'తెలంగాణలో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తాం' | Telangana New secretariat constructed in hyderabad, says Tummala Nageswara rao | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తాం'

Published Sat, Feb 7 2015 1:43 PM | Last Updated on Thu, Aug 30 2018 5:57 PM

Telangana New secretariat constructed in hyderabad, says Tummala Nageswara rao

హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయాన్ని నిర్మించి తీరుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లో తుమ్మల విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రతిపక్షాలు వేరే పనిలేక తమపై విమర్శలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కొత్త సచివాలయాన్ని ఎలా నిర్మించుకోవాలో తమకు తెలుసునని తుమ్మల అన్నారు.

కారణం లేకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తున్నారని విమర్శించారు. ప్రజా ఆమోదం ఉంటేనే తెలంగాణలో పర్యటించాలి, లేదంటే ప్రజలు ఛీ కొడతారని తుమ్మల తెలిపారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement