
సాక్షి, హైదరాబాద్: నగరంలో తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహల తొలగింపు వివాదాస్పదంగా మారింది. నూతన సచివాలయం ముందున్న విగ్రహాలను అధికారులు తొలగించడంతో వివాదం చోటుచేసుకుంది.
కాగా, కొత్త సచివాలయం ఏర్పాటు సందర్భంగా రోడ్డు వెడెల్పులో భాగంగా విగ్రహాలను తొలగించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహల తొలగించడంపై పలువురు భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, అధికారులు విగ్రహాలను మరోచోట ప్రతిష్టిస్తామని చెప్పారు. అయితే, విగ్రహాలను ఎక్కడ పెడతారనే దానిపై మాత్రం అధికారులు క్లారిటీ ఇవ్వలేదు.