కొత్త ఇంట్లోకి మారుతున్న రష్మిక.. తెగ కష్టపడుతున్నానంటూ పోస్ట్‌ | Rashmika Mandanna Is Shifting To New House | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: కొత్త ఇంట్లోకి మారుతున్న రష్మిక.. గృహప్రవేశం పనుల్లో బిజీ!

Published Thu, Feb 3 2022 2:59 PM | Last Updated on Thu, Feb 3 2022 3:30 PM

Rashmika Mandanna Is Shifting To New House - Sakshi

Rashmika Mandanna Is Shifting To New House: కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. రీసెంట్‌గా తెలుగులో పుష్ప సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సొంతం చేసుకున్న ఈ భామ ఇప్పుడు తమిళం సహా బాలీవుడ్‌లో రెండు సినిమా చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో రష్మిక సామాన్యు ప్యాక్‌ చేసుకోవడానికి తెగ కష్టపడుతున్నట్లు పేర్కొంది. దీంతో ఆమె కొత్త ఇల్లు కొనుక్కుందా అనే చర్చ మొదలైంది.

నిజానికి గతేడాది ఫిబ్రవరిలోనే రష్మిక ముంబైలో ఓ ఇం‍టిని కొనుగోలు చేసింది. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడే ఉండేందుకు ప్లాన్‌ చేస్తుంది.  దీనిలో భాగంగానే రష్మిక కొత్త ఇంట్లోకి మారే ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ ఇంటి గృహప్రవేశం​ జరగనున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement