shifting
-
KTR: రాజకీయ బేహారులకు జవాబు చెప్పేది వాళ్లే
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందర.. తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్కు గట్టి షాక్ ఇస్తూ ఆ పార్టీ ప్రధాన నేతలు పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. కేకే, కడియం కుటుంబాలతో పాటు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఇంకొంతమంది సైతం కాంగ్రెస్‌లో చేరవచ్చనే సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. ఈ తరుణంలో.. పార్టీ మారుతున్న నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కడే ఒంటరిగా బయల్దేరి.. లక్షల మంది సైన్యంతో సాధించారని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించారని తెలిపారు. ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని కేటీఆర్ తన సందేశంలో పేర్కొన్నారు. శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్ ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్ ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు… — KTR (@KTRBRS) March 29, 2024 ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం అని కేటీఆర్ పార్టీ మారుతున్న నేతల ప్రభావం బీఆర్ఎస్పై ఉండబోదంటూ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: కారులో కలకలం -
కొత్త భవనంలోకి సచివాలయ శాఖల షిఫ్టింగ్.. కేసీఆర్ ఆఫీస్ ఏ ఫ్లోర్లో ఉంటుందంటే?
సాక్షి, హైదరాబాద్: రేపటి(బుధవారం) నుంచి సమీకృత కొత్త సచివాలయానికి శాఖల షిఫ్టింగ్ షురూ కానుంది. ఈ నెల 28వ తేదీ వరకు షిఫ్టింగ్ కొనసాగనుంది. ఒక్కో ఫ్లోర్‌కు మూడు శాఖల కేటాయింపు జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్లో హోమ్ శాఖ, రెండో అంతస్తులో ఆర్థిక శాఖ, మూడో ఫ్లోర్లో అగ్రికల్చర్ అండ్ ఎస్సీ డెవలప్మెంట్కు కేటాయించారు. నాలుగో అంతస్తులో ఇరిగేషన్ అండ్ లా, ఐదవ అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ, ఆరో ఫ్లోర్లో సీఎం, సీఎస్‌లకు కేటాయించారు. ఈ మేరకు శాఖల వారీగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 30న నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు ఉదయం కొత్త సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎస్ నేతృత్వంలో ఈ రోజు కో ఆర్డినేషన్ సమావేశం జరిగింది. చదవండి: సాగర తీరాన పాలనా సౌధం.. ధగధగల సచివాలయం.. వైరల్ ఫోటోలు -
హిమాచల్ కాంగ్రెస్‌లో ‘ఆపరేషన్ లోటస్’ గుబులు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శాసనసభ ఫలితాల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరోహోరీ పోటీ నెలకొంది. స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్న హస్తం పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలు పెట్టింది. బీజేపీ ఆపరేషన్ కమలం ప్రయత్నాలను అడ్డుకుని, విజయం సాధించే తమ అభ్యర్థులను చేజారి పోకుండా కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలను రాజస్థాన్‌కు తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని పరిస్థితులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రానికి ఆమె సిమ్లా చేరుకోనున్నారని సమాచారం. మరోవైపు.. కొత్త ఎమ్మెల్యేల తరలింపు బాధ్యతను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్, పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గురువారం సాయంత్రం ఎమ్మెల్యేలను బస్సుల ద్వారా రాజస్థాన్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఇదీ చదవండి: మోదీ అడ్డాగా గుజరాత్.. రికార్డులు బద్దలుకొట్టిన బీజేపీ! -
కొత్త ఇంట్లోకి మారుతున్న రష్మిక.. తెగ కష్టపడుతున్నానంటూ పోస్ట్
Rashmika Mandanna Is Shifting To New House: కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. రీసెంట్గా తెలుగులో పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న ఈ భామ ఇప్పుడు తమిళం సహా బాలీవుడ్లో రెండు సినిమా చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో రష్మిక సామాన్యు ప్యాక్ చేసుకోవడానికి తెగ కష్టపడుతున్నట్లు పేర్కొంది. దీంతో ఆమె కొత్త ఇల్లు కొనుక్కుందా అనే చర్చ మొదలైంది. నిజానికి గతేడాది ఫిబ్రవరిలోనే రష్మిక ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసింది. బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడే ఉండేందుకు ప్లాన్ చేస్తుంది. దీనిలో భాగంగానే రష్మిక కొత్త ఇంట్లోకి మారే ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ ఇంటి గృహప్రవేశం జరగనున్నట్లు సమాచారం. -
Photo Feature: జైలెళ్లి పోతోంది..
సాక్షి, వరంగల్: ముందు పోలీస్ వాహనం..వెనుకే ఆమె పరుగు.. వాహనంలో నుంచి బేలగా వెనక్కి చూస్తూ ఓ ఖైదీ.. చివరకు కనుమరుగైన వాహనం.. బరువెక్కిన గుండెలతో ఇంటిముఖం పట్టిన మహిళ.. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఖైదీలను మంగళవారం హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలిస్తున్నపుడు కనిపించిన భావోద్వేగమిది. దగ్గర్లోనే ఉంటే ములాఖత్‌లో కలుసుకోవడం సులువయ్యేదని.. ఇప్పుడు హైదరాబాద్ ఎలా వెళ్లగలమని ఆమెతో పాటు పలువురు ఖైదీల బంధువులు, భార్యపిల్లలు విలపించారు. -
Warangal: ఖైదీల తరలింపు షురూ
సాక్షి, వరంగల్: ప్రస్తుతం వరంగల్‌లో సెంట్రల్ జైలు స్థలాన్ని రీజినల్ కార్డియాక్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. దీంతో వైద్యశాఖకు స్థలాన్ని కేటాయించాలన్న ఆదేశాలతో ఖైదీల తరలింపు చేపట్టామని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ రాజీవ్‌త్రివేది తెలిపారు. సెంట్రల్‌జైలు నుంచి ఖైదీల తరలింపు మంగళవారం మొదలుకాగా, ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీజీ మీడియాతో మాట్లాడుతూ వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని వైద్యశాఖకు ఇస్తున్నందున కొత్తగా జైలు నిర్మించేందుకు ప్రభుత్వం మామునూరులో స్థలం కేటాయించిందని చెప్పారు. అక్కడ అత్యాధునిక హంగులతో కూడిన నూతన జైలు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. మొత్తం 956 మంది ప్రస్తుతం సెంట్రల్ జైలులో 956 ఖైదీలు ఉండగా, వీరిని హైదరాబాద్‌లోని చర్లపల్లి, చంచల్‌గూడతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ జైళ్లకు తరలించనున్నట్లు డీజీ రాజీవ్త్రిదేవి వెల్లడించారు. తొలివిడతగా మంగళవారం 119 మందిని భారీ బందోబస్తు నడుమ చర్లపల్లి జైలుకు తరలించినట్లు చెప్పారు. ఇందులో 80 మంది పురుషులు, 39 మంది మహిళా ఖైదీలు ఉన్నారని తెలిపారు. మిగతా వారి తరలింపు ప్రక్రియ ఇరవై రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. ఇక వరంగల్ సెంట్రల్ జైలులో విధులు నిర్వర్తిస్తున్న 267 మంది సిబ్బందికి కోరుకున్న చోట పోస్టింగ్ ఇస్తామని చెప్పారు. కాగా, జైలు ఆవరణలో ఉన్న పెట్రోల్ పంపులు యథావిధిగా నిర్వహిస్తామని, విచారణలో ఖైదీలను ఎక్కడకు తరలించాలనే విషయమై న్యాయమూర్తుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. కాగా, ఖైదీలను సామగ్రితో తరలించే క్రమంలో కొందరి బంధువులు చేరుకుని కన్నీరు పెట్టుకున్నారు. వరంగల్ నుంచి తరలిస్తుండడంపై పలువురు ఖైదీల బంధువులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడైనా వచ్చి చూసేందుకు అనువుగా లేకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ హైదరాబాద్, వరంగల్ రేంజ్ డీఐజీలు ఎన్.మురళీబాబు, వై.రాజేష్, జైలు సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్‌రాయ్, డిప్యూ టీ సూపరింటెండెంట్లు డి.భరత్, అమరావతి, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Telangana Formation Day: అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు -
అమెరికాను కాదంటే పన్నుల మోత
వాషింగ్టన్: అమెరికా కంపెనీలు తమ తయారీ కేంద్రాలను చైనా నుంచి స్వదేశానికే తరలించాలని.. అలా కాకుండా భారత్, ఐర్లాండ్ వంటి ఇతర దేశాలను ఎంపిక చేసుకుంటే వాటిపై పన్నుల మోత మోగుతుందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కరోనా వైరస్ చైనాలో వెలుగు చూసి అక్కడి పరిశ్రమలన్నీ మూతపడడం.. ఆ దేశ సరఫరా వ్యవస్థపై ఆధారపడిన దేశాలు ఇబ్బందులు పడడం తెలిసిందే. దీంతో పూర్తిగా చైనాపైనే ఆధారపడకుండా, తయారీలో కొంత వరకు భారత్ వంటి ప్రత్యామ్నాయ దేశాలకు తరలించాలని అమెరికాతోపాటు ఇతర దేశాల కంపెనీలు యోచిస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్ తన తయారీని చైనా నుంచి భారత్‌కు తరలించాలనుకుంటున్నట్టు న్యూయార్క్‌పోస్ట్ కథనం పేర్కొంది. ఈ క్రమంలో ట్రంప్ స్వదేశానికే రావాలంటూ హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పన్నులు అనేవి తయారీ కేంద్రాలను అమెరికాకు తరలించే కంపెనీలకు ప్రోత్సాహకమని ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ‘‘ఇలాంటి తెలివి తక్కువ సరఫరా వ్యవస్థ ప్రపంచమంతటా భిన్న ప్రదేశాల్లో ఉంది. ఎక్కడైనా ఇబ్బంది ఏర్పడితే మొత్తం వ్యవస్థ గందరగోళంలో పడుతుంది. కనుక ఈ సరఫరా వ్యవస్థ మొత్తం అమెరికాలోనే ఉండాలి. ఈ పని చేయడానికి మాకు కంపెనీలు ఉన్నాయి’’ అన్నారు. -
డిగ్రీ కాలేజీ షిఫ్టింగ్ అంత ఈజీ కాదు!
సాక్షి, హైదరాబాద్: ఒక మండలం నుంచి మరో మండలానికి ప్రైవేటు డిగ్రీ కాలేజీల షిఫ్టింగ్ ఇకపై అంత ఈజీ కాదు. సీఎం ఆమోదంతోనే ప్రైవేటు డిగ్రీ కాలేజీలను షిఫ్ట్ చేసేలా నిబంధనల్లో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మార్పుతో ఉన్నత విద్యా మండలి, విద్యాశాఖ మంత్రిపై ఒత్తిళ్లు లేకుండా చూడొచ్చని భావిస్తోంది. మండల పరిధిలో ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి కాలేజీని షిఫ్ట్ చేసేందుకు ఉన్నత విద్యా మండలి అనుమతి ఇస్తుండగా, ఒక మండలం నుంచి మరో మండలానికి కాలేజీని షిఫ్ట్ చేసేందుకు విద్యాశాఖ మంత్రి అనుమతి ఇస్తున్నారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు కాలేజీని షిఫ్ట్ చేయాలంటేనే ఫైలు సీఎంకు వెళ్లేది. కానీ ఇకపై ఆ పరిస్థితి లేకుండా నిబంధనలను మార్చే కసరత్తు మొదలైంది. జీహెచ్ఎంసీలో జోన్‌ను పరిగణనలోకి తీసుకోవాలా? పాత మండలాలను పరిగణనలోకి తీసుకోవాలా అన్న దాన్ని ఖరారు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. -
కాళేశ్వరానికి.... ‘అనంత’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను మిడ్‌మానేరు నుంచి దిగువకు తరలించేందుకు అనంతగిరి గ్రామం తరలింపు అడ్డంకిగా మారింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం కింద పూర్తిగా ముంపునకు గురౌతున్న ఈ గ్రామాన్ని ఖాళీ చేయడంలో జాప్యం జరుగుతోంది. దీంతో నీటిని పంపడం సాధ్యం కావడం లేదు. ఈ ఒక్క గ్రామాన్ని తరలిస్తే కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలించే అవకాశం ఉండటంతో దీని తరలింపును వేగిరం చేయాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులకు ఆదేశించారు. ఒక్క గ్రామం తరలిస్తే దిగువకు గోదావరి.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే లక్ష్మీ, సరస్వతి, పార్వ తి బ్యారేజీలను పూర్తిగా నింపారు. వీటి దిగువన ఉన్న ఎల్లంపల్లి బ్యారేజీని ప్రస్తుతం నింపుతున్నా రు, ఇప్పటికే బ్యారేజీలో 20.18 టీఎంసీలకు గానూ 13 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ఎగువన పార్వతి బ్యారేజీ నుంచి 11,197 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. మరో వారం రోజు ల్లో ఇదికూడా నిండనుంది. వీటి దిగువనున్న మిడ్‌మానేరు రిజర్వాయర్‌ను ఇప్పటికే నింపారు. ఇక్కడ 25.87 టీఎంసీల నిల్వలకు గానూ 20.10 టీఎంసీల నిల్వ ఉంది. వాటర్ ప్రోటోకాల్ ప్రకారం ఇంతవరకే నీటిని నింపి, లీకేజీలు గమనించాక మరో 15 రోజుల తర్వాత పూర్తిగానింపనున్నారు. మిడ్‌మానేరు నుంచి నీటిని అనంతగిరి రిజర్వాయర్‌లోకి తరలించేలా 64.5 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులు సిద్ధమయ్యాయి. 12.03 కి.మీల టన్నెల్ పూర్తయింది. అనంతగిరి కింద కొచ్చగుట్టపల్లి, అనంతగిరి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురౌతున్నాయి. ఈ గ్రామాల్లో 2వేల ఎకరాల భూసేకరణతో పాటు సహాయ పునరావాసం కింద వెయ్యి గృహాలను తరలించాల్సి ఉంది. రూ.75కోట్లతో భూసేకరణ ప్రక్రియ చేపట్టి, కొచ్చ గుట్టపల్లిలోని 102 నిర్వాసిత కుటుంబాలను తరలించినా, అనంతగిరిలో మాత్రం పూర్తి కాలేదు. ఇక్కడనుంచి 839 గృహాలను, 1140 కుటుంబాలను తరలించాల్సి ఉన్నా, పునరావాస సాయం పూర్తిగా అంద లేదు. రూ.150 కోట్లకు గాను రూ.100 కోట్లు ఇచ్చి మరో రూ.50కోట్లు చెల్లించలేదు. పునరావాస సాయం అందకపోవడంతో గ్రామంలోనే నిర్వాసితులు ఈ యాసంగిలోనూ సాగుకు సిద్ధమయ్యారు. నీటిని ఎత్తిపోసేందుకు అనంతగిరి గ్రామం ఖాళీ చేయాల్సి ఉందని ప్రాజెక్టు ఇంజనీర్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో దీన్ని పరిశీలించాలని తన కార్యాలయ కార్యదర్శిస్మితా సబర్వాల్‌ను సీఎం ఆదేశించారు. ఇటీవలే అక్కడ పర్యటించిన ఆమె, పునరావాస సాయం కింద రూ.50 కోట్లను విడుదల చేయాలని ఆర్ధిక శాఖను ఆదేశించారు. దీంతో బోర్లకు, బోరు బావుల మోటార్లకు కరెంట్ సరఫరా నిలిపివేయాలని సిరిసిల్లా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాషా ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇంటినీ ఎత్తేస్తారు!
నాగాయలంక : భూమి మెతక వల్ల కుంగిపోయిన, కొత్తగా వేసిన రోడ్డుకన్నా పల్లంగా ఉన్నా, ఇతర వాస్తు దోషాలు ఉన్న భవనాలను కూల్చివేసి మళ్లీ నిర్మించడం ఇప్పటివరకూ చూస్తున్నాం. భవనం ఎంత గట్టిదైనా, నిర్మించి ఎన్నో ఏళ్లు గడవకున్నా కూల్చి తిరిగి నిర్మించడమే ఇప్పటివరకూ ఉన్న పద్ధతి. కొత్తగా అందుబాటులో ఉన్న పద్ధతులతో ఈ విధానానికి ఇక స్వస్తి పలకవచ్చు. హౌస్ లిఫ్టింగ్, షిఫ్టింగ్ పద్ధతి కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం పల్లెలకు కూడా పాకింది. కృష్ణా జిల్లా నాగాయలంకలో ఓ భవనాన్ని జాకీల మీద లేపి ఎత్తుపెంచడం స్థానికంగా ఆసక్తి కలిగిస్తోంది. మండల పరిషత్ అధ్యక్షుడు సజ్జా గోపాలకృష్ణ ఇంటిని హరియాణాకు చెందిన టీడీబీడీ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ (హౌస్ లిప్టింగ్ సర్వీస్ ఇన్ ఇండియా) ఈ పనులు చేపట్టింది. ఈ భవనం పశ్చిమవైపు అడుగు మేర కుంగి, తూర్పున ఎత్తు పెరగడాన్ని వాస్తు దోషంగా భావించి ఇలా ఎత్తు పెంచుతున్నారు. ఈ భవనం ఎత్తు పెంచేందుకు రూ. 5 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. -
పాలన వెనుక లోకేశ్ ఒత్తిడే కారణమా?
-
'ఉస్మానియా ఆస్పత్రి తరలింపును వ్యతిరేకిస్తున్నాం'
నల్లగొండ: హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి తరలించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మంత్రులకు అధికారాలు లేవని, ఏక పక్ష పాలన కొనసాగుతోందన్నారు. కరువు పరిస్థితులను అధ్యయనం చేసి నివారించడంలో తెలంగాణ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రి తరలింపుపై హైకోర్టులో దాఖలైన్ పిల్ రేపు(మంగళవారం) విచారణకు రానుంది. -
మాతృదేశం వీడి వెళుతున్న మిలియనర్లు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా మాతృదేశాన్ని విడిచి పొరుగుదేశాలకు వెళ్లే ధనిక వలసదారుల స్థానంలో భారత్ రెండో స్థానంలో ఉంది. గడిచిన పద్నాలుగేళ్ల కాలంలో ఇప్పటి వరకు 61 వేలమంది భారత మిలియనర్లు విదేశాలపై మోజుతో మాతృదేశాన్ని విడిచి వెళ్లి ఏదో ఒకరకంగా అక్కడే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నరంట. న్యూ వరల్డ్ వెల్త్, లియో గ్లోబల్ అనే రెండు సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఆ వివరాలను ప్రచురించాయి. దాని ప్రకారం మిలియనీర్లుగా మారిన భారతీయులంతా వెంటనే భారత దేశంలో విధిస్తున్న పన్నులు, రక్షణ, పిల్లల చదువు అనే సాకులతో విదేశాలకు వెళ్లిపోతున్నారని, ఇప్పటికే 61 వేలమంది మిలియనీర్లను భారత్ కోల్పోయిందని సర్వే చెప్పింది. కాగా, 91 వేలమంది మిలియనర్లు విదేశాలకు తరలిపోవడం ద్వారా చైనా తొలిస్థానంలో నిలిచింది. భారతీయులంతా ఎక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాకు తరలి వెళుతుండగా.. చైనా వాళ్లు మాత్రం అమెరికా, హాంగ్ కాంగ్, సింగపూర్, బ్రిటన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారంట. కాగా, ప్రపంచ దేశాల నుంచి అత్యధికంగా బ్రిటన్‌కే 1.25 లక్షలమంది వెళ్లినట్లు సర్వే వెళ్లడించింది. -
విజయవాడ తరలనున్న వినియోగదారుల ఫోరం ఆఫీస్
చిత్తూరు: వినియోగదారుల ఫోరం రాష్ట్ర కమిషన్ కార్యాలయాన్ని త్వరలోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తామని ఫోరం కమిషనర్ జస్టిస్ నౌషాద్ ఆలీ తెలిపారు. శనివారం తిరుపతికి విచ్చేసిన ఆయన పద్మావతి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం గురించి, ఫోరం సేవల గురించి జిల్లా, గ్రామ స్థాయిల్లో విసృతంగా అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుంచే వినియోగ విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
ఇరిగేషన్ కార్యాలయాన్ని తరలిస్తే ఆందోళనే: ఉద్యోగుల హెచ్చరిక
విజయవాడ: రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యాలయం తరలింపుపై ఉద్యోగులు ఆందోళనకు గురౌతున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం కోసం తమ కార్యాలయాన్ని తరలించడం అన్యాయమని, దీనికి నిరసిస్తూ ఉద్యోగులు సీనియర్ ఇంజనీర్ కు ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు. తమకు విజయవాడలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా నీటిపారుదల కార్యాలయాన్ని తరలిస్తే ఆందోళన చేస్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
'వాస్తు పేరుతో ఖజానా ఖాళీ'
హైదరాబాద్: 'ఫాస్ట్ పేరుతో తెలంగాణ విద్యార్థులను అంధకారంలో నెట్టావు..వాస్తు పేరుతో ఖజానా ఖాళీ చేస్తావా' అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విరుచుకుపడ్డారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ...ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి ని తరలిస్తే సహించమని హెచ్చరించారు. కేసీఆర్ కు మొక్కులు తీర్చడానికే 8 నెలలు పడితే, ప్రజలకు ఇచ్చిన వాగ్థానాలు ఎప్పుడు నెరవేరుస్తారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. -
సినీ పరిశ్రమ తరలి వెళ్తుందా?
రాష్ట్ర విభజనతో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తు ఏం కాబోతోంది? దాదాపు పాతికేళ్ల క్రితం నాటి మద్రాసు నగరం నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన పరిశ్రమలో కొంత భాగం ఇప్పుడు మళ్లీ ఏ విశాఖపట్నానికో లేదా కొత్త రాజధాని చుట్టుపక్కలకో తరలి వెళ్తుందా? ఈ ప్రశ్నలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. అయితే.. తమిళనాడు నుంచి ఇక్కడకు వచ్చినంత సులభంగా మాత్రం హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతానికి అప్పుడే పరిశ్రమ వెళ్లకపోవచ్చని సీనియర్ నిర్మాతలు కొందరు అంటున్నారు. వెయ్యి కోట్ల రూపాయల తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారే ఉన్నారు. అయితే.. కొన్ని తరాలుగా వాళ్లంతా హైదరాబాద్ నగరంలోనే స్థిరపడిపోయారు. ఇప్పుడు తరలి వెళ్లాలంటే కొత్త రాష్ట్రంలో పన్నుల విధానం, మౌలిక సదుపాయాలు, ఆదాయం, పిల్లల చదువు.. ఇలా అనేక అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ తరం వాళ్లు బహుశా ఇక్కడే ఉండాలనుకోవచ్చని దగ్గుబాటి సురేష్‌బాబు అంటున్నారు. 1980ల చివరి కాలంలోను, 1990ల తొలి నాళ్లలోను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ తరలి వచ్చింది. అప్పట్లో ఎన్నో కష్టాలు పడుతూ ఇక్కడ షూటింగులు చేసుకునేవారు. తర్వాత పెద్దపెద్ద స్టూడియోలు, ఫిలిం సిటీలు కూడా రావడంతో పరిశ్రమ పాతుకుపోయింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లా అరకు లాంటి ప్రాంతాలు ఇప్పటికీ షూటింగులకు స్వర్గధామాలుగా ఉన్నాయి. కానీ పరిశ్రమ తరలి వెళ్లాలంటే మాత్రం చాలా కాలం పట్టొచ్చని మరో సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా అంటున్నారు. ఏ రాష్ట్రంలోనైనా సినీ వ్యాపారం సాగాలంటే పన్నుల విధానమే ముఖ్యమని ఆయన చెప్పారు. పన్నురాయితీలు ఇస్తే సహజంగానే ఎక్కువమంది ఆకర్షితులు అవుతారన్నారు. కేంద్రం చెబుతున్న టాక్స్ హాలిడే విధానం సినీ పరిశ్రమకు కూడా వర్తిస్తే మాత్రం తరలి వెళ్లే అవకాశం లేకపోలేదని అంటున్నారు.