
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొత్త సచివాలయాన్ని ప్రారంభమైంది. కాగా, ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకాలేదు.
ఈ నేపథ్యంలో కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి రాకపోవడంపై గవర్నర్ తమిళిసై వివరణ ఇచ్చారు. సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం పంపలేదు. దీనిపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు. గవర్నర్‌కు ఆహ్వానం పంపామని ప్రభుత్వం అనడం తప్పు. ఆహ్వానం రాకపోవడం వల్లే సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లలేదు అంటూ రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేశాయి.
ఇది కూడా చదవండి: టీఆర్‌ఎస్ పేరుతో మరో కొత్త పార్టీ..
Comments
Please login to add a commentAdd a comment