పుష్ప-2 అభిమానులను అలరించిన రష్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం విక్కీ కౌశల్ సరసన ఛావా చిత్రంతో అలరించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఛావా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఈ మూవీలో మరాఠా రాణి యేసుబాయి భోన్సాలే పాత్రలో నటించే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇలాంటి గొప్ప పాత్ర చేయడం తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ పాత్రతో ఇక తాను సినిమాల నుంచి రిటైర్ అయిపోయినా సంతోషమేనని రష్మిక వెల్లడించింది.
ట్రైలర్ లాంఛ్ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. 'ఇది నాకు గొప్ప గౌరవం. మహారాణి యేసుబాయి పాత్రను పోషించడానికి దక్షిణాది అమ్మాయిగా చాలా సంతోషంగా ఉంది. నా సినీ కెరీర్‌లో అత్యంత విశేషమైన, ప్రత్యేకమైన పాత్ర. అందుకే నేను డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ సార్‌తో ఒక విషయం చెప్పాను. ఈ పాత్ర చేశాక నేను సంతోషంగా రిటైర్ అయిపోతా అని చెప్పా' అని అన్నారు.
తననే ఈ పాత్రకు ఎంపిక చేయడంపై స్పందిస్తూ..' ఈ విషయంలో నేను షాక్ అయ్యా. అసలు లక్ష్మణ్ సర్ నాకు ఇలాంటి పాత్ర ఇవ్వాలని ఎలా డిసైడ్ చేశాడు. నాకు లక్ష్మణ్ సర్ ప్రత్యేక పాత్ర ఇవ్వడంతోనే ఫిదా అయిపోయా. ఇక్కడ నాకు భాషతో పాటు ప్రతిదీ చాలా రిహార్సల్‌గా అనిపించింది. కానీ లక్ష్మణ్ సార్‌కు ఏది అడిగినా చేయడానికి నేను ఉన్నా అన్న ధైర్యమిచ్చా' అని అన్నారు.
గాయంతోనే ఈవెంట్‌కు..
కాగా.. ఇటీవల రష్మిక మందన్నా కాలికి గాయమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో మెరిసింది. కాలు ఎంత ఇబ్బంది పెడుతున్నా కుంటుతూనే ఈవెంట్‌కు హాజరైంది ముద్దుగుమ్మ.
కాగా.. ఛావాలో విక్కీ కౌశల్ హీరోగా నటించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా కనిపించనున్నారు. ఈ చిత్రంలో అశుతోష్ రాణా, దివ్య దత్తా, నీల్ భూపాలం, సంతోష్ జువేకర్, ప్రదీప్ రావత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్ నిర్మించింది. ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment