
'వాస్తు పేరుతో ఖజానా ఖాళీ'
హైదరాబాద్: 'ఫాస్ట్ పేరుతో తెలంగాణ విద్యార్థులను అంధకారంలో నెట్టావు..వాస్తు పేరుతో ఖజానా ఖాళీ చేస్తావా' అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విరుచుకుపడ్డారు.
ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ...ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి ని తరలిస్తే సహించమని హెచ్చరించారు. కేసీఆర్ కు మొక్కులు తీర్చడానికే 8 నెలలు పడితే, ప్రజలకు ఇచ్చిన వాగ్థానాలు ఎప్పుడు నెరవేరుస్తారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.