సాక్షి, సిటీబ్యూరో:2013 ఫిబ్రవరి 21 గురువారం: దిల్‌సుఖ్‌నగర్‌లోని ‘107’ బస్టాప్, ‘ఏ-1’ మిర్చ్ సెంటర్ వద్ద భారీ బాంబు పేలుళ్లు ...
2013 ఆగస్టు 29 గురువారం:
ఈ పేలుళ్లకు బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యాసీన్ భత్కల్, తబ్రేజ్ అరెస్టు... 2005 నుంచి దేశ వ్యాప్తంగా అనేక విధ్వంసాలు సృష్టించిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) రాజధానిలో రెండు ఘాతుకాలకు పాల్పడింది. ఐఎం స్థాపనలో కీలకపాత్ర పోషించిన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ నేతృత్వంలోని మాడ్యుల్ 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో బాంబులు పేల్చింది. అదేరోజు దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ సమీపంలో పేలని బాంబు కూడా దొరికింది. ఇది జరిగిన ఐదున్నరేళ్లకు ఐఎం మరోసారి పంజా విసిరింది. ఈ సంస్థకు కో-ఫౌండర్‌గా ఉన్న యాసీన్ భత్కల్ నేతృత్వంలోని మాడ్యుల్ దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడింది. రియాజ్, ఇక్బాల్‌లకు యాసీన్ భత్కల్ సోదరుడు. గతంలో రియాజ్ నేరుగా వెళ్లి గోకుల్‌చాట్‌లో బాంబు పెట్టగా... తాజాగా యాసీన్ స్వయంగా ‘107’ బస్టాప్‌లో బాంబు పెట్టాడు.
‘పొరుగువారి’ వల్లే కొలిక్కి...
సిటీలో 2007 నాటి తొలి జంట పేలుళ్లు, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రెండో జంట పేలుళ్లు... ఈ రెండు కేసుల్లో ఒక్కటి కూడా నగర, రాష్ట్ర పోలీసులో, నిఘా వర్గాలో ఛేదించలేదు. గోకుల్, లుంబినీ పేలుళ్ల చిక్కుముడిని ఏడాది తరవాత ముంబై క్రైమ్ బ్రాంచ్ విప్పింది. ఢిల్లీలోని బాట్లాహౌస్‌లో 2008 సెప్టెంబరు 19 జరిగిన ఎన్‌కౌంటర్‌లో దొరికిన ఆధారాలను బట్టి క్రైమ్ బ్రాంచ్ మొత్తం ఇండియన్ ముజాహిదీన్ గుట్టు విప్పారు. 2005 ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా 11 విధ్వంసాలకు పాల్పడిన ఈ ఉగ్రవాదుల్లో దాదాపు 20 మందిని 2008 అక్టోబరు 6న అరెస్టు చేశారు.
వీరిలోనే జంట పేలుళ్ల నిందితులు అనీఖ్ షఫీఖ్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అన్సార్ బాద్షా షేక్, సాదిక్ షేక్, ఫారూఖ్ తర్ఖాష్ సైతం ఉన్నారు. ఫిబ్రవరి నాటి దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు సంబంధించి నగర, రాష్ట్ర పోలీసు వర్గాలు కనీసం ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్నీ ఆరు నెలల పరిశోధనలో పట్టుకోలేకపోయారు. ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల సంయుక్త ఆపరేషన్‌తో ఈ చిక్కుముడి వీడింది. భత్కల్ బ్రదర్స్ బీహార్‌లోని బుద్ధగయ, హైదరాబాద్ గురిపెట్టారంటూ గత ఏడాది అక్టోబర్ 21న ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉగ్రవాది మగ్బూల్ వెల్లడించినా ఏ ఒక్కటీ ఆపలేకపోయారు.
నేపాల్ సరిహద్దుల్లో కీలక అరెస్టులు
ఉగ్రవాద కోణంలో నగరానికి సంబంధించిన 2 కీలక అరెస్టులు నేపాల్ సరిహద్దుల్లో చోటు చేసుకున్నాయి. పాక్ నిఘా ఏజెన్సీ ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండాను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ నెల రెండో వారంలో నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ 1998లో సిటీ పోలీసులకు చిక్కిన పాక్ జాతీ యుడు సలీం జునైద్ కేసులో టుండా నింది తుడు. ఇతడు తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్ (టీఐఎం) స్థాపనలో కీల క పాత్ర పోషించాడు. ఈ సంస్థ 1993లో సిటీ లో అబిడ్స్, గోపాలపురం, హుమయూన్‌నగర్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో పేలుళ్లు జరిపిం ది. ఈ పేలుళ్లలో నలుగురు మరణించగా... పలువురు గాయపడ్డారు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు సూత్రధారులైన యాసీన్ భత్కల్, తబ్రేజ్ కూడా నేపాల్ సరిహద్దుల్లోనే చిక్కారు.
సమాచారం సేకరించాక బృందం
ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసిన యాసీన్, తబ్రేజ్‌లకు దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లతో సంబంధం ఉందనే అనుమానాలున్నాయి. 107బస్టాప్ దగ్గర యాసీన్ స్వయంగా బాంబు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరు ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రాథమికంగా అక్కడి అధికారుల నుంచి సమాచారం సేకరిస్తాం. ఆపై వారి విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని పంపుతాం. నేరం నిర్ధారణ అయితే న్యాయస్థానం ఆదేశాలతో పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువస్తాం. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాం.
పేలుళ్లు.. అరెస్ట్..గురువారమే
Published Fri, Aug 30 2013 2:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
Advertisement
Advertisement