పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్ కతాలో నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్ కతాలో నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సచివాలయంలో ఆకస్మికంగా మంటలు చెలరేగి భారీ ప్రమాదానికి దారి తీసింది.
దీంతో 20 ఫైరింజన్లు సాయంతో అక్కడికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.