ఆస్పత్రి తరలింపుపై రాజకీయాలొద్దు | don't play the politics hospital on the move | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి తరలింపుపై రాజకీయాలొద్దు

Published Thu, Jan 29 2015 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

ఆస్పత్రి తరలింపుపై రాజకీయాలొద్దు

ఆస్పత్రి తరలింపుపై రాజకీయాలొద్దు

ఛాతీ ఆస్పత్రి పరిరక్షణ కమిటీ
 
వెంగళరావునగర్: ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి తరలించే విషయంలో ప్రాంతీయ విభేదాలు తీసుకురావద్దని, ఇది సరైన పద్ధతి కాదని చెస్ట్ హాస్పిటల్ పరిరక్షణ కమిటీ (జేఏసీ) చైర్మన్ డాక్టర్ ప్రమోద్‌కుమార్ చెప్పారు. గురువారం వైద్యులు, వైద్యేతర సిబ్బంది ఆస్పత్రిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ ఛాతీ ఆస్పత్రితో ఇతర ఆస్పత్రులకు సంబంధం లేదని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయంగాని, ప్రాంతీయతత్వంగాని కొత్తగా సృష్టిం చవద్దన్నారు. ఇక్కడ నుంచి ఆస్పత్రిని తరలిస్తే వైద్యుల కంటే ఎక్కువగా రోగులే ఇబ్బంది పడతారని చెప్పారు.

గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులతో పాటు కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వైద్యులు ఈ విషయంలో అనవసర జోక్యం చేసుకుని ఇది తమకు అంగీకారమేనని చెప్పడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో ఎలాంటి ప్రాంతీయ విభేదాలు లేవని, ఇక్కడ అందరం కలిసి కట్టుగా అన్నదమ్ముల్లా రోగులకు వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. దీన్ని తరలించవద్దని అందరం ముక్తకంఠంతో చెబుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ఉమర్‌ఖాన్, సతీష్, వీరమణి, అనిల, బ్లాండినా, అరుణ జ్యోతి, లక్ష్మీనారాయణ, శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement