సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం (30వ తేదీన) మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రకటించింది. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా డాక్టర్ ఆపరిసరాల్లో నెలకొనే రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఆదివారం నాడు లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షో లను మూసి వేస్తున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది.
చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వాన.. హెచ్చరికలు జారీ
Comments
Please login to add a commentAdd a comment