Erragadda chest hospital
-
సెల్ఫీ వీడియో..మృత్యువుతో పోరాడి
-
చెస్ట్ ఆస్పత్రిలో మరో దారుణం
సాక్షి, హైదరాబాద్ : ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో మరో దారుణం చోటుచేసుకుంది. సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని ఆరోపిస్తూ మరో వ్యక్తి కూడా ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే.. డాక్టర్లు పట్టించుకోవడం లేదంటూ మృత్యువుతో 3 గంటల పాటు పోరాడిన రవికుమార్.. చివరకు అత్యంత విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రాణాలు కోల్పోవడానికి ముందు రవికుమార్ తీసిన సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన జరిగి 48 గంటలు గడవకముందే మరో వ్యక్తి కూడా అదే రీతిలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. తనకు వైద్యం చేయడం లేదని సెల్ఫీ వీడియో తీసుకుని సయ్యద్ అనే వ్యక్తి చనిపోయాడు. తీవ్ర అనారోగ్యం ఉన్న తనను పట్టించుకోవడం లేదని సయ్యద్ ఆ వీడియోలో పేర్కొన్నారు. (చదవండి : డాడీ.. ఊపిరాడట్లేదు!) మరోవైపు సయ్యద్ ఉదయం మరణించినప్పటికీ.. ఇప్పటివరకు వరకు అతని మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా, చెస్ట్ ఆస్పత్రిలో కరోనా బాధితులకు అందుతున్న చికిత్సపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
డాడీ.. ఊపిరాడట్లేదు!
జవహర్‌నగర్: ‘డాడీ బై.. బై..! నాకు ఊపిరి ఆడక గుండె ఆగిపోయేలా ఉంది. వెంటిలేటర్ పెట్టమని బతిమిలాడినా డాక్టర్లు పట్టించుకోవడం లేదు..’అంటూ మృత్యువుతో 3 గంటల పాటు పోరాడిన ఓ వ్యక్తి.. చివరకు అత్యంత విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు.. ఓ కరోనా మృతుడి హృదయ విదారక సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీజేఆర్‌నగర్‌లో చోటుచేసుకుంది. జవహర్‌నగర్ కార్పొరేషన్లో నివాసముండే వెంకటేశ్ గౌడ్ కుమారుడు రవికుమార్ (35) తన భార్య ఇద్దరు పిల్లలతో కలసి మల్కాజిగిరి నియోజక వర్గంలోని నేరేడ్మెట్ వినాయక్‌నగర్‌లో నివాసముంటున్నాడు. 6 నెలల క్రితమే దుబాయ్ నుంచి వచ్చాడు. ఈ క్రమంలో లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నాడు. ఈ నెల 22న రవికుమార్‌కు తీవ్ర జ్వరం రావడంతో స్థానిక వైద్యుల సలహా మేరకు నిమ్స్‌కు వెళ్లాడు. అక్కడి వైద్యులు ముందుగా కరోనా టెస్ట్ చేయించాలని చెప్పడంతో సమీపంలోని ఓ ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లో కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అప్పటికే తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతున్న రవికుమార్ ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో ఈ నెల 24న చేరి చికిత్స పొందుతూ 26న ఉదయం మృతి చెందాడు. వైద్యులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని బీజేఆర్‌నగర్‌కు మృతదేహాన్ని తీసుకొచ్చి ఖననం చేయించారు. అంత్యక్రియల్లో దాదాపు 30 మంది పాల్గొన్నట్లు సమాచారం. మరుసటిరోజు మృతుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ రిపోర్ట్ రావడంతో వైద్యులు, పోలీసులు మృతుడి కుటుంబసభ్యులను ఆదివారం క్వారంటైన్ చేశారు. భయం గుప్పిట్లో జవహర్‌నగర్ ప్రజలు మృతదేహం ఖనన అనంతరం అతనికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో జవహర్‌నగర్ ప్రజల్లో భయం మొదలైంది. అసలు అంత్యక్రియల్లో కుటుంబసభ్యులతో పాటు బంధువులు ఇతర వ్యక్తులు ఎందరు పాల్గొన్నారు. వారు ఎవరెవరిని కలిశారు అనే ఆందోళన మొదలైంది. దీంతో అధికారులు అప్రమత్తమై అంత్యక్రియల్లో పాల్గొన్న వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. కరోనా వల్లే మృతి..: ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంగళరావునగర్: కరోనా పాజిటివ్ అవడం వల్ల గుండెకు ముప్పు వాటిల్లి తద్వారా యువకుడు మృతి చెందాడని ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ చెప్పారు. వెంటిలేటర్‌ను బలవంతంగా తొలగించామనేది వాస్తవం కాదని, అతనిని కాపాడటానికి శతవిధాలా తమ సిబ్బంది ప్రయత్నించారన్నారు. కరోనా గుండెకు చేరి తద్వారా ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారి మృతి చెందాడని తెలిపారు. -
తుది నివేదిక రాకముందే పాజిటివ్ రోగి డిశ్చార్జ్
వెంగళరావునగర్: కరోనా వ్యాధి లక్షణాలు కలిగిన రోగికి పరీక్షలు చేసి తుది నివేదిక రాకముందే డిశ్చార్జ్ చేసిన సంఘటన ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి లో కరోనా వ్యాధిగ్రస్తులను ప్రత్యేక ఐసోలేషన్ వార్డులోనే ఉంచి పరీక్షలు చేస్తున్నారు.ఇందులో భాగంగా నెగెటివ్ వచ్చిన వారిని ఎప్పటికప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం కొత్తగూడెం డీఎస్పీ షేక్ ఆలీని డిశ్చార్జ్ చేశారు. వాస్తవానికి ఆయన శాంపిల్స్ రెండు గాంధీ ఆసుపత్రికి పంపారు.వాటిలో ఒకటి నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. దీని ఆధారంగా ఆయనను తొలుత డిశ్చార్జ్ చేశారు. అయితే గురువారం రాత్రి ఆలస్యంగా రెండో శాంపి ల్ రిజల్ట్ వచ్చింది. అందులో పాజిటివ్ అ ని తేల్చారు. దీనిని చూసిన ఆసుపత్రి సి బ్బంది అవాక్కై వెంటనే ఆయన కోసంగా లించారు.అప్పటికే ఆయన కొత్తగూడెంలో ని తన నివాస గృహానికి చేరుకున్నట్టు తెలుసుకున్నారు. ఛాతీ ఆసుపత్రి వైద్య బృందం కొత్తగూడెం వెళ్లి ఆయనను తిరిగి నగరానికి తీసుకుని వచ్చి చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘట నపై ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ ను వివరణ కోరగా... డీఎస్పీ ఎస్ఎం ఆలీ కి తొలి శాంపిల్ నెగెటివ్ వస్తేనే డిశ్చార్జ్ చేశామన్నారు. రెండో శాంపిల్ కొద్దిగా పాజిటివ్ వచ్చినట్టు కనిపించడంతో ముందు జాగ్ర త్త చర్యల్లో భాగంగా తాము ఆయనను తిరిగి ఆసుపత్రికి పిలిపించామని, ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్టు చెప్పారు. -
టీబీ @ టీనేజ్
సాక్షి, హైదరాబాద్ : టీనేజ్ యువతపై టీబీ పంజా విసురుతోంది. రాష్ట్రంలో ట్యూబరిక్లోసిస్(టీబీ) చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న హెచ్ఐవీ బాధితులు, చిన్నారుల్లోనే కాదు, టీనేజీ అమ్మాయిల్లోనూ ఇది వెలుగుచూస్తోంది. జనసమూహం ఎక్కువగా ఉన్న హాస్టళ్లలో ఉండటం, సరైన వ్యాయామం లేకపోవడం, పోటీ పరీక్షల పేరుతో పెరుగుతున్న ఒత్తిడికి తోడు ఆశించినస్థాయిలో పౌష్టికాహారం అందకపోవడంతో రోగ నిరోధకశక్తి తగ్గుతోంది. మరి కొంతమంది ఉదయం పూట ఏమీ తినకుండానే ఖాళీ కడుపుతో కాలేజీకి బయలుదేరి, మధ్యాహ్నం క్యాంటీన్లో రెడీమేడ్ ఫుడ్‌తో కడుపు నింపుకోవడం ద్వారా పౌష్టికాహారలోపం ఏర్పడుతోంది. దీంతో చాలామంది టీబీ బారిన పడుతున్నారు. బంధువర్గాల్లో తెలిస్తే వివాహ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భావించి, గుట్టుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయిస్తున్నారు. రోగుల వివరాల నమోదుకు ప్రైవేటు ఆసుపత్రులు సహకరించడంలేదు. క్షయవ్యాధి బారిన పడ్డవారు ఒకట్రెండు నెలలపాటు మందులు వాడి ఆ తరవాత వైద్యఖర్చులకు భయపడి మందులు వాడ కుండా మానేస్తున్నారు. వ్యాధి మరింత ముదిరిపోయి, ఇతరులకు సులభంగా వ్యాపిస్తోంది. నగరంలోని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రికి ఇటీవల ఈ తరహా కేసులు ఎక్కువగా వస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్లో విస్తరిస్తున్న వైనం నగరాన్ని ఓవైపు స్వైన్‌ఫ్లూ, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వణికిస్తుండగా ఇప్పుడు ఆ స్థానాన్ని ట్యూబరిక్లోసిస్(టీబీ) ఆక్రమించింది. టీబీ సంబంధ సమస్యతో బాధపడుతూ ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రికి చేరుకుంటున్న రోగులసంఖ్య గత మూడేళ్లతో పోలిస్తే మూడింతలు పెరిగింది. 2015లో ఆస్పత్రికి చికిత్స కోసం 80 వేలమంది రాగా, 2018లో 1.72 లక్షల మంది చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. వీరిలో 20 శాతానికి మించి టీనేజీ యువత ఉన్నారు. దేశంలో ఏటా మూడు లక్షల మంది ప్రజలు టీబీతో చనిపోతున్నారు. ప్రతిరోగి తను చనిపోయే ముందు మరో 15 మందికి వ్యాపింపజేస్తున్నాడు. టీబీ సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరియా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకసారి బయటికి వచ్చిన బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది. గోర్లు, వెంట్రుకలకు మినహా శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ సోకుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లక్షణాలు గుర్తించవచ్చు ఇలా.. సాయంత్రం, రాత్రిపూట తరచూ జ్వరం రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం. ఆకలి, బరువు తగ్గడం, నీరసంగా, ఆయాసం, ఛాతీలో నొప్పి ఉంటుంది. తెమడ పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. ఆరు నుంచి తొమ్మిది మాసాలపాటు మందులు వాడాలి. బహిరంగ ప్రదేశాల్లో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతి రుమాలు వాడాలి. బలవర్థకమైన ప్రొటీన్ల(గుడ్లు, పప్పు, పాలు)తో కూడిన ఆహారం తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక స్పృహ కలిగి ఉండాలి. పౌష్టికాహారం, వ్యాయామం అవసరం సాధారణంగా ప్రతి మనిషిలోనూ టీబీ లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో త్వరగా బయటపడుతుంటాయి. అబ్బాయిలతో పోలిస్తే టీనేజీ అమ్మాయిల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపర్చుకోవడం, వ్యామాయం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగు పర్చుకుని వ్యాధిభారినపడకుండా చూసుకోవచ్చు. - డాక్టర్ రఫీ, ఫల్మొనాలజిస్ట్, కేర్ హాస్పిటల్ -
జనరల్ ఆసుపత్రిగా ఛాతీ వైద్యశాల
- ఉస్మానియా నుంచి నాలుగు యూనిట్లు తరలించాలని నిర్ణయం - ఒకటి, రెండు నెలల్లో సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: ఎర్రగడ్డలోని ఛాతీ వైద్యశాలను జనరల్ ఆసుపత్రిగా తీర్చి దిద్దాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. తద్వారా కూకట్పల్లి, సనత్‌నగర్ తదితర ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావి స్తోంది. అందుకోసం ఉస్మానియా ఆసుపత్రి నుంచి రెండు మెడికల్, రెండు సర్జికల్ యూనిట్లను ఛాతీ ఆసుపత్రికి తరలించను న్నారు. ఒకట్రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆమోదించారు. ప్రస్తుతం ఛాతీ ఆసుపత్రిలో 670 పడకలున్నాయి. అయితే టీబీ వ్యాధి రోగులు అంతగా లేకపోవడంతో అందులో నిత్యం 300 పడకల వరకు ఖాళీగానే ఉంటున్నాయి. దీంతో పడకలను ఖాళీగా ఉంచకుండా జనరల్ వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఇది అందుబాటులోకి వస్తే ఛాతీ ఆసుపత్రిలో అన్ని రకాల సాధారణ వైద్య సేవలు కూడా పేదలకు అందుతాయి. టీబీకి ప్రత్యేకం.. 1920లో టీబీ వ్యాధి విజృంభించినప్పుడు చికిత్స కోసం హైదరాబాద్ వాసులు వికారాబాద్ సమీపంలోని అనంతగిరి టీబీ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. అంతదూరం వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమత లేక చాలా మంది మృత్యువాతపడేవారు. దీన్ని గమనించిన ఏడో నిజాం 1937లో ఇర్రం నుమా ప్యాలెస్‌ను స్వాధీనం చేసుకుని, అందులో ఛాతీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. సుమారు 150 ఏళ్ల క్రితం నిర్మిం చిన ఈ భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలా వస్థకు చేరుకుంది. ఇప్పటికే భవనం పైకప్పు పెచ్చులూడిపడుతోంది. గోడలు బీటలు వారి కూలేందుకు సిద్ధంగా ఉన్నా యి. అయితే ఎలాగోలా వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా కూకట్పల్లి, సనత్ నగర్ తదితర ప్రాంతాల నుంచి రోగులు ప్రస్తుతం గాంధీ లేదా ఉస్మానియా ఆసు పత్రులకు వైద్యం కోసం వెళుతున్నారు. ఇక రానున్న రోజుల్లో సమీపంలోని ఛాతీ ఆసుపత్రిలోనే ఇతర వైద్య సేవలు పొందొచ్చని అధికారులు చెబుతున్నారు. -
ప్రాణం ఖరీదు రూ.50 !
-
రూ. 150 లంచం ఇవ్వలేక భర్త ప్రాణాలను..
-
అది ప్రభుత్వ హత్యే: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో లంచం ఇవ్వనందుకు వైద్యమందక కృష్ణానాయక్ మృతి చెందాడని, ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణానాయక్ కుటుంబాన్ని రేవంత్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కృష్ణానాయక్‌ను లంచం కోసం పొట్టనబెట్టుకున్న ప్రభుత్వాస్పత్రి సిబ్బంది తీరు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పనితీరుకు నిదర్శనమని అన్నారు. కేవలం 150 రూపాయల కోసం నిండుప్రాణాన్ని బలితీసుకునే స్థాయిలో అవినీతి రాజ్యమేలుతుంటే తెలంగాణలో అవినీతి రహితపాలన సాగుతున్నదని ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రాణం ఖరీదు రూ. 150! ప్రభుత్వాస్పత్రుల్లో అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యం పెరిగిపోయాయని ఎన్నిసార్లు చెప్పినా, పలు సంఘట నలు జరిగినా సీఎంకు, వైద్య ఆరోగ్యశాఖమంత్రి సి.లక్ష్మారెడ్డికి చీమకుట్టినట్టు కూడా లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఒక గిరిజనుడు బలైపోతే అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయనే కనీస భయం కూడా ముఖ్యమంత్రికి, మంత్రికి లేదని, ఇలాంటి ఘటనలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయంతోనే శాసనసభ నుంచి తనను అన్యాయంగా సస్పెండ్ చేసిందన్నారు. మృతుడి కుటుంబానికి రూ. 10 లక్షల పరి హారం ఇవ్వాలని, నలుగురు పిల్లల బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పట్టించుకోకుంటే గిరిజనులను అవమానించినట్టేనన్నారు. మృతుడు కృష్ణానాయక్ కుటుంబానికి రూ. 50వేల ఆర్థికసాయాన్ని రేవంత్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డున పడ్డ కృష్ణ కుటుంబం
హైదరాబాద్: ఊర్లో ఇల్లు లేదు.. భూమి లేదు.. మృతదేహాన్ని తమ గూడేనికి తరలించేందుకు చేతిలో పైసా లేదు.. దహన సంస్కారాలకు దిక్కులేదు.. ఇదీ రూ. 150 లంచం ఇవ్వలేక నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో భర్త ప్రాణాలను పోగొట్టకున్న కృష్ణనాయక్ భార్య కవిత దీనస్థితి. భర్త మృతి చెందడంతో కవిత దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. స్వగ్రామానికి వెళ్లలేక నలు గురు చిన్నారులతో హైదరాబాద్‌లోని తట్టి అన్నారం అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని చెట్ల కిందనే భర్త అంత్యక్రియలను జరిపించింది. ప్రాణం ఖరీదు రూ. 150! మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం రాయారానికి చెందిన కృష్ణనాయక్ కూలీగా పనిచేస్తూ భార్య, పిల్లలతో కలసి అల్వాల్ శివనగర్‌లో ఉంటున్నాడు. మొదటి భార్య చనిపోయింది. ఆమెకిద్దరు ఆడపిల్లలు. రెండో భార్య కవితకు ఒక బాబు, ఒక పాప. కృష్ణనాయక్ చనిపోవడంతో నలుగురు చిన్నపిల్లల భారం కవితపై పడింది. ఏడాది కూడా నిండని చంటిపిల్లని విడిచి పనికి వెళ్లే పరిస్థితి లేదు. అలా అని పనిచేయకుంటే గడిచే స్థితి కనిపించడం లేదు. భర్త ప్రాణం పోయేందుకు కారణమైన ఆసుపత్రి సిబ్బంది కనికరించడం లేదు. ఈ స్థితిలో ఉన్న కవిత కుటుంబాన్ని ఎవరైనా ఆదుకుని సహాయాన్ని అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
హెచ్ఆర్సీలో టీ.వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు
హైదరాబాద్ : ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో దారుణంపై తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహిరించి రోగి మృతికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరింది. స్పందించిన హెచ్ఆర్సీ ఈ ఘటనపై వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో వచ్చే నెల 6వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. (ప్రాణం ఖరీదు రూ. 150!) వివరాల్లోకి వెళితే... మహబూబ్ నగర్ జిల్లా లింగాల మండలం రాయారంకు చెందిన వడ్త్యా కృష్ణ నాయక్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి అందక కొట్టుమిట్టాడుతున్న అతనికి వెంటనే ఆక్సిజన్ పెట్టాలంటూ కృష్ణ భార్య డ్యూటీలోని సిబ్బందిని కోరింది. అయితే అందుకు రూ.150 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బు లేదని, ఆక్సిజన్ పెట్టాలని ఆమె కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. దీంతో అతడు కొద్దిసేపటికే మృతి చెందాడు. ఈ దుర్ఘటనను వైఎస్ఆర్ సీపీ ...హెచ్ఆర్సీ దృష్టికి తీసుకువెళ్లింది. -
కృష్ణా నాయక్ కుటుంబానికి రేవంత్ పరామర్శ
హైదరాబాద్: ఎర్రగడ్డ ఛాతీ హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక ప్రాణాలొదిలిన కృష్ణ నాయక్ కుటుంబ సభ్యులను టీటీడీపీ నాయకులు పరామర్శించారు. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలానికి చెందిన కృష్ణ నాయక్ కు ఆక్సిజన్ అవసరమైంది. అయితే సిలిండర్ పెట్టడానికి హాస్పిటల్ సిబ్బంది రూ.150 లంచం డిమాండ్ చేశారు. ఆ డబ్బు ఇచ్చుకోలేనని కృష్ణ నాయక్ మొర పెట్టుకున్న సిబ్బంది కరుణించలేదు. దీంతో కృష్ణ నాయక్ మంగళవారం ప్రాణాలొదిలిన సంగతి తెలిసిందే. బుధవారం నాగోల్‌లోని బండ్లగూడలో నివాసముంటన్న కృష్ణా నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వారికి ఆర్థిక సాయం అందించారు. -
ప్రాణం ఖరీదు రూ. 150!
- ఆక్సిజన్ కోసం లంచమడిగిన అటెండర్ - పైసల్లేక పోవడంతో ఆగిన ఊపిరి - ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో దారుణం హైదరాబాద్ సోమవారం అర్ధరాత్రి.. ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి.. తీవ్రమైన ఆస్తమాతో అక్కడ చికిత్సపొందుతున్న కృష్ణనాయక్ అస్వస్థతకు గురయ్యాడు.. ఊపిరి అందక కొట్టుమిట్టాడుతున్నాడు.. అది గమనించిన అతని భార్య డ్యూటీలోని సిబ్బంది వద్దకు వెళ్లింది.. వెంటనే ఆక్సిజన్ పెట్టాలన్న సిబ్బంది అందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. తన దగ్గర డబ్బు లేదని, ఆక్సిజన్ పెట్టాలని ఆమె కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. దీంతో కొద్దిసేపటికే కృష్ణ మృతి చెందాడు. ప్రాణాలు నిలబెట్టాల్సిన ప్రభుత్వాస్పత్రుల సిబ్బంది లంచాల దురాశతో ప్రాణాలు తోడేసిన వైనమిది. దీనిపై పలువురు రోగులు, వారి బంధువులు మంగళవారం ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగడంతో.. ఇద్దరు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. ఆస్పత్రిలోకి వచ్చినప్పటి నుంచీ.. మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం రాయారం గ్రామానికి చెందిన వడ్త్యా కృష్ణనాయక్‌కు భార్య కవిత, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తీవ్ర ఆస్తమాతో బాధపడుతున్న కృష్ణను కవిత సోమవారం ఉదయం ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగం వద్దకు కూడా వెళ్లలేని స్థితిలో కృష్ణ ఉండటంతో కవిత వెళ్లి స్లిప్ (చీటీ) రాయాలని కోరింది. కానీ రోగిని తీసుకొస్తే తప్ప ఓపీ చీటీ ఇవ్వబోమనడంతో.. అతికష్టంగా ఓపీ కౌంటర్ వద్దకు తీసుకెళ్లింది. కృష్ణను పరీక్షించిన వైద్యులు ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నారు. ఊపిరి సరిగా తీసుకోలేకపోతుండటంతో ఆక్సిజన్ పెట్టారు. రాత్రి విధులకు వచ్చిన నళిని అనే వైద్యురాలు కూడా కృష్ణనాయక్‌ను పరీక్షించి.. ఆక్సిజన్ అందుతూనే ఉండేలా చూడాలని డ్యూటీ నర్స్ రీటాకు, అటెండర్లకు సూచించారు. కానీ కొద్దిసేపటి తర్వాత అంతా బాగానే ఉందంటూ నర్సు, అటెండర్ ఆక్సిజన్ సరఫరాను తీసేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఊపిరి అందక కృష్ణనాయక్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఇది చూసిన కవిత పరిగెత్తుకుంటూ నర్సు రీటా వద్దకు వెళ్లి చెప్పింది. కానీ ఆమె రాలేదు. మళ్లీ వెళ్లి అడగడంతో పదే పదే రావద్దంటూ బెదిరించి, వెళ్లగొట్టింది. కాళ్లావేళ్లా పడినా.. నర్సు రాకపోవడంతో ఆందోళనగా ఉన్న కవిత వద్దకు అటెండర్ నయీమ్ వచ్చాడు. డబ్బులు ఇస్తే ఆక్సిజన్ అందజేస్తానని చెప్పాడు. ఆలస్యమైతే కృష్ణ చనిపోతాడనీ బెదిరించాడు. తన వద్ద డబ్బులు లేవంటూ కన్నీరు మున్నీరైన కవిత.. తన భర్తను కాపాడాలని వేడుకుంది. అయినా నర్సుగానీ, అటెండర్‌గానీ స్పందించలేదు. తన భర్త పరిస్థితిని చూసి ఆందోళనకు గురైన కవిత మరోసారి వెళ్లి కాళ్లావేళ్లా పడింది. అయినా వారు కవితను తిట్టి పంపించేశారు. దీం ఏడుస్తూ ఆమె బెడ్ వద్దకు వచ్చే సరికి కృష్ణనాయక్ ప్రాణాలు విడిచాడు. ఆందోళన చేయడంతో.. భర్త మరణించడాన్ని చూసిన కవిత పెద్ద పెట్టున రోదించింది. ఇదంతా గమనిస్తున్న పక్క బెడ్ల మీద ఉన్న రోగులు, వారి బంధువులు నర్సును, అటెండర్‌ను నిలదీశారు. డబ్బులు ఇవ్వలేదనే కారణంతో కృష్ణకు ఆక్సిజన్ అందించలేదని, నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారంటూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆందోళనకు దిగారు. దీంతో నర్సు, అటెండర్ నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. చివరికి డ్యూటీ డాక్టర్, ఇతర సిబ్బంది వచ్చి ఉదయం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో రోగులు, బంధువులు వెనక్కి తగ్గారు. మంగళవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మృతుడి బంధువులు ఛాతీ ఆస్పత్రి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. కృష్ణ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూపరింటెండెంట్ నిర్లక్ష్యం కూడా.. ఆక్సిజన్ అందించక కృష్ణ మృతిచెందిన విషయం తెలిసినా ఆస్పత్రి సూపరింటెండెంట్ మంగళవారం ఉదయం వరకు అక్కడికి రాలేదు. పైగా ఆస్పత్రిలో రోగులు ఆందోళన చేస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో పోలీసులు ఆస్పత్రికి వచ్చి ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బంధువులు కృష్ణ మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు. ఇద్దరు ఉద్యోగులపై వేటు కృష్ణనాయక్ భార్యను లంచం డిమాండ్ చేసిన నయీమ్ అనే అటెండర్‌ను, ఔట్‌పేషెంట్ బ్లాక్ వద్ద దురుసుగా ప్రవర్తించిన ధన్‌రాజ్ అనే మరో ఉద్యోగిని సస్పెండ్ చేస్తున్నట్టు ఆర్ఎంవో డాక్టర్ నరేందర్ తెలిపారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సు రీటాపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామన్నారు. -
‘హెరిటేజ్’పై తేల్చేదాకా దాని జోలికెళ్లొద్దు
ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి భవనంపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తలపెట్టిన ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రస్తుతమున్న భవనాన్ని వారసత్వ సంపద (హెరిటేజ్) జాబితాలో చేర్చాలా? వద్దా? అనే విషయాన్ని తేల్చే దాకా ఆ భవనం జోలికి వెళ్లొద్దని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై వీలైనంత త్వరగా కమిటీని ఏర్పాటు చేయాలని, ఆరు వారాల్లో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రగడ్డలోని ఛాతీ, టీబీ ఆసుపత్రుల ప్రాంగణంలో చారిత్రక భవనం ఉందని, అందువల్ల కొత్త సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు బి.మద్దిలేటి, తెలంగాణ నవ నిర్మాణ సేన అధ్యక్షుడు కె.వెంకటయ్య హైకోర్టులో పిల్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ హెచ్ఎండీఏ రూపొందిం చిన నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికను తయారు చేసిన కమిటీ (హెరిటేజ్ సర్వీస్ కమిటీ) పాతదని, ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న భవనాన్ని వారసత్వ సంపద జాబితాలో చేర్చాలా? వద్దా? అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ కమిటీ స్థానంలో కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ కమిటీ నిర్ణయం తీసుకునేంత వరకు ఆ భవనం జోలికి వెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదని పేర్కొంటూ దీన్ని పరిష్కరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆస్పత్రి తరలింపుపై జోక్యం చేసుకోలేం
-
ఆస్పత్రి తరలింపుపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు
హైదరాబాద్: ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ, టీబీ ఆస్పత్రి తరలింపు జోక్యం చేసుకోబోమని హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఆస్పత్రి తరలింపు చట్టవ్యతిరేకం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన కోర్టు ఆస్పత్రి తరలింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడుకోవాలని పిటిషనర్లకు సూచించింది. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు యిచ్చుకోవచ్చని తెలిపింది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ, టీబీ ఆస్పత్రిని రంగారెడ్డి జిల్లా అనంతగిరికి తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో బుధవారం రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆస్పత్రిని తరలించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని, 2008లో నిర్ణయించిన విధంగా ఎర్రగడ్డలో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన బక్కా జెడ్సన్ వేర్వేరుగా ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారు. -
'చెస్ట్ ఆస్పత్రిని తరలించ వద్దంటూ హైకోర్టులో పిల్'
-
'చెస్ట్ ఆస్పత్రిని తరలించ వద్దంటూ హైకోర్టులో పిల్'
హైదరాబాద్: ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించొద్దంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) వేశానని తెలంగాణ బీజేపీ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి అన్నారు. చెస్ట్ ఆస్పత్రిని తరలించడం పేద రోగులకు ఇబ్బంది కలిగించడమేనని ఆయన అన్నారు. బుధవారం నాగం విలేకరులతో మాట్లాడారు. చెస్ట్ ఆస్పత్రిని తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలో మెడికల్, కాలేజీ, వెటర్నరీ ఆస్పత్రిని నిర్మించాలని వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్ణయించారని గుర్తుచేశారు. అయితే వైఎస్ఆర్ మరణాంతరం అది సాధ్యం కాలేదని నాగం తెలిపారు. -
చాతీ ఆసుపత్రిని తరలించొద్దు: తెలంగాణ వైఎస్సార్సీపీ
సాక్షి, హైదరాబాద్: పేద ప్రజలకు అందుబాటులో ఉన్న చాతీ ఆసుపత్రిని హైదరాబాద్ నుంచి మారుమూల ప్రాంతానికి తరలించొద్దని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ డిమాండ్ చేసింది. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఆసుపత్రి అన్నివర్గాలకు, పేదలకు అందుబాటులో ఉందని ఈ సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ఆసుపత్రి తరలింపును అడ్డుకోనున్నట్టుగా ప్రకటించారు. చాతీ ఆసుపత్రిని పార్టీ బృందం సోమవారం సందర్శించనున్నట్టుగా పార్టీ ప్రధానకార్యదర్శి శివకుమార్ వెల్లడించారు. ఈ బృందంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయకులు ఉంటారని చెప్పారు. చాతీ ఆసుపత్రిని తరలించొద్దని, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న మౌళిక వసతులను ఉపయోగించుకుని అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిపై పోరాటాలు వంటివాటిపై చర్చించడానికి పార్టీ గ్రేటర్ కమిటీ సమావేశం కూడా అవుతున్నట్టుగా చెప్పారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు, గ్రేటర్, రాష్ట్ర నాయకులు ఈ సమావేశానికి హాజరవుతారని శివకుమార్ వివరించారు. రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ ప్రధానకార్యదర్శులు శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, గున్నం నాగిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు బి.రవీందర్, అధికారప్రతినిధి సత్యం శ్రీరంగం, మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ముస్తఫా, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు ప్రపుల్లా రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.జయరాజ్, కార్యదర్శులు అమృతా సాగర్, మహీపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేశ్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, కార్యక్రమాల సమన్వయకర్త సిద్ధార్థ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'వాస్తు పేరుతో ఖజానా ఖాళీ'
హైదరాబాద్: 'ఫాస్ట్ పేరుతో తెలంగాణ విద్యార్థులను అంధకారంలో నెట్టావు..వాస్తు పేరుతో ఖజానా ఖాళీ చేస్తావా' అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విరుచుకుపడ్డారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ...ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి ని తరలిస్తే సహించమని హెచ్చరించారు. కేసీఆర్ కు మొక్కులు తీర్చడానికే 8 నెలలు పడితే, ప్రజలకు ఇచ్చిన వాగ్థానాలు ఎప్పుడు నెరవేరుస్తారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. -
రోగుల ఉసురు తాకుద్ది: పొన్నాల
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వృద్ధులు, వితంతు వుల ఉసురే కాదు, టీబీ రోగుల ఉసురూ పోసుకుంటున్నా డని టీ పీసీపీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిని తరలించాలన్న జీవోను ఉపసంహరించుకోవాలని, లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. పొన్నాలతో పాటు మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి తదితరులు గురువారం ఛాతీ ఆస్పత్రిని సందర్శించారు. ఆసుపత్రిని తరలించొద్దు: సీపీఎం ఛాతీ ఆసుపత్రిని తరలించాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని గురువారం సీపీఎం డిమాండ్ చేసింది. అందుబాటులో ఉన్న ఆసుపత్రిని వికారాబాద్‌కు తరలించడంరోగులకు ఇబ్బంది కలిగిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మరోవైపు ఆస్పత్రి తరలింపు ఉత్తర్వులను నిలిపేయాలని కోరుతూ సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సీఎంకు లేఖ రాశారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆరు బీసీ సంఘాలు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశాయి. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ ఆస్పత్రి తరలింపు వెనుక ప్రభుత్వ కుట్రలున్నాయని, ఇక్కడున్న వేల కోట్ల విలువైన భూమిని దొడ్డిదారిన విక్రయించి అక్రమాలకు పాల్పడాలని చూస్తోందని ఆర్.కృష్ణయ్య (జాతీయ బీసీ సంక్షేమ సంఘం), జాజుల శ్రీనివాస్‌గౌడ్ (రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం), జి.మల్లేష్‌యాదవ్(బీసీ ఫ్రంట్), ప్రొఫెసర్ కె.నటరాజ్ (బీసీ కులాల ఐక్యవేదిక), దుర్గయ్యగౌడ్ (బీసీ సమాఖ్య), కె.శ్రీనివాస్(బీసీ విద్యార్థి సంఘం) ఆరోపించారు. -
ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రీ వికారాబాద్‌కే!
తరలించాలని ప్రభుత్వ నిర్ణయం? 42 ఎకరాల్లోని ఆసుపత్రి స్థలంలో ఐఏఎస్ అధికారుల గృహ సముదాయం పరిశీలనలో ఔషధ నియంత్రణ మండలి స్థలం కూడా వాస్తు దోషం వల్ల ఎర్రగడ్డ రైతు బజార్ స్థలం సేకరణకు విముఖత సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రిని వికారాబాద్ చేరువలోని అనంతగిరికి తరలించాలని ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై చెలరేగిన దుమారం ఇంకా కొనసాగుతుండగానే సర్కారు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఛాతీ వ్యాధుల ఆసుపత్రిని ఆనుకునే ఉన్న ప్రభుత్వ మానసిక చికిత్సాలయాన్ని (మెంటల్ హాస్పిటల్) కూడా అనంతగిరిలోనే ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అక్కడ స్థల సేకరణ అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడనుంది. ఛాతీ వ్యాధుల ఆసుపత్రి తరలింపుతో ఏర్పడే ఖాళీస్థలంలో సచివాలయాన్ని నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం అక్కడే ప్రభుత్వ పాలనా కార్యాలయాలతోపాటు ఉన్నతాధికారుల నివాసాలు కూడా ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఛాతీ వ్యాధుల ఆసుపత్రి స్థలంలో సచివాలయం నిర్మిస్తే అధికారుల నివాస గృహసముదాయానికి స్థలం కావాలి కాబట్టి మానసిక చికిత్సాలయం తరలింపుతో ఆ స్థలాన్ని సిద్ధం చేయాలనేది సీఎం కేసీఆర్ నిర్ణయంగా తెలుస్తోంది. స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి... ఎర్రగడ్డలో ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర కార్యాలయాల సముదాయాలు అన్నీ పక్కపక్కనే ఉన్నాయి. అక్కడ దాదాపు 150 ఎకరాల వరకు స్థలం ఉన్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతకాలంగా ఆ స్థలాన్ని ఇతరత్రా ప్రజోపయోగ నిర్మాణాలకు వినియోగించే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారం క్రితం రోడ్లు భవనాలశాఖకు చెందిన కొందరు అధికారులతో కలసి ఆయన ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. వెంగళరావు నగర్ వెళ్లే రోడ్డులోని ఔషధ నియంత్రణ మండలి డీజీ కార్యాలయం నుంచి ఆయన పరిశీలిన మొదలైంది. ఆ ప్రాంగణం కూడా విశాలమైందే. దానిని ఆనుకుని కేంద్రప్రభుత్వ రంగ సంస్థ కార్యాలయం ఒకటి ఉంది. ఆ తర్వాత ఛాతీ వ్యాధుల ఆసుపత్రి, దాని పక్కన మానసిక చికిత్సాలయం, ఆ తర్వాత ఎర్రగడ్డ రైతు బజార్ ఉంది. వీటన్నింటిని ఆయన వరుసగా పరిశీలించారు. ఇందులో రైతుబజార్ వద్ద ఓ అక్రమ నిర్మాణం వల్ల వాస్తు దోషం ఉందని గుర్తించి దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. అది పోను తొలుత ఛాతీ ఆసుపత్రి, మానసిక చికిత్సాలయం స్థలాలను సేకరించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ రెండూ కలిపితే 102 ఎకరాల స్థలం ఉందని అధికారులు తేల్చారు. అనంతగిరిలో టీబీ (క్షయ) శానిటోరియం సిద్ధంగా ఉన్నందున ఆ ప్రాంగణానికి మర మ్మతులు చేస్తే వెంటనే టీబీ ఆసుపత్రిని తరలించేందుకు అవకాశం ఉండటంతో తొలుత దాన్ని తరలించాలని ఆదేశించారు. ఆ తర్వాత 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మానసిక చికిత్సాలయాన్ని తరలించాలని ఆదేశించినట్టు తెలిసింది. ప్రస్తుతం మెంటల్ హాస్పిటల్ ఏర్పాటుకు అనంతగిరిలో ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీని తరలింపుతో అందుబాటులోకి వచ్చే 42 ఎకరాలను ఐఏఎస్ అధికారుల నివాస సముదాయానికి వాడాలని సీఎం భావిస్తున్నారు. వెంగళరావు నగర్ దారిలోని ఔషధ నియంత్రణ మండలి కార్యాలయాన్ని తరలించటం ద్వారా ఆ స్థలాన్ని కూడా ఈ ప్రణాళికలో చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో వీటిపై చర్చించనున్నట్టు తెలిసింది. ఇప్పటికిప్పుడు 102 ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులోకి వస్తున్నందున అందులో ప్రభుత్వ పరిపాలన భవనం, అధికారుల నివాస గృహాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. -
ఆస్పత్రి తరలింపుపై రాజకీయాలొద్దు
ఛాతీ ఆస్పత్రి పరిరక్షణ కమిటీ వెంగళరావునగర్: ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి తరలించే విషయంలో ప్రాంతీయ విభేదాలు తీసుకురావద్దని, ఇది సరైన పద్ధతి కాదని చెస్ట్ హాస్పిటల్ పరిరక్షణ కమిటీ (జేఏసీ) చైర్మన్ డాక్టర్ ప్రమోద్‌కుమార్ చెప్పారు. గురువారం వైద్యులు, వైద్యేతర సిబ్బంది ఆస్పత్రిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ ఛాతీ ఆస్పత్రితో ఇతర ఆస్పత్రులకు సంబంధం లేదని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయంగాని, ప్రాంతీయతత్వంగాని కొత్తగా సృష్టిం చవద్దన్నారు. ఇక్కడ నుంచి ఆస్పత్రిని తరలిస్తే వైద్యుల కంటే ఎక్కువగా రోగులే ఇబ్బంది పడతారని చెప్పారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులతో పాటు కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వైద్యులు ఈ విషయంలో అనవసర జోక్యం చేసుకుని ఇది తమకు అంగీకారమేనని చెప్పడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో ఎలాంటి ప్రాంతీయ విభేదాలు లేవని, ఇక్కడ అందరం కలిసి కట్టుగా అన్నదమ్ముల్లా రోగులకు వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. దీన్ని తరలించవద్దని అందరం ముక్తకంఠంతో చెబుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ఉమర్ఖాన్, సతీష్, వీరమణి, అనిల, బ్లాండినా, అరుణ జ్యోతి, లక్ష్మీనారాయణ, శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు. -
చెస్ట్ ఆసుపత్రి తరలింపుపై ఉద్యోగులు ధర్నా
-
వంద అంతస్థుల్లో తెలంగాణ సచివాలయం!
హైదరాబాద్: సచివాలయాన్ని ఎర్రగడ్డకు మర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఛాతీ ఆస్పత్రి ఉన్న ప్రాంగణంలో సచివాలయం ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ సర్కారు యోచిస్తోంది. నిజాం హయాంలో నిర్మించిన చెస్ట్ ఆస్పత్రి 62 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించివుంది. 75 ఏళ్లుగా రోగులకు సేవలు అందిస్తోంది. ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్ కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇక సచివాలయం భవనాన్ని వంద అంతస్థుల్లో నిర్మించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చెస్ట్ ఆస్పత్రి తరలించాలన్న ప్రతిపాదనపై వైద్యులు, సిబ్బంది నిరసిస్తున్నారు. ఆస్పత్రిని ఎర్రగడ్డ నుంచి తరలించొద్దని కోరుతున్నారు.