lumbini Park
-
నేపాల్‌లో ‘డ్రాగన్’ ఆటలకు భారత్ ఎలా చెక్ పెట్టింది?
చైనా రుణంతో నేపాల్‌లోని లుంబినీ, పోఖ్రాలలో నిర్మితమైన రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉపయోగంలో లేనివిగా మారాయి. ఈ రెండు విమానాశ్రయాల్లో టెర్మినల్ భవనం నుంచి రన్‌వే వరకు నిర్మాణం చాలా కాలం క్రితమే పూర్తయింది. ప్రతిరోజూ ఒకటోరెండో దేశీయ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అవుతున్నాయి. అయితే ఈ విమానాశ్రయాలు ఇప్పటికీ అంతర్జాతీయ విమానాల రాక కోసం వేచి చూస్తున్నాయి. ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని చూసి వ్యాపార దృష్టితో పెద్దఎత్తున అప్పులు చేసి, భూములు కొని, విలాసవంతమైన హోటళ్లను నిర్మించినవారు ఇప్పుడు ఆదాయం లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఈ హోటళ్లు నిత్యం ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం లక్షల మంది బౌద్ధ పర్యాటకులు లుంబినీని సందర్శిస్తారు. అయితే వారిలో ఎక్కువ మంది ఖాట్మండు నుండి దేశీయ విమానాల ద్వారా నగరానికి చేరుకుంటారు. పోఖ్రాలోనూ ఇదే పరిస్థితి ఉంది. అటు లుంబినీ, ఇటు పోఖ్రాలో పర్యాటకులు ఎందుకు పెరగడం లేదు? లుంబినీ, పోఖ్రాలలో అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించినా పర్యాటకుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగకపోవడానికి భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే కారణమని నేపాల్ అభిప్రాయపడింది. లుంబినీ డెవలప్మెంట్ ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం 2022లో నేపాల్ ప్రభుత్వం చైనా రుణంతో గౌతమబుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 76 మిలియన్ డాలర్ల మొత్తాన్ని వెచ్చించింది. గత ఏడాది మేలో ఈ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభించింది. లుంబినీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భైరహవా విమానాశ్రయం అని కూడా అంటారు. ఈ విమానాశ్రయం కారణంగా పర్యాటకులు రాజధాని ఖాట్మండు నుండి 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించే బదులు నేరుగా లుంబినీకి చేరుకోవచ్చు. అయినప్పటికీ పర్యాటకుల సంఖ్యలో ఊహించిన పెరుగుదల కనిపించడం లేదు. లుంబినీ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాలు క్రమం తప్పకుండా నడిస్తే విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని విమానయాన, పర్యాటక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత్ తన గగనతలం గుండా విమానాలు పశ్చిమ దిశగా వెళ్లేందుకు నిరాకరించిందని నేపాలీ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం చూస్తే గౌతమ బుద్ధ విమానాశ్రయానికి చేరుకోవడానికి విమానాలేవీ భారతదేశం మీదుగా ప్రయాణించలేవు. చిన్న విమానాలకు మాత్రమే మినహాయింపు ఉంది. గత ఏడాది డిసెంబర్లో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ జరిగింది. గౌతమబుద్ధ విమానాశ్రయం ట్రాఫిక్ కోసం తెరిచిన ఏడు నెలలకే ఈ ఘటన జరిగింది. 2020లో లడఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత్- చైనాల మధ్య ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఇందులో 20 మంది భారతీయ ఆర్మీ సైనికులు అమరులయ్యారు. ఆ సమయంలో చైనా సైనికులు రెట్టింపు ప్రాణనష్టాన్ని చవిచూశారు. కాగా ఖాట్మండు విమానాశ్రయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 2015లో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా దీనిని కొంతకాలం మూసివేశారు. పోఖ్రాలోని మూడో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లుంబినీ తరహా సంక్షోభాన్నే ఎదుర్కొంటోంది. పోఖ్రాలో అన్నపూర్ణ పర్వతాల అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. వీటిని చూసేందుకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ ఏడాది జనవరిలో కొత్తగా నియమితులైన నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ‘ఓం’ పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం? -
ఈరోజు అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
-
హైదరాబాదీలకు అలర్ట్.. రేపు పార్కుల మూసివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం (30వ తేదీన) మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రకటించింది. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డాక్టర్ ఆపరిసరాల్లో నెలకొనే రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఆదివారం నాడు లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షో లను మూసి వేస్తున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది. చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వాన.. హెచ్చరికలు జారీ -
Lumbini Park Photos: లుంబినీ పార్కులో మ్యూజికల్ ఫౌంటేన్ ప్రారంభం (ఫొటోలు)
-
HYD: ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్ బంద్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మకంగా ఫార్ములా ఈ-రేస్ నిర్వహించనున్న నేపథ్యంలో నగరంలోని ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. అంతేకాదు.. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ట్యాంక్‌బండ్‌పై సందర్శక ప్రాంతాలను మూసేయనున్నారు. ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులను ఈ నెల 18(శుక్రవారం) నుంచి బంద్ చేయనున్నారు. ఈ మూసివేత 20వ తేదీ వరకు ఉంటుంది. తిరిగి 21వ తేదీ నుంచి వాటిని తెరుస్తారు. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది. ఈ నెల 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం కానుంది. సాగర తీరాన ట్రాక్ పనులు, గ్యాలరీ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలను 16వ తేదీ రాత్రి పది గంటల నుంచి 20వ తేదీ రాత్రి పది గంటల వరకు అమలు చేస్తామని ఇది వరకే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షలు.. ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు మొదలయ్యాయి. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఖైతరాబాద్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కంపౌండ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయం రూట్, ట్యాంక్‌బండ్ పరిసరాలలో వెళ్లవద్దని ట్రాఫిక్ జాయింట్ సీపీ వాహనదారులకు సూచించారు. అనసవసరంగా ఆ రూట్లలో వెళ్లి ట్రాఫిక్‌లో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు. -
ముంబై నుంచి తీసుకెళ్తేనే.. స్టేట్మెంట్ ఇస్తా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్–లుంబినీ పార్క్‌ల్లో 2007 ఆగస్టు 25న చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న అనీఖ్ షఫీఖ్ సయీద్ ‘మారా’ చేస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలోని తలోజ జైల్లో ఉన్న ఇతడిపై అహ్మదాబాద్ కోర్టులో విచారణ సాగుతోంది. అయితే తనను ముంబై నుంచి తీసుకెళ్తేనే వాంగ్మూలం ఇస్తానంటూ తన లాయర్ ద్వారా అహ్మదాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయించాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)కు చెందిన ఈ ఉగ్రవాదికి హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం 2018లో ఉరి శిక్ష విధించింది. అనీఖ్ స్వస్థలం మహారాష్ట్రలోని పుణె. ఇతగాడికి ఖలీద్ అనే మారు పేరు కూడా ఉంది. పుణెలో కంప్యూటర్లు, మొబైల్స్ దుకాణం నిర్వహించేవాడు. ఐఎంలో కీలక ఉగ్రవాది అయిన రియాజ్ భత్కల్ ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. గోకుల్‌చాట్–లుంబినీ పార్క్ పేలుళ్ల కోసం సిటీకి వచ్చినప్పుడు తన పేరును సతీష్‌గా మార్చుకున్నాడు. రియాజ్ ఆదేశాల మేరకు మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరితో కలిసి 2007 జూలైలో హైదరాబాద్ వచ్చారు. అదే ఏడాది ఆగస్టు 25న రియాజ్ భత్కల్ గోకుల్ ఛాట్‌లో, అనీఖ్ షఫీఖ్ లుంబినీపార్క్‌లో బాంబులు అమర్చగా... మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి దిల్‌షుక్‌నగర్‌లో బాంబు పెట్టాడు. మొదటి రెండూ పేలగా, మూడోదానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులతో పాటు అనీఖ్ కూడా అరెస్టయ్యాడు. ఈ కేసుల విచారణ 2018లో పూర్తికావడంతో న్యాయస్థానం అనీఖ్‌కు ఉరి శిక్ష విధించింది. అయితే మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో ఐఎం సృష్టించిన వరుస పేలుళ్లలోనూ అనీఖ్ కీలక పాత్ర పోషించాడు. దీంతో మహారాష్ట్ర పోలీసులు తమ కేసుల విచారణ కోసం ముంబైకి తరలించారు. ప్రస్తుతం తలోజ జైల్లో ఉన్న ఇతడిపై అహ్మదాబాద్ కోర్టులోనూ విచారణ జరుగుతోంది. దీంతో లాక్డౌన్ మొదలయ్యే వరకు అనీఖ్‌కు అవసరమైన ప్రతి సందర్భంలోనూ ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తీసుకువెళ్లేవారు. కరోనా నేపథ్యంలో అహ్మదాబాద్ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ప్రారంభించడంతో అతను అప్పటి నుంచి జైలుకే పరిమితమయ్యాడు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో ఇతడి నుంచి అక్కడి కోర్టు అదనపు వాంగ్మూలం నమోదు చేయాలని భావించింది. దీంతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తలోజ జైలులో ఉన్న అనీఖ్ వాంగ్మూలం రికార్డుకు ఆదేశాలు ఇచ్చింది. అయితే తాను అలా స్టేట్మెంట్ ఇవ్వనంటూ ఈ ఉగ్రవాది స్పష్టం చేశాడు. తనను తలోజ జైలు నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలుకు తరలిస్తేనే వాంగ్మూలం ఇస్తానంటూ అందులో పేర్కొన్నాడు. తలోజ జైలు అధికారులు తనకు అహ్మదాబాద్ కేసుకు సంబంధించిన రికార్డులు ఇవ్వలేదని తన పిటిషన్లో వివరించాడు. లాక్‌డౌన్‌కు ముందే తనను సబర్మతి జైలుకు తరలించేందుకు కోర్టు వారెంట్ ఇచ్చిందని, దీనిని పట్టించుకోని తలోజ జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నాడు. కేసుల విచారణకు అడ్డంకులు సృష్టించి, జాప్యం చేయడానికే ఇతగాడు ఇలా వ్యవహరిస్తున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అనీఖ్‌కు ఇప్పటికే హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడింది. మిగిలిన కేసుల విచారణ పూర్తయిన తర్వాతే దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కేసుల విచారణకు పొడిగిస్తే శిక్ష అమలు కూడా మరింత ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో అనీఖ్ ఇలా చేస్తున్నాడని పేర్కొంటున్నారు. -
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఐఎం చీఫ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్‌ల్లో 2007 ఆగస్ట్ 25న చోటుచేసుకున్న జంట పేలుళ్ల కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు అమీర్ రజాఖాన్ పాకిస్థాన్‌లో తలదాచుకున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతడు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన ముఖ కవళికల్నీ మార్చుకున్నట్లు తేల్చాయి. ఉగ్రవాదులుగా పిలిచే ఉగ్ర సోదరులు, 2007 నాటి జంట పేలుళ్ల కేసు నిందితులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌లను ఉగ్రవాదం వైపు మళ్లించింది సైతం ఇతగాడే. ఫోన్ కాల్స్‌ను ఓ ప్రాంతం నుంచి చేస్తూ మరో ప్రాంతం నుంచి చేస్తున్నట్లు చూపించే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఐరోపా ఖండంలోని దేశాల్లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థల్ని తప్పుదోవపట్టిస్తున్నాడని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇతడు తమ ముఖ కవళికల్ని మార్చుకున్నాడని చెప్పడానికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించిన నిఘా వర్గాలు గాలింపు ముమ్మరం చేశాయి. బెదిరింపుల దందాలో దొరికిన నమూనాలు.. కేంద్ర నిఘా వర్గాలు గతంలోనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా పోలీసుల వద్ద నుంచి అమీర్ రజా ఖాన్ గొంతుకు సంబంధించిన నమానాలను సేకరించాయి. అదే నగరానికి చెందిన అమీర్ రజా ఖాన్ అక్కడ నుంచే నేర ప్రస్థానం ప్రారంభించాడు. తన సోదరుడైన ఆసిఫ్ రజా ఖాన్‌తో కలిసి ఆఫ్తాబ్ అన్సారీ గ్యాంగ్‌లో చేరి కిడ్నాప్‌లు, బెదిరించి డబ్బు గుంజడాలు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడు. 2001లో కోల్‌కతాకే చెందిన చెప్పుల తయారీ కర్మాగారం యజమాని ప్రథా రాయ్ బుర్మన్ను కిడ్నాప్ చేస్తానని బెదిరించి భారీగా దండుకున్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ సందర్భంలోనే అమీర్ రజా ఖాన్ ఫోన్ ద్వారా చేస్తున్న బెదిరింపులను రాయ్ సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేశారు. వాటిని అప్పట్లోనే కోల్‌కతా నేర దర్యాప్తు విభాగం అధికారులకు అందించారు. అమీర్, ఆసిఫ్‌ల నేర సామ్రాజ్యం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు విస్తరించడంతో అక్కడా అనేక నేరాలు చేశారు. 2001లోనే రాజ్‌కోట్‌లో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్ మరణించడంతో అమీర్ పాకిస్థాన్‌కు పారిపోయి ఉగ్రవాద బాటపట్టాడు. ఆసిఫ్ రజా కమెండో ఫోర్స్ (ఏఆర్‌సీఎఫ్) పేరుతో 2002లో కోల్‌కతాలోని అమెరికన్ కేంద్రంపై దాడి చేయించాడు. ఆ తర్వాత దీన్నే ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మార్చి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడ్డాడు. వీటిలో నగరంలో జరిగిన జంట పేలుళ్లు కూడా ఒకటి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ... అమీర్ రజా పాకిస్థాన్‌లో ఉంటూనే కోల్‌కతాలో తన దందా కొనసాగించాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 2010లో అక్కడి ఫైవ్‌స్టార్ హోటల్ యజమానిని రూ.20 కోట్లు చెల్లించాలంటూ ఫోన్ ద్వారా బెదిరించాడు. ఈ సందర్భంలోనూ గొంతును బాధితుడు సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేశారు. భవానీపూర్ పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసు ఆపై జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ అయింది. దర్యాప్తులో భాగంగా రాయ్ కేసులో నేర దర్యాప్తు విభాగం వద్ద ఉన్న గొంతు నమూనాలను సేకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ అంతర్జాతీయ ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టింది. వీటిలో ఒక దాంట్లో అమీర్ రజా ఖాన్ గొంతు చిక్కడంతో లోతుగా ఆరా తీసింది. ఆ ఫోన్ కాలు ఐరోపా ఖండంలో ఉన్న లగ్జెంబర్గ్ నుంచి వచ్చినట్లు నిర్థారించిన జాతీయ దర్యాప్తు సంస్థ ఆ దేశ పోలీసులకు కేసు దర్యాప్తు సహకార విజ్ఞప్తి రాసింది. దీనిపై స్పందించిన ఆ దేశం కూడా దర్యాప్తు చేసి రజా తమ దేశంలో లేడని స్పష్టం చేసింది. మరింత లోతుగా దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ పాకిస్థాన్‌లోనే ఉంటున్న అమీర్ రజా ఖాన్ ఫోను సంకేతాల్ని ప్రాంతం మార్పు ద్వారా వ్యవహారాలు సాగిస్తున్నాడని అభిప్రాయపడింది. ఈ కారణంగానే లగ్సెంబర్గ్ వెలుగులోకి వచ్చినట్లు తేల్చింది. దుబాయ్, కరాచీ, నేపాల్ల్లోనూ అతడి కదలికలు ఉన్నట్లు సాంకేతిక పరికరాల నిఘాలో గుర్తించారు. రెండేళ్లలో మారిన కవళికలు.. ఈ వివరాల ఆధారంగా ఆరా తీసిన కేంద్ర నిఘా వర్గాలు అంతర్జాతీయ సంస్థల సహకారంతో అమీర్ కోసం వేట ముమ్మరం చేశాయి. ఫలితంగా 2018లో అమీర్ కదలికల్ని పాకిస్థాన్‌లో ఉన్న బాలాకోట్‌లోని లష్కరే తొయిబా ఉగ్రవాద శిక్షణ శిబిరంలో గుర్తించాయి. అప్పట్లో అక్కడి ఉగ్రవాదులకు ఇతడు శిక్షణ ఇస్తున్నట్లు తేల్చారు. మళ్లీ దాదాపు రెండేళ్ల తర్వాత అమీర్‌కు చెందిన తాజా ఫొటోను కేంద్ర నిఘా వర్గాలు సేకరించగలిగాయి. దీనికి, అప్పటి ఫొటోకు చాలా తేడాలు ఉన్నట్లు తేల్చాయి. గడ్డం, మీసం లేకపోవడంతో పాటు కవళికల్లోనే ఎన్నో తేడాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన ముఖాన్ని మార్చుకున్నట్లు అనుమానిస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం అమీర్ రజా ఖాన్ చనిపోయాడంటూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధికారికంగానే ప్రకటించింది. తాజాగా దొరికిన ఆధారాలు అతడు బతికే ఉన్నాడని స్పష్టం చేస్తున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు దీని వెనుక కొత్త వ్యూహం ఏదైనా ఉందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. -
వింటేజ్ షోయగం
-
హైదరాబాద్ లుంబిని పార్క్ వద్ద కారు ప్రమాదం
-
జంట పేలుళ్ల కేసులో అప్పీళ్లు విచారణకు స్వీకరించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్లలో సంభవించిన జంట పేలుళ్ల కేసులో కింది కోర్టు విధించిన ఉరి శిక్ష తీర్పును సవాల్ చేస్తూ దోషులు అనీక్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. వీరిద్దరికీ ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన నేరానికి తారీఖ్ అంజూమ్ ఎహసాన్ అనే వ్యక్తికి కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తారీఖ్ కూడా హైకోర్టులో అప్పీల్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వీటిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించింది. ఈ కేసు నుంచి నిర్దోషులుగా బయటపడిన నిందితులు షాదిక్ ఇష్రార్ షేక్, ఫరూక్ షర్ఫూద్దీన్ తర్ఖాష్లకు పేలుళ్లతో సంబంధం ఉందని, కింది కోర్టు వీరిని విడిచిపెట్టడం చెల్లదని ప్రత్యేక దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను కూడా కలిపి విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. అప్పీల్ తీర్పు వెలువడే వరకూ తమకు బెయిల్ మంజూరు చేయాలన్న వారి అభ్యర్థనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఉరిశిక్ష ఖరారు విషయంలో నిర్ణయం తీసుకునేందుకు వాటికి గతంలోనే హైకోర్టు నంబర్లు కేటాయించి రెఫర్ ట్రయిల్ మొదలు పెట్టింది. అనీక్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు ఉరిశిక్ష విధిస్తూ రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.శ్రీనివాసరావు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. -
జంట పేలుళ్ల కేసు.. మరో నిందితుడు దోషే
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కు జంట బాంబుపేలుళ్ల కేసులో మరో నిందితుడిని సైతం కోర్టు దోషిగా తేల్చింది. గత మంగళవారం ఈకేసుపై తీర్పు వెలువరించిన కోర్టు ఇద్దరు నిందితులను దోషులగా.. మరో ఇద్దరిని నిర్ధోషులగా ప్రకటించిన విషయం తెలిసిందే. దోషులకు విధించే శిక్ష, ఐదో నిందితుడిపై తుది తీర్పు నేడు వెల్లడిస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో జరిగిన విచారణలో ఐదో నిందితుడైన మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్‌ను సైతం కోర్టు దోషిగా తేల్చింది. అతను ఢిల్లీలో ఉగ్రవాదులకు ఆశ్రయిమిచ్చాడని విచారణలో రుజువైంది. తారీఖ్ అంజూమ్‌తో పాటు దోషులు ఇస్మాయిల్ చురి, అనీఖ్ షఫీఖ్‌లకు కోర్టు మరికాసేపట్లో శిక్ష ఖరారు చేయనుంది. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. వీరిలో సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. 2007 ఆగస్టు 25న నగరంలో జరిగిన ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. 77 మంది గాయపడ్డారు. చదవండి: ఇద్దరు దోషులు.. ఇద్దరు నిర్దోషులు -
ప్రాణం ఖరీదు రూ.888!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ‘జంట పేలుళ్ల ’కోసం ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఖర్చు చేసింది ఎంతో తెలుసా..? అక్షరాల రూ.40 వేలు మాత్రమే. గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్లతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబు ఆపరేషన్ వెనుక ఉన్న విషయమిది. 2007 ఆగస్టు 25న చోటు చేసుకున్న ఈ రెండు పేలుళ్లు 45 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన సరాసరిన ఒక్కో హత్యకు వీరు రూ.888 చొప్పున ఖర్చు చేశారు. హైదరాబాద్ పేలుళ్ల తర్వాత వీరందరూ ఈ కుట్ర పురుడుపోసుకున్న పుణేలోని అశోక మీవ్స్ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అక్కడ ఉంటూనే ఆ నగరంలో కొన్ని కిడ్నాప్‌లు చేయడం ద్వారా ‘మాల్ ఏ ఘనీమఠ్’ సంపాదించాలని కుట్రపన్నారు. మంగళవారం దోషులుగా తేలిన అనీఖ్ షఫీద్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిల వాంగ్మూలాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనీఖ్‌కు ఇచ్చింది రూ.20 వేలు... పాతబస్తీలోని మక్కా మసీదు పేలుళ్లకు ప్రతీకారంగా నగరాన్ని టార్గెట్ చేయాలని భావించిన రియాజ్ భత్కల్ తన అనుచరుడు అనీఖ్‌ను హైదరాబాద్ పంపాలని నిర్ణయించుకున్నాడు. తొలుత ఫారూఖ్ బంధువైన నవీద్‌ను కలిసి, కంప్యూటర్ శిక్షణ కోసం వచ్చినట్లు చెప్పాలని సూచించాడు. ఆగస్టు 1న అతడికి రూ.20 వేలు ఇచ్చి పంపాడు. సరూర్‌నగర్‌లోని నవీద్ ఇంట్లో కొన్ని రోజులు ఉన్న అనీఖ్ అక్కడి నుంచి పుణే వెళుతున్నట్లు చెప్పి నాంపల్లిలోని ఓ లాడ్జిలో బస చేశాడు. అయితే దాని అద్దె రోజుకు రూ.250 వరకు ఉండటంతో మరుసటి రోజే అజీజియా లాడ్జికి మకాం మార్చాడు. తన పేరు సతీష్ గౌక్వాడ్‌గా చెప్పుకుని రూ.120 అద్దెతో గది తీసుకున్నాడు. ఇక్కడ ఉంటూనే హబ్సిగూడ బంజారా నిలయంలోని ఫ్లాట్ నం.302లో దిగేందుకు యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నెలకు రూ.4 వేల అద్దె చెల్లించేందుకు అంగీకరించి రూ.12 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. అక్బర్ తెచ్చింది మరో రూ.6 వేలు... ఫ్లాట్ అద్దెకు తీసుకున్న అనీఖ్ ఈ విషయాన్ని పబ్లిక్ ఫోన్ ద్వారా రియాజ్‌కు చేరవేయడంతో ఆగస్టు 8న అక్బర్‌ను నగరానికి పంపిన రియాజ్... ఖర్చుల కోసం రూ.6 వేలు ఇచ్చాడు. అనీఖ్, అక్బర్ అమీర్‌పేటలోని ధూమ్ టెక్నాలజీస్‌లో హార్డ్‌వేర్ నెట్ వర్కింగ్ కోర్సులో చేరి రూ.5 వేలు చెల్లించారు. అక్బర్.. వినోద్ పాటిల్ పేరుతో చెలామణి అయ్యాడు. భత్కల్ ఆదేశాల మేరకు అనీఖ్ రూ.4 వేలతో కోఠిలో టీవీ కొనుగోలు చేశాడు. రియాజ్ భత్కల్ బంజారా నిలయానికి వచ్చిన తర్వాత అతడి సూచనల మేరకు సికింద్రాబాద్‌లోని రూ.360 వెచ్చించి మూడు బ్యాగులు కొన్నారు. ఆగస్టు 1 నుంచి 27 మధ్య (పేలుళ్ల తర్వాతా ఫ్లాట్‌లోనే రెండు రోజులు ఉన్నాడు) భత్కల్ రెండుసార్లు వచ్చిపోవడానికి, బాంబుల తయారీ, ఇతర ఖర్చులకు మరో రూ.14 వేలు వెచ్చించినట్లు అనీఖ్, అక్బర్ చెప్పుకొచ్చారు. ఇలా మొత్తమ్మీద జంట పేలుళ్ల ఆపరేషన్ పూర్తి చేయడానికి రియాజ్ వెచ్చించింది రూ.40 వేలు. పేలుళ్ల అనంతరం ఆగస్టు 27న అనీఖ్ పుణేకు తిరిగి వెళ్లిపోయాడు. పుణేలో కిడ్నాప్‌లకు కుట్ర... పేలుళ్ల తర్వాత అనీఖ్, అక్బర్, రియాజ్ వేర్వేరుగా పుణే చేరుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకు పుణేలోని అశోక మీవ్స్ అపార్ట్మెంట్లో సమావేశం కాగా, రియాజ్ తన కుట్రను బయటపెట్టాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు అవసరమైన డబ్బు (మాల్ ఏ ఘనీమఠ్) కోసం కిడ్నాప్‌లు చేయాలని చెప్పాడు. పుణేలోని ప్రముఖ నిర్మాణ, రియల్ ఎస్టేట్ సంస్థ లుంకడ్ బిల్డర్స్ యజమానిని తొలి టార్గెట్‌గా చేసుకున్నారు. అక్కడి విమాన్‌నగర్‌లో ఉన్న అతడి కార్యాలయం, క్యాంప్ ఏరియాలోని కౌన్సిల్ హాల్ ఔట్‌పోస్ట్‌ల వద్ద రెక్కీ చేసే బాధ్యతలను రియాజ్.. అనీఖ్, అక్బర్‌కే అప్పగించాడు. ఇతడితో పాటు రంక జ్యూవెలర్స్ యజమాని కుమారుడినీ టార్గెట్‌గా చేసుకుని గణేశ్ పేట్‌లోని అతడి కార్యాలయం, మార్షినగర్‌లోని ఇంటి వద్ద సైతం వీరితో రెక్కీ చేయించాడు. ఒక్కొక్కరి వెనుక పక్షం రోజుల పాటు రెక్కీలు చేయించిన రియాజ్ ఆపై హఠాత్తుగా వదిలేయాలంటూ చెప్పాడు. జంట పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులో అనీఖ్, అక్బర్లను మంగళవారం దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం వచ్చే సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. -
వీళ్లంతా నాన్ లోకలే
సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్ల క్రితం గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో జరిగిన బాంబు పేలుడు ఘటనలు నగరాన్ని ఎంతలా కుదిపేశాయో అందరికీ తెలిసిందే. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న ఎనిమిది మంది నిందితుల్లో ఒక్కరూ స్థానికులు లేరు. అయితే వీరిలో నిందితులుగా ఉండి, అభియోగాలు వీగిపోయిన ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకూ సిటీ, శివారు జిల్లాలతో లింకులు ఉన్నాయి. మరో కీలక ఉగ్రవాది నగరంలో ఎథికల్ హ్యాకింగ్ శిక్షణ తీసుకున్నాడు. ముంబైలోని అంథేరి ప్రాంతానికి చెందిన సాదిఖ్ ఇష్రార్ షేక్ బంధువులు సిటీలో ఉండగా.. పుణేలోని ఖాండ్వా ప్రాంతంలో ఉంటున్న ఫారూఖ్ సర్ఫుద్దీన్ షేక్ స్వస్థలం మహబూబ్‌నగర్ సమీపంలోని నారాయణ్‌పేట్. రెండు పేలిన బాంబు కేసుల్లో, ఓ పేలని బాంబు కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిపై మంగళవారం అభియోగాలు వీగిపోయాయి. మిగిలిన ముగ్గురిలో అనీఖ్ షఫీఖ్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిని కోర్టు దోషులుగా తేల్చింది. మరో నిందితుడు తారిఖ్ అంజుమ్ హసన్‌పై సోమవారం నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఐఎం మీడియా సెల్ ఇన్చార్జి పీర్భాయ్.. ‘మక్కా’ పేలుడు సమయంలో నరగంలోనే కంప్యూటర్ శిక్షణ తీసుకుంటున్నాడు. మహ్మద్ సాదిక్ ఇష్రార్ షేక్ అలియాస్ యాసీర్ అలియాస్ ఇమ్రాన్ అంధేరిలోని సీఎంఎస్ కంప్యూటర్స్‌లో డెస్క్‌టాప్ ఇంజినీర్‌గా పనిచేస్తూ ఉగ్రవాద సంస్థ ఐఎంకు కో–ఫౌండర్, ఫెసిలిటేటర్‌గా వ్యవహరించాడు. ఐఎం సంస్థ జంట పేలుళ్లతో సహా 2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా సృష్టించిన 11 విధ్వంసాల్లోనూ ఇతని పాత్ర ఉన్నట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. సాదిక్ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని ఆజామ్ఘర్ నుంచి 40 ఏళ్ల క్రితం ముంబైకి వలస వచ్చింది. అక్కడి హబీబ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఐటీఐ పూర్తిచేసిన సాదిక్ అక్కడి గోద్రేజ్ కంపెనీలో చేరాడు. 2000లో దూరవిద్య ద్వారా బీఏ చదవడం కోసం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్శిటీలో చేరాడు. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ సమీపంలో ఉన్న అంజుమన్ ఇస్లామ్ హైస్కూల్లోని ఉర్దూ యూనివర్శిటీ సెంటర్‌కు హాజరయ్యేవాడు. 1996లో గోద్రేజ్ కంపెనీలో పనిచేస్తున్న కాలంలోనే స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) భావాలపట్ల ఆకర్షితుడై ఆ సంస్థలో చేరాడు. అప్పట్లో సిమిపై నిషేధం లేదు. చిత్తూరు జిల్లా పీలేరు నుంచి వలస వచ్చి ముంబైలోనే స్థిరపడ్డ అన్సార్‌తో కలిసి 1996–97ల్లో సిమి సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. సిమి నిర్వహించే అనేక సమావేశాలకు రియాజ్ భత్కల్, అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్ సైతం హాజరయ్యేవారు. ఈ సంస్థ వ్యవహారాలను నిశితంగా పరిశీలించిన తరవాత సాదిక్ పునరాలోచనలో పడ్డాడు. సిమి సంస్థ కేవలం సమావేశాలు నిర్వహించడం మాత్రమే కాదని, మరెన్నో ‘వ్యవహారాలు’ సాగిస్తోందని తెలిసి ఆ సంస్థ సమావేశాలకు దూరంగా ఉండడం ప్రారంభించాడు. మలుపుతిప్పిన ముజాహిద్ పరిచయం హైదరాబాద్‌కు చెందిన ముజాహిద్ (2004లో మరణించాడు) పరిచయం సాదిక్ జీవితాన్ని పూర్తిగా ఉగ్రవాదం వైపు మళ్లించింది. ముజాహిద్, సాదిక్ షేక్‌ల మధ్య బంధుత్వం ఉంది. 2001 ఏప్రిల్‌లో ముజాహిద్ ముంబై వెళ్లిన సందర్భంలో సాదిక్‌తో పరిచయం ఏర్పడింది. ఇతని స్ఫూర్తితో సాదిక్ ఉగ్రవాదం వైపు మళ్లాడు. అప్పట్లో సాదిక్ షేక్‌ను ముజాహిద్ ముంబైలోని ఓ సైబర్‌కేఫ్‌కు తీసుకువెళ్లి ఓ ఈ–మెయిల్ ఐడీ రూపొందించి ఇచ్చాడు. ఈ మెయిల్‌ను క్రమం తప్పకుండా బ్రౌజ్ చేస్తూ ఉండమని, ఈ–మెయిల్ ద్వారానే ఓ వ్యక్తి పరిచయం అవుతాడని సాదిక్‌కు చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే మూడు నెలల పాటు బ్రౌజ్ చేసిన అనంతరం ఓ వ్యక్తి నుంచి సాదిక్‌కు సందేశాలు రావడం మొదలయ్యాయి. కొంతకాలానికి తనను కలవాలంటూ సాదిక్‌కు ఆ వ్యక్తి మెయిల్ పంపాడు. దీనికి స్పందనగా ముంబైలోని చీతా క్యాంప్‌లో ఉన్న మదీనా హోటల్ వద్ద కలుద్దామంటూ సాదిక్ వర్తమానం పంపాడు. అనుకున్నట్లే వచ్చిన ఆ వ్యక్తి తన పేరును జహీర్‌గా చెప్పుకున్నాడు. అతనే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఏర్పడటానికి కారణమైన కోల్‌కతాకు చెందిన అమీర్ రజా సోదరుడు ఆసిఫ్ రజా అని సాదిక్‌కు ఆ తరవాత తెలిసింది. ఎప్పటికీ వెనుకడుగు వేయనంటూ సాదిక్ నుంచి మాట తీసుకున్న ఆసిఫ్.. అతన్ని పూర్తిగా ఉగ్రవాదం వైపు మళ్లించాడు. అనీఖ్‌కు ‘రిఫరెన్స్’ ఇచ్చిన ఫారూఖ్ రియాజ్ ఆదేశాల మేరకు పేలుళ్లకు దాదాపు నెల రోజుల ముందు అనీఖ్ హైదరాబాద్‌కు బయలుదేరాడు. తన బంధువు రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తి ఫారూఖ్ షర్ఫుద్దీన్ తర్ఖాష్, మహబూబ్‌నగర్ సమీపంలోని నారాయణ్‌పేట్‌కు చెందిన ఫారూఖ్ కుటుంబం పూణేలోని క్యాంపు ఏరియాకు వలస వెళ్లింది. పూణేలో ఇతనితో కలిసి చదువుకున్న మాజిద్ ద్వారా అనీఖ్ షఫీఖ్ సయీద్ పరిచయమయ్యాడు. 2007 జూలైలో హైదరాబాద్‌లో ఓ పని నిమిత్తం వెళ్తున్నానని ఫారూఖ్‌తో చెప్పాడు. అక్కడ కొంత కాలం ఉండడానికి ఆశ్రయం కల్పించమని కోరాడు. దీంతో నారాయణ్‌పేట్ నుంచి వచ్చి సరూర్‌నగర్‌లో ఉంటున్న దూరపు బంధువు నవీద్ దగ్గరకు వెళ్లాల్సిందిగా ఫారూఖ్ సూచించి నవీద్ ఫోన్ నెంబర్ సైతం ఇచ్చి పంపాడు. అలా 2007 ఆగస్టు 1న ఇండియన్ ముజాహిదీన్ మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఆదేశాల ప్రకారం హైదరాబాద్ వచ్చిన అనీఖ్.. నవీద్ దగ్గర రెండు రోజులు ఆశ్రయం పొందాడు. ఆ తర్వాత హబ్సిగూడలోని స్ట్రీట్ నెం.8లోని బంజారా నిలయంలో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. పీర్భాయ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ ఇండియన్ ముజాహిదీన్‌కు మీడియా సెల్ ఇన్చార్జిగా వ్యవహరించడంతో పాటు పేలుళ్లకు ముందు మీడియా సంస్థలకు ఈ–మెయిల్ పంపిన ఉగ్రవాది మన్సూర్ అస్ఘర్ పీర్భాయ్. పుణేకు చెందిన ఇతడు 2007లో కొన్నాళ్లు సిటీలో ఉన్నాడు. కంప్యూటర్ రంగంలో నిపుణుడైన ఇతడు రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు 2007లో సిటీకి వచ్చి ప్రత్యేక శిక్షణ పొందాడు. బంజారాహిల్స్‌లోని ఈ–2 ల్యాబ్స్ సంస్థ.. ఫార్చూన్ కత్రియ హోటల్లో ఆ ఏడాది మే 14 నుంచి 19 వరకు ఎథికల్ హ్యాకింగ్ కోర్సులో శిక్షణనిచ్చింది. దీనికి హాజరైన పీర్భాయ్.. అదే నెల 18న మక్కా మసీదులో పేలుడు జరిగినట్లు తెలుసుకుని అక్కడకు వెళ్లి చూశాడు. ఈ విషయాలను రియాజ్ భత్కల్‌కు వివరించాడు. ఈ నేపథ్యంలోనే భత్కల్ తదితరులు మక్కా పేలుడుకు ప్రతీకారంగా సిటీని టార్గెట్ చేశాడు. -
ఉగ్రవాదుల నేపథ్యం ఇదీ..
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని మక్కా మసీదు పేలుళ్లకు ప్రతీకారంగా జరిగిన గోకుల్‌చాట్, లుంబినీ పార్కు పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. వారి వ్యవహారాలు ఇవీ.. రియాజ్ భత్కల్ ఇతని స్వస్థలం కర్ణాటకలోని భత్కల్. గోకుల్‌ఛాట్‌లో బాంబు పెట్టిన వ్యక్తి. ఇండియన్ ముజాహిదీన్‌కు రెండో కమాండ్ ఇన్చార్జిగా వ్యవహరించాడు. పాకిస్తాన్‌లోని అమీర్ రజా ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన విధ్వంసాలకు పేలుడు పదార్థాలు, మనుషులు, డబ్బును ఏర్పాటు చేశాడు. దేశ వ్యాప్తంగా అనేక విధ్వంసాలకు సూత్రధారి. 2013 దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులోనూ వాంటెడ్. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతని సోదరుడైన ఇక్బాల్ భత్కల్ సైతం జంట పేలుళ్ల కేసులో నిందితుడు. మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి మహారాష్ట్రలోని పుణెకు చెందిన కంప్యూటర్ మెకానిక్. విధ్వంసకర్తలకు డ్రైవర్‌గా వ్యవహరించాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర బాంబు పెట్టాడు. మంగుళూరు నుంచి పేలుడు పదార్థాలను రవాణా చేశాడు. సూరత్‌లో దొరికిన బాంబులూ ఇతని పనే. ఇతడిపై నేరం నిరూపితమైంది. అమీర్‌పేటలోని ధూమ్ టెక్నాలజీస్‌లో కంప్యూటర్ కోర్సులో చేరేప్పుడు తన పేరు వినోద్ పాటిల్‌గా పేర్కొన్నాడు. అనీక్ షఫీక్ సయ్యద్ ఇతడి స్వస్థలం కూడా పుణె. లుంబినీ పార్కులో బాంబు పెట్టింది ఇతడే. రియాజ్ భత్కల్ మారిదిగానే ఇండియన్ ముజాహిదీన్‌లో సీనియర్ సభ్యుడు. పుణెలో కంప్యూటర్లు, మెబైల్స్ దుకాణం నిర్వహించేవాడు. ఇతడినీ న్యాయస్థానం దోషిగా ప్రకటించింది. ఫారూఖ్ షర్ఫుద్దీన్ తర్ఖాష్ పూణెలోని క్యాంప్ ఏరియాకు చెందిన వాడు. ‘టి క్యాప్షన్ ఔట్‌డోర్’ యాడ్ ఏజెన్సీ ఉద్యోగి. ఇండియన్ ముజాహిదీన్‌లో కీలక ఉగ్రవాది. జంట పేలుళ్ల కుట్రను అమలు చేయడానికి హైదరాబాద్ వస్తున్న అనీఖ్‌కు తన బంధువు నవీద్ దగ్గర సరూర్‌నగర్‌లో ఆశ్రయం కల్పించి నిందితుడిగా మారాడు. ఇతడిపై అభియోగాలు వీగిపోయాయి. సాదిక్ ఇష్రార్ షేక్ ముంబై అంధేరికి చెందిన ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు. ఫెసిలిటేటర్‌గా వ్యవహరించాడు. విధ్వంసాల వ్యూహకర్తలకు, క్షేత్రస్థాయిలో పాలుపంచుకునే వారికి, ఈ–మెయిల్స్ పంపే వ్యక్తులకు మధ్య సంధానకర్త. జంట పేలుళ్లకు అవసరమైన సహకారం అందించాడు. ఇతడి పైనా అభియోగాలు వీగిపోయాయి. అమీర్ రజా ఖాన్ కోల్‌కతా వాసి. దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఏర్పాటుకు కీలకపాత్ర పోషించాడు. 2001లో కోల్‌కతాలోని అమెరికన్ కాన్సులేట్‌పై జరిగిన దాడి కేసులో నిందితుడు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటూ ఇక్కడ ఉగ్రవాద చర్యలకు సహాయం చేస్తున్నాడు. జంట పేలుళ్లలోనూ ఇతని పాత్ర ఉంది. మహ్మద్ తారిఖ్ అంజుమ్ హసన్ బీహార్‌లోని నలంద ప్రాంతానికి చెందిన ఇతగాడు కర్ణాటకలోని భత్కల్‌లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అదే వృత్తిలో ఉన్న ఇతడు 1998లో సిమీ సభ్యుడిగా మారాడు. 2001లో రియాజ్ ద్వారా ఐఎంలోకి ప్రవేశించాడు. అమీర్ రజాఖాన్ నేతృత్వంలో జరిగిన కోల్‌కతా ఎటాక్‌లోనూ కీలక పాత్ర పోషించాడు. ఐఎంలోని ‘టాప్ సిక్స్’లో ఒకడిగా, దుబాయ్ నుంచి ఫైనాన్సియర్‌గా వ్యవహరించాడు. కోర్టు ఇతడిపై సోమవారం తీర్పు వెలువరించనుంది. -
కదిలిస్తే కన్నీటి వరదే..
ఉప్పల్: లుంబిని పార్కు, గోకుల్ చాట్ దుర్ఘటన జరిగి 11 ఏళ్లు గడిచినా వారి కుటుంబ సభ్యులు నేటికీ ఆ పేరు గుర్తు చేస్తే ఉల్లిక్కి పడుతున్నారు. ఎవరిని కదలించినా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉప్పల్ శాంతినగర్‌కు చెందిన గాదే అంజయ్య, వెంకటలక్ష్మిల కూతురు స్రవంతి(14), చిన్నమ్మ సుశీల(30), అంజయ్య అన్న కూతురు శ్రీలేఖ(19)తో కలసి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీలు కొనేందుకు వెళ్లి షాపింగ్ అనంతరం గోకుల్ చాట్‌కు వెళ్లారు. వారు లోపల ఉండగానే బాబు పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన సుశీల(30), శ్రీలేఖ(19), స్రవంతి(14) ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు నుంచి రాఖీ పౌర్ణమి వచ్చిందంటే వారు భయపడుతున్నారు. ఆలస్యమైనా కఠినశిక్ష పడాల్సిందే.. ‘ఆలస్యమైనా తప్పుచేసిన నిందితులకు మాత్రం కఠిన శిక్షపడితేనే మరణించిన వారి అత్మలకు శాంతి కలుగుతుంది. గత 11 సంవత్సరాలుగా నిందితులకు రాజభోగాలు అందించడం చూసి బాధేసింది. వారికోసం రూ. కోట్లు ఖర్చు చేసారు. మాకు మాత్రం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానన్న మాటను ప్రభుత్వం దాటవేసింది. నింధితులను కోర్టుకు తీసుకు వచ్చినప్పుడల్లా రాజులా సెక్యూరిటీ మధ్యలో తీసుకువస్తుంటే బాధ పడ్డాం. బాధితులకు సత్వర న్యాయం జరగాలి. అయినా పర్వాలేదు.. బాద్యులందరినీ ఉరికంభం ఎక్కించాల్సిందే’ అని మృతురాలు స్రవంతి తండ్రి అంజయ్య డిమాండ్ చేశారు. ఆగస్టు అంటే భయమేస్తుంది.. ‘రాఖీ పండగ అంటే మా కుటుంబంలో భయంతో కూడిన విషాదం కనబడుతుంది. నేరాలు చేసినవారు రాజాలా బతుకుతున్నారు. మృతిచెందిన వారి కుటుంబాలే వారి జ్ఞాపకాలతో రోదిస్తున్నాయి. నిందితులకు అప్పటికప్పుడే శిక్ష వేయ్యాలే తప్పా 11 ఏళ్లుగా కేసులను నానబెట్టారు. ఏం సాదించింది.. కేవలం ఇద్దరికే శిక్ష ఖరా>రు చేసింది. విచారణ పేరుతో బాధితులను మభ్యపెడుతున్నారు. చాలా బాధగా ఉంది’ అని గోకుల్ చాట్ ఘటనలో మృతిచెందిన సుశీల సోదరి చంద్రకళ ఆవేదన చెందింది. ఇప్పటికీ సుశీల కుమారుడు సాయికుమార్ నిద్రలో భయంతో కలవరిస్తాడని కన్నీటి పర్యంతమైంది. -
ప్రతీకారేచ్ఛతోనే పేలుళ్లు
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలో జంట బాంబు పేలుళ్లవెనుక ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదుల ప్రతీకారేచ్ఛే కారణమని దర్యాప్తు అధికారులు తేల్చారు. హైదరాబాద్ పాతబస్తీ లోని మక్కా మసీదులో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడుకు ఓ వర్గం వారే బాధ్యులని భావించిన ఐఎం ఉగ్రవాదులు అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో పేలుళ్లకు పాల్పడినట్లు నిర్ధారించారు. అదే రోజు దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ సమీపంలో ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జి సమీపంలో మరో బాంబును అమర్చినా అది పేలకపోవ డంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని పుణేలో ఉన్న అశోక్ మీవ్స్ అపార్ట్మెంట్లో ఈ పేలుళ్లకు కుట్ర జరిగిందని నిందితులు బయటపెట్టారు. భారీ ప్రాణ నష్టమే లక్ష్యం... హుస్సేన్‌సాగర్ బోట్లో అనీఖ్, గోకుల్‌చాట్‌లో రియాజ్, దిల్‌సుఖ్‌నగర్‌లో అక్బర్ బాంబులు పేట్టాలన్నది పథకం. వాస్తవానికి సికింద్రాబాద్, అమీర్‌పేట్, చార్మినార్ సహా మరికొన్ని చోట్ల రెక్కీ చేసినా చివరకు రియాజ్ ఆదేశాలతో ఈ మూడింటినే టార్గెట్‌గా చేసుకున్నారు. భారీ ప్రాణ నష్టాన్ని సృష్టించాలని భావించిన రియాజ్ భత్కల్... నగరంలో మూడు బాంబులూ రద్దీ సమయమైన రాత్రి 7 గంటలకు కచ్చితంగా పేలేలా అనీఖ్, అక్బర్‌ల వాచీలను రీ–సెట్ చేయించాడు. టైమర్‌తో కూడిన షేప్డ్ బాంబుల్లో సరిగ్గా 6.45 గంటలకు బ్యాటరీలను పెట్టి, తమ టార్గెట్స్‌లో జన సమ్మర్థం ఉన్న చోట వదలాలని స్పష్టం చేశాడు. తమ దగ్గర ఉన్న సెల్ఫోన్లను ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లే ముందు ఆపేయాలని, విధ్వంసం జరిగి ఫ్లాట్‌కు చేరుకున్నాకే వాటిని ఆన్‌చేయాలని చెప్పాడు. ఒకవేళ ముగ్గురిలో ఎవరైనా పట్టుబడితే పోలీసుల సమక్షంలోనే మిగిలిన ఇద్దరికీ ఫోన్ చేసి ‘బిగ్ బజార్‌కు రండి’అని చెప్పాలంటూ రియాజ్ కోడ్ ఏర్పాటు చేశాడు. ఇలా ఫోన్ వస్తే మిగిలిన వారు పారిపోవాలని స్పష్టం చేశాడు. తారుమారైన పరిస్థితులు... గోకుల్‌చాట్ వద్ద పేలుడుకు రియాజ్ భత్కల్ పథకం ప్రకారమే అక్కడి ఐస్‌క్రీమ్ డబ్బాపై బాంబు పెట్టి జారుకున్నా మిగిలిన ఇద్దరు మాత్రం పేలుళ్ల అమల్లో కంగారుపడ్డారు. హబ్సిగూడ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రా బాద్‌కు వెళ్లిన అనీఖ్ అక్కడి నుంచి ఆటోలో లుంబినీ పార్కుకు చేరుకొని ఆటోడ్రైవర్‌కు రూ. 500 నోటు ఇవ్వగా అతడు చిల్లర లేదన్నాడు. దీంతో అక్కడే ఉన్న లేజర్ షో బుకింగ్ కౌంటర్లో టికెట్ కొని చిల్లర తెచ్చిచ్చాడు. కానీ ఆటో దిగే ముందే టైమర్‌ను ఆన్ చేయడంతో బాంబు యాక్టివేట్ అయి పోయింది. అయితే అప్పుడే షికారు బోటు హుస్సేన్‌సాగర్‌లోకి వెళ్లిపోవడం, మరొకటి బయలుదేరే వరకు తాను వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండటం, ఈలోగా బాంబు పేలే ప్రమాదం నెలకొనడంతో తాను కొన్న టికెట్‌తో లేజర్ షో వద్దకు వెళ్లి బాంబు అమర్చి పరారయ్యాడు. మరోవైపు దిల్సుఖ్నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో బాంబు పెట్టడానికి హబ్సిగూడలోని ఫ్లాట్ నుంచి సరిగ్గా సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరి బస్సు కోసం నిరీక్షించి అది రాకపోవడంతో ఆటోలో 6.20 గంటలకు అక్కడకు చేరుకున్నాడు. ఆ ప్రాంతమంతా జన సమ్మర్థంగా ఉన్నప్పటికీ బాంబు ఉన్న బ్యాగ్‌ను ఎక్కడ పెట్టాలో అతనికి అర్థంకాలేదు. ఆ ఆందోళనలోనే బాంబులో బ్యాటరీని హడావుడిగా పెట్టడంతో టైమర్ వాచ్ పని చేయకపోవడాన్ని గమనించినా... ఏమీ చేయలేక బ్యాగ్‌ను ఓ ద్విచక్ర వాహనానికి తగిలించి చివరకు ఫ్లాట్‌కు చేరుకున్నాడు. పేలుడు జరిగిన మర్నాడూ ముగ్గురు ఉగ్రవాదులు ఫ్లాట్‌లోనే గడిపారు. ఆగస్టు 27న మధ్యాహ్నం 3.30 గంటలకు అక్బర్ సికింద్రాబాద్ నుంచి బస్సు ద్వారా పుణే పరారవగా ఆపై రెండు రోజుల వ్యవధిలో మిగిలిన వాళ్లూ పరారయ్యారు. ఈ విధ్వంసాలకు అవసరమైన సహాయ సహకారాలను ఇతర నిందితులు అందించారు. రియాజ్ భత్కల్ స్కెచ్... ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ తన సోదరుడు ఇక్బాల్ భత్కల్, పాకిస్తాన్లో ఉన్న అమీర్ రజా ఖాన్‌తో కలసి హైదరాబాద్‌లో పేలుళ్లకు స్కెచ్ వేశాడు. రియాజ్ ఆదేశాలతో 2007 ఆగస్టు మొదటి వారంలో అనీఖ్ షఫీఖ్ సయ్యద్ నగరానికి చేరుకోగా సురక్షిత ప్రాం తంలో ఇల్లు అద్దెకు తీసుకోవడంతోపాటు కం ప్యూటర్ కోర్సులో చేరాలంటూ అతన్ని రియా జ్ ఆదేశించాడు. దీంతో అనీఖ్ తొలుత సరూర్ నగర్లో ఉంటున్న ఫారూఖ్ బంధు వైన నవీద్ వద్ద ఆశ్రయం పొందాడు. ఆపై నాంపల్లిలోని అజీజియా లాడ్జిలో కొన్ని రోజులు బస చేశాడు. ఆ తర్వా త హబ్సిగూడలోని బంజారా నిల యం అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 302ను అద్దెకు తీసుకున్నాడు. అనీఖ్ ఎవరికీ అనుమానం రాకుండా నగరంలో ఆశ్రయం పొందడంతో పుణేకు చెందిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరిని రియాజ్ హైద రాబాద్ పంపాడు. వారిద్దరూ అమీ ర్‌పేటలోని ధూమ్ కంప్యూటర్స్ లో హార్డ్‌వేర్ శిక్షణలో చేరారు. పే లుళ్లకు కొన్ని రోజుల ముందు సిటీ వచ్చిన రియాజ్... ఇక్కడి ఏర్పాట్ల పై సంతృప్తి చెందాడు. కొన్ని రోజు ల తర్వాత మంగుళూరు నుంచి ఆర్టీసీ బస్సు లో పేలుడు పదార్థాలను పంపగా... అనీఖ్, అక్బర్ ఎంజీబీఎస్‌లో వాటిని అందుకున్నారు. పేలుళ్లకు రెండ్రోజుల ముందు అనీఖ్, అక్బర్లను నగరంలో కలిసిన రియాజ్ కుట్ర అమలుకు సిద్ధం కావాలని ఆదేశించాడు. దీంతో వారిద్దరూ సికింద్రాబాద్‌లో బ్యాగ్‌లు, కోఠిలో బ్యాటరీలు కొని అనుకున్నట్లుగానే 2007 ఆగస్టు 25న మూడు బ్యాగుల్లో బాంబులు పెట్టుకొని బయలుదేరారు. -
లుంబీనీ పేలుళ్ల కేసు.. అనూహ్య తీర్పు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో 2007లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఇద్దరు దోషులుగా తేల్చిన న్యాయస్థానం మరో ఇద్దరని నిర్దోషులుగా ప్రకటించింది. దోషుల్లో అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీఖ్ షఫిక్ సయ్యద్‌లకు శిక్ష ఖరారైంది. దోషులపై సెక్షన్ 302 కింద అభియోగాలు నమోదయ్యాయి. సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. రెండో కేసులో తుది తీర్పును సోమవారం వెలువరించనుంది. ఇక దోషులకు విధించే శిక్ష ఆ రోజే తెలియనుంది. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. -
లేజర్ షోకులేనా?
సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న లుంబినీ పార్కులోని లేజర్ షో మసకబారుతోంది. మొత్తం ఐదెకరాల్లో పార్కు, లేజర్ షో ప్రాంతం, పార్కింగ్ ప్రదేశం ఉన్నాయి. అయితే ఇందులోని ఎకరం స్థలాన్ని ఇటీవల ఆర్అండ్బీ శాఖ తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మాణం కోసం హెచ్ఎండీఏ నుంచి తీసుకుని పనులు చేపట్టింది. దీంతో ఇక్కడకు వచ్చే సందర్శకుల వాహనాలు ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి తలెత్తింది. దీనివల్ల లేజర్షోకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గిపోయింది. బస్సులు, కార్ల పార్కింగ్‌కు చోటులేక దేశ, విదేశీ అతిథులు తమ సందర్శన జాబితాలో లుంబినీపార్కు, లేజర్ షో లేకుండానే పర్యటనను ముగించుకుంటున్నారు. ప్రస్తుతం కార్లు, బస్సులు నిలిపే స్థలాన్ని ఆర్ అండ్‌బీ స్వాధీనం చేసుకుంది. మరో రెండు మూడు రోజుల్లో ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలాన్ని కూడా తీసుకోనున్నారు. అదే జరిగితే.. ఇక్కడకు వచ్చే పర్యాటకులు, సందర్శకుల సంఖ్య పూర్తిస్థాయిలో పడిపోవచ్చని పార్కు నిర్వాహకులు చెబుతున్నారు. తగ్గిపోయిన సందర్శకులు వీకెండ్లో సందర్శులు కుటుంబ సభ్యులతో ఎంచక్కా వాహనాల్లో వచ్చి ఇక్కడ పార్క్ చేసేవారు. తర్వాత లుంబినీపార్కు చుట్టేయడంతో పాటు సాగర్ తీరాన బోటులో షికారు చేసి సాయంత్రం లేజర్ షో చూసి తిరిగి వెళ్లేవారు. ఆగస్టు తొలి రెండు వారాల్లో లుంబినీ పార్కుకు సందర్శకుల సంఖ్య రోజుకు సగటున 5 వేలు ఉంటే.. చివరి రెండు వారాల్లో ఆ సంఖ్య 3,750 వరకు తగ్గిపోయింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య పూర్తిగా పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని, పార్కింగ్‌కు స్థలం ఇవ్వకపోతే లుంబినీపార్కు, లేజర్ షో విశిష్టత మసకబారడం ఖాయమని అధికారులు అంటున్నారు. లేజర్ షోకు ‘నష్ట’కాలమే.. లుంబినీ పార్కుకు వచ్చే పర్యాటకుల్లో సీజన్ సమయాల్లో లేజర్ షోకు 1500 నుంచి 1800 మంది వరకు వీక్షకులు ఉంటారు. ప్రస్తుతం వర్షాకాలం (ఆన్‌సీజన్)లో ఆ సంఖ్య వెయ్యి మందికి పడిపోయింది. ఆగస్టు తొలి రెండు వారాల్లో 800కు పైగానే వీక్షించినా చివరి రెండు వారాల్లో ఆ సంఖ్య 400కు తగ్గిపోయింది. ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలం కూడా పోతే లుంబినీ పార్కు, లేజర్ షో ఆదాయంపై ప్రభావం చూపుతుందని అధికారులు అంటున్నారు. లుంబినీ పార్కు ప్రవేశ రుసుం పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10గా వసూలు చేస్తున్న అధికారులు లేజర్ షోకు రూ.50 తీసుకుంటున్నారు. పార్కుకు రాకుండా నేరుగా లేజర్షోకు వెళ్లేవారికి భద్రతా సిబ్బంది రూ.50 ఛార్జి తీసుకుంటున్నారు. ఈ రకంగా చూసుకుంటే అటు పార్కుకు వచ్చే ఆదాయం, ఇటు లేజర్ షోకు వచ్చే ఆదాయం కేవలం వాహనాలకు పార్కింగ్ లేకపోవడం వల్ల దాదాపు 25 శాతం పడిపోయిందని చెబుతున్నారు. పార్కింగ్‌కు ప్రత్యామ్నాయం చూపెడితే తప్ప ఆదాయం పెరిగే ఛాన్స్ లేదని చెబుతున్నారు. పార్కింగ్‌పై తర్జనభర్జన.. లుంబినీ పార్కులో ప్రస్తుతం పార్కింగ్ కాంట్రాక్ట్ బాధ్యతలు చూసుకుంటున్న సంస్థను తప్పుకోవాలని ఇప్పటికే హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఎన్టీఆర్ గార్డెన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాన్ని పార్కింగ్‌కు అప్పగించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ పరిమిత కాలాన్ని బట్టి సమకూర్చాలని ఆలోనచలో అధికారులు ఉన్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మిస్తున్న ఆర్అండ్బీ అధికారులు తొలిరెండు అంతస్తుల్లో లుంబినీపార్కు, లేజర్ షోకు వచ్చేవారి వాహనాల పార్కింగ్‌కు చోటిస్తామని చెబుతున్నారు. అయితే ఆ నిర్మాణం పూర్తయ్యేసరికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఆలోపు వాహనాల పార్కింగ్ సమస్య ఏంటనేదాని పైనే అధికారులు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. దీనిపై హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి చొరవ చూపి ఏదో ఒక మార్గాన్ని చూపాలని సందర్శకులు డిమాండ్ చేస్తున్నారు. -
జంట పేలుళ్ల కేసులో తీర్పు సెప్టెంబర్ 4కి వాయిదా
-
బ్రేకింగ్: జంట పేలుళ్ల కేసులో తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో 2007లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో తీర్పు వచ్చే నెల నాలుగో తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో నేడు (సోమవారం) తీర్పు వెలువడుతుందని భావించినప్పటికీ.. పలు కారణాల వల్ల నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టు తీర్పును వచ్చేనెలకు వాయిదా వేసింది. భద్రతా కారణాల రీత్యా చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ఐఏ న్యాయమూర్తి శ్రీనివాసరావు ఎదుట ఐదుగురు నిందితులను హాజరుపర్చారు. భద్రత కారణాల వల్ల నిందితులను కోర్టుకు తీసుకెళ్లడం లేదని, జైలు నుంచే వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ఎదుట ప్రవేశపెడతామని జైలు అధికారులు తెలిపారు. గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో పేలుళ్లతోపాటు దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబులకు సంబంధించి మొత్తం 3 కేసుల విచారణ ఈ నెల 7తో పూర్తయిన సంగతి తెలిసిందే. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదు గురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. సోమవారం తీర్పు వెలువడనుండటంతో పోలీసు విభాగం జైలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసింది. ఆక్టోపస్ కమాండోలను మోహరించింది. ఈ పేలుళ్లు జరిగి శనివారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. జంట పేలుళ్ల కేసులను తొలుత నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేశారు. పేలుళ్ల ఘటన తర్వాత నాటి ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరుకు ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) విభాగాన్ని ఏర్పాటు చేసి నిఘా, ఆపరేషన్స్, దర్యాప్తు బాధ్యతలు కల్పిస్తూ పోలీసుస్టేషన్ హోదా ఇచ్చింది. దీంతో సిట్ నుంచి ఈ 3 కేసులూ ఆక్టోపస్‌కు వెళ్లాయి. దీనిపై ఆక్టోపస్ అధికారులు 2009లో 3 అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇది జరిగిన ఏడాదికే ఆక్టోపస్‌ను కమాండో ఫోర్స్‌గా మార్చిన ప్రభుత్వం పోలీ సు స్టేషన్ హోదాను ఉగ్రవాద వ్యతిరేక విభాగమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్‌కు కట్టబెట్టింది. దీంతో ఈ కేసులు సీఐ సెల్‌కు బదిలీ అయ్యాయి. సీఐ సెల్‌కు భవిష్యత్తులో మరే ఇతర కేసు దర్యాప్తును అప్పగించకూడ దని నాడే నిర్ణయించారు. దీంతో ఆక్టోపస్, సీఐ సెల్ వింగ్స్ పర్యవేక్షించిన తొలి, ఆఖరి కేసులుగా ఈ మూడే రికార్డులకు ఎక్కాయి. -
జంట పేలుళ్ల కేసులో తుది తీర్పు నేడే
-
జంట పేలుళ్ల కేసులో నేడే తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ 2007లో హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో జరిపిన జంట బాంబు పేలుళ్ల కేసులో సోమవారం తీర్పు వెలువడనుంది. గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో పేలుళ్లతోపాటు దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబుల కు సంబంధించి మొత్తం 3 కేసుల విచారణ ఈ నెల 7తో పూర్తయింది. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదు గురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. సోమవారం తీర్పు వెలువడనుండ టంతో పోలీసు విభాగం జైలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసింది. ఆక్టోపస్ కమాండోలను మోహరించింది. ఈ పేలుళ్లు జరిగి శనివారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవే ‘తొలి–ఆఖరి’ కేసులు... పేలుళ్ల కేసులను తొలుత నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేశారు. పేలుళ్ల ఘటన తర్వాత నాటి ప్రభుత్వం ఉగ్ర వాదంపై పోరుకు ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) విభాగాన్ని ఏర్పాటు చేసి నిఘా, ఆపరేషన్స్, దర్యాప్తు బాధ్యతలు కల్పిస్తూ పోలీసుస్టేషన్ హోదా ఇచ్చింది. దీంతో సిట్ నుంచి ఈ 3 కేసులూ ఆక్టోపస్‌కు వెళ్లాయి. దీనిపై ఆక్టోపస్ అధికా రులు 2009లో 3 అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇది జరిగిన ఏడాదికే ఆక్టోపస్‌ను కమాండో ఫోర్స్‌గా మార్చిన ప్రభుత్వం పోలీ సు స్టేషన్ హోదాను ఉగ్రవాద వ్యతిరేక విభాగమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్‌కు కట్టబెట్టింది. దీంతో ఈ కేసులు సీఐ సెల్‌కు బదిలీ అయ్యాయి. సీఐ సెల్‌కు భవిష్యత్తులో మరే ఇతర కేసు దర్యాప్తును అప్పగించకూడ దని నాడే నిర్ణయించారు. దీంతో ఆక్టోపస్, సీఐ సెల్ వింగ్స్ పర్యవేక్షించిన తొలి, ఆఖరి కేసులుగా ఈ మూడే రికార్డులకు ఎక్కాయి. -
హైదరాబాద్ గోకుల్ చాట్ పేలుళ్లకు 11 ఏళ్లు
-
హైదరాబాద్ జంట పేలుళ్లకు 11 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్ : 41 మందిని బలితీసుకున్న హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటనకు నేటితో పదకొండేళ్లు పూర్తయ్యాయి. 2007, ఆగస్టు 25న లుంబిని పార్కు, గోకుల్ చాట్‌లో సంభవించిన జంట పేలుళ్లు ఎన్నో కుటుంబాలను వీధిన పడేశాయి. నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్ల కేసుకు సంబంధించిన తుది తీర్పును ఎన్ఐఏ స్పెషల్ కోర్టు సోమవారం(ఆగస్టు 27) వెలువరించనుంది. ప్రభుత్వమే ఆదుకోవాలి.. ఈ ఉగ్రదాడి జరిగి పదకొండేళ్లయినా బాధిత కుటుంబాలను మాత్రం వాటి ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కోఠి గోకుల్ చాట్ వద్ద నివాళులర్పించిన బాధిత కుటుంబాలు.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నాయి. చికిత్స కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నామని... దీంతో ఆర్ధికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
షికారు.. మరింత హుషారు!
సాక్షి, హైదరాబాద్: అసలే వర్షాకాలం.. ఒకింత చలి.. ఒక్కోసారి ఉక్కపోత... కాంక్రీట్ జంగిల్లో ప్రజలు ఉండలేక రాజధాని నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ తీరానికి బారులు తీరుతున్నారు. పర్యాటకుల సరదాకు తగినట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ)అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న స్పీడు బోట్లు , సాంస్కృతికానందాన్ని పంచే ఖైరున్నీసా, భాగమతి బోట్లే కాక మరి కొన్నింటిని తీసుకువస్తున్నారు. బోటు షికారుకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ‘ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లు’తీసుకురానుండటంతో షికారుకే కొత్త హుషారు రానుంది. లుంబినీ పార్కు బోటింగ్ పాయింట్లో అంతర్జాతీయ ప్రమాణాలు సమకూరుతున్నాయి. ఆసక్తిగా ఎదురుచూస్తున్న పర్యాటకులు హుస్సేన్‌సాగర్‌లో బోటు షికారు అంటే ఎవరికైనా హుషారు వస్తుంది. అందులో కొత్తగా వచ్చే ‘ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్ల’కు మరింత గిరాకీ రానున్నది. చూడటానికి బంగారు వర్ణంలో హుందాగా కన్పిస్తుండటంతో అందులో షికారుకు అందరూ మక్కువ చూపే అవకాశం ఉంది. శుక్ర, శని, ఆదివారాలు, ప్రత్యేక సెలవుదినాల్లో పర్యాటకులు ఇక్కడి బోట్లలో జలవిహారానికి ముచ్చటపడతారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ టైపు బోట్లు రెండు త్వరలో సాగర్‌లోకి ప్రవేశం చేయగానే వాటికి పేరు పెట్టాల్సి ఉంది. వేడుకలు... ఆనందమే... పుట్టిన రోజు, పెళ్లిరోజు వేడుకలు వంటి చిన్న కార్యక్రమాలు ఇందులో చేసుకునే వెసులుబాటు ఉంది. పార్టీల కోసం వీటిని అద్దెకు ఇస్తామని టీఎస్‌టీడీసీ అధికారులు చెబుతున్నారు. ఇవి హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. గతంలో ఉన్న ఖైరున్నీసా హోటల్ టైపులో ఉంటుంది. కానీ, ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లకు చుట్టూ గ్లాస్(అద్దం), పైన టాప్ కూడా గ్లాస్ అమర్చబడి ఉంటుంది. అంటే కింది భాగం తప్పా బోట్ అంతా అద్దంతో తయారు చేసి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా బస్సు టైపు బోట్లు దర్శనమిస్తాయి. విభిన్నంగా ప్రపంచంలో ఎక్కడా లేనట్లు సరికొత్తగా ఉండాలని టీఎస్‌టీడీసీ అధికారులు ప్రత్యేకంగా వీటిని తయారు చేయిస్తున్నారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోటు నమూనా రెండు విభిన్న రకాలు... విభిన్న రేట్లు.. సాగర్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లు మల్టీపర్పస్‌గా యూజ్ అవుతాయి. కుర్చీలు ఎటువైపు అయినా అమర్చుకొనే వెసులుబాటు ఉంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఫిక్స్డ్ సీట్ల బోట్లు ఉంటాయి. ఇందులో పర్యాటకులు ఇంట్లో ఉన్నట్లు అనుభూతి పొందుతారు. నచ్చిన చోట, నచ్చిన వైపు సీట్లు వేసుకొని కూర్చొనే వెసులుబాటు ఉంటుంది. దీనికి పెద్ద ఇంజన్లు ఉండవు. అవుట్ బోర్డు మోటార్స్ –2 అమర్చి ఉంచుతారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లు రెండు రకాలున్నాయి. ఒకదానిలో 32 నుంచి 50 సీట్లు, రెండోది 80 నుంచి 100 సీట్లు ఉంటాయి. ఇందులో నదిలో విహరిస్తున్నట్లు ఉంటుంది. వీటి విలువ రూ.కోటి నుంచి రెండు కోట్ల వరకు ఉంటుంది. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. అందుబాటులో ఉన్న బోట్లు ఇవే... హుస్సేన్‌సాగర్‌లో చిన్నవి, పెద్దవి మొత్తం 17 బోట్లు ఉన్నాయి. మరో ఐదు రిపేరులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరో రెండు రాబోతున్నాయి. మూలన పడిన ఫ్యారా సెయిలింగ్, జెడ్ స్కీ బోట్లను సైతం మరమ్మతులు చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. - విందులు వినోదాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించే వీలున్న ఖైరున్నీసా, భాగమతి బోట్లల్లో 40 నిమిషాలపాటు సాగరంలో విహరించవచ్చు. భగీరథిలో 200 మంది వరకూ విహరించవచ్చు. - 5 మెకనైజ్డ్ బోట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి బుద్ధుడి వద్దకు తీసుకెళ్లి తీసుకొస్తాయి. 2 డీలక్స్బోట్లు అందుబాటులో ఉన్నాయి. - రాజహంస పడవలో హుందాగా అలలపై 15 నిమిషాలపాటు తేలియాడి రావొచ్చు. వీటికితోడు స్పీడుబోటులో సాగర్‌లో దూసుకుపోవాలంటే నడిపే వ్యక్తితో పాటు ఒక్కరే ప్రయాణించవచ్చు. ఆకర్షించేందుకు ప్రణాళికలు పర్యాటకంగా సాగర్‌ను అభివృద్ధి చేసేందుకు అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వీకెండ్లో ఒక్కొక్క రోజు వేలమంది పర్యాటకులు బోటింగ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే క్రమక్రమంగా లుంబినీ పార్కు బోటింగ్ యూనిట్లో అంతర్జాతీయ ప్రమాణాలు ప్రవేశ పెట్టబోతున్నాం. హైదరాబాద్‌కు వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు లుంబినీ పార్కు సందర్శించి బోటింగ్ చేయాలనే ఆలోచనకు తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. – టీఎస్‌టీడీసీ ఎండీ మనోహర్ -
వింటేజ్ మోటార్ షో
-
చీకటి రోజుకు పదేళ్లు
∙ ఇంకా పరారీలోనే ప్రధాన సూత్రధారి రియాజ్ ∙ నిందితులపై కొనసాగుతున్న విచారణ సిటీబ్యూరో: లుంబినీపార్క్, గోకుల్చాట్ల్లో జంట పేలుళ్లు చోటు చేసుకుని శుక్రవారం నాటికి పదేళ్లు పూర్తయింది. 2007 ఆగస్టు 25న జరిగిన ఈ ఉగ్రవాద చర్యలో 41 మంది ప్రాణాలు కోల్పోగా... మరో 300 మంది వరకు క్షతగాత్రులయ్యారు. వీరిలో అనేక మంది ఇప్పటికీ జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. అదే రోజున దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ పేలని బాంబునూ స్వాధీనం చేసుకున్నారు. ఉదంతం చోటు చేసుకున్న 14 నెలలకు ఈ ఘాతుకాని ఒడిగట్టింది ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులుగా తేల్చిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. రాష్ట్ర ఆక్టోపస్ అధికారులు ఈ ఘాతుకంపై చార్జ్‌షీట్ సైతం దాఖలు చేశారు. ప్రస్తుతం ట్రయల్ దశలో ఉన్న ఈ కేసును ఇంటెలిజెన్స్ ఆధీనంలోని సీఐ సెల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ‘ట్విన్ బ్లాస్ట్’ క్రమం ఓసారి పరిశీలిస్తే... 25.8.07 సాయంత్రం 7–7.30 గంటల మధ్య లుంబినీ పార్క్, గోకుల్ఛాట్ల్లో షేప్డ్ బాంబులు పేలాయి. వెంకటాద్రి థియేటర్ వద్ద ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జి కింద ఓ పేలని బాంబు కూడా దొరికింది. 27.8.07 ఊహా చిత్రాలు రూపొందించి దాదాపు 130 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. రెండు కుట్రలు వెలుగులోకి రావడంతో కొందరిపై ఆ కేసులు నమోదు చేశారు. 10.1.08 హైదరాబాద్‌కు చెందిన రజీయుద్దీన్ నాసిర్‌ను కర్ణాటకలోని దావళగెరె పోలీసులు అరెస్టు చేశారు. అయితే జంట పేలుళ్లపై ఎలాంటి క్లూ లభించలేదు. 6.10.08 ఢిల్లీ ఎన్కౌంటర్లో దొరికిన లీడ్స్‌పై దర్యాప్తు చేపట్టిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ మొత్తం ఇండియన్ ముజాహిదీన్ గుట్టు విప్పింది. 2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడిన ఈ ఉగ్రవాదుల్లో దాదాపు 20 మందిని అరెస్టు చేశారు. వీరిలోనే జంట పేలుళ్ల నిందితులు సైతం ఉండటంతో సిట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న కేసు కొలిక్కి వచ్చింది. 30.11.08 ఉగ్రవాదంపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) రూపుదిద్దుకున్న ఏడాది తరవాత అధికారిక దర్యాప్తు ప్రారంభించింది. 1.2.09 జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల్లో అనీఖ్ షఫీఖ్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అన్సార్ బాద్షా షేక్‌లను పీటీ వారెంట్ పై ముం బయి నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. 9.2.09 దర్యాప్తులో కీలక ఘట్టమైన టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్‌ను చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్వహించారు. లుంబినీ పార్క్‌లో బాంబు పెట్టిన అనీఖ్తో పాటు ఇతనితో కలిసి హబ్సిగూడలోని బంజారా నిలయంలో బస చేసిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను సాక్షులు గుర్తించారు. 25.3.09 జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు ఉగ్రవాదులను ఆక్టోపస్ అధికారులు హైదరాబాద్ తరలించారు. అనీఖ్ షఫీఖ్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అన్సార్ బాద్సా షేక్‌లను 2009 ఫిబ్రవరిలోనే తీసుకురాగా... ఐఎం కో–ఫౌండర్ సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ తర్ఖాష్‌లను పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి తదుపరి దర్యాప్తు జరిపారు. 15/28.5.09, – 20.6.09 జంట పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులనూ దర్యాప్తు చేసిన ఆక్టోపస్ అధికారులు అనేక కీలక ఆధారాలు సేకరించి నాంపల్లి కోర్టులో చార్జ్షీట్లు దాఖలు చేశారు. వీటిలో లుంబినీపార్క్‌లో బాంబు పెట్టిన అనీఖ్, గోకుల్‌చాట్‌లో ఐస్‌క్రీమ్ డబ్బాపై బాంబు పెట్టిన రియాజ్ భత్కల్, దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పెట్టిన అక్బర్‌లతో పాటు ఇక్బాల్ భత్కల్, ఐఎం ఫౌండర్ అమీర్ రజా ఖాన్, ఫారూఖ్ తర్ఖాష్, సాదిక్ షేక్‌లను నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో రియాజ్, ఇక్బాల్, అమీర్ రజా ఇప్పటికీ పరారీలో ఉన్నారు. సీఐ సెల్‌కు కేసు బదిలీ ఆక్టోపస్‌ను పూర్తి స్థాయి కమాండో ఫోర్స్‌గా మార్చిన తర్వాత ఈ కేసుల్ని ఉగ్రవాద వ్యతిరేక విభాగం సీఐ సెల్‌కు బదిలీ చేశారు. ఈ వి«భాగం పర్యవేక్షిస్తున్న ఏకైక కేసు ఇదే కావడం గమనార్హం. ఐఎం ఉగ్రవాదులపై దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉండటంతో ఆయా అధికారులు తీసుకువెళ్ళడం, తీసుకురావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేసు విచారణకు సమయం పడుతోంది. -
పరారీలోనే ప్రధాన సూత్రదారి
సాక్షి, సిటీబ్యూరో: రియాజ్ భత్కల్... గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్లకు సూత్రధారిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నమోదైన విధ్వంసాల కేసుల్లో ఇతడి పేరు ప్రముఖంగా ఉంది. ఉగ్రవాదం ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం చేశాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) గుట్టు బయటపడటం వెనుకా ఇతని ‘పాత్ర’ ఉంది. 2007 ఆగస్టు 25 నాటి ఆ జంట పేలుళ్లకు తొమ్మిదేళ్లు పూరై్తన నేపథ్యంలో ఇప్పటికీ పరారీలోనే ఉన్న ఈ గజ ఉగ్రవాది నేపథ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... ముంబైలో మొదలైన ‘ప్రస్థానం’... రియాజ్ భత్కల్ అసలు పేరు రియాజ్ అహ్మద్ షహబంద్రి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ గ్రామంలో 1976 మే 19న పుట్టాడు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు, స్మగ్లింగ్ వ్యవహారాలు ఎక్కువ. ఆ ప్రభావంతోనే రియాజ్ భత్కల్ నేరబాట పట్టాడు. వీరి కుటుంబం కొన్నాళ్ల పాటు ముంబైలో నివసించింది. మొదటి నుంచి డబ్బుపై యావ ఎక్కువ ఉన్న ఇతగాడు ఈ నేపథ్యంలోనే ముంబై గ్యాంగ్‌స్టర్ ఫజల్–ఉర్–రెహ్మాన్ ముఠాలో చేరాడు. బెదిరింపులు, కిడ్నాప్‌లు వంటివి చేసి డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. ఈ మేరకు ఇతనిపై కోల్‌కత, ముంబై, కర్ణాటకల్లో అనేక కేసులు నమోదైనా... ఒక్కసారీ అరెస్టు కాలేదు. ఈ గ్యాంగ్ నుంచి బయటకు వచ్చి కుర్లా ప్రాంతంలో ‘ఆర్ఎన్’ పేరుతో కొత్తముఠా కట్టి కొంతకాలం వ్యవహారాలు సాగించాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రార్థనా స్థలంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు తరచూ వెళ్లేవాడు. ఆ ప్రోద్భలంతో నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)లో పని చేశాడు. అప్పడికే ఇతని అన్న ఇక్బాల్ భత్కల్ పాక్ ప్రేరేపిత లష్కరేతొయిబాతో సంబంధాలు పెట్టుకోవడంతో అతని ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, రెండో కమాండ్ ఇన్‌చార్‌్జగా వ్యవహరిస్తున్నాడు. ఆసిఫ్ రజా కమెండో ఫోర్స్ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించిన కోల్‌కతా వాసి అమీర్ రజా ఖాన్ నుంచి అందే ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన విధ్వంసాలకు పేలుడు పదార్థాలు, మనుషులు, డబ్బు సమకూరుస్తుంటాడు. ధనార్జన కోసం రియల్టర్ అవతారం... జిహాద్ పేరుతో యువకులను ఉగ్రవాదం వైపు నడిపించి వారి భవితను భత్కల్ బుగ్గిపాలు చేశాడు. తాను మాత్రం ఉగ్రవాదం పేరు చెప్పి వసూలు చేసిన నిధులను భారీగా దారి మళ్లించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. మరిన్ని నిధుల కోసం పూణేకు చెందిన వ్యాపారుల కిడ్నాప్‌కు కుట్రపన్నాడు. విధ్వంసాలకు శిక్షణ, పేలుడు పదార్థాలు కొనుగోలు, ఆయుధాల సేకరణ పేరుతో కొన్ని విదేశీ సంస్థల నుంచి హవాలా రూపంలో భారీగా నిధులు సమీకరించాడు. అయితే వాటిని తన సొంత ‘ఖాతా’ల్లోకి మార్చుకుంటూ మంగుళూరు సమీపంలోని థోయ్యత్తు, ఉల్లాల్ పరిసరాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశాడు. హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్ పేలుళ్ల నిమిత్తం అంటూ విదేశీ సంస్థల నుంచి రూ.లక్షల్లో నిధులు సమీకరించాడు. భత్కల్ ఇండియన్ ముజాహిదీన్‌లో సెకండ్ కమాండ్ ఇన్చార్జ్ హోదాలో ఉండటంతో నిధులుపై అజమాయిషీ ఇతనిదే. దీంతో జమాఖర్చులు అడిగే సాహసం మాడ్యూల్‌లోని ఎవరూ చేయలేకపోయారు. ‘ఐఎం’ గుట్టు బయటపడింది ఇతని వల్లే... ఐఎంలో కీలక వ్యక్తిగా ఉన్న రియాజ్ భత్కల్ అనేక పేలుళ్ల సందర్భంలో కొన్ని ఈ–మెయిల్స్ రూపొందించి మీడియా సంస్థలకు పంపాడు. దీనిని మరో ఉగ్రవాది సాదిక్ షేక్ వ్యతిరేకించాడు. ఇలా చేయడం వల్ల తమ ఉనికి బయటపడి, దర్యాప్తు అధికారులకు పట్టుబడే అవకాశం ఉందని వాదిస్తూ వచ్చాడు. ఈ మాటలను రియాజ్ పెడచెవిన పెట్టాడు. ప్రతి విధ్వంసానికీ వ్యూహరచన చేసి కథనడిపేది తామైతే... చివరకు పేరు మాత్రం సీమాంతర ఉగ్రవాద సంస్థలకు రావడం రియాజ్‌కు రుచించలేదు. తమ సంస్థ పేరు బయటకు వచ్చి ప్రచారం జరిగితే నిధులు భారీగా వస్తాయని సాదిక్‌తో వాదించాడు. తన పంతం నెగ్గించుకొని ప్రతీ విధ్వంసానికీ ముందు ఈ–మెయిల్ పంపేవాడు. ఈ మెయిల్స్ వచ్చిన ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు ఐఎంకు సంబంధించిన కొన్ని వివరాలు సేకరించారు. అలా ప్రారంభమైన దర్యాప్తుతోనే 2008లో ఐఎం గుట్టురటై్టంది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన రియాజ్.. ప్రస్తుతం పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. జంట పేలుళ్లులో ఇదీ పాత్ర.... మహారాష్ట్రలోని పూణేకు చెందిన మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్‌చౌదరి, అనీఖ్ షపీఖ్ సయ్యద్‌లు మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు 2007 జూలైలో హైదరాబాద్ వచ్చారు. అదే ఏడాది జూలై, ఆగస్టుల్లో రియాజ్ అనేకసార్లు నగరానికి వచ్చి వెళ్లాడు. అక్బర్, అనీఖ్లు తమ ‘టార్గెట్’ను ఎంచుకొని ముంబైలో ఉన్న రియాజ్ భత్కల్‌కు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ పేలుళ్లకు కొన్ని రోజుల ముందు ముంబైలో జరిగిన సమావేశంలో ఇండియన్ ముజాహిదీన్ మాస్టర్‌మైండ్ గా భావించే రియాజ్ భత్కల్, సాదిక్ షేక్‌లతో పాటు అన్సార్ అహ్మద్ బాద్షా షేక్ కూడా పాల్గొన్నాడు. ప్రణాళిక మొత్తం సిద్ధమయ్యాక ఆగస్టు 23న భత్కల్ నగరానికి వచ్చాడు. అప్పటికే పార్సిల్లో పంపిన బాంబులను అసెంబుల్ చేశాడు. చివరకు ఆగస్టు 25న రియాజ్ భత్కల్ గోకుల్‌ఛాట్‌లో, అనీఖ్ షఫీఖ్ సయ్యద్ లుంబినీపార్క్‌లో బాంబులు అమర్చగా... మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి దిల్‌షుక్‌నగర్‌లో బాంబు పెట్టాడు. మొదటి రెండూ పేలగా... మూడోది పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
బుల్లెట్లా దూసుకెళ్తాం..
-
పార్కుల్లో భద్రతపై ఆరా..!
లుంబినీ, ఎన్టీఆర్, సంజీవయ్య పార్కును పరిశీలించిన నిఘా బృందం అన్ని పార్కుల్లో బయటపడ్డ భద్రతా లోపాలు సిటీబ్యూరో : హుస్సేన్‌సాగర్ తీరంలో నిత్యం సందర్శకులతో కిటకిటలాడే లుంబిని పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కుల్లో ప్రజాభద్రతపై పోలీసు అధికారుల నిఘా బృందం లోతుగా అధ్యయనం చేసింది. లష్కరే తోయిబా, హిజుబుల్ ముజాహిద్దీన్, ఐఎస్ఐఎస్ వంటి తీవ్రవాద సంస్థలు మెట్రోపాలిటన్ నగరాల్లో విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు సాగర్ పరిసరాల్లో సందర్శనీయ ప్రాంతాలైన పార్కుల ను బుధ, గురువారాల్లో సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా లుంబినీ, ఎన్టీఆర్గార్డెన్, సంజీవయ్య పార్కుల్లోని భద్రతాపరమైన అనేక లోపాలు బయటపడ్డాయి. లుంబిని లేజర్ షో ప్రాంగణంలో అగ్నిప్రమాదం సంభవిస్తే నివారించేందుకు ఎలాంటి పరికరాలు ఏర్పాటు చేయకపోవడాన్ని నిఘా బృందం గుర్తించింది. గతంలో ఇక్కడ తీవ్రవాదులు జరిపిన మారణ హోమంలో 11 మంది అసువులుబాసినా హెచ్ఎండీఏ ప్రజాభద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టక పోవడాన్ని పోలీసు అధికారులు తప్పుబట్టారు. ఎన్టీఆర్ మెమోరియల్ వెనుక సెక్రటేరియట్ వైపు ఉన్న గుడిసెలను వెంటనే తొలగించాలని నిర్ణయించారు. వీఐపీల కదలికలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డుపక్కనే ఉన్న గుడిసెల వల్ల ముప్పు ఉందని నిఘా అధికారులు భావిస్తున్నారు. అలాగే ఐమాక్స్ థియేటర్ వెనుక వైపున ఫెన్షింగ్ పటిష్టంగా లేకపోవడాన్ని నిఘా అధికారులు గుర్తించారు. ఐమాక్స్ థియేటర్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్‌లోకి, అలాగే గార్డెన్ నుంచి థియేటర్ వైపునకు వెళ్లేందుకు మార్గం సులభంగా ఉండటంతో ఇక్కడ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సుమారు 90 ఎకరాల విస్తీర్ణం ఉన్న సంజీవయ్య పార్కులో తగినన్ని సీసీ కెమెరాలు లేని విషయాన్ని, అలాగే సాగర్ గట్టు వెంట నిర్మించిన రెయిలింగ్ ఎత్తు చాలా తక్కువ ఉండటాన్ని నిఘా బృందం గమనించింది. పీవీ ఘాట్ వెనుక ప్రాంతంలో పడిపోయిన కాంపౌండ్ వాల్‌ను తిరిగి నిర్మించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. సందర్శకులతో రద్దీగా ఉండే ఈ పార్కుల్లో నామమాత్రంగా సెక్యూరిటీ సిబ్బందిని కొనసాగిస్తున్న తీరుపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్లకు వస్తున్న వాహనాలపై ఎలాంటి తనిఖీలు చేయకపోవడం, పార్కింగ్ లాట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం వ ంటి లోపాలను అధికారులు గుర్తించారు. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని సంబధిత అధికారి ఒకరు తెలిపారు. తనిఖీల్లో ఏసీపీ సురేందర్‌రెడ్డి, ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచి అధికారులు, సైఫాబాద్ పోలీసులు, హెచ్ఎండీఏ ఏఓ, రేణుకాశక్తి సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు. -
పేలుళ్ల నిందితుడికి బెయిల్ నిరాకరణ
హైదరాబాద్: హైదరాబాద్ వరుస పేలుళ్ల కేసు నిందితుడికి హైకోర్టులో చుక్కెదురైంది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పేలుళ్ల సంఘటనల్లో నిందితుడు ఫరూక్ షర్పొద్దీన్ తర్కాష్ల అలియాస్ అబ్దుల్లాకు బెయిల్ ఇవ్వడానికి గురువారం హైకోర్టు నిరాకరించింది. 2007 ఆగస్టు 25న ... లుంబినీపార్క్, గోకుల్ చాట్ ప్రాంతాల్లో ఏకకాలంలో పేలుళ్లు సంబవించిన విషయం తెలిసిందే. ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలపాలయ్యారు. ఆ తర్వాత 2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో అక్కడికక్కడే 17 మంది చనిపోగా 80 వరకు గాయపడ్డారు. -
లుంబినీ పార్క్ దగ్గరకు మహా గణపతి
-
లుంబినీ పార్క్ దగ్గరకు మహా గణపతి
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణనాథుడి శోభాయాత్ర కనుల విందుగా సాగుతోంది. ఎన్టీఆర్ ఘాట్ రోడ్డు మీదుగా మహా గణపతిని నిమజ్జన కార్యక్రమానికి తరలించారు. ప్రస్తుతం లుంబినీ పార్క్ వద్దకు మహాగణపతి శోభాయాత్ర చేరుకుంది. మరో రెండు గంటల్లో మహా గణపతి నిమజ్జన కార్యక్రమం ముగిస్తామని పోలీసులు చెప్పారు. గంట సమయం వెల్డింగ్ పనులు చేసేందుకు.. మరో గంట సమయం పూజలకు పడుతుందని, ఆ తర్వాత నిమజ్జనం మొదలు పెడతామని చెప్పారు. మరోపక్క, ఆదివారమే నిమజ్జన పనులు ముగుస్తాయని భావించినా సోమవారం మొత్తం గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగేలా ఉన్నాయి. గణేశ్ నిమజ్జన వేడుకలతో తెలుగు రాష్ట్రాల రాజధాని భాగ్యనగరం పులకించిపోతోంది. జంటనగరాలు విఘ్నేశ్వరుడి శోభాయాత్రతో సందడిగా మారాయి. కన్నుల పండువగా సాగుతున్న నిమజ్జన వేడుకులను తిలకించేందుకు భక్త జనం ట్యాంక్ బండ్‌కు బారులు తీరింది. లక్షలాది మంది భక్తులు గణపతి విగ్రహాల వెంట తరలిరావడంతో మహానగర రహదారులు ఆధ్యాత్మికశోభను సంతరించుకున్నాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో భక్తిమయ వాతావరణం నెలకొంది. సామాన్య భక్తులతో పాటు రాజకీయ నేతలు కూడా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. -
గోకుల్‌చాట్ ఘటనకు ఎనిమిదేళ్లు
అబిడ్స్ (హైదరాబాద్) : గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో జంట బాంబు పేలుళ్లు సంభవించి నేటికి ఎనిమిదేళ్లయ్యాయి. భాగ్యనగరం గుండెపై ఓ మానని గాయంలాంటి ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఈరోజు బీజేపీ కార్యకర్తల ఆధ్యర్యంలో నాటి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా 'ఉగ్రవాదం నశించాలి' అనే నినాదంతో బ్యానర్లను ఏర్పాటు చేశారు. భారతమాత విగ్రహానికి పూలమాల వేసి మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు. -
వెంటాడే పీడకల
గోకుల్ చాట్, లుంబినీ పార్కు పేలుళ్లకు ఎనిమిదేళ్లు సుల్తాన్‌బజార్: కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుందంటారు.. కానీ ఎనిమిదేళ్లు గడిచినా ‘జంట పేలుళ్ల’ ఘటనను మాత్రం ప్రజలు మరిచిపోలేక పోతున్నారు. నిద్దురలోనూ ఉలికిపడుతున్నారు. 2007లో ఆగష్టు 25న సాయంత్రం 7.45 గంటలకు కోఠిలోని గోకుల్ చాట్, లుంబినీ పార్కు లేజర్ షో చూస్తున్నవారిపై ఐఎస్ఐ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు విసిరిన పంజా విసిరారు. ఈ ఘటనలో 44 మంది అమాయకులు బలయ్యారు. ఈ దుర్ఘటన జరిగి నేటికి ఎనిమిదేళ్లు. ఇన్నేళ్లు గడిచినా స్థానికుల్లో ఇంకా భయం వీడలేదు. జంట బాంబు పేలుళ్లలో చనిపోయినవారి కుటుంబాలకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి బాధితులకు భరోసా కల్పించారు. ైవె ఎస్ అకాల మరణంతో కొంతమంది బాధితులకు నేటికీ న్యాయం జరగలేదు. నాయకులు ఏటా ఈ ప్రాంతాలకు వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు గాని బాధితులకు సాయం మాత్రం చేయడంలేదు. ప్రతి సంవత్సరం కోఠిలోని గోకుల్ చాట్‌కు బాధితులు వచ్చి వైఎస్సార్ బతికుంటే తమకు న్యాయం జరిగేదని కన్నీరు పెట్టుకోవడం పరిపాటిగా మారింది. నేటి పాలకులైనా జంట పేలుళ్లలో మృతిచెందిన కుటుంబాలను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. జంట పేలుళ్లలో చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని గత ఏడేళ్లుగా గోకుల్‌చాట్ యాజమాని ప్రేంచంద్ విజయవర్గి దుకాణాన్ని బంద్ చేస్తున్నారు. మంగళవారం సైతం గోకుల్‌చాట్ బంద్ ఉంటుందని ఆయన తెలిపారు. ఆ శబ్దం నేటికీ ప్రతిధ్వనిస్తోంది ఆనాడు గోకుల్‌చాట్‌లో జరిగిన బాంబు పేలుడు శబ్దం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. అ సమయంలో నేను వెనుక వైపు ఉండడంతో బతికి బయటపడ్డాను. ఎక్కడ ఏ శబ్దం విన్నా ఆ బాంబు పేలుళ్ల శబ్దాలే గుర్తుకువచ్చి గుండె జల్లుమంటుంది. ఇలాంటి ఘటనతో మేము ప్రైవేటు సెక్యూరిటీతో పాటు ఎలక్ట్రానిక్ నిఘా ఏర్పాటు చేసుకున్నాం. ఆనాటి భయం మాత్రం పోవడంలేదు. - ప్రేంచంద్, గోకుల్‌చాట్ యాజమాని ఆ రోడ్డున వెళ్లాలంటే భయం.. ఇప్పటికీ గోకుల్‌చాట్ భండార్‌కు వెళ్లాలంటే ఆనాటి ఘటన గుర్తుకు వచ్చి భయంగా ఉంటుంది. ఉగ్రవాదులు పెట్టిన బాంబు పేలుళ్లలో తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్నవారిని నా చేతులతో ఆటోలు, కార్లు, బస్సుల్లో తరలించా. కొందరు అవయవాలు తెగిపడి గిలగిలా కొట్టుకుంటూ నా చేతుల్లో ప్రాణాలు విడిచారు. ఈ ఘటనను తలచుకుంటే కన్నీళ్లు ఆగవు. - సునీల్ బిడ్లాన్, కుత్బిగూడ -
డబ్బంటే వాళ్లకు అంత చేదా...?
ఏ సంస్థ అయినా ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నప్పుడు అనవసరపు ఖర్చులు తగ్గించుకొని..ఆదాయపు మార్గాల కోసం అన్వేషిస్తుంది. అయితే హెచ్ఎండీఏ ఇందుకు వ్యతిరేకం. లుంబినీ పార్కు ద్వారా మరింత ఆదాయం సమకూరే అవకాశాలున్నా అందిపుచ్చుకోలేక పోతోంది. దీంతో లక్షల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకొన్న వివిధ నిర్మాణాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. -సాక్షి, సిటీబ్యూరో లుంబినీ పార్కులో నిరుపయోగంగా అద్భుత నిర్మాణాలు ఔత్సాహికులు ముందుకొచ్చినా... అలక్ష్యం ఆదాయంపై ఆరాటంలేని హెచ్ఎండీఏ 1) హుస్సేన్‌సాగర్ తీరాన లుంబినీ పార్కులో పదేళ్ల క్రితం రెస్టారెంట్ కోసం అద్భుతమైన స్టీల్ స్ట్రక్చర్‌ను నిర్మించారు. అలాగే లేజర్ షోను ఆనుకొని సర్వాంగ సుందరంగా ఓ వాణిజ్య సముదాయాన్ని హెచ్ఎండీఏ నిర్మించింది. వీటిని లీజుకు ఇచ్చే విషయంలో అధికారులు శ్రద్ధ పెట్టకపోవడంతో కోట్లాది రూపాయల ఆదాయం సంస్థకు అందకుండా పోతోంది. 2) లుంబినీ పార్కులో భారీ స్టీల్ స్ట్రక్చర్‌ను నిర్మించేందుకు 11ఏళ్ల క్రితం రూ.15లక్షల వరకు నిధులు వెచ్చించారు. ఆ తర్వాత వివిధ కారణాలను సాకుగా చూపుతూ దాన్ని గాలికొదిలేశారు. అందులో ఫుడ్ కోర్టు పెట్టుకొనేందుకు అనుమతిస్తే నెలకు రూ.50-60వేలు అద్దె చెల్లిస్తామని ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. అయితే.. అధికారులు స్పందించక పోవడంతో అది వెనుదిరిగింది. 3) లుంబినీ పార్కులో లేజర్ షో కోసం 2005లో అద్భుతమైన నిర్మాణం చేశారు. ఆతర్వాత దీనికి రూ.60లక్షలు వెచ్చించి కార్పొరేట్ భవనంగా హంగులద్దారు. రెండంతస్తులున్న ఈ భవనం ఏళ్లతరబడి ఖాళీగా పడిఉంది. ఈ భవనాన్ని లీజ్కిస్తే నెలకు లక్షల రూపాయలకు పైగా ఆదాయం వచ్చేది. ఇక్కడ చిల్డ్రన్ ఎమ్యూజ్మెంట్ పార్కు, ఫాస్టు ఫుడ్ సెంటర్, ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు లీజ్‌కు ఇవ్వాలంటూ పలు సంస్థలు బీపీపీకి దరఖాస్తు చేసుకొన్నాయి. నక్షత్ర (స్టార్) హోటల్ నిర్వహించేందుకు ఓ సంస్థ నిర్వాహకుడు అమితాసక్తిని చూపారు. అయితే... ఇక్కడ హోట ల్ నిర్వహణకు అనుమతి లేదంటూ అధికారులు తిరస్కరించారు. వీటి మాటేమిటి ? లేజర్ షో పక్కనే ఉన్న ఓ క్లబ్లో రెస్టారెంట్ ఉంది. అలాగే నెక్లెస్ రోడ్లో ఈట్ స్ట్రీట్, ఓరిస్ రెస్టారెంట్ వంటివాటికి అనుమతి ఉన్నప్పుడు హెచ్ఎండీఏ సొంత స్థలంలో నిర్మించిన భవనాలు, స్ట్రక్చర్లకు ఎం దుకు అనుమతి లేదన్నది ఇక్కడ అర్థంగాని విషయం. పార్కుల్లో స్థలాన్ని, నిర్మాణాలను లీజ్‌కిచ్చి అదనపు ఆదాయం సమకూర్చుకొనే అవకాశం ఉన్నా అధికారులు మాత్రం తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తుండటంతో ఔత్సాహికులు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం లుంబినీలోని స్టీల్ స్ట్రక్చర్ తుప్పుపడుతుండగా, లెజేరియం భవనం మాత్రం బందోబస్తుకు వచ్చే పోలీసులకు విడిదిగా మారింది. హెచ్ఎండీఏను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు కసరత్తు చేస్తున్న కమిషనర్ శాలిని మిశ్రా లుంబినీ పార్కులో నిరుపయోగంగా ఉన్న అద్భుతమైన నిర్మాణాలపై దృష్టి సారించకపోవడం గమనార్హం. -
డబ్బంటే చేదా...?
- లుంబినీ పార్కులో నిరుపయోగంగా అద్భుత నిర్మాణాలు - ఔత్సాహికులు ముందుకొచ్చినా... అలక్ష్యం - ఆదాయంపై ఆరాటంలేని హెచ్ఎండీఏ ఏ సంస్థ అయినా ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నప్పుడు అనవసరపు ఖర్చులు తగ్గించుకొని..ఆదాయపు మార్గాల కోసం అన్వేషిస్తుంది.అయితే హెచ్ఎండీఏ ఇందుకు వ్యతిరేకం. లుంబినీ పార్కు ద్వారా మరింత ఆదాయం సమకూరే అవకాశాలున్నా అందిపుచ్చుకోలేక పోతోంది. దీంతో లక్షల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకొన్న వివిధ నిర్మాణాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. - హుస్సేన్‌సాగర్ తీరాన లుంబినీ పార్కులో పదేళ్ల క్రితం రెస్టారెంట్ కోసం అద్భుతమైన స్టీల్ స్ట్రక్చర్‌ను నిర్మించారు. అలాగే లేజర్ షోను ఆనుకొని సర్వాంగ సుందరంగా ఓ వాణిజ్య సముదాయాన్ని హెచ్ఎండీఏ నిర్మించింది. వీటిని లీజుకు ఇచ్చే విషయంలో అధికారులు శ్రద్ధ పెట్టకపోవడంతో కోట్లాది రూపాయల ఆదాయం సంస్థకు అందకుండా పోతోంది. - లుంబినీ పార్కులో భారీ స్టీల్ స్ట్రక్చర్‌ను నిర్మించేందుకు 11ఏళ్ల క్రితం రూ.15లక్షల వరకు నిధులు వెచ్చించారు. ఆ తర్వాత వివిధ కారణాలను సాకుగా చూపుతూ దాన్ని గాలికొదిలేశారు. అందులో ఫుడ్ కోర్టు పెట్టుకొనేందుకు అనుమతిస్తే నెలకు రూ.50-60వేలు అద్దె చెల్లిస్తామని ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. అయితే.. అధికారులు స్పందించక పోవడంతో అది వెనుదిరిగింది. - లుంబినీ పార్కులో లేజర్ షో కోసం 2005లో అద్భుతమైన నిర్మాణం చేశారు. ఆతర్వాత దీనికి రూ.60లక్షలు వెచ్చించి కార్పొరేట్ భవనంగా హంగులద్దారు. రెండంతస్తులున్న ఈ భవనం ఏళ్లతరబడి ఖాళీగా పడిఉంది. ఈ భవనాన్ని లీజ్కిస్తే నెలకు లక్షల రూపాయలకు పైగా ఆదాయం వచ్చేది. ఇక్కడ చిల్డ్రన్ ఎమ్యూజ్మెంట్ పార్కు, ఫాస్టు ఫుడ్ సెంటర్, ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు లీజ్‌కు ఇవ్వాలంటూ పలు సంస్థలు బీపీపీకి దరఖాస్తు చేసుకొన్నాయి. నక్షత్ర (స్టార్) హోటల్ నిర్వహించేందుకు ఓ సంస్థ నిర్వాహకుడు అమితాసక్తిని చూపారు. అయితే... ఇక్కడ హోట ల్ నిర్వహణకు అనుమతి లేదంటూ అధికారులు తిరస్కరించారు. వీటి మాటేమిటి ? లేజర్ షో పక్కనే ఉన్న ఓ క్లబ్లో రెస్టారెంట్ ఉంది. అలాగే నెక్లెస్ రోడ్లో ఈట్ స్ట్రీట్, ఓరిస్ రెస్టారెంట్ వంటివాటికి అనుమతి ఉన్నప్పుడు హెచ్ఎండీఏ సొంత స్థలంలో నిర్మించిన భవనాలు, స్ట్రక్చర్లకు ఎం దుకు అనుమతి లేదన్నది ఇక్కడ అర్థంగాని విషయం. పార్కుల్లో స్థలాన్ని, నిర్మాణాలను లీజ్‌కిచ్చి అదనపు ఆదాయం సమకూర్చుకొనే అవకాశం ఉన్నా అధికారులు మాత్రం తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తుండటంతో ఔత్సాహికులు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం లుంబినీలోని స్టీల్ స్ట్రక్చర్ తుప్పుపడుతుండగా, లెజేరియం భవనం మాత్రం బందోబస్తుకు వచ్చే పోలీసులకు విడిదిగా మారింది. హెచ్ఎండీఏను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు కసరత్తు చేస్తున్న కమిషనర్ శాలిని మిశ్రా లుంబినీ పార్కులో నిరుపయోగంగా ఉన్న అద్భుతమైన నిర్మాణాలపై దృష్టి సారించకపోవడం గమనార్హం. -
వింటేజ్లెస్ వెహికల్స్
ఈ బుల్లి బైక్ భలే ఉంది కదూ. సయ్యద్‌నగర్‌కు చెందిన మెకానిక్ మహ్మద్ సలీమ్ దీని రూపకర్త. తన కుమారుడు రోజూ స్కూల్‌కు వెళ్లేందుకని దీనిని తయారు చేశాడు. లుంబినీపార్క్‌లో సోమవారం నిర్వహించిన వింటేజ్ వాహనాల ప్రదర్శనలో ఇటువంటి స్పెషల్ అట్రాక్షన్స్ ఎన్నో... అలనాటి మేటి వాహనాలు.. సిటీవాసులకు కనువిందు చేశాయి. తాతల నాటి వాహనాలను వారసత్వ సంపదగా గుర్తించిన వారు కొందరు. గతంలో ఓ వెలుగు వెలిగిన వాహనాన్ని అందిపుచ్చుకుని అపురూపంగా చూసుకుంటున్న వారు ఇంకొందరు. వీరంతా వింటేజ్ కార్లు, ఆనాటి ద్విచక్ర వాహనాలు, సైకిళ్లను తమ స్టేటస్ సింబల్‌గా చూపిస్తున్నారు. అలనాటి మేటి వాహనాలు.. సిటీవాసులకు కనువిందు చేశాయి. తాతల నాటి వాహనాలను వారసత్వ సంపదగా గుర్తించిన వారు కొందరు. గతంలో ఓ వెలుగు వెలిగిన వాహనాన్ని అందిపుచ్చుకుని అపురూపంగా చూసుకుంటున్న వారు ఇంకొందరు. వీరంతా వింటేజ్ కార్లు, ఆనాటి ద్విచక్ర వాహనాలు, సైకిళ్లను తమ స్టేటస్ సింబల్‌గా చూపిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా లుంబినీ పార్క్‌లో డెక్కన్ హెరిటేజ్ ఆటోమొబైల్ అసోసియేషన్ సోమవారం నిర్వహించిన 12వ వింటేజ్ కార్ అండ్ మోటార్ సైకిళ్ల ర్యాలీలో ప్రదర్శించిన ఆ పాత వాహనాలు.. అందరి మనసులనూ దోచుకున్నాయి. - వాంకె శ్రీనివాస్ 1936 మోడల్ ఆస్టిన్ కారును కుటుంబసభ్యుడిగా చూసుకుంటున్నారు రాంకోఠికి చెందిన మాధవరావు.. ‘ఈ కారు తొక్కితే ఇప్పటికీ గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది’ అని మురిసిపోతూ చెబుతుంటారు. 1930 షెవర్లే, ప్లిమత్, సన్‌బీమ్ టాల్బోల్ట్.. ఇలా రకరకాల కార్లు నాటి ఠీవిని కళ్ల ముందుంచాయి. ఇప్పటికీ అదే డామినేషన్.. కార్లే కాదు.. నాడు మధ్యతరగతి మారుతిగా పేరొందిన వెస్పాపై ఇప్పటికీ సిటీవాసికి మోజు తగ్గలేదు. 1971నాటి మోడల్ బజాజ్ బండికి నయా హంగులద్ది హ్యాపీ జర్నీ సాగిస్తున్నాడు బాలానగర్‌కు చెందిన ప్రేమ్‌కుమార్. ర్యాలీలో 1952 నాటి నార్టన్ డామినేటర్ 500 సీసీ ట్విన్బైక్ అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఇది బుల్లెట్ వేగంతో దూసుకుపోతుందని అంటున్నారు దాని యజమాని గురుదేవ్ సింగ్ సోఖి. తన కుమారుడు పాఠశాలకు వెళ్లేందుకు సయ్యద్‌నగర్‌కు చెందిన మెకానిక్ మహ్మద్ సలీమ్ తయారు చేసిన బుల్లి బైక్ ప్రదర్శనలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సూపర్ బైక్ పాత మోడల్ బుల్లెట్‌ను రీమోడల్ చేశా. జీపీఎస్ సిస్టమ్, 30 లైట్లు, విండ్ వెలాసిటీ, వెదర్ ఫోర్కాస్టింగ్, ఎఫ్ఎం రేడియో తదితర పరికరాలతో ఫ్లయింగ్ ఏంజిల్‌గా మార్చాను. డబుల్ ఎగ్జాస్టర్, టర్బో ఇంజిన్‌తో పాటు బాంబు జామర్ కూడా అమర్చాను. బైక్ ఉన్న 500 మీటర్ల రేడియస్‌లో ఎక్కడ బాంబ్ ఉన్నా పట్టేయడం దీని స్పెషాలిటీ. - వెంకట్రావు శతాబ్ది ఎక్స్‌ప్రెస్.. అద్దంలా మెరిసిపోతున్న ఈ కారుకు వందేళ్ల చరిత్ర ఉంది. 1915లో లండన్ నుంచి వచ్చిన ఈ కారు... బీహార్‌కు చెందిన ఓ మహారాజు వినియోగించేవారు. ‘నలభై ఏళ్ల కిందట బీహార్ వెళ్లినప్పుడు మహారాజు వాడిన గోల్ఫర్ కూపే కారు ఉందని తెలిసి.. మా పేరెంట్స్‌ను ఒప్పించి ఆ కారు కొనుగోలు చేశాను. అప్పట్నుంచి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. ఇందులో ప్రయాణిస్తుంటే ఆ దర్జాయే వేరు’ అని అంటున్నారు ఖైరతాబాద్‌లో ఉంటున్న వ్యాపారి రామ్ ప్రకాశ్ అగర్వాల్. -
‘గోకుల్’ మృతులకు నివాళి
సుల్తాన్‌బజార్: గోకుల్‌చాట్, లుంబిని పార్క్ జంట బాంబు పేళ్లులు జరిగి సోమవారం నాటికి 7ఏళ్లు నిండాయి. హైదాబాద్‌కు మాయని మచ్చగా నిలిచిన ఈ సంఘటనకు కోఠి గోకుల్‌చాట్, లుంబినీపార్క్లు సాక్షిగా మారాయి. కోఠి గోకుల్‌చాట్ వద్ద బాంబుపేళ్లుల్లో మృతి చెందిన మృతులకు బీజేపీ, సీపీఐ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల నాయకులతో పాటు విద్యార్థులు, స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు సోమవారం గోకుల్‌చాట్ వద్ద నివాళులర్పించారు. వీహెచ్‌పి, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో... ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకురావాలని విశ్వహిందూపరిషత్, భజరంగ్‌దళ్‌లు డిమాండ్ చేశాయి. బాంబు దాడుల్లో మృతిచెందిన వారి ఆత్మశాంతి కోసం సోమవారం కోఠిలోని గోకుల్చాట్వద్ద శ్రద్ధాంజలి ఘటించి నివాళుర్పించారు. ఈ సందర్భంగా వీహెచ్‌పి రాష్ట్ర కార్యదర్శి గాల్‌రెడ్డి మాట్లాడుతూ సంఘటన జరిగి ఏడేళ్లు పూర్తి కావస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. బాధితులకు రూ.20లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఆకారపు కేశవరావు, భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ వై.భానుప్రకాష్ఐ భరత్‌వంశీ, యమన్సింగ్తో పాటు పెద్ద ఎత్తున వీహెచ్‌పి, భజరంగ్‌దళ్ నాయకులు పాల్గొన్నారు. బాధితుడు రెహ్మతుల్లా నివాళి... కోఠి గోకుల్‌చాట్ వద్ద గత ఏడేళ్ల క్రితం చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో బాధితుడు రెహ్మతుల్లా తీవ్రంగా గాయపడి ఒక కన్నును కోల్పోయాడు. కుమార్తెకు ఐస్‌క్రీమ్ తీసుకురావడానికి వెళ్లిన రెహ్మతుల్లా పేలుళ్ల బారిన పడ్డానని కంటతడిపెట్టుకున్నాడు. తన చికిత్స కోసం ఇప్పటి వరకు లక్షల్లో డబ్బులు వెచ్చించానని వాపోయాడు. పెయింటర్‌గా పనిచేసే తాను వైద్య ఖర్చుల కోసం స్వగ్రామమైన ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలో ఉన్న భూములను అమ్ముకున్నానన్నాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదన్నారు. ఇప్పటికైనా టీ సర్కార్స్పందించి తనకుసహాయం చేయాలని కోరాడు. నగరంలో ఉగ్ర’ మూలాలు : కిషన్‌రెడ్డి లుంబినీ పార్క్ మృతులకు బీజేపీ నేతల నివాళి ఖైరతాబాద్: ఉగ్రవాదం పెను సవాలుగా మారిందని, దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల దాడులు జరిగినా దాని మూలాలు హైరదాబాద్ నగరంలో బయట పడుతుండటం ఆందోళన కలిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం లుంబినీపార్క్‌లో బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, నగర నాయకుడు వెంకట్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు లుంబినీ, గోకుల్‌చాట్ వద్ద జరిగిన బాంబుదాడుల్లో మృతి చెందిన వారికి ఘనంగా నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఎంపీ బండారు దత్తాత్రేయ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బద్దం బాల్‌రెడ్డి, ఆలె జితేంద్ర, లాయక్ అలీ తదితరులు పాల్గొని మృతుల కుటుంబాలకు నివాళులు అర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. -
యూరప్‌లో చిక్కిన జంట పేలుళ్ల నిందితుడు ఖాన్?
హుటాహుటిన వెళ్లిన భారత నిఘా వర్గాలు ఖాన్‌పై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు వారం క్రితమే అదుపులోకి హైదరాబాద్: హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కుల్లో జరిగిన జంట పేలుళ్ల కేసులో వాంటెడ్‌గా ఉన్న ఉగ్రవాది మహ్మద్ అమీర్ రజా ఖాన్.. యూరప్ పోలీసులకు పట్టుబడినట్టు సమాచారం. 2005 ఆగస్టు 25న జరిగిన ఈ విధ్వంసంలో 42 మంది మృతి చెందారు. మరో వంద మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ కేసులో అమీర్ రజా ఖాన్ వాంటెడ్‌గా ఉన్నాడు. పాకిస్థాన్‌లో తలదాచుకున్న అమీర్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే వారం క్రితం యూరప్‌లో అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న భారత నిఘా బృందం హుటాహుటిన బయలుదేరి వెళ్లింది. నేరమయ జీవితం..: కోల్‌కతాకు చెందిన అమీర్ రజా గుజరాత్లో మాఫియా కార్యకలాపాల ద్వారా నేరాల బాటపట్టాడు. 2001లో కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త పార్థోను కిడ్నాప్ చేసి భారీగా డబ్బు వసూలు చేసినట్లు ఇతనిపై ఆరోపణలున్నాయి. ఏఆర్డీఎఫ్ సంస్థను స్థాపించిన అమీర్.. కొందరు యువతను సమీకరించి పోలీసులపై ప్రతీకారానికి పురిగొల్పాడు. నగదు కోసం బెదిరింపులు, కిడ్నాప్‌లు చేయడం ప్రారంభించాడు. 2002లో అఫ్తాబ్ అన్సారీతో కలిసి కోల్‌కతాలో ఉన్న అమెరికన్ సెంటర్‌పై దాడి చేశాడు. 2003లో రియాజ్ భత్కల్, సాదిక్ ఇష్రార్ షేక్‌లతో(గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల సూత్రధారులు) కలసి ఇండియన్ ముజాహిదీన్‌ను స్థాపించాడు. 2005లో హైదరాబాద్ జంట పేలుళ్లతో పాటు మరికొన్ని ఉగ్రవాద చర్యల్లోనూ అమీర్ పేరు వెలుగులోకి రావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ మరికొన్ని కేసులను రెడ్‌కార్నర్ నోటీసులో జత చేసింది. ముంబై దాడుల తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు అందించిన మోస్ట్‌వాంటెడ్ జాబితాలోనూ అమీర్ పేరు ఉంది. -
వింటేజ్ షో అదిరింది..
ఖైరతాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లుంబినీ పార్క్‌లో ఏర్పాటుచేసిన వింటేజ్ వాహనాల ప్రదర్శన ఆకట్టుకుంది. 1962 నుంచి ఇప్పటి 2004 వరకు మార్కెట్లోకి వచ్చిన మొత్తం 30 కార్లు, 60కి పైగా ద్విచక్రవాహనాలు శుక్రవారం ప్రదర్శనలో ఉంచారు. చవర్లెట్ కంపెనీ...ఆస్టిన్- మేడిన్ ఇంగ్లాండ్ 1952 నాటి ఆస్టిన్ - మేడిన్ ఇంగ్లాడ్ బైక్... రెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన సైకిల్...రాజ్‌దూత్, హెచ్డి, బుల్లెట్, వెస్పా స్కూటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలచాయి. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఆరువేల వింటేజ్ వాహనాలు ఉంటే తెలంగాణలోనే రెండువేల వాహనాలు ఉన్నాయన్నారు. 1952 నాటి నార్టన్ బైక్ (500సిసి)ను కమిషనర్ ఉత్సాహంగా నడిపారు. ఎంతో కాలం తర్వాత ద్విచక్రవాహనం నడిపే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. వింటేజ్ ప్రదర్శనలో 1952 మోడల్ చవర్లెట్ కంపెనీకి చెందిన స్టైల్ లైన్ డీలక్స్ - 6 సిలిండర్ ఇంజన్, 1936 మోడల్ ఆస్టిన్ -ఇంగ్లాండ్ మోడల్ కారు తండ్రి జ్ఞాపకార్థం తనకు ద క్కిందని మాధవరావు తెలిపారు. రెండవ ప్రపంచ యుద్దంలో ఉపయోగించిన 1935 నాటి పోల్డబుల్ సైకిల్, 1973నాటి ప్యూజీ కంపెనీ మోటార్ సైకిల్, 1953 ఇంజన్ సైకిల్ ప్రదర్శనలో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్ జయేష్ రంజన్‌తో పాటు నగరం నలు మూలల నుంచి విచ్చేసిన సందర్శకులు ఎంతో ఉత్సాహంగా వాహనాల వద్ద ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. -
నకిలీ కరెన్సీ కేసులో అల్కాజ్కు ఐదేళ్ల జైలు
మరో ముగ్గురు నిందితులకు సైతం విధింపు తీర్పు వెలువరించిన నాంపల్లి న్యాయస్థానం సాక్షి, హైదరాబాద్: నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2007 ఆగస్టు 25న అరెస్టు చేసిన అంతర్జాతీయ నకిలీ కరెన్సీ రాకెట్ ప్రధాన సూత్రధారి, దుబాయ్ వాసి ఖమీస్ అలీ అల్కాజ్కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు గురువారం తీర్పునిచ్చిం ది. ఇతడితో పాటు మరో ముగ్గురికీ జైలు శిక్షను ఖరారు చేసింది. వీరిలో ఇద్దరికి నాలుగేళ్లు, ఒకరికి ఏడాది శిక్షను విధించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఇంకో ముగ్గురిపై నేరం నిరూపణకాలేదని పేర్కొంది. 2007లో నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో జంట పేలు ళ్లు జరగడానికి సరిగ్గా 24 గంటల ముందు టాస్క్‌ఫోర్స్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సంయుక్తంగా పాతబస్తీలోని బార్కస్‌లో భారీ ఆపరేషన్ నిర్వహించాయి. ఇందులో రూ.2.36 కోట్ల నకిలీ కరెన్సీని పట్టుబడింది. జంట పేలుళ్లు జరిగిన రోజే నిందితుల అరెస్టు ప్రకటించారు. ఈ కేసులో దుబాయ్‌కు చెందిన ఖమీస్ ఒబేద్ అలియాస్ ఖమీస్ అలీ అల్కాజ్ ప్రధాన నిందితుడిగా ఉండగా... హైదరాబాద్‌కు చెందిన ఖాలిద్ బిన్ సాలెహ్, మహ్మద్ నజాత్, ఖాలిద్ అబ్దుల్లా నజాత్తో పాటు మరో ముగ్గురు నింది తులుగా ఉన్నారు. మొత్తం నిందితుల్లో పాక్ జాతీయులైన ముగ్గురు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. ఖాలిద్ నగరంలో వెస్ట్ ఇండియా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పేరులో ఓ కంపెనీ నిర్వహిస్తున్నాడు. దుబాయ్‌కు చెందిన ఖమీస్ అలీ అల్కాజ్ ద్వారా పాకిస్తాన్లో ముద్రితమైన రూ.500, రూ.1000 డినామినేషన్లో ఉన్న నకిలీ కరెన్సీని హైదరాబాద్‌కు చేరుకుంది. 2007 ఏప్రిల్ నుంచి మూడు దఫాలుగా చిత్తుకాగితాల పేరుతో సీ కార్గో ద్వారా ముంబై మీదుగా ఇక్కడకు తీసుకువచ్చారు. దుబాయ్ వాసి ఖమీస్ పాస్‌పోర్ట్ ఆధారంగా అతను మూడుసార్లు పాకిస్తాన్ సందర్శించినట్లూ పోలీ సులు గుర్తించారు. నకిలీ కరె న్సీ భారత్ చేరుకున్న సమ యం, ఖమీస్ పాక్ సందర్శించిన సమయం ఒకటే కావడంతో పాక్ నుంచి ఇతనే తీసుకువచ్చినట్టు నిర్థారించారు. ఈ కేసును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు దర్యాప్తు చేసి అభియోగాలు నమోదు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాల బుచ్చయ్య వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం గురువారం అల్కాజ్ ఖమీస్కు ఐదేళ్లు, ఖాలిద్ బిన్ సాలెహ్, మహ్మద్ నజాత్లకు నాలుగేళ్లు, ఖాలిద్ అబ్దుల్లా నజాత్కు ఏడాది జైలు శిక్ష విధించింది. 2007 నుంచి చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అల్కాజ్ ఖమీస్కు దాదాపు 20 నెలల అనంతరం బెయిల్ మంజూరైంది. అయితే ఇతనిపై గుజరాత్‌లోనూ ఓ కేసు నమోదై ఉండటంతో అది వీగిపోయే వరకు జైల్లోనే ఉన్నాడు. 2009 ఏప్రిల్‌లో ఆ కేసు వీగిపోవడంతో ఖమీస్ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. ఖమీస్ జైల్లో ఉంటూనే తన అనుచరుల ద్వారా కరెన్సీ రాకెట్ నడిపాడని గుర్తించిన సీసీఎస్ పోలీసులు ఇతడిపై నిఘా ఉంచారు. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఖమీస్ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద రూ.2 లక్షల నకిలీ కరెన్సీ లభించడంతో మళ్లీ అరెస్టు చేశారు. ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. -
రోజూ ఒకటే ‘ఆట’
క్రేజీ పోయి... లేజీ ఆవహించింది. వెలుగు జిలుగులు లయ తప్పి ఆస్వాదనం ఆవిరి అవుతోంది. పాడిందే పాట... అన్నట్టుగా ఏడేళ్లుగా ఒకటే పాట... ఒకటే ఆట... ఒకటే బోరు. కోట్లాది రూపాయలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయే తప్ప... వచ్చినవారిని ఆకట్టుకోలేకపోతోంది లుంబినీ పార్కులోని లేజర్ షో. పర్యాటకుల ఉత్సాహాన్నంతా ఒకే దెబ్బకు ఎగరేసుకుపోతోంది. రోజూ ఒకటే ‘ఆట’ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) పర్యవేక్షణలో ప్రస్తుతం లుంబినీ పార్కు నిర్వహణ సాగుతోంది. ఆదాయంపై దృష్టి సారించడం మినహా అదనపు హంగులు సమకూర్చేందుకు హెచ్ఎండీఏ ఎలాంటి శ్రద్ధ తీసుకోవట్లేదు. వినోదం కోసం వచ్చేవారికి వైవిధ్యం లేక విసిగెత్తిపోతున్నా... చార్జీల మోత మాత్రం మోగిస్తూనే ఉంది. ఆరంభంలో రూ.30 ప్రవేశ రుసుముతో ప్రారంభమైన లేజర్ షోకు... ప్రస్తుతం రూ.50 వసూలు చేస్తున్నారు. అయితే అందుకు తగ్గ వినోదాన్ని మాత్రం పర్యాటకులకు అందించలేకపోతున్నారు. మూస ధోరణితో ప్రదర్శిస్తున్న షోతో ప్రేక్షకులు బోరెత్తిపోతున్నారు. లేజర్ షో వల్ల ఏడాదికి కోటిన్నర రూపాయలకు పైగా ఆదాయం వస్తున్నా... విభిన్నంగా, కొత్తగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్న ధ్యాస కూడా హెచ్ఎండీఏకు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. టెండర్ ఎందుకు రద్దైంది? పర్యాటకులను ఆకట్టుకొనే లేజర్ షోకు కొత్త అందాలు అద్దేందుకు అధికారులు చేసిన ప్రయత్నానికి స్వయంగా హెచ్ఎండీఏ కమిషనర్ మోకాలడ్డటం విస్మయం కల్గిస్తోంది. జీవవైవిధ్య సదస్సు (కాప్-11) సందర్భంగా లేజర్ షోకు మరిన్ని హంగులద్దేందుకు రూ.1.65 కోట్లు నిధులు కేటాయించారు. ప్రస్తుతమున్న థీమ్‌కు కొత్త థీమ్‌ను జత చే సేందుకు ప్రణాళికలు కూడా రూపొందించారు. ముఖ్యంగా తెలుగు సంస్కృతి, వైభవాలు, హైదరాబాద్ చారిత్రక వైశిష్ట్యాన్ని ప్రతిబింబించేలా సరికొత్త థీమ్‌లతో లేజర్ షోను పరిపుష్ఠం చేయాలని భావించారు. ఆమేరకు టెండర్‌ను కూడా ఆహ్వానించగా... రెండు సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. అయితే.. సాంకేతికంగా మంచి ఎక్విప్మెంట్ను తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసేందుకు ఎవరు ముందుకు వస్తే ... వారికి ఈ టెండర్‌ను అప్పగించాలని కమిషనర్ అంతర్గతంగా సిబ్బందికి సూచించారు. దీంతో వ్యవహారం టెక్నికల్ బిడ్స్ వద్దే ఆగిపోయింది. ఆ తర్వాత దీనిగురించి పట్టించుకొన్న నాథుడే లేడు. ప్రస్తుతం పర్యాటకుల రద్దీ పెరుగుతోంది. ఈ దశలో మళ్లీ టెండర్ పిలిచేందుకు ఎన్నికల కోడ్‌ను బూచిగా చూపుతూ అధికారులు లేజర్ షో నవీకరణనను గాలికి వదిలేశారు. -
కిరాయిదారులపై నిఘా
అద్దెకుండే వారి వివరాలతో డేటాబేస్ ముష్కరుల ఆగడాలకు చెక్ చెప్పేందుకే ఠాణాల వారీగా వివరాల సేకరణకు నిర్ణయం ప్రణాళికలు సిద్ధం చేసిన సైబరాబాద్ సీపీ సాక్షి, సిటీబ్యూరో: 2007 ఆగస్టు, 2013 ఫిబ్రవరి... ఉత్తరాది నుంచి వచ్చిన ముగ్గురు ముష్కరులు హబ్సిగూడ, అబ్దుల్లాపూర్‌మెట్‌ల్లో మకాం పెట్టారు... లుంబినీపార్క్, గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్‌ల్లో బాంబులు పేల్చి 59 మందిని బలి తీసుకున్నారు... ముంబై మోడల్ని ఈవెంట్ పేరుతో తీసుకువచ్చిన దండుగులు నిజాంపేట్‌లోని ఇంట్లో బంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాల్ని పరిగణలోకి తీసుకున్న సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ టెనెంట్స్ వాచ్ (అద్దెకుండే వారిపై నిఘా) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవీ విధి విధానాలు... ‘టెనెంట్స్ వాచ్ ఫామ్’ దరఖాస్తుల్ని ముద్రించి అన్ని ఠాణాల్లో అందుబాటులో ఉంచుతారు. ఇంటి యజమానులంతా వీటిని తీసుకోవాలి. తమ ఇంట్లో అద్దెకుండే వారి పూర్తి వివరాలు నమోదు చేసి, వారి గుర్తింపు పత్రాలతో పాటు ఫొటోలనూ జత చేసి పోలీసు స్టేషన్లో అప్పగించాలి. ఈ అంశాన్ని మరింత సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రచారం నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క స్థానిక ఇన్స్పెక్టర్లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తన పరిధిలో టెనెంట్స్ వాచ్ అమలును తనిఖీ చేయాలి. కేవలం వివరాలు సేకరించి వదిలిపెట్టకుండా ఫొటోలతో సహా టెనెంట్స్ డేటాబేస్ రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో సైబరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అద్దెకున్న వారి వివరాలన్నీ సెంట్రల్ సర్వర్‌లో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని, దీన్ని పోలీసు విభాగం వినియోగించే ఇంట్రానెట్‌కు కనెక్ట్ చేస్తారు. శివార్లలో కాలేజీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు ఐటీ హబ్‌లోనూ టెనెంట్స్ వాచ్ తప్పనిసరి చేసి ఉల్లంఘించిన ఇంటి యజమానులపై చర్యలకు అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఈ టెనెంట్స్‌వాచ్ అమలుతో ముష్కరులకు షెల్టర్ దొరక్కుండా చేయడంతో పాటు ఏదైనా జరగరానిది జరిగినప్పుడు దర్యాప్తు తేలికవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఠాణాల వారీగా వివరాల సేకరణ... నగరానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందంటూ నిఘా వర్గాల నుంచి తరచు హెచ్చరికలు అందుతూనే ఉన్నాయి. మరోపక్క ఇతర ప్రాంతా లు, రాష్ట్రాల నుంచి వస్తున్న దృష్టి మరల్చి చోరీలు చేసే ముఠాలు, దోపిడీ దొంగలకూ అద్దె ఇళ్లే అడ్డాలు గా మారుతున్నాయి. ఇలా వస్తున్న ముష్కరులకు షెల్టర్ దొరక్కుండా చేయాలనే ఉద్దేశంతోనే సైబరాబాద్ పోలీసులు ఈ టెనెంట్స్ వాచ్‌ను అమలు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో 41 శాంతి భద్రతల ఠా ణాలకు ఈ బాధ్యతల్ని అప్పగించనున్నారు. టెనెం ట్స్ వాచ్‌కు సంబంధించిన విధి విధానాలను సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రూపకల్పన చేస్తున్నారు. డిజైన్ సిద్ధం చేశాం.... ముష్కరమూకలతో పాటు అసాంఘికశక్తులకు చెక్ చెప్పే చర్యల్లో భాగంగా టెనెంట్స్ వాచ్‌ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి న విధి విధానాల డిజైన్‌ను పూర్తి చేశాం. ప్రస్తుతం దీనికి తుదిమెరుగులు దిద్దుతున్నాం. పూర్తిస్థాయి స్వరూపం వచ్చాక ఠాణా ల వారీగా త్వరలోనే అమలు చేస్తాం. అద్దెకుండే వారి వివరాల సేకరణను తప్పనిసరి చేస్తాం. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
సంస్థ ఆదాయంపై.. హెచ్ఎండీఏ మహా నిర్లక్ష్యం
సాక్షి, సిటీబ్యూరో : ఏ సంస్థ అయినా కష్టాల్లో ఉన్నప్పుడు అనవసరపు ఖర్చులు తగ్గించుకొంటుంది. అలాగే ఆదాయపు మార్గాల కోసం అన్వేషిస్తుంది. ఆదాయపు మార్గాలు కన్పిస్తే అందిపుచ్చుకొని పక్కాగా సద్వినియోగం చేసుకొంటుంది. కానీ హెచ్ఎండీఏకు మాత్రం ఇవేమీ పట్టడంలేదు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని పార్కుల ద్వారా ఆదాయం సమకూరే అవకాశాలు కార్యాలయం గడప తొక్కినా... అధికారులు కాలితో తన్నేస్తున్నారు. సొంత ఆదాయం తప్ప సంస్థ ఆదాయంపై దృష్టి పెట్టట్లేదు. దీంతో రూ.లక్షలాది వ్యయంతో రూ పుదిద్దుకొన్న వివిధ నిర్మాణాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ పార్కులు, ఇతర అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యత బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ)దే. అయితే, కొందరు అధికారుల తీరు సంస్థకు తీవ్ర నష్టాల్ని తెచ్చిపెడుతోంది. లుంబినీ పార్కు, లేజర్ షో ప్రాంగణాల్లో నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. పదేళ్లుగా నిరపయోగం ... లుంబినీ పార్కు, లేజర్ షోలను తిలకించేందుకు నిత్యం వందలాది మంది వస్తుంటారు. అయితే వీరికి వినోదం, విహారం అందిస్తు న్నా... ఆకలి బాధలు తీర్చేందుకు ఎలాంటి సౌకర్యం లేవు. తగిన నిర్మాణాలున్నా వాటిని వినియోగించు కోవడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. పదేళ్ల క్రితం లుంబినీ పార్కులో రెస్టారెంట్ కోసం 3వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతమైన స్టీల్ స్ట్రక్చర్‌ను నిర్మించారు. ఇందుకోసం రూ.15లక్షల వరకు నిధులు వెచ్చించారు. ఆ తర్వాత వివిధ కారణాలను సాకుగా చూపుతూ ఆ నిర్మాణాన్ని గాలికొదిలేశారు. ఆ నిర్మాణాన్ని లీజ్కిస్తే అందులో ఫుడ్‌కోర్టు పెట్టుకొని నెలకు రూ.50వేలు అద్దె చెల్లిస్తామని ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. ఈమేరకు దరఖాస్తు చేసుకొన్నా.. అధికారులు స్పందించలేదు. పదేళ్లుగా ఆ నిర్మాణం నిరుపయోగంగా ఉంది. దీన్ని లీజుకిచ్చి ఉంటే ఈ పాటికి లక్షలాది రూపాయలం ఆదాయం హెచ్ఎండీఏకు సమకూరేది. లెజేరియంలో కూడా... లుంబినీ పార్కులో లేజర్ షో కోసం 2005లో అద్భుతమైన నిర్మాణ ం చేశారు. ఏడాదిన్నర క్రితం రూ.60లక్షలు వెచ్చించి కార్పొరేట్ భవనంగా హంగులద్దారు. రెండంతస్తులు ఉన్న ఈ భవనం ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. ఇక్కడ చిల్డ్రన్ ఎమ్యూజ్మెంట్ పార్కు, ఫాస్టుఫుడ్ సెంటర్, ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు లీజ్‌కివ్వాలని పలు సంస్థలు దరఖాస్తు చేసుకొన్నాయి. ఇక్కడ నక్షత్ర హోటల్ నిర్వహించేందుకు ఓ సంస్థ నిర్వాహకుడు అమితాసక్తిని చూపారు. అయితే, హోటల్ నిర్వహణకు అనుమతి లేదంటూ తిరస్కరించారు. రెస్టారెంట్‌కు ఇక్కడ అనుమతి లేనప్పుడు రూ.లక్షలు వెచ్చించి లుంబినీ పార్కులో స్టీల్ స్ట్రక్చర్ ఎందు కు నిర్మించారన్న ప్రశ్నకు సమాధానం లేదు. అలాగే లేజర్ షో పక్కనే ఉన్న ఓ క్లబ్లో రెస్టారెంట్ ఉంది, నెక్లెస్ రోడ్లో ఈట్ స్ట్రీట్, ఓరిస్ రెస్టారెంట్ వంటివాటికి అనుమతి ఉన్నప్పుడు.. హెచ్ఎండీఏ నిర్మించిన భవనాలు, స్ట్రక్చర్లకు ఎందుకు అనుమతి లేదన్నది అర్థంగాని విషయం. పార్కుల్లో స్థలాన్ని, నిర్మాణాలను లీజ్‌కిచ్చి అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని హెచ్ఎండీఏకు గతంలో ప్రభుత్వం సూచించింది. అయితే... అధికారులు మాత్రం సవాలక్ష ఆంక్షలు విధిస్తూ తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తుండటంతో ఔత్సాహికులు వెనుకడుగు వేస్తున్నారు. బీపీపీ అధికారులు మాత్రం అది తమకు సంబంధం లేని వ్యవహారంగా భావిస్తూ మిన్నకుండి పోయారు. దీంతో లుంబినీలోని స్టీల్ స్ట్రక్చర్ తుప్పుపడుతుండగా, లెజేరియం భవ నం మాత్రం మట్టి వినాయక విగ్రహాలను నిల్వ చేసేందుకు గోదాముగా మారిపోయింది. ఓ వైపు హెచ్ఎండీఏను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు మున్సిపల్, పురపాలక శాఖ మంత్రి మహీధర్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తుంటే... మరో వైపు బీపీపీ అధికారులు ఇవేమీ పట్టించుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది. -
పేలుళ్లు.. అరెస్ట్..గురువారమే
సాక్షి, సిటీబ్యూరో:2013 ఫిబ్రవరి 21 గురువారం: దిల్‌సుఖ్‌నగర్‌లోని ‘107’ బస్టాప్, ‘ఏ-1’ మిర్చ్ సెంటర్ వద్ద భారీ బాంబు పేలుళ్లు ... 2013 ఆగస్టు 29 గురువారం: ఈ పేలుళ్లకు బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యాసీన్ భత్కల్, తబ్రేజ్ అరెస్టు... 2005 నుంచి దేశ వ్యాప్తంగా అనేక విధ్వంసాలు సృష్టించిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) రాజధానిలో రెండు ఘాతుకాలకు పాల్పడింది. ఐఎం స్థాపనలో కీలకపాత్ర పోషించిన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ నేతృత్వంలోని మాడ్యుల్ 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో బాంబులు పేల్చింది. అదేరోజు దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ సమీపంలో పేలని బాంబు కూడా దొరికింది. ఇది జరిగిన ఐదున్నరేళ్లకు ఐఎం మరోసారి పంజా విసిరింది. ఈ సంస్థకు కో-ఫౌండర్‌గా ఉన్న యాసీన్ భత్కల్ నేతృత్వంలోని మాడ్యుల్ దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడింది. రియాజ్, ఇక్బాల్‌లకు యాసీన్ భత్కల్ సోదరుడు. గతంలో రియాజ్ నేరుగా వెళ్లి గోకుల్‌చాట్‌లో బాంబు పెట్టగా... తాజాగా యాసీన్ స్వయంగా ‘107’ బస్టాప్‌లో బాంబు పెట్టాడు. ‘పొరుగువారి’ వల్లే కొలిక్కి... సిటీలో 2007 నాటి తొలి జంట పేలుళ్లు, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రెండో జంట పేలుళ్లు... ఈ రెండు కేసుల్లో ఒక్కటి కూడా నగర, రాష్ట్ర పోలీసులో, నిఘా వర్గాలో ఛేదించలేదు. గోకుల్, లుంబినీ పేలుళ్ల చిక్కుముడిని ఏడాది తరవాత ముంబై క్రైమ్ బ్రాంచ్ విప్పింది. ఢిల్లీలోని బాట్లాహౌస్లో 2008 సెప్టెంబరు 19 జరిగిన ఎన్కౌంటర్లో దొరికిన ఆధారాలను బట్టి క్రైమ్ బ్రాంచ్ మొత్తం ఇండియన్ ముజాహిదీన్ గుట్టు విప్పారు. 2005 ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా 11 విధ్వంసాలకు పాల్పడిన ఈ ఉగ్రవాదుల్లో దాదాపు 20 మందిని 2008 అక్టోబరు 6న అరెస్టు చేశారు. వీరిలోనే జంట పేలుళ్ల నిందితులు అనీఖ్ షఫీఖ్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అన్సార్ బాద్షా షేక్, సాదిక్ షేక్, ఫారూఖ్ తర్ఖాష్ సైతం ఉన్నారు. ఫిబ్రవరి నాటి దిల్సుఖ్నగర్ పేలుళ్లకు సంబంధించి నగర, రాష్ట్ర పోలీసు వర్గాలు కనీసం ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్నీ ఆరు నెలల పరిశోధనలో పట్టుకోలేకపోయారు. ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల సంయుక్త ఆపరేషన్‌తో ఈ చిక్కుముడి వీడింది. భత్కల్ బ్రదర్స్ బీహార్‌లోని బుద్ధగయ, హైదరాబాద్ గురిపెట్టారంటూ గత ఏడాది అక్టోబర్ 21న ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉగ్రవాది మగ్బూల్ వెల్లడించినా ఏ ఒక్కటీ ఆపలేకపోయారు. నేపాల్ సరిహద్దుల్లో కీలక అరెస్టులు ఉగ్రవాద కోణంలో నగరానికి సంబంధించిన 2 కీలక అరెస్టులు నేపాల్ సరిహద్దుల్లో చోటు చేసుకున్నాయి. పాక్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండాను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ నెల రెండో వారంలో నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ 1998లో సిటీ పోలీసులకు చిక్కిన పాక్ జాతీ యుడు సలీం జునైద్ కేసులో టుండా నింది తుడు. ఇతడు తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్ (టీఐఎం) స్థాపనలో కీల క పాత్ర పోషించాడు. ఈ సంస్థ 1993లో సిటీ లో అబిడ్స్, గోపాలపురం, హుమయూన్‌నగర్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో పేలుళ్లు జరిపిం ది. ఈ పేలుళ్లలో నలుగురు మరణించగా... పలువురు గాయపడ్డారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు సూత్రధారులైన యాసీన్ భత్కల్, తబ్రేజ్ కూడా నేపాల్ సరిహద్దుల్లోనే చిక్కారు. సమాచారం సేకరించాక బృందం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసిన యాసీన్, తబ్రేజ్లకు దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లతో సంబంధం ఉందనే అనుమానాలున్నాయి. 107బస్టాప్ దగ్గర యాసీన్ స్వయంగా బాంబు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరు ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రాథమికంగా అక్కడి అధికారుల నుంచి సమాచారం సేకరిస్తాం. ఆపై వారి విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని పంపుతాం. నేరం నిర్ధారణ అయితే న్యాయస్థానం ఆదేశాలతో పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువస్తాం. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాం.