మూతపడిన కోఠిలోని గోకుల్‌చాట్ భండార్
సుల్తాన్‌బజార్: హైదరాబాద్‌లో పేరుపొందిన కోఠి గోకుల్‌చాట్ యజమాని (72)కి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. అధికారులు గోకుల్‌చాట్‌ను మూసివేయించడంతో పాటు 20 మంది సిబ్బందిని, కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. కరోనా పా జిటివ్ వచ్చిన యజమాని ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో వైద్య సిబ్బంది, పో లీసులు వివరాలు సేకరిస్తున్నారు. సాధారణంగా ఎక్కువ సంఖ్యలోనే ప్రజలు గోకుల్‌చాట్ రుచులను ఆస్వాదిస్తుం టారు. దీంతో ఎక్కువ మంది వివరా లు సేకరించాల్సి రావొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
గోకుల్‌చాట్‌లో కట్లెట్, పావుబాజి, కుల్ఫీ వంటి పదార్థాలను ఎక్కువ మంది రుచిచూస్తారు. లాక్‌డౌన్‌తో మూతపడిన దుకాణం ప్ర భుత్వం సడలింపులు ఇవ్వడంతో తెరుచుకుంది. టేక్ అవే పేరుతో కట్లెట్, ఇతర స్నాక్స్ అందిస్తోంది. గోకుల్‌చాట్ యజ మానికి పాజిటివ్ రావడంతో ఇక్కడ స్నా క్స్ తిన్న వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ దుకాణంలో 40 మంది వరకు పనిచేసేవారు. కేంద్రం సడలింపులతో వారిలో చాలామంది సొంతూళ్లకు వెళ్లారు. ప్రస్తుతం సగం మందే విధులు నిర్వహిస్తున్నారు. వీరందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.
కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కలకలం
గచ్చిబౌలి: కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో మరో 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 10 మంది వైద్య సిబ్బందితో పాటు ఆస్పత్రికి వచ్చిన నలుగురి శాంపిల్స్ ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీకి పంపించగా పాజిటివ్‌గా తేలిం ది. వీరిలో ఇద్దరు డాక్టర్లు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, సెక్షన్ ఆఫీసర్, సె క్యూరిటీ గార్డు, జూనియర్ అసిస్టెంట్, వీసీటీసీ కౌన్సిలర్, అంబులెన్స్ డ్రైవర్, ఫార్మసిస్ట్‌తో పాటు ఆస్పత్రికి వచ్చిన మరో నలుగురు ఉన్నారు. ఇప్పటికే సూ పరింటిండెంట్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో కేసుల సంఖ్య 15కు చేరింది. వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరాడు
న్యూమోనియాతో బాధపడుతున్న మా నాన్నను మూడు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని సెంచూరీ ఆసుపత్రిలో చేర్పించాం. సోమవారం రాత్రి అక్కడి వైద్యులు ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో మేమంతా హోం క్వారంౖ టెన్ అయ్యాం. మా దుకాణ సిబ్బందిని కూడా క్వారంటైన్‌లో ఉండాలని సూచించాం. లాక్‌డౌన్ తర్వాత నుంచి మా నాన్న బయటకు రావడం లేదు.. గోకుల్‌చాట్‌కు కూడా రాలేదు. కాబట్టి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– రాకేష్, గోకుల్‌చాట్ యజమాని కుమారుడు
Comments
Please login to add a commentAdd a comment