
కొత్త సచివాలయం ఎందుకు: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: విశాలంగా ఉన్న ప్రస్తుత సచివాలయా నికే వెళ్లని ముఖ్య మంత్రి కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుకని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంత రావు ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలో అక్కడి సీఎం చంద్రబాబు బిల్డింగులు కట్టు కుంటున్నారని ఇక్కడ సీఎం కేసీఆర్ కూడా కొత్త బిల్డింగులు కట్టాలని అనుకుంటున్నా రని అన్నారు. ప్రజల సొమ్మును వృథాగా ఖర్చు పెట్టడానికి రాష్ట్రం కేసీఆర్ జాగీరా అని వీహెచ్ నిలదీశారు. కొత్త సచివాలయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడితే సరిపోదని, దమ్ముంటే సీఎం కేసీఆర్ మాట్లాడాలని సవాల్ చేశారు.