Gokul Chat
-
గోకుల్‌చాట్ యజమానికి కరోనా
సుల్తాన్‌బజార్: హైదరాబాద్‌లో పేరుపొందిన కోఠి గోకుల్‌చాట్ యజమాని (72)కి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. అధికారులు గోకుల్‌చాట్‌ను మూసివేయించడంతో పాటు 20 మంది సిబ్బందిని, కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. కరోనా పా జిటివ్ వచ్చిన యజమాని ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో వైద్య సిబ్బంది, పో లీసులు వివరాలు సేకరిస్తున్నారు. సాధారణంగా ఎక్కువ సంఖ్యలోనే ప్రజలు గోకుల్‌చాట్ రుచులను ఆస్వాదిస్తుం టారు. దీంతో ఎక్కువ మంది వివరా లు సేకరించాల్సి రావొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గోకుల్‌చాట్‌లో కట్లెట్, పావుబాజి, కుల్ఫీ వంటి పదార్థాలను ఎక్కువ మంది రుచిచూస్తారు. లాక్‌డౌన్‌తో మూతపడిన దుకాణం ప్ర భుత్వం సడలింపులు ఇవ్వడంతో తెరుచుకుంది. టేక్ అవే పేరుతో కట్లెట్, ఇతర స్నాక్స్ అందిస్తోంది. గోకుల్‌చాట్ యజ మానికి పాజిటివ్ రావడంతో ఇక్కడ స్నా క్స్ తిన్న వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ దుకాణంలో 40 మంది వరకు పనిచేసేవారు. కేంద్రం సడలింపులతో వారిలో చాలామంది సొంతూళ్లకు వెళ్లారు. ప్రస్తుతం సగం మందే విధులు నిర్వహిస్తున్నారు. వీరందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కలకలం గచ్చిబౌలి: కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో మరో 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 10 మంది వైద్య సిబ్బందితో పాటు ఆస్పత్రికి వచ్చిన నలుగురి శాంపిల్స్ ఈఎస్ఐ మెడికల్ కాలేజీకి పంపించగా పాజిటివ్‌గా తేలిం ది. వీరిలో ఇద్దరు డాక్టర్లు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, సెక్షన్ ఆఫీసర్, సె క్యూరిటీ గార్డు, జూనియర్ అసిస్టెంట్, వీసీటీసీ కౌన్సిలర్, అంబులెన్స్ డ్రైవర్, ఫార్మసిస్ట్తో పాటు ఆస్పత్రికి వచ్చిన మరో నలుగురు ఉన్నారు. ఇప్పటికే సూ పరింటిండెంట్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో కేసుల సంఖ్య 15కు చేరింది. వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరాడు న్యూమోనియాతో బాధపడుతున్న మా నాన్నను మూడు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని సెంచూరీ ఆసుపత్రిలో చేర్పించాం. సోమవారం రాత్రి అక్కడి వైద్యులు ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో మేమంతా హోం క్వారంౖ టెన్ అయ్యాం. మా దుకాణ సిబ్బందిని కూడా క్వారంటైన్లో ఉండాలని సూచించాం. లాక్డౌన్ తర్వాత నుంచి మా నాన్న బయటకు రావడం లేదు.. గోకుల్‌చాట్‌కు కూడా రాలేదు. కాబట్టి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – రాకేష్, గోకుల్‌చాట్ యజమాని కుమారుడు -
కరోనా అలర్ట్: గోకుల్‌చాట్ మూసివేత
సాక్షి, హైదరాబాద్: కోఠిలోని గోకుల్‌చాట్‌లో కరోనా కలకలం రేగింది. గోకుల్‌చాట్ యజమానికి మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు దానిని మూసేశారు. 20 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. గత రెండు,మూడు రోజులుగా గోకుల్ చాట్‌కు వచ్చిన వెళ్లినవారి వివరాలను అధికారులు తెలుసుకుంటున్నారు. కాగా, హైదరాబాద్‌లో గోకుల్ చాట్‌కు విశేష ప్రాచుర్యం ఉంది. అక్కడ రోజూ వందలాదిమంది చాట్ ఆరగిస్తారు. తాజా ఘటనతో అక్కడ ఇటీవల చాట్ తిన్న వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. లాక్‌డౌన్‌తో మూతపడిన గోకుల్‌చాట్ ఈనెల 8 నుంచి తిరిగి ప్రారంభమైందని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా 219 కరోనా కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 5,193కి చేరింది. (చదవండి: ఆర్డర్ చేసిన ఫుడ్‌లో ఈగ) -
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఐఎం చీఫ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్‌ల్లో 2007 ఆగస్ట్ 25న చోటుచేసుకున్న జంట పేలుళ్ల కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు అమీర్ రజాఖాన్ పాకిస్థాన్‌లో తలదాచుకున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతడు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన ముఖ కవళికల్నీ మార్చుకున్నట్లు తేల్చాయి. ఉగ్రవాదులుగా పిలిచే ఉగ్ర సోదరులు, 2007 నాటి జంట పేలుళ్ల కేసు నిందితులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌లను ఉగ్రవాదం వైపు మళ్లించింది సైతం ఇతగాడే. ఫోన్ కాల్స్‌ను ఓ ప్రాంతం నుంచి చేస్తూ మరో ప్రాంతం నుంచి చేస్తున్నట్లు చూపించే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఐరోపా ఖండంలోని దేశాల్లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థల్ని తప్పుదోవపట్టిస్తున్నాడని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇతడు తమ ముఖ కవళికల్ని మార్చుకున్నాడని చెప్పడానికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించిన నిఘా వర్గాలు గాలింపు ముమ్మరం చేశాయి. బెదిరింపుల దందాలో దొరికిన నమూనాలు.. కేంద్ర నిఘా వర్గాలు గతంలోనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా పోలీసుల వద్ద నుంచి అమీర్ రజా ఖాన్ గొంతుకు సంబంధించిన నమానాలను సేకరించాయి. అదే నగరానికి చెందిన అమీర్ రజా ఖాన్ అక్కడ నుంచే నేర ప్రస్థానం ప్రారంభించాడు. తన సోదరుడైన ఆసిఫ్ రజా ఖాన్‌తో కలిసి ఆఫ్తాబ్ అన్సారీ గ్యాంగ్‌లో చేరి కిడ్నాప్‌లు, బెదిరించి డబ్బు గుంజడాలు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడు. 2001లో కోల్‌కతాకే చెందిన చెప్పుల తయారీ కర్మాగారం యజమాని ప్రథా రాయ్ బుర్మన్ను కిడ్నాప్ చేస్తానని బెదిరించి భారీగా దండుకున్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ సందర్భంలోనే అమీర్ రజా ఖాన్ ఫోన్ ద్వారా చేస్తున్న బెదిరింపులను రాయ్ సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేశారు. వాటిని అప్పట్లోనే కోల్‌కతా నేర దర్యాప్తు విభాగం అధికారులకు అందించారు. అమీర్, ఆసిఫ్‌ల నేర సామ్రాజ్యం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు విస్తరించడంతో అక్కడా అనేక నేరాలు చేశారు. 2001లోనే రాజ్‌కోట్‌లో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్ మరణించడంతో అమీర్ పాకిస్థాన్‌కు పారిపోయి ఉగ్రవాద బాటపట్టాడు. ఆసిఫ్ రజా కమెండో ఫోర్స్ (ఏఆర్‌సీఎఫ్) పేరుతో 2002లో కోల్‌కతాలోని అమెరికన్ కేంద్రంపై దాడి చేయించాడు. ఆ తర్వాత దీన్నే ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మార్చి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడ్డాడు. వీటిలో నగరంలో జరిగిన జంట పేలుళ్లు కూడా ఒకటి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ... అమీర్ రజా పాకిస్థాన్‌లో ఉంటూనే కోల్‌కతాలో తన దందా కొనసాగించాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 2010లో అక్కడి ఫైవ్‌స్టార్ హోటల్ యజమానిని రూ.20 కోట్లు చెల్లించాలంటూ ఫోన్ ద్వారా బెదిరించాడు. ఈ సందర్భంలోనూ గొంతును బాధితుడు సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేశారు. భవానీపూర్ పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసు ఆపై జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ అయింది. దర్యాప్తులో భాగంగా రాయ్ కేసులో నేర దర్యాప్తు విభాగం వద్ద ఉన్న గొంతు నమూనాలను సేకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ అంతర్జాతీయ ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టింది. వీటిలో ఒక దాంట్లో అమీర్ రజా ఖాన్ గొంతు చిక్కడంతో లోతుగా ఆరా తీసింది. ఆ ఫోన్ కాలు ఐరోపా ఖండంలో ఉన్న లగ్జెంబర్గ్ నుంచి వచ్చినట్లు నిర్థారించిన జాతీయ దర్యాప్తు సంస్థ ఆ దేశ పోలీసులకు కేసు దర్యాప్తు సహకార విజ్ఞప్తి రాసింది. దీనిపై స్పందించిన ఆ దేశం కూడా దర్యాప్తు చేసి రజా తమ దేశంలో లేడని స్పష్టం చేసింది. మరింత లోతుగా దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ పాకిస్థాన్‌లోనే ఉంటున్న అమీర్ రజా ఖాన్ ఫోను సంకేతాల్ని ప్రాంతం మార్పు ద్వారా వ్యవహారాలు సాగిస్తున్నాడని అభిప్రాయపడింది. ఈ కారణంగానే లగ్సెంబర్గ్ వెలుగులోకి వచ్చినట్లు తేల్చింది. దుబాయ్, కరాచీ, నేపాల్ల్లోనూ అతడి కదలికలు ఉన్నట్లు సాంకేతిక పరికరాల నిఘాలో గుర్తించారు. రెండేళ్లలో మారిన కవళికలు.. ఈ వివరాల ఆధారంగా ఆరా తీసిన కేంద్ర నిఘా వర్గాలు అంతర్జాతీయ సంస్థల సహకారంతో అమీర్ కోసం వేట ముమ్మరం చేశాయి. ఫలితంగా 2018లో అమీర్ కదలికల్ని పాకిస్థాన్‌లో ఉన్న బాలాకోట్‌లోని లష్కరే తొయిబా ఉగ్రవాద శిక్షణ శిబిరంలో గుర్తించాయి. అప్పట్లో అక్కడి ఉగ్రవాదులకు ఇతడు శిక్షణ ఇస్తున్నట్లు తేల్చారు. మళ్లీ దాదాపు రెండేళ్ల తర్వాత అమీర్‌కు చెందిన తాజా ఫొటోను కేంద్ర నిఘా వర్గాలు సేకరించగలిగాయి. దీనికి, అప్పటి ఫొటోకు చాలా తేడాలు ఉన్నట్లు తేల్చాయి. గడ్డం, మీసం లేకపోవడంతో పాటు కవళికల్లోనే ఎన్నో తేడాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన ముఖాన్ని మార్చుకున్నట్లు అనుమానిస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం అమీర్ రజా ఖాన్ చనిపోయాడంటూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధికారికంగానే ప్రకటించింది. తాజాగా దొరికిన ఆధారాలు అతడు బతికే ఉన్నాడని స్పష్టం చేస్తున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు దీని వెనుక కొత్త వ్యూహం ఏదైనా ఉందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. -
జంట పేలుళ్ల కేసులో తీర్పు సెప్టెంబర్ 4కి వాయిదా
-
జంట పేలుళ్ల కేసులో తుది తీర్పు నేడే
-
చీకటి రోజుకు పదేళ్లు
∙ ఇంకా పరారీలోనే ప్రధాన సూత్రధారి రియాజ్ ∙ నిందితులపై కొనసాగుతున్న విచారణ సిటీబ్యూరో: లుంబినీపార్క్, గోకుల్చాట్ల్లో జంట పేలుళ్లు చోటు చేసుకుని శుక్రవారం నాటికి పదేళ్లు పూర్తయింది. 2007 ఆగస్టు 25న జరిగిన ఈ ఉగ్రవాద చర్యలో 41 మంది ప్రాణాలు కోల్పోగా... మరో 300 మంది వరకు క్షతగాత్రులయ్యారు. వీరిలో అనేక మంది ఇప్పటికీ జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. అదే రోజున దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ పేలని బాంబునూ స్వాధీనం చేసుకున్నారు. ఉదంతం చోటు చేసుకున్న 14 నెలలకు ఈ ఘాతుకాని ఒడిగట్టింది ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులుగా తేల్చిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. రాష్ట్ర ఆక్టోపస్ అధికారులు ఈ ఘాతుకంపై చార్జ్‌షీట్ సైతం దాఖలు చేశారు. ప్రస్తుతం ట్రయల్ దశలో ఉన్న ఈ కేసును ఇంటెలిజెన్స్ ఆధీనంలోని సీఐ సెల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ‘ట్విన్ బ్లాస్ట్’ క్రమం ఓసారి పరిశీలిస్తే... 25.8.07 సాయంత్రం 7–7.30 గంటల మధ్య లుంబినీ పార్క్, గోకుల్ఛాట్ల్లో షేప్డ్ బాంబులు పేలాయి. వెంకటాద్రి థియేటర్ వద్ద ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జి కింద ఓ పేలని బాంబు కూడా దొరికింది. 27.8.07 ఊహా చిత్రాలు రూపొందించి దాదాపు 130 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. రెండు కుట్రలు వెలుగులోకి రావడంతో కొందరిపై ఆ కేసులు నమోదు చేశారు. 10.1.08 హైదరాబాద్‌కు చెందిన రజీయుద్దీన్ నాసిర్‌ను కర్ణాటకలోని దావళగెరె పోలీసులు అరెస్టు చేశారు. అయితే జంట పేలుళ్లపై ఎలాంటి క్లూ లభించలేదు. 6.10.08 ఢిల్లీ ఎన్కౌంటర్లో దొరికిన లీడ్స్‌పై దర్యాప్తు చేపట్టిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ మొత్తం ఇండియన్ ముజాహిదీన్ గుట్టు విప్పింది. 2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడిన ఈ ఉగ్రవాదుల్లో దాదాపు 20 మందిని అరెస్టు చేశారు. వీరిలోనే జంట పేలుళ్ల నిందితులు సైతం ఉండటంతో సిట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న కేసు కొలిక్కి వచ్చింది. 30.11.08 ఉగ్రవాదంపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) రూపుదిద్దుకున్న ఏడాది తరవాత అధికారిక దర్యాప్తు ప్రారంభించింది. 1.2.09 జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల్లో అనీఖ్ షఫీఖ్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అన్సార్ బాద్షా షేక్‌లను పీటీ వారెంట్ పై ముం బయి నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. 9.2.09 దర్యాప్తులో కీలక ఘట్టమైన టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్‌ను చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్వహించారు. లుంబినీ పార్క్‌లో బాంబు పెట్టిన అనీఖ్తో పాటు ఇతనితో కలిసి హబ్సిగూడలోని బంజారా నిలయంలో బస చేసిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను సాక్షులు గుర్తించారు. 25.3.09 జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు ఉగ్రవాదులను ఆక్టోపస్ అధికారులు హైదరాబాద్ తరలించారు. అనీఖ్ షఫీఖ్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అన్సార్ బాద్సా షేక్‌లను 2009 ఫిబ్రవరిలోనే తీసుకురాగా... ఐఎం కో–ఫౌండర్ సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ తర్ఖాష్‌లను పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి తదుపరి దర్యాప్తు జరిపారు. 15/28.5.09, – 20.6.09 జంట పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులనూ దర్యాప్తు చేసిన ఆక్టోపస్ అధికారులు అనేక కీలక ఆధారాలు సేకరించి నాంపల్లి కోర్టులో చార్జ్షీట్లు దాఖలు చేశారు. వీటిలో లుంబినీపార్క్‌లో బాంబు పెట్టిన అనీఖ్, గోకుల్‌చాట్‌లో ఐస్‌క్రీమ్ డబ్బాపై బాంబు పెట్టిన రియాజ్ భత్కల్, దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పెట్టిన అక్బర్‌లతో పాటు ఇక్బాల్ భత్కల్, ఐఎం ఫౌండర్ అమీర్ రజా ఖాన్, ఫారూఖ్ తర్ఖాష్, సాదిక్ షేక్‌లను నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో రియాజ్, ఇక్బాల్, అమీర్ రజా ఇప్పటికీ పరారీలో ఉన్నారు. సీఐ సెల్‌కు కేసు బదిలీ ఆక్టోపస్‌ను పూర్తి స్థాయి కమాండో ఫోర్స్‌గా మార్చిన తర్వాత ఈ కేసుల్ని ఉగ్రవాద వ్యతిరేక విభాగం సీఐ సెల్‌కు బదిలీ చేశారు. ఈ వి«భాగం పర్యవేక్షిస్తున్న ఏకైక కేసు ఇదే కావడం గమనార్హం. ఐఎం ఉగ్రవాదులపై దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉండటంతో ఆయా అధికారులు తీసుకువెళ్ళడం, తీసుకురావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేసు విచారణకు సమయం పడుతోంది. -
గోకుల్‌చాట్ ఘటనకు ఎనిమిదేళ్లు
అబిడ్స్ (హైదరాబాద్) : గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో జంట బాంబు పేలుళ్లు సంభవించి నేటికి ఎనిమిదేళ్లయ్యాయి. భాగ్యనగరం గుండెపై ఓ మానని గాయంలాంటి ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఈరోజు బీజేపీ కార్యకర్తల ఆధ్యర్యంలో నాటి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా 'ఉగ్రవాదం నశించాలి' అనే నినాదంతో బ్యానర్లను ఏర్పాటు చేశారు. భారతమాత విగ్రహానికి పూలమాల వేసి మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు. -
వెంటాడే పీడకల
గోకుల్ చాట్, లుంబినీ పార్కు పేలుళ్లకు ఎనిమిదేళ్లు సుల్తాన్‌బజార్: కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుందంటారు.. కానీ ఎనిమిదేళ్లు గడిచినా ‘జంట పేలుళ్ల’ ఘటనను మాత్రం ప్రజలు మరిచిపోలేక పోతున్నారు. నిద్దురలోనూ ఉలికిపడుతున్నారు. 2007లో ఆగష్టు 25న సాయంత్రం 7.45 గంటలకు కోఠిలోని గోకుల్ చాట్, లుంబినీ పార్కు లేజర్ షో చూస్తున్నవారిపై ఐఎస్ఐ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు విసిరిన పంజా విసిరారు. ఈ ఘటనలో 44 మంది అమాయకులు బలయ్యారు. ఈ దుర్ఘటన జరిగి నేటికి ఎనిమిదేళ్లు. ఇన్నేళ్లు గడిచినా స్థానికుల్లో ఇంకా భయం వీడలేదు. జంట బాంబు పేలుళ్లలో చనిపోయినవారి కుటుంబాలకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి బాధితులకు భరోసా కల్పించారు. ైవె ఎస్ అకాల మరణంతో కొంతమంది బాధితులకు నేటికీ న్యాయం జరగలేదు. నాయకులు ఏటా ఈ ప్రాంతాలకు వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు గాని బాధితులకు సాయం మాత్రం చేయడంలేదు. ప్రతి సంవత్సరం కోఠిలోని గోకుల్ చాట్‌కు బాధితులు వచ్చి వైఎస్సార్ బతికుంటే తమకు న్యాయం జరిగేదని కన్నీరు పెట్టుకోవడం పరిపాటిగా మారింది. నేటి పాలకులైనా జంట పేలుళ్లలో మృతిచెందిన కుటుంబాలను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. జంట పేలుళ్లలో చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని గత ఏడేళ్లుగా గోకుల్‌చాట్ యాజమాని ప్రేంచంద్ విజయవర్గి దుకాణాన్ని బంద్ చేస్తున్నారు. మంగళవారం సైతం గోకుల్‌చాట్ బంద్ ఉంటుందని ఆయన తెలిపారు. ఆ శబ్దం నేటికీ ప్రతిధ్వనిస్తోంది ఆనాడు గోకుల్‌చాట్‌లో జరిగిన బాంబు పేలుడు శబ్దం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. అ సమయంలో నేను వెనుక వైపు ఉండడంతో బతికి బయటపడ్డాను. ఎక్కడ ఏ శబ్దం విన్నా ఆ బాంబు పేలుళ్ల శబ్దాలే గుర్తుకువచ్చి గుండె జల్లుమంటుంది. ఇలాంటి ఘటనతో మేము ప్రైవేటు సెక్యూరిటీతో పాటు ఎలక్ట్రానిక్ నిఘా ఏర్పాటు చేసుకున్నాం. ఆనాటి భయం మాత్రం పోవడంలేదు. - ప్రేంచంద్, గోకుల్‌చాట్ యాజమాని ఆ రోడ్డున వెళ్లాలంటే భయం.. ఇప్పటికీ గోకుల్‌చాట్ భండార్‌కు వెళ్లాలంటే ఆనాటి ఘటన గుర్తుకు వచ్చి భయంగా ఉంటుంది. ఉగ్రవాదులు పెట్టిన బాంబు పేలుళ్లలో తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్నవారిని నా చేతులతో ఆటోలు, కార్లు, బస్సుల్లో తరలించా. కొందరు అవయవాలు తెగిపడి గిలగిలా కొట్టుకుంటూ నా చేతుల్లో ప్రాణాలు విడిచారు. ఈ ఘటనను తలచుకుంటే కన్నీళ్లు ఆగవు. - సునీల్ బిడ్లాన్, కుత్బిగూడ -
గాయం @ 8ఏళ్లు
-
‘గోకుల్’ మృతులకు నివాళి
సుల్తాన్‌బజార్: గోకుల్‌చాట్, లుంబిని పార్క్ జంట బాంబు పేళ్లులు జరిగి సోమవారం నాటికి 7ఏళ్లు నిండాయి. హైదాబాద్‌కు మాయని మచ్చగా నిలిచిన ఈ సంఘటనకు కోఠి గోకుల్‌చాట్, లుంబినీపార్క్లు సాక్షిగా మారాయి. కోఠి గోకుల్‌చాట్ వద్ద బాంబుపేళ్లుల్లో మృతి చెందిన మృతులకు బీజేపీ, సీపీఐ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల నాయకులతో పాటు విద్యార్థులు, స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు సోమవారం గోకుల్‌చాట్ వద్ద నివాళులర్పించారు. వీహెచ్‌పి, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో... ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకురావాలని విశ్వహిందూపరిషత్, భజరంగ్‌దళ్‌లు డిమాండ్ చేశాయి. బాంబు దాడుల్లో మృతిచెందిన వారి ఆత్మశాంతి కోసం సోమవారం కోఠిలోని గోకుల్చాట్వద్ద శ్రద్ధాంజలి ఘటించి నివాళుర్పించారు. ఈ సందర్భంగా వీహెచ్‌పి రాష్ట్ర కార్యదర్శి గాల్‌రెడ్డి మాట్లాడుతూ సంఘటన జరిగి ఏడేళ్లు పూర్తి కావస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. బాధితులకు రూ.20లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఆకారపు కేశవరావు, భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ వై.భానుప్రకాష్ఐ భరత్‌వంశీ, యమన్సింగ్తో పాటు పెద్ద ఎత్తున వీహెచ్‌పి, భజరంగ్‌దళ్ నాయకులు పాల్గొన్నారు. బాధితుడు రెహ్మతుల్లా నివాళి... కోఠి గోకుల్‌చాట్ వద్ద గత ఏడేళ్ల క్రితం చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో బాధితుడు రెహ్మతుల్లా తీవ్రంగా గాయపడి ఒక కన్నును కోల్పోయాడు. కుమార్తెకు ఐస్‌క్రీమ్ తీసుకురావడానికి వెళ్లిన రెహ్మతుల్లా పేలుళ్ల బారిన పడ్డానని కంటతడిపెట్టుకున్నాడు. తన చికిత్స కోసం ఇప్పటి వరకు లక్షల్లో డబ్బులు వెచ్చించానని వాపోయాడు. పెయింటర్‌గా పనిచేసే తాను వైద్య ఖర్చుల కోసం స్వగ్రామమైన ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలో ఉన్న భూములను అమ్ముకున్నానన్నాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదన్నారు. ఇప్పటికైనా టీ సర్కార్స్పందించి తనకుసహాయం చేయాలని కోరాడు. నగరంలో ఉగ్ర’ మూలాలు : కిషన్‌రెడ్డి లుంబినీ పార్క్ మృతులకు బీజేపీ నేతల నివాళి ఖైరతాబాద్: ఉగ్రవాదం పెను సవాలుగా మారిందని, దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల దాడులు జరిగినా దాని మూలాలు హైరదాబాద్ నగరంలో బయట పడుతుండటం ఆందోళన కలిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం లుంబినీపార్క్‌లో బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, నగర నాయకుడు వెంకట్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు లుంబినీ, గోకుల్‌చాట్ వద్ద జరిగిన బాంబుదాడుల్లో మృతి చెందిన వారికి ఘనంగా నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఎంపీ బండారు దత్తాత్రేయ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బద్దం బాల్‌రెడ్డి, ఆలె జితేంద్ర, లాయక్ అలీ తదితరులు పాల్గొని మృతుల కుటుంబాలకు నివాళులు అర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. -
కిరాయిదారులపై నిఘా
అద్దెకుండే వారి వివరాలతో డేటాబేస్ ముష్కరుల ఆగడాలకు చెక్ చెప్పేందుకే ఠాణాల వారీగా వివరాల సేకరణకు నిర్ణయం ప్రణాళికలు సిద్ధం చేసిన సైబరాబాద్ సీపీ సాక్షి, సిటీబ్యూరో: 2007 ఆగస్టు, 2013 ఫిబ్రవరి... ఉత్తరాది నుంచి వచ్చిన ముగ్గురు ముష్కరులు హబ్సిగూడ, అబ్దుల్లాపూర్‌మెట్‌ల్లో మకాం పెట్టారు... లుంబినీపార్క్, గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్‌ల్లో బాంబులు పేల్చి 59 మందిని బలి తీసుకున్నారు... ముంబై మోడల్ని ఈవెంట్ పేరుతో తీసుకువచ్చిన దండుగులు నిజాంపేట్‌లోని ఇంట్లో బంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాల్ని పరిగణలోకి తీసుకున్న సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ టెనెంట్స్ వాచ్ (అద్దెకుండే వారిపై నిఘా) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవీ విధి విధానాలు... ‘టెనెంట్స్ వాచ్ ఫామ్’ దరఖాస్తుల్ని ముద్రించి అన్ని ఠాణాల్లో అందుబాటులో ఉంచుతారు. ఇంటి యజమానులంతా వీటిని తీసుకోవాలి. తమ ఇంట్లో అద్దెకుండే వారి పూర్తి వివరాలు నమోదు చేసి, వారి గుర్తింపు పత్రాలతో పాటు ఫొటోలనూ జత చేసి పోలీసు స్టేషన్లో అప్పగించాలి. ఈ అంశాన్ని మరింత సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రచారం నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క స్థానిక ఇన్స్పెక్టర్లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తన పరిధిలో టెనెంట్స్ వాచ్ అమలును తనిఖీ చేయాలి. కేవలం వివరాలు సేకరించి వదిలిపెట్టకుండా ఫొటోలతో సహా టెనెంట్స్ డేటాబేస్ రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో సైబరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అద్దెకున్న వారి వివరాలన్నీ సెంట్రల్ సర్వర్‌లో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని, దీన్ని పోలీసు విభాగం వినియోగించే ఇంట్రానెట్‌కు కనెక్ట్ చేస్తారు. శివార్లలో కాలేజీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు ఐటీ హబ్‌లోనూ టెనెంట్స్ వాచ్ తప్పనిసరి చేసి ఉల్లంఘించిన ఇంటి యజమానులపై చర్యలకు అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఈ టెనెంట్స్‌వాచ్ అమలుతో ముష్కరులకు షెల్టర్ దొరక్కుండా చేయడంతో పాటు ఏదైనా జరగరానిది జరిగినప్పుడు దర్యాప్తు తేలికవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఠాణాల వారీగా వివరాల సేకరణ... నగరానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందంటూ నిఘా వర్గాల నుంచి తరచు హెచ్చరికలు అందుతూనే ఉన్నాయి. మరోపక్క ఇతర ప్రాంతా లు, రాష్ట్రాల నుంచి వస్తున్న దృష్టి మరల్చి చోరీలు చేసే ముఠాలు, దోపిడీ దొంగలకూ అద్దె ఇళ్లే అడ్డాలు గా మారుతున్నాయి. ఇలా వస్తున్న ముష్కరులకు షెల్టర్ దొరక్కుండా చేయాలనే ఉద్దేశంతోనే సైబరాబాద్ పోలీసులు ఈ టెనెంట్స్ వాచ్‌ను అమలు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో 41 శాంతి భద్రతల ఠా ణాలకు ఈ బాధ్యతల్ని అప్పగించనున్నారు. టెనెం ట్స్ వాచ్‌కు సంబంధించిన విధి విధానాలను సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రూపకల్పన చేస్తున్నారు. డిజైన్ సిద్ధం చేశాం.... ముష్కరమూకలతో పాటు అసాంఘికశక్తులకు చెక్ చెప్పే చర్యల్లో భాగంగా టెనెంట్స్ వాచ్‌ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి న విధి విధానాల డిజైన్‌ను పూర్తి చేశాం. ప్రస్తుతం దీనికి తుదిమెరుగులు దిద్దుతున్నాం. పూర్తిస్థాయి స్వరూపం వచ్చాక ఠాణా ల వారీగా త్వరలోనే అమలు చేస్తాం. అద్దెకుండే వారి వివరాల సేకరణను తప్పనిసరి చేస్తాం. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
ఒకటే స్కెచ్
నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఐదున్నరేళ్ల వ్యవధిలో నగరంలో రెండు భారీ విధ్వంసాలను సృష్టించింది. 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో బాంబుల్ని పేల్చి 47 మంది ప్రాణాలు తీసింది. మరో 300 మందిని క్షతగాత్రుల్ని చేసింది. సుదీర్ఘ విరామం తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 21న మరోసారి విరుచుకుపడిన ముష్కరులు 18 మందిని చంపి, 131 మందిని క్షతగాత్రుల్ని చేశారు. ఈ రెండు పేలుళ్ల ఆపరేషన్ల మధ్య ఉన్న సారూప్యతలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ విధ్వంసాల కోసం ముష్కరులు 25 రోజుల ముందు నగరానికి చేరుకోగా... ఈసారి మాత్రం కేవలం 16 రోజుల ముందే వచ్చారు. అప్పట్లో తొలుత అనీఖ్ షఫీఖ్ సయీద్ (లుంబినీ పార్క్‌లో బాంబు పెట్టాడు) అనే ఉగ్రవాది వచ్చాడు. షెల్డర్ ఏర్పాటు చేశాక అక్బర్ ఇస్మాయిల్ చౌదరి (ఇతడు పెట్టిన బాంబు పేలలేదు)ని పిలించించాడు. ఇద్దరూ కలిసి ప్రాథమిక రెక్కీలు పూర్తి చేసిన తరవాత పేలుడుకు రెండు రోజుల ముందు మాత్రమే ప్రధాన సూత్రధారి, పాత్రధారి అయిన రియాజ్ భత్కల్ (గోకుల్‌చాట్‌లో పెట్టింది ఇతడే) చేరుకుని బాంబుల పని పూర్తి చేశాడు. ఆ తరవాత ఒక రోజు తమ గదిలోనే ఉండి తిరిగి వెళ్లారు. తాజా దిల్సుఖ్నగర్ ఆపరేషన్ కోసం మొదట తెహసీన్ అక్తర్ అలియాస్ మోను (ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద బాంబు పెట్టిన వ్యక్తి) రాగా... కొన్ని రోజులకు తబ్రేజ్, వఖాస్ (107 బస్టాప్‌లో పెట్టిన వ్యక్తి) వచ్చారు. ఈ ముగ్గురూ కలిసి రెండు పేలుళ్లు జరిపి వెళ్లారు. మంగుళూరు నుంచే ‘పార్సిల్స్’ అప్పటి, ఇప్పటి జంట పేలుళ్లకు అవసరమైన పేలుడు పదార్థం, డిటోనేటర్లు ఉగ్రవాదులు నగరానికి చేరుకున్న తరవాతే వారికి అందాయి. 2007లో విధ్వంసం సృష్టించడానికి పదిహేను రోజుల ముందు మంగుళూరు నుంచి రియాజ్ భత్కల్ పేలుడు పదార్థంతో పాటు ఇతర ఉపకరణాలను ఓ బస్సు ద్వారా పంపాడు. వీటిని అనీఖ్, అక్బర్లు చాదర్‌ఘాట్‌లో రిసీవ్ చేసుకున్నారు. ఈసారి మాత్రం తబ్రేజ్ నేరుగా మంగుళూరు నుంచి తీసుకువచ్చాడు. ఇతడిని మోను ఎల్బీనగర్ చౌరస్తాలో రిసీవ్ చేసుకుని తమ డెన్‌కు వెంటపెట్టుకు వెళ్లాడు. నాడు చెక్కతో చేసిన షేప్డ్ బాంబుల్ని పేల్చగా... నేడు ప్రెషర్ కుక్కర్లతో తయారు చేసిన బాంబుల్ని పేల్చారు. రెండు సందర్భాల్లోనూ పేలుడు పదార్థంగా అమ్మోనియం నైట్రేట్‌నే వినియోగించారు. కామన్ ‘పాయింట్’ దిల్సుఖ్నగర్ 2007 నాటి గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్ల ఆపరేషన్, ఈ ఏడాది ఫిబ్రవరి నాటి ఏ-1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల వద్ద జరిగిన విధ్వంసం... ఈ రెండు అంశాల్లోనూ దిల్సుఖ్నగర్ కామన్ పాయింట్‌గా ఉంది. అప్పట్లో గోకుల్‌చాట్‌లో రియాజ్, లుంబినీపార్క్‌లో అనీఖ్ బాంబులు పెట్టగా... అక్బర్ మరో బాంబును దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ ఎదురుగా ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వద్ద వదిలి వెళ్లాడు. ఆ రెండూ పేలగా... ఇది పేలలేదు. ఫిబ్రవరి ఆపరేషన్‌లో మాత్రం ఉగ్రవాదులు నేరుగా దిల్‌సుఖ్‌నగర్‌నే టార్గెట్ చేసి రెండు బాంబుల్ని పేల్చారు. ఈ రెండు ఉదంతాలపై నమోదైన ఐదు కేసుల్లోనూ రియాజ్ భత్కల్ ప్రధాన నిందితుడిగా, మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. అప్పట్లో నేరుగా వచ్చి హబ్సిగూడలోని గదిలో బాంబుల్ని అసెంబుల్ చేసి గోకుల్‌చాట్‌లో బాంబు పెట్టగా... ఈసారి మాత్రం పాకిస్థాన్ నుంచి నేతృత్వం వహించి చేయించాడు. బాంబుల అసెంబ్లింగ్ బాధ్యతల్ని వఖాస్‌కు అప్పగించాడు. రెండుసార్లూ మారిన ‘టార్గెట్స్’... ఈ రెండు ఆపరేషన్లలోనూ ఉగ్రవాదులు ఆఖరి నిమిషంలో అనుకోని ప్రాంతాన్ని టార్గెట్‌గా చేసుకుని బాంబు పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో ఉగ్రవాదులు టార్గెట్ చేసిన ప్రాంతాల్లో గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్‌లతో పాటు హుస్సేన్‌సాగర్‌లో తిరిగే షికారు బోటు ఉంది. అయితే ఇందులో బాంటు పెట్టేందుకు ట్రిగ్గర్ ఆన్ చేసుకుని ఆటోలో వెళ్లిన అనీఖ్... ఆటోవాలాకు చెల్లించేందుకు అవసరమైన చిల్లర లేకపోవడంతో బాంబు పేలే సమయం సమీపించి లుంబినీపార్క్ లేజేరియం వద్ద వదిలి వెళ్లాడు. ఫిబ్రవరి 21న సైతం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ-1 మిర్చ్ సెంటర్‌తో పాటు దాని వెనుక ఉన్న ఓ మద్యం దుకాణాన్ని టార్గెట్ చేశారు. అయితే అక్కడకు బాంబుతో కూడిన సైకిల్‌ను తీసుకువెళ్తున్న వఖాస్ సమయం మించిపోతుండటంతో 107 బస్టాప్ వద్ద పార్క్ చేసి వెనక్కు వెళ్లిపోయాడు. అనుమానం రాని చోట మకాం సిటీని టార్గెట్‌గా చేసుకుని విధ్వంసం సృష్టించడానికి నిర్ణీత సమయం ముందు వచ్చిన ఐఎం ఉగ్రవాదులు పోలీసుల ఆలోచన సోకని, వారికి అనుమానం రాని ప్రాంతాల్లోనే షెల్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. నాటి జంట పేలుళ్ల కోసం నగరానికి వచ్చిన ఉగ్రవాదులు హబ్సిగూడలోని స్ట్రీట్ నెం.8లో ఉన్న బంజారా నిలయం అపార్ట్మెంట్లోని 302 ఫ్లాట్‌ను ఎంచుకుంటే... తాజాగా దిల్సుఖ్నగర్ ఆపరేషన్ పూర్తి చేయడం కోసం వచ్చిన వారు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సాయినగర్‌లో ఉన్న రేకుల ఇంటిలో ఆశ్రయం పొందారు. ఈ రెండు సందర్భాల్లోనూ విద్యార్థులమంటూనే ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. రెండు ఇళ్ల యజమానులూ వాటికి సమీపంలో లేకపోవడం వీరికి కలిసి వచ్చింది. -
పేలుళ్లు.. అరెస్ట్..గురువారమే
సాక్షి, సిటీబ్యూరో:2013 ఫిబ్రవరి 21 గురువారం: దిల్‌సుఖ్‌నగర్‌లోని ‘107’ బస్టాప్, ‘ఏ-1’ మిర్చ్ సెంటర్ వద్ద భారీ బాంబు పేలుళ్లు ... 2013 ఆగస్టు 29 గురువారం: ఈ పేలుళ్లకు బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యాసీన్ భత్కల్, తబ్రేజ్ అరెస్టు... 2005 నుంచి దేశ వ్యాప్తంగా అనేక విధ్వంసాలు సృష్టించిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) రాజధానిలో రెండు ఘాతుకాలకు పాల్పడింది. ఐఎం స్థాపనలో కీలకపాత్ర పోషించిన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ నేతృత్వంలోని మాడ్యుల్ 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో బాంబులు పేల్చింది. అదేరోజు దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ సమీపంలో పేలని బాంబు కూడా దొరికింది. ఇది జరిగిన ఐదున్నరేళ్లకు ఐఎం మరోసారి పంజా విసిరింది. ఈ సంస్థకు కో-ఫౌండర్‌గా ఉన్న యాసీన్ భత్కల్ నేతృత్వంలోని మాడ్యుల్ దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడింది. రియాజ్, ఇక్బాల్‌లకు యాసీన్ భత్కల్ సోదరుడు. గతంలో రియాజ్ నేరుగా వెళ్లి గోకుల్‌చాట్‌లో బాంబు పెట్టగా... తాజాగా యాసీన్ స్వయంగా ‘107’ బస్టాప్‌లో బాంబు పెట్టాడు. ‘పొరుగువారి’ వల్లే కొలిక్కి... సిటీలో 2007 నాటి తొలి జంట పేలుళ్లు, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రెండో జంట పేలుళ్లు... ఈ రెండు కేసుల్లో ఒక్కటి కూడా నగర, రాష్ట్ర పోలీసులో, నిఘా వర్గాలో ఛేదించలేదు. గోకుల్, లుంబినీ పేలుళ్ల చిక్కుముడిని ఏడాది తరవాత ముంబై క్రైమ్ బ్రాంచ్ విప్పింది. ఢిల్లీలోని బాట్లాహౌస్లో 2008 సెప్టెంబరు 19 జరిగిన ఎన్కౌంటర్లో దొరికిన ఆధారాలను బట్టి క్రైమ్ బ్రాంచ్ మొత్తం ఇండియన్ ముజాహిదీన్ గుట్టు విప్పారు. 2005 ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా 11 విధ్వంసాలకు పాల్పడిన ఈ ఉగ్రవాదుల్లో దాదాపు 20 మందిని 2008 అక్టోబరు 6న అరెస్టు చేశారు. వీరిలోనే జంట పేలుళ్ల నిందితులు అనీఖ్ షఫీఖ్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అన్సార్ బాద్షా షేక్, సాదిక్ షేక్, ఫారూఖ్ తర్ఖాష్ సైతం ఉన్నారు. ఫిబ్రవరి నాటి దిల్సుఖ్నగర్ పేలుళ్లకు సంబంధించి నగర, రాష్ట్ర పోలీసు వర్గాలు కనీసం ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్నీ ఆరు నెలల పరిశోధనలో పట్టుకోలేకపోయారు. ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల సంయుక్త ఆపరేషన్‌తో ఈ చిక్కుముడి వీడింది. భత్కల్ బ్రదర్స్ బీహార్‌లోని బుద్ధగయ, హైదరాబాద్ గురిపెట్టారంటూ గత ఏడాది అక్టోబర్ 21న ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉగ్రవాది మగ్బూల్ వెల్లడించినా ఏ ఒక్కటీ ఆపలేకపోయారు. నేపాల్ సరిహద్దుల్లో కీలక అరెస్టులు ఉగ్రవాద కోణంలో నగరానికి సంబంధించిన 2 కీలక అరెస్టులు నేపాల్ సరిహద్దుల్లో చోటు చేసుకున్నాయి. పాక్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండాను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ నెల రెండో వారంలో నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ 1998లో సిటీ పోలీసులకు చిక్కిన పాక్ జాతీ యుడు సలీం జునైద్ కేసులో టుండా నింది తుడు. ఇతడు తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్ (టీఐఎం) స్థాపనలో కీల క పాత్ర పోషించాడు. ఈ సంస్థ 1993లో సిటీ లో అబిడ్స్, గోపాలపురం, హుమయూన్‌నగర్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో పేలుళ్లు జరిపిం ది. ఈ పేలుళ్లలో నలుగురు మరణించగా... పలువురు గాయపడ్డారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు సూత్రధారులైన యాసీన్ భత్కల్, తబ్రేజ్ కూడా నేపాల్ సరిహద్దుల్లోనే చిక్కారు. సమాచారం సేకరించాక బృందం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసిన యాసీన్, తబ్రేజ్లకు దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లతో సంబంధం ఉందనే అనుమానాలున్నాయి. 107బస్టాప్ దగ్గర యాసీన్ స్వయంగా బాంబు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరు ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రాథమికంగా అక్కడి అధికారుల నుంచి సమాచారం సేకరిస్తాం. ఆపై వారి విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని పంపుతాం. నేరం నిర్ధారణ అయితే న్యాయస్థానం ఆదేశాలతో పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువస్తాం. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాం.