హైదరాబాద్ : ఏసీ అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ను కలవడానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణతో వారు మాట్లాడారు. స్పీకర్ కు వినతిపత్రం ఇవ్వాలని కోరుతు కార్యదర్శి చేతికి అందజేశారు. అసెంబ్లీ లాంజీలో తొలగించిన దివంగత నేత వైఎస్సార్ చిత్ర పటాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని స్పీకర్ ను కోరుతున్నట్లు వైఎస్ఆర్ సీపీ నేతలు వినతిపత్రంలో పేర్కొన్నారు.
సెక్రటరీ ఆఫీస్ ఎదుట వైఎస్ఆర్సీపీ నేతల ధర్నా
Published Fri, Jul 31 2015 11:37 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
Advertisement
Advertisement