ నేరుగా సీఎం కార్యాలయం వరకు వచ్చేలా కొత్త సచివాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలక్‌నుమా తరహాలో అసెంబ్లీ భవనం రాష్ట్ర అసెంబ్లీ భవనానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎర్రగడ్డలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మించాలని నిర్ణయించినందున ప్రస్తుత అసెంబ్లీ భవనాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం భావిస్తున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్ తరహాలో దాన్ని నగరానికి మకుటాయమానంగా మిగిలేలా రూపొం దించాలని అధికారులకు సూచించారు. మ్యూజియంగా మార్చాలా, ఫలక్‌నుమా ప్యాలెస్ తరహాలో హోటల్‌గా రూపొందిం చాలా అన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలో భారీ ఆకాశహర్మ్యాలను నిర్మించనున్నారు. గతంలో సిగ్నేచర్ టవర్స్ కోసం లుంబినీ పార్కును గుర్తించగా, అక్కడ కుదరదని తాజాగా తేల్చారు. ఈ నేపథ్యంలో వాటి నిర్మాణానికి సచివాలయ ప్రాంగణమే సరిపోతుందని భావిస్తున్నారు. ఐఏఎస్‌లకు ఆధునిక విల్లాలు సీనియర్ ఐఏఎస్ అధికారులకు అధునాతన రీతిలో 100 విల్లాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత వీటిని ఎర్రగడ్డలోనే నిర్మించాలనుకున్నా.. తాజాగా ఎర్రమంజిల్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఇక్కడి పాత క్వార్టర్లు తొలగించి 25 ఎకరాలను నిర్మాణాలకు గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం సర్వే జరుగుతోంది. ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయం పక్కన ఐఏఎస్ అధికారుల సంఘం భవనం, పాత క్వార్టర్లను తొలగించి.. ముఖ్యమంత్రికి కొత్త అధికారిక నివాసం నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలకు మరో రూ.400 కోట్లు వెచ్చించనున్నారు. మొత్తమ్మీద కొత్త సచివాలయం, అందులో భవనాల నిర్మాణాలతోపాటు అధికారులకు భవనాలు, సీఎం అధికార నివాసానికి కలిపి రూ.900 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా. డిజైన్లు మొదలు నిర్మాణం వరకు వ్యవహారాలన్నీ పర్యవేక్షించేందుకు జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా ఆధ్వర్యంలో ఎనిమిది మంది ఉన్నతాధికారులతో కమిటీ వేయనున్నారు. గతంలో అయిదుగురు సభ్యులతో ప్రభుత్వం వేసిన కమిటీలో మరో ముగ్గురిని చేర్చాలని ఇటీవల సీఎం నిర్ణయం తీసుకున్నారు. -
కోల్ కతా కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్ కతాలో నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సచివాలయంలో ఆకస్మికంగా మంటలు చెలరేగి భారీ ప్రమాదానికి దారి తీసింది. దీంతో 20 ఫైరింజన్లు సాయంతో అక్కడికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'తెలంగాణలో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తాం'
హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయాన్ని నిర్మించి తీరుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో తుమ్మల విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రతిపక్షాలు వేరే పనిలేక తమపై విమర్శలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కొత్త సచివాలయాన్ని ఎలా నిర్మించుకోవాలో తమకు తెలుసునని తుమ్మల అన్నారు. కారణం లేకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తున్నారని విమర్శించారు. ప్రజా ఆమోదం ఉంటేనే తెలంగాణలో పర్యటించాలి, లేదంటే ప్రజలు ఛీ కొడతారని తుమ్మల తెలిపారు. -
8 బ్లాకులతో.. నూతన సచివాలయం
తొమ్మిది అంతస్తులతో సీఎం పేషీ భవనం.. అందులోనే ప్రజా సంబంధాల విభాగం, సీఎస్ కార్యాలయం 300 సీట్ల సామర్థ్యంతో సమావేశ మందిరం మంత్రుల కోసం ఎనిమిది అంతస్తులతో ఆరు బ్లాకులు ఏడెనిమిది అంతస్తులతో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ అధునాతన వసతులు, సౌకర్యాలతో ఏర్పాట్లు పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అధికారులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని ఎర్రగడ్డలో నిర్మించనున్న నూతన సచివాలయాన్ని ఎనిమిది బ్లాకులుగా చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అందులో ముఖ్యమంత్రి పేషీ కోసం ఏడు నుంచి తొమ్మిది అంతస్తుల వరకు ఉండే ఒక బ్లాకును, ఇతర మంత్రిత్వ శాఖల కోసం ఆరు బ్లాకులు, పార్కింగ్ కోసం ఒక మల్టీలెవల్ పార్కింగ్ బ్లాకును నిర్మించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఆర్అండ్బీ అధికారులతో సమావేశమయ్యారు. నూతన సచివాలయం నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాల్సిందిగా ఆదేశించారు. మొత్తం ఎనిమిది బ్లాకులుగా నూతన సచివాలయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి కోసం ఏడు నుంచి తొమ్మిది అంతస్తులుండే ప్రత్యేక బ్లాక్ ఉంటుంది. ఇందులోనే దిగువన ప్రజా సంబంధాల విభాగం ఉండనుండగా.. దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయనకు సంబంధించిన ఇతర విభాగాల కార్యాలయాలు ఉంటాయి. వీటితోపాటు మూడొందల మంది కూర్చునే సామర్థ్యంతో ప్రత్యేక సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్, మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక హాల్లు ఉంటాయి. ముఖ్యమైన అతిథులతో భేటీ అయ్యేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తారు. వీటన్నింటినీ పూర్తి అధునాతన వసతులతో ఏర్పాటు చేయనున్నారు. ఇక మంత్రుల కోసం ఆరు బ్లాకులను విడివిడిగా నిర్మించనున్నారు. ఇవి ఒక్కొక్కటి 6 నుంచి 8 అంతస్తులతో ఉంటాయి. ఈ బ్లాకుల్లో ఒక్కో మంత్రిత్వ శాఖకు రెండు అంతస్తుల చొప్పున కేటాయిస్తారు. వాటిల్లో మంత్రి, ఆ శాఖ కార్యదర్శి, విభాగాధిపతుల కార్యాలయాలు ఉంటాయి. భవిష్యత్ అవసరాలను అనుసరించి అంతస్తుల సంఖ్యను పెంచుతారు. మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్.. ప్రస్తుత సచివాలయంలో పార్కింగ్‌కు సరైన ఏర్పాట్లు లేవు. ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ వాహనాలు నిలుపుతున్నారు. ఒక్కోసారి లోపల స్థలం సరిపోక సచివాలయం వెలుపల రోడ్డుపక్కన కూడా వాహనాలను నిలుపుతున్నారు. ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా నూతన సచివాలయంలో ప్రత్యేకంగా మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తారు. ర్యాంపుల మీదుగా వాహనాలు పైఅంతస్తుల్లోకి చేరుకుంటాయి. దీనిని ఏడెనిమిది అంతస్తులతో నిర్మించాలని భావిస్తున్నారు. -
ఎర్రగడ్డకు సచివాలయం?
వేగంగా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ⇒ టీబీ ఆసుపత్రిని అనంతగిరికి తరలిస్తూ ఉత్తర్వులు ⇒ ఖాళీ అయిన స్థలంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి యోచన ⇒ నిర్మాణ డిజైన్లపై అధికారులతో సీఎం సమీక్ష ⇒ ఎనిమిది బ్లాక్‌లతో అధునాతన భవనాలు నిర్మించాలని సూచన సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్ సమీపంలో ఉన్న రాష్ట్ర సచివాలయ భవనాల సముదాయాన్ని తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలాన్ని విక్రయించటం ద్వారా భారీగా ఆదాయం సమకూరటంతోపాటు హుస్సేన్‌సాగర్ చుట్టూ న్యూయార్క్ తరహాలో ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే బృహత్తర లక్ష్యం నెరవేరుతుందని యోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఎర్రగడ్డలో ఉన్న ప్రభుత్వ క్షయ (టీబీ), ఛాతీ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి క్షయ ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కోసం రూ.7.70 కోట్లకు పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇదేరోజున సచివాలయం తరలింపుపై ఆర్అండ్బీ అధికారులతో సీఎం సమీక్ష జరపటం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రస్తుత సచివాలయం దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఎర్రగడ్డ టీబీ ఆసుపత్రి 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయ సముదాయాన్ని ఎర్రగడ్డలో ఖాళీ చేయనున్న టీబీ ఆసుపత్రికి తరలించేందుకు గల సాధ్యాసాధ్యాలను ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది. కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు ఎలా ఉండాలి.. అందులో ఎన్ని బ్లాక్‌లుండాలి.. ఎన్ని అంతస్తులుండాలి అనే వివరాలను సైతం సీఎం చర్చించినట్లు సమాచారం. సీఎం ఆఫీసుకు ప్రత్యేక బ్లాక్... తాజా ప్రతిపాదనల ప్రకారం కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేకంగా ఒక బ్లాక్ కేటాయిస్తారు. ఏడు నుంచి ఎనిమిది అంతస్థుల భవనంలో సీఎం బ్లాక్ ఉంటుంది. మంత్రులకు సంబంధించి ఆరు నుంచి ఎనిమిది బ్లాక్‌లు నిర్మిస్తారు. ఒక్కో మంత్రికి రెండు అంతస్థులు కేటాయించాలనేది ప్రతిపాదన. మంత్రి కార్యాలయంతో పాటు ఆ విభాగపు కార్యదర్శి, ఉన్నతాధికారులు, విభాగపు సిబ్బంది అందులో ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 మంది మంత్రులున్నారు. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మంత్రుల సంఖ్య దాదాపు 22 వరకు పెరగనుంది. వీరికి తోడు ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శులున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరికి రెండు అంతస్తుల చొప్పున మొత్తం 56 అంతస్తులు నిర్మించాల్సి ఉంటుంది. అందుకే ఏడు లేదా ఎనిమిది బ్లాక్‌లుగా బహుళ అంతస్తుల సముదాయం నిర్మించాలనేది తాజా ప్రతిపాదన. ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలను 1888లో ఆరో నిజాం కాలంలో నిర్మించారు. సైఫాబాద్ ప్యాలెస్‌గా అప్పట్లో ప్రసిద్ధి పొందిన ఈ భవనాలను ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పునర్నిర్మించారు. ఈ ప్రాంతం ‘హార్ట్ ఆఫ్ ది ట్విన్ సిటీస్’గా పేరొందిన నేపథ్యంలో ఇది అత్యంత ఖరీదైన స్థలం అనడంలో సందేహం లేదు. తొలి బడ్జెట్లోనే భూముల అమ్మకం ద్వారా దాదాపు రూ.6500 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. తొలి ప్రయత్నంగా సెక్రటేరియట్‌ను తరలించేందుకు పావులు కదుపుతోంది. బఫర్ జోన్ ఆంక్షల నేపథ్యంలో... హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించి.. గ్రేటర్ సిటీని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెరువులు, కుంటల చుట్టూ బఫర్ జోన్లో పక్కా నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. హుస్సేన్‌సాగర్ చుట్టూ నిర్మాణాలకు సైతం ఇవే ఆంక్షలు వర్తించనున్నాయి. అందుకే బఫర్ జోన్‌కు అవతల ఉన్న సచివాలయ స్థలాలను విక్రయిస్తే, అక్కడ ఆకాశహర్మ్యాలు నిర్మించేందుకు మార్గం సుగమమవుతుందని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. -
కొత్త సచివాలయంగా 'మర్రి చెన్నారెడ్డి' భవనం?
తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే.. హైదరాబాద్‌ను కొన్నేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే, సీమాంధ్ర ప్రాంతానికి పదేళ్లు లేదా ఐదేళ్ల పాటు హైదరాబాద్‌లో ప్రత్యేక పాలనా కేంద్రం అవసరం అవుతుంది. ఇప్పటికే ఉన్న సచివాలయంలో కొంత భాగాన్ని 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రానికి రాజధానిగా చేస్తారా.. లేక కొత్త భవనాన్ని వెతుకుతారా అనేది అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని కొత్త సచివాలయంగా మారే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి 1976లోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌ను ఏర్పాటుచేశారు. దాన్నే 1998లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థగా మార్చి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉద్యోగులు, అధికారులకు శిక్షణ ఇచ్చే సమున్నత కేంద్రంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ విభాగాల్లోని అన్ని శాఖలకు సంబంధించిన శిక్షణ ఇవ్వడానికి ఈ సంస్థను దేశంలోనే అత్యున్నత సంస్థగా భావిస్తారు. ఈ సంస్థకు ఐఎస్ఓ 9001:2000 గుర్తింపు కూడా లభించింది. శిక్షణ, కన్సల్టెన్సీ, పరిశోధన ప్రచురణ రంగాల్లో ఈ సంస్థ నాణ్యత అసమానం అని చెబుతుంటారు. కాలక్రమేణా ఈ సంస్థ భవనంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేశారు. అన్ని రాష్ట్రాల్లోను ఇలాంటి శిక్షణ సంస్థలు ఉన్నాయి గానీ, ఇక్కడి సదుపాయాలు, సౌకర్యాలకు మరేదీ సాటి రాదు. కేంద్ర ప్రభుత్వం నియమించిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ సూచనల మేరకు ఈ కేంద్రాలను నెలకొల్పారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ప్రాంతంలోని 30 ఎకరాల సువిశాల స్థలంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఉంది. ఈ భవనంలో ఉన్న సౌకర్యాలివీ.. లెక్చర్ హాళ్లు ఆడిటోరియం సెమినార్ హాళ్లు/ కాన్ఫరెన్స్ గదులు కంప్యూటర్ శిక్షణ ల్యాబ్‌లు గ్రంథాలయం హెలిప్యాడ్ సిబ్బంది కోసం నివాస సదుపాయం అతిథిగృహం