లుంబినీ పార్క్ దగ్గరకు మహా గణపతి | maha ganapathi at lumbini park | Sakshi
Sakshi News home page

లుంబినీ పార్క్ దగ్గరకు మహా గణపతి

Published Mon, Sep 28 2015 6:15 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

లుంబినీ పార్క్ దగ్గరకు మహా గణపతి

లుంబినీ పార్క్ దగ్గరకు మహా గణపతి

హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణనాథుడి శోభాయాత్ర కనుల విందుగా సాగుతోంది. ఎన్టీఆర్ ఘాట్ రోడ్డు మీదుగా మహా గణపతిని నిమజ్జన కార్యక్రమానికి తరలించారు. ప్రస్తుతం లుంబినీ పార్క్ వద్దకు మహాగణపతి శోభాయాత్ర చేరుకుంది. మరో రెండు గంటల్లో మహా గణపతి నిమజ్జన కార్యక్రమం ముగిస్తామని పోలీసులు చెప్పారు. గంట సమయం వెల్డింగ్ పనులు చేసేందుకు.. మరో గంట సమయం పూజలకు పడుతుందని, ఆ తర్వాత నిమజ్జనం మొదలు పెడతామని చెప్పారు.

మరోపక్క, ఆదివారమే నిమజ్జన పనులు ముగుస్తాయని భావించినా సోమవారం మొత్తం గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగేలా ఉన్నాయి. గణేశ్ నిమజ్జన వేడుకలతో తెలుగు రాష్ట్రాల రాజధాని భాగ్యనగరం పులకించిపోతోంది. జంటనగరాలు విఘ్నేశ్వరుడి శోభాయాత్రతో సందడిగా మారాయి.

 

కన్నుల పండువగా సాగుతున్న నిమజ్జన వేడుకులను తిలకించేందుకు భక్త జనం ట్యాంక్ బండ్‌కు బారులు తీరింది. లక్షలాది మంది భక్తులు గణపతి విగ్రహాల వెంట తరలిరావడంతో మహానగర రహదారులు ఆధ్యాత్మికశోభను సంతరించుకున్నాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో భక్తిమయ వాతావరణం నెలకొంది.  సామాన్య భక్తులతో పాటు రాజకీయ నేతలు కూడా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement