
దిష్టిబొమ్మ దహనం చేస్తున్న బీజేవైఎం నాయకులు
కరీంనగర్‌సిటీ: బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను హైద్రాబాద్‌లో గృహనిర్బంధం, అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం జిల్లా ఉపాద్యక్షుడు ఎండీ ముజీబ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్శేటి సంపత్ మాట్లాడుతూ బీజేపీ నేతల అరెస్ట్ కేసీఆర్ నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. హిందువులు ఆరాద్య దైవంగా పూజించే సీతారాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తిమహేశ్‌పై చర్యలు తీసుకోవాలని, హిందూ ధర్మపరిరక్షణకై స్వామిపరిపూర్ణానంద చేపట్టిన యాత్రకు అనుమతిని ఇవ్వకపోగా ఆయనను నగర బహిష్కరణచేసి కేసీఆర్ నిజాం రాజులకు వారసునని స్పష్టం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఉప్పరపెల్లి శ్రీనివాస్, పురం హరి, చరణ్, పవన్, హరీశ్, సాయి, బ్రహ్మం, శ్రావణ్‌కుమార్, ఫయాజ్, వీరసాయి, గణేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment