ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ లో అంతర్ రాష్ట్ర మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మొత్తం 17మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
దాదాపు పదేళ్ల తర్వాత అంతర్ రాష్ట్ర మండలి భేటీ అయింది. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాలని అన్నారు. దేశ అభివృద్ధికి రాష్ట్రాల సహకారం అవసరం అని చెప్పారు. కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలు బలపడాలని చెప్పారు. గ్యాస్ కనెక్షన్లు పెంచడం ద్వారా కిరోసిన్ వాడకం తగ్గించ వచ్చని, కిరోసిన ఆదా చేస్తే మిగిలే నిధుల్లో 75శాతం రాష్ట్రాలకు వాటాగా అందుతుందని చెప్పారు. 5కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు.