request letter
-
ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి..
గోపాలపట్నం(విశాఖపట్నం): కాన్వాయ్ వేగంగా దూసుకెళుతున్నప్పటికీ ఆపన్న హస్తం కోసం రోడ్డు పక్కనే ఎదురు చూస్తున్న ఓ కుటుంబం సీఎం జగన్ దృష్టి నుంచి దాటిపోలేదు. విశాఖ షిప్ యార్డులో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసే పొన్నపువ్వు ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందాడు. తమను ఆదుకోవాలని కోరుతూ మృతుడి భార్య నాగమణి బ్యానర్ పట్టుకుని పిల్లలతో కలసి రోడ్డుపై నిలుచుంది. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి ఆమె నుంచి అర్జీ తెప్పించుకున్నారు. దరఖాస్తులో ఫోన్ నంబర్, చిరునామా లేనందున వివరాలు సేకరించాలని గోపాలపట్నం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని జిల్లా అధికారులు ఆదేశించారు. చదవండి: ఖాకీ చొక్కా ధరించి ఆటో నడిపిన సీఎం జగన్ -
సెక్రటరీ ఆఫీస్ ఎదుట వైఎస్ఆర్సీపీ నేతల ధర్నా
-
సెక్రటరీ ఆఫీస్ ఎదుట వైఎస్ఆర్సీపీ నేతల ధర్నా
హైదరాబాద్ : ఏసీ అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను కలవడానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణతో వారు మాట్లాడారు. స్పీకర్ కు వినతిపత్రం ఇవ్వాలని కోరుతు కార్యదర్శి చేతికి అందజేశారు. అసెంబ్లీ లాంజీలో తొలగించిన దివంగత నేత వైఎస్సార్ చిత్ర పటాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని స్పీకర్ ను కోరుతున్నట్లు వైఎస్ఆర్ సీపీ నేతలు వినతిపత్రంలో పేర్కొన్నారు. -
ఇరిగేషన్ కార్యాలయాన్ని తరలిస్తే ఆందోళనే: ఉద్యోగుల హెచ్చరిక
విజయవాడ: రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యాలయం తరలింపుపై ఉద్యోగులు ఆందోళనకు గురౌతున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం కోసం తమ కార్యాలయాన్ని తరలించడం అన్యాయమని, దీనికి నిరసిస్తూ ఉద్యోగులు సీనియర్ ఇంజనీర్ కు ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు. తమకు విజయవాడలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా నీటిపారుదల కార్యాలయాన్ని తరలిస్తే ఆందోళన చేస్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.