మాతృదేశం వీడి వెళుతున్న మిలియనర్లు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా మాతృదేశాన్ని విడిచి పొరుగుదేశాలకు వెళ్లే ధనిక వలసదారుల స్థానంలో భారత్ రెండో స్థానంలో ఉంది. గడిచిన పద్నాలుగేళ్ల కాలంలో ఇప్పటి వరకు 61 వేలమంది భారత మిలియనర్లు విదేశాలపై మోజుతో మాతృదేశాన్ని విడిచి వెళ్లి ఏదో ఒకరకంగా అక్కడే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నరంట. న్యూ వరల్డ్ వెల్త్, లియో గ్లోబల్ అనే రెండు సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఆ వివరాలను ప్రచురించాయి.
దాని ప్రకారం మిలియనీర్లుగా మారిన భారతీయులంతా వెంటనే భారత దేశంలో విధిస్తున్న పన్నులు, రక్షణ, పిల్లల చదువు అనే సాకులతో విదేశాలకు వెళ్లిపోతున్నారని, ఇప్పటికే 61 వేలమంది మిలియనీర్లను భారత్ కోల్పోయిందని సర్వే చెప్పింది. కాగా, 91 వేలమంది మిలియనర్లు విదేశాలకు తరలిపోవడం ద్వారా చైనా తొలిస్థానంలో నిలిచింది. భారతీయులంతా ఎక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాకు తరలి వెళుతుండగా.. చైనా వాళ్లు మాత్రం అమెరికా, హాంగ్ కాంగ్, సింగపూర్, బ్రిటన్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారంట. కాగా, ప్రపంచ దేశాల నుంచి అత్యధికంగా బ్రిటన్కే 1.25 లక్షలమంది వెళ్లినట్లు సర్వే వెళ్లడించింది.