
సాక్షి, హైదరాబాద్ : ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో మరో దారుణం చోటుచేసుకుంది. సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని ఆరోపిస్తూ మరో వ్యక్తి కూడా ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే.. డాక్టర్లు పట్టించుకోవడం లేదంటూ మృత్యువుతో 3 గంటల పాటు పోరాడిన రవికుమార్.. చివరకు అత్యంత విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రాణాలు కోల్పోవడానికి ముందు రవికుమార్ తీసిన సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన జరిగి 48 గంటలు గడవకముందే మరో వ్యక్తి కూడా అదే రీతిలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. తనకు వైద్యం చేయడం లేదని సెల్ఫీ వీడియో తీసుకుని సయ్యద్ అనే వ్యక్తి చనిపోయాడు. తీవ్ర అనారోగ్యం ఉన్న తనను పట్టించుకోవడం లేదని సయ్యద్ ఆ వీడియోలో పేర్కొన్నారు. (చదవండి : డాడీ.. ఊపిరాడట్లేదు!)
మరోవైపు సయ్యద్ ఉదయం మరణించినప్పటికీ.. ఇప్పటివరకు వరకు అతని మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా, చెస్ట్ ఆస్పత్రిలో కరోనా బాధితులకు అందుతున్న చికిత్సపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment