సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్ట ర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయ భవన ప్రారంభబోత్సవం ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభ తేదీని ఖరారు చేయ డంతో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి సీఎం జన్మదినం నాటికి భవ నాన్ని సిద్ధం చేయడంపై అధికారులు దృష్టి సారించారు. రూ.617 కోట్ల వ్య యంతో నిర్మిస్తున్న ఈ సచివాలయ పనులకు 2019 జూన్‌లో సీఎం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.
పనులను పరిశీలించిన మంత్రి: ఉమ్మడి రాష్ట్రంలో పలు భవనాలతో కూడిన సచివాలయ సముదాయం సేవలందించగా, అవి విడివిడిగా ఉండటం అంత అనుకూలంగా లేదన్న కారణంతో వాటిని కూల్చేసి 10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో జీ ప్లస్ 6 అంతస్తులుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని తరహాలో అత్యంత విశాలంగా, పూర్తి ఆధునిక వసతులతో చేపట్టారు.
గతేడాది దసరాకు ప్రారంభించాలనుకున్నా పనులు పూర్తి కాలేదు. తాజాగా సంక్రాంతికి అనుకున్నా సిద్ధం కాలేదు. ఇప్పుడు ఫిబ్రవరి 17ను ముహూర్తంగా ఖరారు చేయడం విశేషం. అప్పటివరకు పనులు పూర్తి కావడం కొంత ఇబ్బందిగానే ఉన్నా పది రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధికారులను సోమవారం ఆదేశించారు.
ఇండో–పర్షియన్ నమూనాలో...: గతంలో భాగ్యనగరంలో ఇండో–పర్షియన్ నమూనాలో గుమ్మటాలతో హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి సహా ఎన్నో భవనాలు నిజాం కాలంలో రూపుదిద్దుకున్నాయి. మళ్లీ ఇప్పుడు అదే నమూనాలో కొత్త సచివాలయ భవనం సిద్ధమవుతోంది. ఈ నిర్మాణంలో కాకతీయ శైలి కూడా ఉందని నిర్మాణ సంస్థ చెబుతోంది. ఈ భవనంలో 34 గుమ్మటాలను తీర్చిదిద్దారు. ఇందులో రెండు గుమ్మటాలు 82 అడుగుల ఎత్తుండటం విశేషం. మధ్యలో కోర్ట్‌యార్డు.. దానికి ముందు వెనక రెండు బ్లాకులపై ఉండే ఈ భారీ గుమ్మటాలపై నాలుగు సింహాలుండే అశోక చిహ్నం ఏర్పాటు చేశారు.
►ఈ ప్రాంగణం 28 ఎకరాల్లో విస్తరించి ఉంది. కోర్టు యార్డు లాన్ రెండు ఎకరాల్లో ఉండగా, భవనం ముందువైపు ఐదెకరాల్లో పచ్చిక బయళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ముందు పచ్చికలో రెండు వైపులా పార్లమెంటు ముందున్న ఫౌంటెయిన్ నమూనాలో రెండు ఫౌంటెయిన్లు ఏర్పాటు చేశారు.
►ప్రధాన భవనం 265 అడుగుల ఎత్తుంటుంది. ప్రధా న గుమ్మటాలుండే సెంట్రల్ టవర్ 8 అంతస్తులుగా ఉంటుంది. ముఖ్య మంత్రి కార్యాలయం, కేబినెట్ సమా వేశ మందిరం ఆరో అంతస్తులో ఉంటాయి.
►రెండు నుంచి ఐదో అంతస్తు వరకు ప్రతి ఫ్లోర్‌లో నాలుగు చొప్పున మంత్రులు, కేబినెట్ ర్యాంకులో ఉండే ముఖ్యుల కార్యాలయా లుంటాయి. ఒకటి, రెండు అంతస్తు ల్లో జీఏడీ, ఆర్థిక శాఖ కార్యాలయా లుంటాయి.
►ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శు లకు 59 కార్యాలయాలు సిద్ధం చేశా రు. అదనపు, ఉప, సహ కార్యదర్శు లకు 90 గదులు, సహాయ కార్యదర్శి స్థాయి వారి కోసం 121 కార్యాల యాలు ఏర్పాటు చేశారు. ఇతర సిబ్బందికి 1,550 గదులు ఏర్పాటు చేశారు.
►ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన ద్వారాన్ని, 2 లిఫ్టులను ఏర్పాటు చేశారు. సీఎం, మంత్రులకు విడిగా పార్కింగ్ వసతి కల్పించారు. ∙బిర్లామందిర్ రోడ్డు వైపు దేవాలయాన్ని, వెనకవైపు చర్చి, మసీదులను నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment