సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాశాంతి పార్టీ నాయకుడు కెఏ పాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాదంపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ ఘటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కేఏపాల్ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన దర్మాసనం.. ఈ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ దాఖలైందా అని ప్రశ్నించింది. దేశంలో జరిగే అగ్నిప్రమాదాలపై సీబీఐతో విచారణ జరపమానాలా? అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, ఇటీవల తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై కేఏ పాల్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తెలంగాణ నూతన సచివాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని, నర బలి జరిగిందని ఆయన కోర్టుకు తెలిపారు. ఆయనే సొంతంగా వాదనలు వినిపించారు.
తన భద్రతను ప్రభుత్వం తొలగించిందని, దీంతో తన జీవితానికి భద్రత ఉందని కేఏపాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ. ‘మీరొక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి. మీ ఉద్దేశం వేరు. ఒక దానికి మరొక దానికి ముడిపెట్టొద్దు ’అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన వేసిన పిటిషన్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
చదవండి: టిస్టు.. హైకోర్టు ఆదేశాలు.. దొరకని జగిత్యాల స్ట్రాంగ్ రూం తాళాలు
Comments
Please login to add a commentAdd a comment