సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయంలో బ్యాటరీ వాహనాలు సందడి చేస్తున్నాయి. బుధవారం నాలుగు కొత్త బ్యాటరీ వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. వాటిని సచివాలయ ప్రారంభోత్సవం రోజు వీఐపీల కోసం వినియోగిస్తారని సమాచారం. ఆ తర్వాత కూడా వాటిని కొనసాగిస్తారని, లోపలికి సాధారణ ప్రజల వాహనాలకు అనుమతి లేనందున గేటు వద్ద నుంచి భవనం వరకు బ్యాటరీ వాహనంలో సందర్శకులు వెళ్లేందుకు వినియోగిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే కేవలం ప్రారంభోత్సవం కోసం మాత్రమే తెప్పించారని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. బుధవారం రాత్రి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, జీఏడీ కార్యదర్శి శేషాద్రి తదితరులు వాటిని పరిశీలించారు. కాగా, ఈనెల 30న సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ రోజు ఉదయం సుదర్శనయాగం నిర్వహించనున్న ప్రాంతంలో నిర్మించిన యాగశాల, సభా ప్రాంగణం, వీఐపీల వాహనాల పార్కింగ్ ప్రాంతాలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్‌సీ గణపతి రెడ్డి, ఈఈ శశిధర్, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. భవనానికి రంగురంగుల లైటింగ్, ఫౌంటెయిన్లు, పూల మొక్కల ఏర్పాటు తదితరాలపై అధికారులకు సూచనలు చేశారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. ట్యాంక్ బండ్‌లో తప్పిన పెను ప్రమాదం
ఇక్కడ క్లిక్ చేయండి: తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్!
Comments
Please login to add a commentAdd a comment