రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యాలయం తరలింపుపై ఉద్యోగులు ఆందోళనకు గురౌతున్నారు.
విజయవాడ: రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యాలయం తరలింపుపై ఉద్యోగులు ఆందోళనకు గురౌతున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం కోసం తమ కార్యాలయాన్ని తరలించడం అన్యాయమని, దీనికి నిరసిస్తూ ఉద్యోగులు సీనియర్ ఇంజనీర్ కు ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు. తమకు విజయవాడలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా నీటిపారుదల కార్యాలయాన్ని తరలిస్తే ఆందోళన చేస్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.