
గోపాలపట్నం(విశాఖపట్నం): కాన్వాయ్ వేగంగా దూసుకెళుతున్నప్పటికీ ఆపన్న హస్తం కోసం రోడ్డు పక్కనే ఎదురు చూస్తున్న ఓ కుటుంబం సీఎం జగన్ దృష్టి నుంచి దాటిపోలేదు. విశాఖ షిప్ యార్డులో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసే పొన్నపువ్వు ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందాడు. తమను ఆదుకోవాలని కోరుతూ మృతుడి భార్య నాగమణి బ్యానర్ పట్టుకుని పిల్లలతో కలసి రోడ్డుపై నిలుచుంది. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి ఆమె నుంచి అర్జీ తెప్పించుకున్నారు. దరఖాస్తులో ఫోన్ నంబర్, చిరునామా లేనందున వివరాలు సేకరించాలని గోపాలపట్నం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని జిల్లా అధికారులు ఆదేశించారు.
చదవండి: ఖాకీ చొక్కా ధరించి ఆటో నడిపిన సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment