కోవింద్‌తో కేసీఆర్‌కు తాతలనాటి పరిచయమా?
ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌తో సీఎం కేసీఆర్‌కు తాత ముత్తాతల నాటి నుంచి పరిచయమున్నట్టుగా హల్‌చల్ చేశారని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు అన్నారు. మంగళవారంనాడిక్కడ విలేకరు లతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన మీరాకుమార్ ఫోన్‌చేస్తే స్పందించని ఆయన ఏం ముఖ్యమంత్రఅని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదా యాన్ని అవమానించారని విమర్శించారు.
ఊరూరా తిరిగి జనాన్ని ఏకం చేసి ముఖ్యమంత్రి కుర్చీ నుంచి కేసీఆర్‌ను దించుతానని హెచ్చరించారు. జీఎస్టీతో నష్టం అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెబుతుంటే కేసీఆర్ లాభం అని అంటున్నారని, ఎవరు అబద్దాలు మాట్లాడుతున్నారో తేల్చాలన్నా రు. కేసీఆర్ నియంతృత్వ, అరాచక పాలనతో నక్సలిజం పెరుగబోతుందని వి.హనుమంతరావు హెచ్చరించారు.