battery vehicles
-
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పరిశీలిస్తున్నాం...
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) దేశీయంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు (బీఈవీ) గల డిమాండ్‌ను పరిశీలిస్తోంది. తదనుగుణంగా మరిన్ని మోడల్స్‌ను ప్రవేశపెట్టడానికి సంబంధించిన వ్యూహాన్ని రూపొందించుకోనుంది. జేఎల్ఆర్ ప్రస్తుతం జాగ్వార్ భారత్‌లో ఐ–పేస్ అనే ఏకైక ఎలక్ట్రిక్ మోడల్‌ను విక్రయిస్తోంది. జేఎల్ఆర్ ఇండియా ఎండీ రాజన్ అంబా ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా లగ్జరీ వాహనాల సెగ్మెంట్ వేగంగా వృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ మార్కెట్లో విక్రయాల వృద్ధి అత్యంత మెరుగ్గా ఉండగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 1,048 యూనిట్ల విక్రయాలతో అత్యుత్తమ పనితీరు కనపర్చినట్లు పేర్కొన్నారు. అమ్మకాలను పెంచుకోవడంలో భాగంగా తమ సేల్స్ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించే పనిలో ఉన్నట్లు రాజన్ వివరించారు. ప్రస్తుతం తమకు దేశవ్యాప్తంగా 25 సేల్స్ అవుట్‌లెట్స్, 27 సరీ్వస్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. జేఎల్ఆర్ ఇటీవలే కొత్త రేంజ్ రోవర్ వేలార్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 94.3 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే వేలార్‌కు 750 బుకింగ్స్ వచ్చాయని, ఏటా 1,500 యూనిట్ల మేర అమ్మకాలకు అవకాశాలు ఉన్నాయని రాజన్ చెప్పారు. -
కొత్త సచివాలయంలో బ్యాటరీ వాహనాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయంలో బ్యాటరీ వాహనాలు సందడి చేస్తున్నాయి. బుధవారం నాలుగు కొత్త బ్యాటరీ వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. వాటిని సచివాలయ ప్రారంభోత్సవం రోజు వీఐపీల కోసం వినియోగిస్తారని సమాచారం. ఆ తర్వాత కూడా వాటిని కొనసాగిస్తారని, లోపలికి సాధారణ ప్రజల వాహనాలకు అనుమతి లేనందున గేటు వద్ద నుంచి భవనం వరకు బ్యాటరీ వాహనంలో సందర్శకులు వెళ్లేందుకు వినియోగిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కేవలం ప్రారంభోత్సవం కోసం మాత్రమే తెప్పించారని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. బుధవారం రాత్రి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, జీఏడీ కార్యదర్శి శేషాద్రి తదితరులు వాటిని పరిశీలించారు. కాగా, ఈనెల 30న సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ రోజు ఉదయం సుదర్శనయాగం నిర్వహించనున్న ప్రాంతంలో నిర్మించిన యాగశాల, సభా ప్రాంగణం, వీఐపీల వాహనాల పార్కింగ్ ప్రాంతాలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతి రెడ్డి, ఈఈ శశిధర్, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. భవనానికి రంగురంగుల లైటింగ్, ఫౌంటెయిన్లు, పూల మొక్కల ఏర్పాటు తదితరాలపై అధికారులకు సూచనలు చేశారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. ట్యాంక్ బండ్లో తప్పిన పెను ప్రమాదం ఇక్కడ క్లిక్ చేయండి: తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్! -
Electric Vehicles Burst Incidents: మంటల్లో ఈవీ.. సమాధానాలేవీ...?
ఓ వైపు పెట్రోల్ రేట్ల మంట మరోవైపు కరోనాతో దెబ్బతిన్న వినియోగదారుల కొనుగోలు శక్తి...ఈ నేపధ్యంలోనే భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో పెను విప్లవం చోటు చేసుకుంటుంది. విద్యుత్, వాహనాల పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. ఈ మార్కెట్ 2021లో మూడు రెట్లు పెరగడం ఈ– వెహికల్ పరిశ్రమకు ఓ టర్నింగ్ పాయింట్‌గా కూడా నిలిచింది. ఈ– పరిశ్రమ 2022 సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే ఎన్నో రెట్ల వృద్ధిని సాధించింది. వినియోగదారులలో అవగాహన పెరగడంతో పాటుగా అమ్మకాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇప్పుడు భారత దేశంలో అమ్ముడవుతున్న ప్రతి 10స్కూటర్లలో ఒకటి ఈవీ స్కూటర్ అని రవ్నీత్ చెబుతూ, గత 12 నెలల కాలంలో ఈ రంగంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. నాణేనికి మరోవైపు...? ఇలా ఈవీల పట్ల దేశవ్యాప్తంగా పెరిగిన ఆసక్తి ఈ– పరిశ్రమకు నూతనోత్తేజం అందిస్తుంటే... మరోవైపు ఇటీవలి కాలంలో విద్యుత్ వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురై తగులబడిన సంఘటనలు జరిగాయి. ఇవి వినియోగదారులలో అనేక ఆందోళనలకూ సందేహాలకూ దారి తీశాయి. ఇది పరిశ్రమ వృద్ధికి ప్రతికూలంగానూ మారుతోందనే భయాందోళన వాహన పరిశ్రమలోనూ చోటు చేసుకుంది. ఈవీలలో ఎదురవుతున్న సమస్యలకు తక్షణమే తగిన పరిష్కారాలను కనుగొనకపోతే అది దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశముందనే ఆందోళనతో ఉత్పత్తిదారులు ఏకీభవిస్తున్నారు. బ్యాటరీ కీలకం... ఈవీ వాహన వృద్ధిలో బ్యాటరీ అభివృద్ధి అత్యంత కీలకం, వినియోగదారుల భద్రతను పరిగణలోకి తీసుకుని బ్యాటరీల రూపకల్పన చేయాల్సి ఉంటుంది. ఈవీలకు గుండె లాంటి బ్యాటరీ ఒక్కటి బాగుంటే ఈవీ చాలా వరకూ బాగున్నట్లే. అయితే ఈవీలలో బ్యాటరీలు విఫలం కావడానికి ప్రధాన కారణం మన దేశ పరిస్ధితులకనుగుణంగా వాటిని ఓఈఎంలు డిజైన్ చేయకపోవడమేనని తాజాగా నిపుణులు విశ్లేషించారు. ఈవీ పరిశ్రమలో వేగవంతమైన వృద్ధిని చూసి తగిన అవగాహన లేని వారు కూడా ఈ రంగంలో అడుగుపెడుతున్నారు. ఇలాంటి వారు భారతీయ పరిస్థితులకనుగుణంగా డిజైనింగ్, టెస్టింగ్, వాలిడేషన్ చేయకపోవడం పెద్ద సమస్యగా మారింది. భారతీయ వాతావరణ పరిస్ధితులు దృష్టిలో పెట్టుకుని మెరుగైన ప్రమాణాలను ప్రతి ఓఈఎం నిర్ధేశించుకుంటే ఈ సమస్య ముగిసే అవకాశాలున్నాయని ఓ నిపుణుడు అభిప్రాయపడ్డారు.దేశంలో పెరిగే ఉష్ణోగ్రతలు ఈవీలు తగలబడటానికి కారణం కాదంటూ ఉష్ణోగ్రతలు పెరిగితే వాహన సామర్ధ్యం దెబ్బతింటుందన్నారు. అమ్మకాలపై మంటల ప్రభావం లేదు... ఇటీవలి కాలంలో ఈవీల పరంగా కొన్ని దురుదృష్టకర సంఘటనలు జరిగినా అమ్మకాల పరంగా క్షీణత ఏమీ లేదన్నారు. వాహనాల ఉత్పత్తిసంస్థ ఎథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ ఎస్ ఫోఖేలా. అయితే ఈ సమస్యలకు వెంటనే ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. ఎథర్ ఎనర్జీ ఆర్ అండ్ డీ, ఇంజినీరింగ్, టెస్టింగ్ పై తీవ్ర పరిశోధనలు చేసిందంటూ విభిన్న భారతీయ వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తమ వాహనాలను డిజైన్ చేశామన్నారు రవ్నీత్. సేఫ్టీ అనేది తమ దగ్గర కేవలం చెక్‌బాక్స్ ఐటెమ్ కాదని అది తమకు అది అతి ప్రధానమైన ఎంపికన్నారు. తమ మొదటి వాహనం 2018లో విడుదల చేయడానికి ఐదేళ్ల ముందుగానే బ్యాటరీ ప్యాక్‌లను తాము నిర్మించామన్నారు. తమ స్కూటర్లను ఒక లక్ష కిలోమీటర్లకు పైగా పరీక్షించడం జరిగిందంటూ అత్యంత కఠినమైన ప్రమాణాలను తాము అంతర్గతంగా నిర్ధేశించుకున్నామన్నారు. తాము బ్యాటరీ ప్యాక్‌లను ఇతరుల వద్ద కొనుగోలు చేయమంటూ, తామే వాటిని ఫ్యాక్టరీలో తయారుచేస్తున్నామన్నారు. ఓ స్టార్టప్ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ త్వరలోనే 4వ తరపు బ్యాటరీ ప్యాక్ విడుదల చేయబోతున్నామని ప్యాక్ లెవల్లో 120 పరీక్షలు, వాహన స్ధాయిలో దాదాపు 800 పరీక్షలు చేస్తామని, ఇవి కాకుండా మరిన్ని పరీక్షలు కూడా చేస్తున్నామన్నారు. అని రవ్నీత్ అన్నారు. నాణ్యత పట్ల సరిగా శ్రద్ధ పెట్టకపోవడం, డిజైనింగ్ లోపాలు కూడా సమస్యకు కారణమవుతుందన్నారు. జాగ్రత్తగా ఎంచుకోవాలి... ఈవీలు తగలబడుతున్న కాలం, పెరుగుతున్న పెట్రో ధరల నేపథ్యంలో ఈవీలను ఎలా ఎంచుకోవాలనేది ప్రశ్నే అయినా కాస్త శ్రద్ధ పెడితే వీటిని ఎంచుకోవడం తేలికేనన్నారు రవ్నీత్. సవారీ చేసిన వెంటనే ఈవీలకు చార్జింగ్ పెట్టకూడదు, చార్జింగ్ పూర్తయిన వెంటనే ప్లగ్ తీసేయాలి లాంటి సూచనలన్నీ వాహన డిజైనింగ్ సరిగా లేని పరిస్థితుల్లోనే వస్తాయన్నారు. బ్యాటరీ ప్యాక్ ట్యాంపర్ చేయకుండా ఉండటం, నాణ్యమైన, అధీకృత చార్జర్లు వాడటం, వాహనాలు రెగ్యలర్‌గా సర్వీస్‌చేయించడం చేస్తే సమస్యలు రాకుండా పనిచేస్తాయని ఆయన సూచిస్తున్నారు. -
ఈవీ ప్రమాదాలు.. డీఆర్డీవో నివేదికలో షాకింగ్ విషయాలు
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా జరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు.. వాహనదారుల్లో ఆందోళన రెకెత్తిస్తోంది. మరణాలు సైతం సంభవించడంతో.. కేంద్రం సైతం విషయాన్ని సీరియస్‌గా పరిగణించి దర్యాప్తులకు ఆదేశించింది. ఈ తరుణంలో.. ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలపై డీఆర్డీవో నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధమవుతుండడం వెనక.. ఎండాకాలం సీజన్ కారణం కావొచ్చంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి తొలుత. అయితే కారణం అది కాదని డీఆర్డీవో తన నివేదికలో వెల్లడించింది. బ్యాటరీ లోపాలు కారణంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఓ నివేదిక రూపొందించింది. బ్యాటరీ ప్యాక్స్ డిజైన్లు, సరైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే బ్యాటరీ బండ్లను మార్కెట్లోకి రిలీజ్ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తన నివేదికలో డీఆర్డీవో స్పష్టం చేసింది. అంతేకాదు.. ఖర్చు తగ్గించుకునేందుకు లో-గ్రేడ్ మెటీరియల్‌ను ఉద్దేశపూర్వకంగానే ఉపయోగించడం.. ప్రమాదాలకు కారణమైందని డీఆర్డీవో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈ-మోటర్‌సైకిల్‌ల వినియోగాన్ని 2030 నాటికి 80 శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, వరుస ప్రమాదాలు, కంపెనీల వైఖరి ఆ లక్ష్యాన్ని అందుకుంటుందో.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అదే సమయంలో.. కంపెనీల వైఖరి బయటపడడంపై మంత్రి నితిన్ గడ్కరీ ఎలా స్పందిస్తారో చూడాలి. -
ఎలక్ట్రిక్ బైకులు ఎందుకు పేలిపోతున్నాయ్?
పెట్రోలు ధరల నుంచి ఉపశమనం మాట ఏమోగాని డబ్బులచ్చి మరీ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టుగా ఉంది ఎలక్ట్రిక్ బైకుల పరిస్థితి. తయారీలో నాణ్యతా లోపాలు, కంపెనీల పట్టింపులేని తనం, యూజర్ గైడ్‌పై అవగాహన కల్పించకపోవడం వల్ల వేసవి మొదలైనప్పటి నుంచి దేశంలో రోజుకో చోట ఎలక్ట్రిక్ బైకులు గ్రనేడ్లలా పేలిపోతూ అగ్ని ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ప్రాణాలు తీస్తున్నాయి. రీకాల్ తప్పదా ఎలక్ట్రిక్ బైకుల్లో చోటు చేసుకుంటున్న ప్రమాదాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ల కంటే మేలో మరిన్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రమాదాలతో సంబంధం ఉన్న కంపెనీలే కాకుండా మార్కెట్లో ఉన్న ఈవీ మేకర్స్ అందరూ మరోసారి తమ వాహనాలను రీకాల్ చేసి నాణ్యతా పరీక్షలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో అగ్ని ప్రమాదాలకు నిపుణులు చెబుతున్న కారణాలు ఇలా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు కారణమా? - సాధారణంగా లిథియం ఐయాన్ బ్యాటరీలు మైనస్ 20 సెల్సియస్ డిగ్రీల నుంచి ప్లస్ 50 సెల్సియస్ డిగ్రీల వరకు తట్టుకోగలవు. యాభై సెల్సియస్ డిగ్రీల కంటే ఉష్ణోగ్రత పెరిగిపోతే లిథియం ఐయాన్ బ్యాటరీలు తట్టుకోలేవు. - మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఉపయోగిస్తున్న లిథియం ఐయాన్ బ్యాటరీలను చైనా, దక్షిణ కొరియాల నుంచి దిగుమతి చేసుకున్నవి ఎక్కువగా ఉంటున్నాయి. ఈ బ్యాటరీలు అక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా తయారు చేస్తున్నారు. - కానీ మనదేశంలో వేసవిలో అనేక ప్రాంతాల్లో బయటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 సెల్సియస్ డిగ్రీలకు చేరుకుంటుంది. బయటి ఉష్ణోగ్రత ఈ స్థాయిలో ఉన్నప్పుడు బ్యాటరీల ఉష్ణోగ్రతలు 50 నుంచి 55 సెల్సియస్ డిగ్రీల దగ్గర నమోదు అవుతుంటాయి. ముఖ్యంగా ఛార్జింగ్‌లో పెట్టినప్పుడు, ఎండలో వాహనం ఎక్కువ సేపు నిలిపినప్పుడు ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఎక్కువ. - బ్యాటరీ ఉష్ణోగ్రత 50 సెల్సియస్ డిగ్రీలు దాటి ఎక్కువ సేపు కొనసాగితే పరిస్థితి అదుపు తప్పుతుంది. ఫలితంగా ఒక్కసారిగా బ్యాటరీలు బాంబుల్లా పేలిపోతాయి. మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ? ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (బీఎంఎస్) అనేది ఎంతో కీలకమైన అంశం. బ్యాటరీ ప్యాక్‌లో ఉన్న ప్రతీ సెల్ టెంపరేచర్‌ను మానిటర్ చేసే స్మార్ట్ బీఎంఎస్ వ్యవస్థను వాహన తయారీ సంస్థలు సమకూర్చుకోవాల్సి ఉంది. బ్యాటరీ టెంపరేచర్ ఆపరేట్ చేసేందుకు ప్రత్యేక కూలింగ్ సిస్టమ్‌ని అమర్చుకోవాల్సి ఉంది. అయితే ఇవి ఖరీదైన వ్యవహారాలు కావడంతో చాలా సంస్థలు ఈ బీఎంఎస్ టెక్నాలజీపై దృష్టి సారించడం లేదు. తక్కువ ధరకే వాహనం అందించాలనే పోటీతో నాణ్యత విషయంలో రాజీ పడుతున్నారయనే ఆరోపణలు వస్తున్నాయి. దృష్టి పెట్టాల్సిందే గత రెండేళ్లుగా మార్కెట్లో ఈవీ బూమ్ కొనసాగుతోంది. అయితే గత రెండు వేసవిల్లో లాక్డౌన్ నిబంధనలు, ప్రయాణ ఆంక్షలు ఉండటం వల్ల ఈవీలు రోడ్లపైకి వచ్చింది తక్కువ. ఈసారి ఆంక్షలు లేకపోవడంతో ఈవీలు రోడ్లపై రయ్రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. ఇదే సమయంలో అందులోని లోపాల కారణంగా ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్, ప్రమాదాలు ఎదురవుతున్నాయి. భవిష్యత్తు ఆశకిరణంగా చెప్పుకుంటున్న ఈవీలపై భయాలు తొలగిపోయి నమ్మకం కలగాలంటే మరింతగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్ జరగాల్సి ఉందని నిపుణులు అంటున్నారు. చదవండి👉ఈవీ కంపెనీలకు నితిన్ గడ్కరీ వార్నింగ్! -
11ఏళ్ల కష్టానికి ఫలితం, దేశీ స్టార్టప్‌కు యూరప్ నుంచి భారీ డీల్!
న్యూఢిల్లీ: బెంగళూరు స్టార్టప్ ప్రవయిగ్ రూపొందిస్తున్న బ్యాటరీలకు యూరోపియన్ పునరుత్పాదక ఇంధన కంపెనీ ఎరెన్ గ్రూప్ మద్దతు పలికింది. స్టోరేజీ అప్లికేషన్స్ కోసం ప్రవయిగ్ తయారీ 54 ఎండబ్ల్యూహెచ్ బ్యాటరీను ఎరెన్ కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు సిద్ధార్థ బాగ్రీ పేర్కొన్నారు. దీంతో ఈ బ్యాటరీలను ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్రాజెక్టుల్లో దేశీయంగా వినియోగించేందుకు అవకాశాలు పెరిగినట్లు వ్యాఖ్యానించా రు. ధావల్ వింకే ఖుల్లార్తో కలసి బాగ్రీ ప్రవయిగ్ను ఏర్పాటు చేశారు. ప్రొటోటైప్ ఈవీపై పదేళ్లుగా పనిచేస్తున్నట్లు బాగ్రీ తెలియజేశారు. తద్వారా అత్యధిక డెన్స్తోకూడిన ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీని రూపొందించినట్లు వివరించారు. అర్ధగంటలోనే పూర్తి చార్జింగ్కు వీలుగా తయారు చేసినట్లు వెల్లడించారు. 11ఏళ్ల పరిశోధన, అభివృద్ధి తదుపరి అత్యధిక ఇంధన డెన్స్ బ్యాటరీలను రూపొందించగలిగినట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు రామ్ దివేది తెలియజేశారు. గ్లోబల్ ఆటోమోటివ్ పరిశ్రమ వినియోగానికి వీలుగా 180 డబ్ల్యూహెచ్ పర్ కేజీవరకూ వీటిని రూపొందించగలుగుతున్నట్లు తెలియజేశారు. -
ఈ–సైకిల్’.. లోకల్ మేడ్
E Bicycle Homemade: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన బైక్ మెకానిక్ అబ్దుల్ జలీల్ ఈ–సైకిల్ తయారు చేశారు. కేవలం రూ.6,200 ఖర్చుతో పాత సైకిల్‌ను ఈ–సైకిల్‌గా విజయవంతంగా మార్చారు. 20 ఏళ్లుగా బైక్ మెకానిక్ అనుభవం ఉన్న జలీల్ తన ఆలోచనతో పంటలపై రసాయన మందు పిచికారీ చేసే యంత్రంలో ఉపయోగించే 8.12 వోల్టుల రెండు బ్యాటరీలు, చైనా మోడల్ కిట్ (ఎక్స్‌లేటర్, మోటార్) అమర్చి ఈ సైకిల్‌ను తయారు చేశారు. (చదవండి: జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!) ఇది గంటన్నర చార్జింగ్‌తో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని జలీల్ తెలిపారు. ముందుగా ఈ ప్రయోగం పాత సైకిల్‌తో చేసినట్లు తెలిపారు. రూ.21 వేలతో నూతన సైకిల్‌తోపాటు 40 కిలోమీటర్లు ప్రయాణించే సైకిల్‌ను త్వరలో తయారు చేస్తానని చెప్పారు. మధ్య వయసున్న పేద, మధ్యతరగతి వారు ఈ సైకిల్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. (చదవండి: అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) -
రూ.50 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. అందుబాటులో ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ స్కూటర్ల రెంటల్ స్టార్టప్ సంస్థ బౌన్స్ కొత్తగా ఈ–స్కూటర్ల తయారీ, బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. వచ్చే 12 నెలల్లో ఇందుకు సంబంధించి 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 742 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో వివేకానంద హలికెరె ఈ విషయాలు తెలిపారు. రెండు వేరియంట్స్ ఈ నెలాఖరు నాటికి తమ తొలి స్కూటర్‌ను రెండు వేరియంట్స్‌లో ఆవిష్కరిస్తామని, ఆ తర్వాత ప్రీ–బుకింగ్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి డెలివరీ మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రీ–బుకింగ్‌లో సుమారు ఒక లక్ష పైగా వాహనాలకు ఆర్డర్లు రావచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. బ్యాటరీతో కలిపి వాహనం ధర రూ. 70,000 లోపు, బ్యాటరీ లేకుండా సుమారు రూ. 50,000 లోపు రేటు నిర్ణయించే అవకాశం ఉందని వివేకానంద చెప్పారు. బ్యాటరీ లేకుండా బ్యాటరీతో పాటు తీసుకుంటే పోర్టల్ చార్జర్ ద్వారా ఇంటి వద్దే చార్జింగ్ చేసుకునే వీలు ఉంటుందన్నారు. అదే బ్యాటరీ లేని వేరియంట్ తీసుకుంటే.. బ్యాటరీస్ యాజ్ ఎ సర్వీస్ విధానంలో తాము నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్లలో బ్యాటరీ మార్పిడి చేసుకోవచ్చని వివేకానంద చెప్పారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, పుణె తదితర ఆరు నగరాల్లో బ్యాటరీ మార్పి స్టేషన్లు విస్తరిస్తామన్నారు. రాజస్థాన్‌లో ప్లాంటు తొలి దశలో రాజస్థాన్‌లోని భివాడీలో ఉన్న తమ ప్లాంటులో వాహనాలు ఉత్పత్తి చేయనున్నామని, తదుపరి రెండో లొకేషన్ కోసం అన్వేషిస్తున్నామని వివేకానంద తెలిపారు. భివాడీ ప్లాంటు వార్షిక సామర్థ్యం 1.8 లక్షల స్కూటర్లుగా ఉంటుందని, దీని ద్వారా వచ్చే 3–4 నెలల్లో సుమారు 1,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించగలవన్నారు. ప్రస్తుతం ఈ యూనిట్లో 100 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది వ్యవధిలో ఈ ప్లాంటుపై సుమారు 25 మిలియన్ డాలర్లు, బ్యాటరీ మార్పిడి స్టేషన్లపై 50–75 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేస్తామని వివేకానంద వివరించారు. చదవండి:టెస్లా బ్యాటరీతో.. ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇప్పుడు ఇండియాలో -
టెస్లా బ్యాటరీతో.. ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇప్పుడు ఇండియాలో
సాక్షి, అమరావతి / బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ఉన్న విజయవాడకు చెందిన అవేరా న్యూ, రెనివేబుల్ ఎనర్జీ మోటో కార్ప్ టెక్.. రెట్రోసా స్కూటర్ కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ఈ స్థాయి వేగం కలిగిన ఈ–స్కూటర్ భారత్‌లో ఇదేనని కంపెనీ తెలిపింది. టెస్లా బ్యాటరీతో టెస్లా కంపెనీ తయారు చేసే కార్లలో వినియోగిస్తున్న లైఫ్పీవో4 రకానికి చెందిన బ్యాటరీలను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో వినియోగించారు. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఈ తరహా బ్యాటరినీ పొందుపర్చడం ప్రపంచంలో ఇదే తొలిసారని ఆవేరా ఫౌండర్ రమణ తెలిపారు. ఆటోమేటిక్ ఆన్/ఆఫ్ స్కూటర్‌పైన కూర్చోగానే హ్యాండిల్‌కు ఉన్న కెమెరా సెన్సార్స్ ఆధారంగా వాహనం స్టార్ట్ అవుతుంది. వాహనం దిగగానే ఆఫ్ అవుతుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే ఎకానమీ డ్రైవ్‌లో 148 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ధర సబ్సిడీలు పోను రూ.1.25 లక్షలు. బ్యాటరీ చార్జింగ్ ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ వాహనాన్ని సోమవారం విజయవాడలో పరిశీలించారు. -
పెట్రోల్ రేట్ల పెంపుతో ఇంజన్ పీకేసి.. ఇలా సెట్ చేశాడు
Janagaon Electric Bike: పెరుగుతున్న పెట్రోలు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత రెండు నెలలుగా దాదాపు రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరిగిన ధరలతో కొందరు తమ వాహనాలను మూలన పడేయగా మరికొందరు ప్రత్యామ్నాయాలను చూసుకున్నారు. కానీ జనగామకు చెందిన విద్యాసాగర్ విభిన్నమైన మార్గం ఎంచుకున్నాడు. జనగామకు చెందిన కూరపాటి విద్యాసాగర్ ఓ ఎలక్ట్రానిక్ దుకాణం నిర్వహిస్తున్నారు. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోలు ధరలు భారంగా మారాయి. జనగామలో కూడా పెట్రోలు ధర లీటరు వంద దాటింది. పెట్రోలు ధరలు పెరగడమే తప్ప తగ్గకపోవడంతో తన భైకుకు ఉన్న పెట్రోల్ ఇంజన్‌ను తీసేయాలని నిర్ణయించుకున్నాడు. రూ.10 వేల ఖర్చుతో 30ఏహెచ్ కెపాసిటీ కలిగిన నాలుగు బ్యాటరీలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత రూ.7500 ఖర్చు చేసి ఆన్లైన్లో మోటారు కొన్నాడు. స్థానిక మెకానిక్ అనిల్ సహకారంతో పెట్రోల్ ఇంజన్ స్థానంలో బైక్‌కి బ్యాటరీలు, మోటార్ అమర్చాడు. ఈ లోకల్ మేడ్ ఎలక్ట్రిక్ వెహికల్ 5 గంటలపాటు ఛార్జింగ్ పెడితే 50 కిలోమీటర్ల ప్రయాణిస్తోంది. బ్యాటరీలతో నడుస్తున్న విద్యాసాగర్ బైక్ ఇప్పుడు జనగామలో ట్రెండింగ్‌గా మారింది. బ్యాటరీలను ఛార్జింగ్ చేసుకోవడానికి ఒకటి నుంచి ఒకటిన్నర యూనిట్ కరెంటు ఖర్చవుతోంది, కేవలం రూ.10తో 50 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నా. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఈ ఆలోచన చేశాను - విద్యాసాగర్ -
హోండా నుంచి ఎలక్ట్రిక్ బైక్!
వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి వచ్చేందుకు జపాన్ ఆటోమోబైల్ దిగ్గజ కంపెనీ హోండా సన్నాహకాలు చేస్తోంది. జపాన్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న హోండా బెన్లే మోడల్ని ఇండియాకి తీసుకురానుంది. అరాయ్‌లో టెస్టింగ్ హోండా సంస్థ 2019లో బెన్లే ఎలక్ట్రిక్ బైక్‌లను రూపొందించింది. అక్కడ ప్రస్తుతం బెన్లే సిరీస్‌లో నాలుగు బైక్‌లు రిలీజ్ అయ్యాయి. ఇదే బైక్‌ను ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టే ఆలోచనలో హోండా సంస్థ ఉంది. ఈమేరకు పూణేలో ఉన్న ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (అరాయ్)లో ఈ బైక్‌కు టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. డెలివరీకి తగ్గట్టుగా ఇండియాలో ఎలక్ట్రిక్ బైక్‌లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ బైకులకు మంచి మార్కెట్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఇండియాలో ఈ కామర్స్ రంగం జోరుమీదుంది. హోండా బెన్లే బైక్ డిజైన్ సైతం డెలివరీ సర్వీసులకు అనుకూలంగా ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయడుతున్నాయి. మరోవైపు ఈ బైకులకు కీలకమైన బ్యాటరీ విషయంలోనూ హోండా ముందు చూపుతో వ్యవహరిస్తోంది. సులువుగా బ్యాటరీ మార్చుకునేలా బైక్ డిజైన్‌లో మార్పులు చేర్పులు చేస్తోంది. -
డ్రైవర్ అవసరం లేని డైమ్లర్స్ భారీ ట్రక్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక ట్రక్, బస్సు తయారీదారు సంస్థ డైమ్లెర్ ఎజీ భవిష్యత్ లో హైడ్రోజన్, బ్యాటరీ సహాయంతో నడిచే భారీ ట్రక్ లను మార్కెట్లోకి తీసుకు రానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం జీరో ఎమిషన్ వాహనల తయారీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు లేనప్పటికీ డైమ్లెర్ ఎజీ ట్రక్ డివిజన్ 2025 నాటికి ఎక్కువ శాతం పర్యావరణ హిత వాహనాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఈ దశాబ్దం తర్వాత బ్యాటరీ, హైడ్రోజన్ శక్తితో పనిచేసే అతి పెద్ద వాహనాలు డీజిల్‌తో నడిచే వాహనలతో పోటీ పడతాయని కంపెనీ అంచనా వేసింది. అతిపెద్ద వాహనాలను బ్యాటరీలతో నడిచే విధంగా రూపోదించడానికి అయ్యే ఖర్చు భారీగా ఉందని, అలాగే సాంకేతికత పరంగా మరిన్ని మార్పులు చోటు చేసుకోవాలని డైమ్లెర్ ట్రక్ సీఈఓ మార్టిన్ డామ్ చెప్పారు. డైమ్లెర్ ఏజీ ట్రక్ ఈ ఏడాది చివరి నాటికి తన సహా బ్రాండ్లైన ఫ్రైట్‌లైనర్, మెర్సిడెస్ బెంజ్ నుంచి స్వతంత్ర సంస్థగా మారిన తర్వాత పర్యావరణ హిత వాహనాల అభివృద్ది కోసం వ్యూహ రచన చేస్తున్నట్లు డామ్ తెలిపారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రియాస్ గోర్బాచ్ 2025 నాటికి కంపెనీ బ్యాటరీ, హైడ్రోజన్ వాహనాల తయారీ కోసం ప్రణాళికలు రూపోదించినట్లు చెప్పారు. 2025 తర్వాత బ్యాటరీతో నడిచే వాహనాల ధర డీజిల్‌తో నడిచే వాహనాల ధరతో సమానంగా ఉంటుందని ఆయన ఊహించారు. ఈ దశాబ్దం చివరి నాటికి డ్రైవరు అవసరం లేని అతిపెద్ద ట్రక్ లను కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. చదవండి: ఎయిర్టెల్: సైబర్ నేరాలు పెరుగుతున్నాయ్.. -
జూపార్క్‌పై కోవిడ్ దెబ్బ: 20 మంది ఉద్యోగులపై వేటు
సాక్షి, బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో బ్యాటరీ వాహన డ్రైవర్లుగా పని చేస్తున్న 20 మంది ఉద్యోగులను జూ అధికారులు విధుల నుంచి తొలగించారు. జూలో కాలుష్య రహిత బ్యాటరీ వాహనాలు ప్రారంభమైనప్పటి నుంచి సందర్శకులను బ్యాటరీ వాహనాల్లో తిప్పుతూ వన్యప్రాణుల వివరాలను డ్రైవర్లు తెలిపే వీరిని కరోనా కారణంగా ఉద్యోగాల నుంచి తొలగించారు. జూ పున:ప్రారంభమైనప్పుడు చూస్తామని... ప్రస్తుతం విధుల్లోకి రావద్దని అధికారులు పేర్కొన్నారు. తమను విధుల్లో నుంచి తొలగిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు నెలల వేతనం చెల్లించాలని, కానీ జూ అధికారులు ఎలాంటి వేతనాలు చెల్లించకుండా తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీసం నెల ఖర్చులు కూడా ఇవ్వకుండా తొలగించారన్నారు. గతంలో జూపార్కు క్యూరేటర్ శివానీ డోగ్రా పెద్ద ఎత్తున 200 మంది ఉద్యోగులను అర్ధాంతరంగా విధుల్లో నుంచి తొలగించారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ఉద్యోగులను తొలగిస్తూ వారి బతుకులను అంధకారమయం చేస్తున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం, అటవీ శాఖ మంత్రి స్పందించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆదుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. (చదవండి: భర్త ఇంటికి వచ్చేసరికి భార్యతో సహా పిల్లలు..) -
కుమారుడికి ప్రేమతో.. బ్యాటరీ బైక్
దొండపర్తి (విశాఖ దక్షిణ): తొక్కడానికి పనికిరాకుండా పోయిన సైకిల్‌ను బాగు చేయమని ఓ కొడుకు తన తండ్రిని అడిగితే.. ఆ సైకిల్‌ను బ్యాటరీ బైక్‌గా తీర్చిదిద్దాడు ఆ తండ్రి. గుంటూరుకు చెందిన మురళీకృష్ణ పదేళ్లుగా విశాఖలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జువాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ అక్కయ్యపాలెంలో ఉంటున్నారు. తన కుమారుడు సూర్యసిద్ధార్థ (7)కు చిన్న సైకిల్ ఉండేది. అది పూర్తిగా పాడైంది. దాన్ని బాగు చేయమని కొడుకు రెండేళ్ల కిందట అడిగాడు. దీంతో పాత సైకిల్‌ను కొత్తగా తయారు చేయడం కంటే.. దాన్ని చిన్న బైక్‌గా మార్చి తన కుమారుడికి ఇవ్వాలని మురళీకృష్ణ నిర్ణయించుకుని రూ.20 వేల ఖర్చుతో బైక్‌ను రూపొందించారు. రెండేళ్ల కష్టం.. బ్యాటరీ బైక్ తయారు చేయడానికి ఏయే వస్తువులు, సాంకేతికత అవసరమో మురళీకృష్ణ తెలుసుకున్నారు. పాత సైకిల్ సామగ్రితో పాటు స్క్రాప్‌లో దొరికిన బైక్‌ల విడిభాగాలను తీసుకుని వాటిని తాను అనుకున్న మోడల్లో తయారు చేసుకున్నారు. చార్జింగ్ బైక్‌ను తయారు చేసే క్రమంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. బైక్‌కు మోటర్ కోసం డ్రిల్లింగ్ మెషిన్ మోటర్‌ను ముందు వినియోగించారు. దాని సామర్థ్యం సరిపోకపోవడంతో లారీ, బస్సుల అద్దాలను శుభ్రం చేసే వైపర్ మోటర్‌ను బైక్‌కు అమర్చారు. కంప్యూటర్ యూపీఎస్ బ్యాటరీ పెట్టారు. రెండేళ్లకు తాను అనుకున్న విధంగా ‘హార్లీ డేవిడ్ సన్’ బైక్ రూపురేఖలతో చార్జింగ్ బైక్‌ను తయారు చేశారు. బైక్ ప్రత్యేకతలు.. బైక్‌లో ఒక్కో భాగం ఒక్కో బైక్‌కు చెందినది. సెల్ఫ్ స్టార్ట్, త్రీ స్పీడ్ లెవెల్స్, కిలోమీటర్ల రీడింగ్‌తో స్పీడో మీటర్ మోనో సస్పెన్షన్, సింగల్ షాక్ అబ్జార్బర్ ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు బైక్‌కు అమర్చిన నాలుగు 12 ఓల్ట్స్, 7 యాంప్స్ బ్యాటరీలను 4 గంటల పాటు చార్జ్ చేస్తే 15 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం 40 కిలోలు బరువును మోసే సామర్థ్యం సంతోషంగా ఉంది ఈ బైక్ తయారీకి రెండేళ్లు కష్టపడ్డాను. ఏ వస్తువు దొరికినా దాన్ని తీసుకుని బైక్‌కు అనువుగా మలుచుకున్నాను. చేసింది బాగోలేకపోతే వాటిని తీసి కొత్త రకంగా తయారు చేయడంతో ఖర్చు పెరిగింది. రూ.20 వేల వరకు ఖర్చు అయింది. సరిగ్గా దీనిపై దృష్టి పెడితే రూ.15 వేలకే తయారు చేయవచ్చు. నా కొడుకు ఆ బైక్‌ను డ్రైవ్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. – మురళీకృష్ణ -
కష్టాలను గుర్తించిన కమిషనర్
నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం నిత్యం వందలాది మంది ప్రజలు వస్తుంటారు. వారిలో వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు, మహిళలు ఉంటారు. మెయిన్ రోడ్డు నుంచి లోనికి వచ్చేందుకు వారు ఇబ్బందులు పడేవారు. వారి కష్టాలను గమనించిన కమిషనర్ మూర్తి బ్యాటరీ వాహనాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కమిషనర్ మూర్తి వాహనంలో కొంతసేపు ప్రయాణం చేశారు. ఈ వాహనం చాలా సౌకర్యంగా ఉందని, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే కోటంరెడ్డి కమిషనర్‌ను ప్రశంసించారు. -
రీ’ చార్జ్‌తో రయ్..రయ్..
కడప అగ్రికల్చర్: వాహనంలో పెట్రోలు అయిపోయిందన్న బెంగ ఇక ఉండదు. వాహనదారులు టెన్షన్ పడాల్సిన పని అసలే ఉండదు..పెట్రోలు, డీజిల్ పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రికల్ బ్యాటరీతో నడిచే వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. జిల్లాలో ప్రయోగాత్మకంగా బ్యాటరీతో నడిచే వాహనాలకు రీచార్జ్ చేయిం చుకునే కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. ఇక నుంచి వాహనదారులు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని విద్యుత్ అధికారులు అంటున్నారు. జిల్లాకు ఎలక్ట్రికల్ రీచార్జ్ స్టేషన్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని ఏర్పాటు చేయిం చేందుకు అధికారులు జిల్లా కేంద్రంలో సన్నాహాలు ప్రారంభించారు. ఈ స్టేషన్ల నిర్మాణాలను వచ్చే జనవరి లోపల పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సెల్ఫోన్లకు ఏ విధంగా చార్జింగ్ చేస్తామో ఆ తరహాలో ఈ ఎలక్ట్రికల్ వాహనాలకు కూడా రీచార్జ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం స్థలాలను గుర్తించి ఇస్తే నిర్వాహకులు సే ్టషన్లను ఏర్పాటు చేస్తామని ఒప్పందం కు దుర్చుకున్నారు. విద్యుత్‌శాఖ అధికారులుఆయా స్టేషన్లకు సరఫరాను ఇస్తారు. స్టేషన్ల ఏర్పాటు నుంచి బిల్లును నిర్వాహకుల నుంచి వసూలు చేస్తారు. కడప నగరంలో ఏడు ఎలక్ట్రికల్ రీచార్జ్ స్టేషన్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణాలను ఎనర్జీ ఎపిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ వారు చేపట్టనున్నారు. స్థలాలను విద్యుత్‌శాఖ అధికారులు పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రాంతాలు ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఉండడంతో ఆయా శాఖల ఉన్నతాధికారులు ఒకసారి పరిశీలించి అనుమతులు ఇచ్చేలా నోట్ ఫైల్ తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ స్టేషన్లలో వాహనానికి ఒక గంట చార్జింగ్ చేస్తే 20 కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు. కారుకు ఐదు గంటలు చార్జింగ్ చేస్తే 120కిలో మీటర్లు సరిపోతుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. గంట చార్జింగ్ చేస్తే నిర్వహకులు రూ.3 వసూలు చేస్తారు. ఒక్కో స్టేషన్ నిర్మాణానికి రూ.3 నుంచి 5 లక్షలు పెట్టుబడి అవుతుందని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. కడప నగరంలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. మొదట ప్రభుత్వ ఉన్నతాధికారు వాహనాలన్నీంటికి ఎలక్ట్రిక్ బ్యాటరీలను అమర్చి వాటికి చార్జింగ్ ఇచ్చి నడుపుతారు. ఆ తరువాత ఇతర అధికారుల వాహనాలకు ఈ బ్యాటరీలు అమర్చుకునే అవకాశం కల్పిస్తారు. కడప నగరంలో ఎక్కడెక్కడ నిర్మిస్తారంటే కడప నగరంలో పాత కలెక్టరేట్లోను, పాత మున్సిపల్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణల్లోనూ, పోలీసు పెట్రోల్ బంక్ కో ఆపరేటివ్ కాలనీ, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఐటీఐ సర్కిల్, కొత్త కలెక్టరేట్, మార్కెట్‌యార్డు దేవుని కడపరోడ్డులో ఈ రీచార్జ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టేషన్లను ఈఈఎస్ఎల్ కంపెనీ వారు నిర్వహిస్తారు. -
మార్కెట్లోకి స్వీకార్ ఆటో బ్యాటరీ వాహనాలు
• ప్యాసింజర్, కార్గో మోడల్ త్రిచక్ర వాహనాలు • విడుదల చేసిన అడాప్ట్ మోటార్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అడాప్ట్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ మార్కెట్లోకి తొలిసారిగా బ్యాటరీ వాహనాలను విడుదల చేసింది. రూ.5 కోట్ల పెట్టుబడులతో స్వీకార్ పేరిట బ్యాటరీ ఆధారంగా నడిచే ప్యాసింజర్, కార్గో త్రిచక్ర వాహనాలను తయారు చేసినట్లు కంపెనీ ఎండీ భరత్ మామిడోజు శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు. 2 ఎకరాల్లో పెద్ద అంబర్‌పేట్‌లోని ప్లాంట్‌లో ఈ వాహనాలను రూపొందించామని.. నెలకు 500 వాహనాల తయారీ సామర్థ్యం ఉందని వివరించారు. ప్యాసింజర్ వాహనం ధర రూ.1.10 లక్షలు, కార్గో వాహనం ధర రూ.1.20 లక్షలుగా నిర్ణరుుంచామని పేర్కొన్నారు. 3 గంటల పాటు చార్జీంగ్ చేస్తే 70-90 కి.మీ. వరకు ప్రయాణించగలవని తెలిపారు. ‘‘తొలిసారిగా నిధులు సమీకరించనున్నాం. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రూ.10 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు. కంపెనీ విస్తరణ, వాహనాల తయారీ కోసం రూ.20 కోట్ల పెట్టుబడులు అవసరమని’’ వివరించారు.