సాక్షి, హైదరాబాద్: ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్.. అటు ఏపీ సీఎం చంద్రబాబు.. ఇద్దరూ నియంతలేనని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత తెలుగు రాష్ట్రాల్లో నియంతృత్వ పాలన సాగుతోందన్నారు.
ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతిభవన్ ప్రజల కోసమా, లేక కేసీఆర్ మనవడు విలాసంగా ఉండటానికా.. అని ప్రశ్నించా రు. సామాన్యులు సీఎంను కలిసే పరిస్థితి లేకపోవడంతో పేదలు నిరాశతో ఆత్మ హత్యలకు పాల్పడాల్సిన దుస్థితి తెలంగా ణలో ఉందన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ పెరగ డానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. ఈ కేసులో తిమింగలాలను వదిలిపెట్టి, చిన్నచిన్న వారిని బలిపెడుతున్నారని ఆరో పించారు. ఏపీలో కాపుల హక్కుల కోసం ముద్రగడ పాదయాత్ర చేస్తానంటే చంద్ర బాబు ఎందుకు అడ్డుకుంటున్నారని వీహెచ్ ప్రశ్నించారు.