సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కొత్త సచివాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 1.24 గంటల సమయంలో ప్రారంభించారు. తర్వాత 6వ అంతస్తులోని తన చాంబర్‌కు వెళ్లి సీట్లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా తన సెంటిమెంట్ లక్కీ నంబర్ 6కు తగ్గట్టుగా 6 ఫైళ్లపై సంతకాలు చేశారు.
♦ 2023–24లో దళితబంధు పథకం అమలుకు సంబంధించిన ఫైల్‌పై సీఎం కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో అమలు చేసిన హుజూరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగతా 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున లబ్దిదారులకు ఈ పథకాన్ని వర్తింపచేసే ప్రతిపాదనలను ఆమోదించారు.
♦ పోడుభూముల పట్టాల పంపిణీకి సంబంధించిన ఫైలుపై రెండో సంతకం చేశారు. మే నెల నుంచి జిల్లాల వారీగా పోడు పట్టాల పంపిణీ చేపట్టనున్నారు. మొత్తంగా లక్షా 35 వేల మందికి దాదాపు 3.9 లక్షల ఎకరాలకు సంబంధించి పట్టాలు ఇవ్వనున్నారు.
♦ సీఎంఆర్‌ఎఫ్ నిధుల పంపిణీకి సంబంధించిన ఫైలుపై సీఎం మూడో సంతకం చేశారు.
♦గర్భిణులకు పౌష్టికాహారం అందించే.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు సంబంధించిన ఫైలుపై నాలుగో సంతకం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేపట్టనున్నారు. ఈ ఏడాది 6.84 లక్షల మంది గర్భిణులకు 13.08 లక్షల కిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో కిట్ విలువ రూ.రెండు వేలు. ఈ పథకానికి ప్రభుత్వం మొత్తం రూ.277 కోట్లు ఖర్చు చేయనుంది.
♦ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైలుపై సీఎం ఐదో సంతకం సంతకం చేశారు.
♦ పాలమూరు లిఫ్టు ఇరిగేషన్‌కు సంబంధించిన ఫైలుపై ఆరో సంతకం చేశారు. కరివెన, ఉద్ధండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణపూర్, కొడంగల్, వికారాబాద్‌లకు తాగునీటిని సరఫరా చేసే కాల్వల పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశారు.
6వ అంతస్తులో.. 6 ఫైళ్లపై సంతకం
Published Mon, May 1 2023 3:52 AM | Last Updated on Mon, May 1 2023 10:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment