సాక్షి, హైదరాబాద్: రేపటి(బుధవారం) నుంచి సమీకృత కొత్త సచివాలయానికి శాఖల షిఫ్టింగ్ షురూ కానుంది. ఈ నెల 28వ తేదీ వరకు షిఫ్టింగ్ కొనసాగనుంది. ఒక్కో ఫ్లోర్‌కు మూడు శాఖల కేటాయింపు జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్‌లో హోమ్ శాఖ, రెండో అంతస్తులో ఆర్థిక శాఖ, మూడో ఫ్లోర్‌లో అగ్రికల్చర్ అండ్ ఎస్సీ డెవలప్‌మెంట్‌కు కేటాయించారు.
నాలుగో అంతస్తులో ఇరిగేషన్ అండ్ లా, ఐదవ అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ, ఆరో ఫ్లోర్‌లో సీఎం, సీఎస్‌లకు కేటాయించారు. ఈ మేరకు శాఖల వారీగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 30న నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు ఉదయం కొత్త సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎస్ నేతృత్వంలో ఈ రోజు కో ఆర్డినేషన్ సమావేశం జరిగింది.
చదవండి: సాగర తీరాన పాలనా సౌధం.. ధగధగల సచివాలయం.. వైరల్ ఫోటోలు
Comments
Please login to add a commentAdd a comment