V. Hanmantha Rao
-
కొత్త సచివాలయం ఎందుకు: వీహెచ్
-
కొత్త సచివాలయం ఎందుకు: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: విశాలంగా ఉన్న ప్రస్తుత సచివాలయా నికే వెళ్లని ముఖ్య మంత్రి కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుకని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంత రావు ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలో అక్కడి సీఎం చంద్రబాబు బిల్డింగులు కట్టు కుంటున్నారని ఇక్కడ సీఎం కేసీఆర్ కూడా కొత్త బిల్డింగులు కట్టాలని అనుకుంటున్నా రని అన్నారు. ప్రజల సొమ్మును వృథాగా ఖర్చు పెట్టడానికి రాష్ట్రం కేసీఆర్ జాగీరా అని వీహెచ్ నిలదీశారు. కొత్త సచివాలయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడితే సరిపోదని, దమ్ముంటే సీఎం కేసీఆర్ మాట్లాడాలని సవాల్ చేశారు. -
ఇద్దరు సీఎంలూ నియంతలే: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్.. అటు ఏపీ సీఎం చంద్రబాబు.. ఇద్దరూ నియంతలేనని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత తెలుగు రాష్ట్రాల్లో నియంతృత్వ పాలన సాగుతోందన్నారు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతిభవన్ ప్రజల కోసమా, లేక కేసీఆర్ మనవడు విలాసంగా ఉండటానికా.. అని ప్రశ్నించా రు. సామాన్యులు సీఎంను కలిసే పరిస్థితి లేకపోవడంతో పేదలు నిరాశతో ఆత్మ హత్యలకు పాల్పడాల్సిన దుస్థితి తెలంగా ణలో ఉందన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ పెరగ డానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. ఈ కేసులో తిమింగలాలను వదిలిపెట్టి, చిన్నచిన్న వారిని బలిపెడుతున్నారని ఆరో పించారు. ఏపీలో కాపుల హక్కుల కోసం ముద్రగడ పాదయాత్ర చేస్తానంటే చంద్ర బాబు ఎందుకు అడ్డుకుంటున్నారని వీహెచ్ ప్రశ్నించారు. -
కోవింద్‌తో కేసీఆర్‌కు తాతలనాటి పరిచయమా?
ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్ సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌తో సీఎం కేసీఆర్‌కు తాత ముత్తాతల నాటి నుంచి పరిచయమున్నట్టుగా హల్చల్ చేశారని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు అన్నారు. మంగళవారంనాడిక్కడ విలేకరు లతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన మీరాకుమార్ ఫోన్‌చేస్తే స్పందించని ఆయన ఏం ముఖ్యమంత్రఅని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదా యాన్ని అవమానించారని విమర్శించారు. ఊరూరా తిరిగి జనాన్ని ఏకం చేసి ముఖ్యమంత్రి కుర్చీ నుంచి కేసీఆర్‌ను దించుతానని హెచ్చరించారు. జీఎస్టీతో నష్టం అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెబుతుంటే కేసీఆర్ లాభం అని అంటున్నారని, ఎవరు అబద్దాలు మాట్లాడుతున్నారో తేల్చాలన్నా రు. కేసీఆర్ నియంతృత్వ, అరాచక పాలనతో నక్సలిజం పెరుగబోతుందని వి.హనుమంతరావు హెచ్చరించారు.