
కొత్త సచివాలయం కట్టడం మూర్ఖత్వమే
రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం కట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం మూర్ఖత్వానికి పరా కాష్ట అని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. మంత్రిగా ఉన్న కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని ఈ పని తలపెట్టారని పేర్కొన్నారు. ఇది మూఢనమ్మకమే అవుతుందని అన్నారు. ఇప్పటిదాకా 16 మంది సీఎంలుగా పనిచేసిన సచివాలయంలో వారి కుమారులు ఎవరూ సీఎం కాలేదనే కారణంతోనే కొత్త సచివా లయం కడతారా అని ఆయన గురువారం సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగలేఖలో ప్రశ్నించారు.