సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందర.. తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ ఇస్తూ ఆ పార్టీ ప్రధాన నేతలు పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. కేకే, కడియం కుటుంబాలతో పాటు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఇంకొంతమంది సైతం కాంగ్రెస్‌లో చేరవచ్చనే సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. ఈ తరుణంలో.. పార్టీ మారుతున్న నేతలపై బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కడే ఒంటరిగా బయల్దేరి.. లక్షల మంది సైన్యంతో సాధించారని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించారని తెలిపారు. ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని కేటీఆర్ తన సందేశంలో పేర్కొన్నారు.
శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్
— KTR (@KTRBRS) March 29, 2024
ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్
ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు…
ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం అని కేటీఆర్ పార్టీ మారుతున్న నేతల ప్రభావం బీఆర్‌ఎస్‌పై ఉండబోదంటూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: కారులో కలకలం
Comments
Please login to add a commentAdd a comment