Updates..
- సచివాలయాన్ని ప్రారంభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందరికీ నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పరిపాలన కేంద్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుందని అన్నారు. సచివాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు.
- తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తూ తొలి సంతకం చేశారు. మొత్తం 6 ఫైళ్లపై సంతకాలు చేశారు.
- తమ చాంబర్లలో కొలువుదీరిన మంత్రులు
- హైదరాబాద్‌లో లక్ష బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ఫైల్‌పై మంత్రి కేటీఆర్ తొలి సంతకం
- 6వ అంతస్తులోని తన చాంబర్‌లో కొలువుదీరిన సీఎం కేసీఆర్
- పోడు భూములు పంపిణీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన సీఎం కేసీఆర్
- తన కార్యాలయంలో 6 ఫైల్స్‌పై సంతకం చేసిన సీఎం కేసీఆర్
- కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీనిలో భాగంగా యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
- కొత్త సచివాలయంలో ప్రారంభోత్సవంలో భాగంగా మధ్యాహ్నం గం. 1.15 నిమిషాల ప్రాంతంలో సీఎం కేసీఆర్ అక్కడకు చేరుకున్నారు.
- కొత్త సచివాలయం చేరుకున్న మంత్రి కేటీఆర్.
- మూడో అంతస్తును కేటీఆర్ పరిశీలించారు.
- ట్యాంక్ బండ్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్నాయి.
- హుస్సేన్‌సాగర్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.
- తెలుగు తల్లి జంక్షన్‌లో వాహనాల దారి మళ్లింపు.
- ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై వాహనాలకు నో ఎంట్రీ. ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి, బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో వాహనాలకు అనుమతి నిరాకరణ.
- ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పార్కులు మూసివేత.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం వద్ద సందడి నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన కొత్త సెక్రటేరియట్‌ను ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. తర్వాత సీఎంతోపాటు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులై.. కొత్త సెక్రటేరియట్ నుంచి తొలి సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత అతిథులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
- గృహలక్ష్మీ సహా కీలక ఫైళ్లపై సంతకాలు చేయనున్న సీఎం కేసీఆర్, మంత్రులు.
- హైదరాబాద్‌లో లక్ష బెడ్ రూం ఇళ్ల పంపిణీపై కేటీఆర్ తొలి సంతకం.
- మధ్యాహ్నం 2:15 గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగం.
కొత్త సచివాలయం విస్తీర్ణం వివరాలివీ..
మొత్తం భూ విస్తీర్ణం: 28 ఎకరాలు
భవనం నిర్మించిన ప్రాంతం: 2.45 ఎకరాలు
ల్యాండ్ స్కేపింగ్: 7.72 ఎకరాలు
సెంట్రల్ కోర్ట్ యార్డ్ లాన్: 2.2 ఎకరాలు
పార్కింగ్ సామర్థ్యం: 560 కార్లు, 700 బైకులు
ప్రధాన భవన కాంప్లెక్స్ బిల్టప్ ఏరియా: 8,58,530 చదరపు అడుగులు
లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, ఆరు అంతస్తుల్లో ఒక్కోదాని ఎత్తు: 14 అడుగులు
మొత్తం ఎత్తు: 265 అడుగులు
నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి
ఉక్కు: 8,000 టన్నులు
సిమెంటు: 40,,000 టన్నులు
ఇసుక: 30,000 టన్నులు (5 వేల లారీలు)
కాంక్రీట్: 60,000 క్యూబిక్ మీటర్లు
ఇటుకలు: 11 లక్షలు
ఆగ్రా రెడ్ స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు
గ్రానైట్: మూడు లక్షల చదరపు అడుగులు
మార్బుల్: లక్ష చదరపు అడుగులు
ధోల్‌పూర్ రెడ్‌స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు
కలప: 7,500 క్యూబిక్ అడుగులు
పనిచేసిన కారి్మకులు: మూడు షిప్టుల్లో 12,000 మంది.
Comments
Please login to add a commentAdd a comment