న్యూఢిల్లీ: బెంగళూరు స్టార్టప్ ప్రవయిగ్ రూపొందిస్తున్న బ్యాటరీలకు యూరోపియన్ పునరుత్పాదక ఇంధన కంపెనీ ఎరెన్ గ్రూప్ మద్దతు పలికింది. స్టోరేజీ అప్లికేషన్స్ కోసం ప్రవయిగ్ తయారీ 54 ఎండబ్ల్యూహెచ్ బ్యాటరీను ఎరెన్ కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు సిద్ధార్థ బాగ్రీ పేర్కొన్నారు.
దీంతో ఈ బ్యాటరీలను ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్రాజెక్టుల్లో దేశీయంగా వినియోగించేందుకు అవకాశాలు పెరిగినట్లు వ్యాఖ్యానించా రు. ధావల్ వింకే ఖుల్లార్‌తో కలసి బాగ్రీ ప్రవయిగ్‌ను ఏర్పాటు చేశారు. ప్రొటోటైప్ ఈవీపై పదేళ్లుగా పనిచేస్తున్నట్లు బాగ్రీ తెలియజేశారు. తద్వారా అత్యధిక డెన్స్‌తోకూడిన ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీని రూపొందించినట్లు వివరించారు. అర్ధగంటలోనే పూర్తి చార్జింగ్‌కు వీలుగా తయారు చేసినట్లు వెల్లడించారు.
11ఏళ్ల పరిశోధన, అభివృద్ధి తదుపరి అత్యధిక ఇంధన డెన్స్ బ్యాటరీలను రూపొందించగలిగినట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు రామ్ దివేది తెలియజేశారు. గ్లోబల్ ఆటోమోటివ్ పరిశ్రమ వినియోగానికి వీలుగా 180 డబ్ల్యూహెచ్ పర్ కేజీవరకూ వీటిని రూపొందించగలుగుతున్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment