Inter State Council
-
ఏపీ విధానాలు నచ్చాయి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పాలనా విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని అంతర్ రాష్ట్ర మండలి ప్రశంసించింది. గ్రామ, వార్డు సచివాలయాలతో క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన వికేంద్రీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారని కితాబిచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామాల్లో ప్రజల ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తున్నారని, రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)తో సాగుకు అవసరమైన అన్ని రకాల ఇన్‌పుట్స్‌ను గ్రామాల్లోనే అందుబాటులోకి తెచ్చారని కొనియాడింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో భూ యజమానులకు కచ్చితమైన భూ హక్కు పత్రాలను అందజేస్తున్నారని..ఇదొక మంచి విధానమని (గుడ్ ప్రాక్టీస్) పేర్కొంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న గుడ్ ప్రాక్టీసెస్‌పై అంతర్ రాష్ట్ర మండలి ఇటీవల ఓ నివేదికను వెల్లడించింది. అందులో మన రాష్ట్రానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సచివాలయాలతో పాలనా వికేంద్రీకరణ ♦ ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన పాలనా వికేంద్రీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తద్వారా వివిధ సంక్షేమ పథకాలతోపాటు పలు ప్రభుత్వ సేవలను పౌరుల ఇంటి వద్దకే చేరవేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అవసరాలను తీర్చడంలో ఈ వ్యవస్థ వన్‌స్టాప్ సొల్యూషన్‌గా నిలిచింది. ♦ గ్రామాల్లో 50 ఇళ్లకు.. పట్టణాల్లో 70–100 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున పని చేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో 11 మంది చొప్పున, పట్టణ సచివాలయాల్లో 10 మంది చొప్పున ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరు తమ పరిధిలోని ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ సేవలను నిర్ణీత కాల వ్యవధిలో అందిస్తున్నారు. ఆరు అంచెల్లో ట్రాక్ చేయడం ద్వారా పథకాలకు అర్హులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నారు. ఎవరికైనా అర్హత లేకపోతే అందుకు కారణాలను కూడా చెబుతూ దరఖాస్తు తిరస్కరిస్తున్నారు. సమగ్ర సర్వేతో భూ రికార్డుల శుద్ధీకరణ ♦ దశల వారీగా సమగ్ర భూ సర్వేను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. డ్రోన్స్ ద్వారా ఏరియల్ ఫ్లయింగ్‌తో సర్వే చేయడంతో పాటు గ్రౌండ్ ట్రూథింగ్, రికార్డుల తయారీ, క్షేత్ర స్థాయిలో ధృవీకరణ, రికార్డుల అప్డేషన్, సరిహద్దు వివాదాలపై అప్పీల్స్, సెక్షన్–13 నోటిఫికేషన్ ప్రచురణ, ఫైనల్ రికార్డ్ ఆఫ్ రైట్స్, స్టోన్ ప్లాంటేషన్, సబ్ డివిజన్స్.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్లను క్రమానుగతంగా అమలు చేస్తున్నారు. ♦ సరిహద్దుల ఆన్లైన్ పర్యవేక్షణ, జోనల్, నిబంధనలు, భూమిపై భౌతిక మార్పులతో సహా సమగ్ర భూసర్వే చేపట్టారు. ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా కచ్చితమైన భూ హక్కు పత్రాలను భూ యజమానులకు పంపిణీ చేస్తున్నారు. తద్వారా భూ రికార్డులు క్లీన్ అవుతాయి. ఇది చాలా మంచి విధానం. ‘ఫ్యామిలీ డాక్టర్’తో ప్రజల్లో నిశ్చింత ♦ డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టం చేసింది. ఇందులో భాగంగా రోగుల ఇంటి వద్దే వైద్య సేవలను అందిస్తోంది. తద్వారా చిన్న చిన్న జబ్బులకు పట్టణాలకు పరుగులు తీయాల్సిన అవసరం తప్పిందని ప్రజలు నిశ్చింతగా ఉన్నారు. ఇదొక అద్భుతమైన కార్యక్రమం. ♦ ఆయుష్మాన్ భారత్ హెల్త్–వెల్నెస్ సెంటర్ల ఏకీకరణ ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది. ♦ గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు ఒకటి చొప్పన డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసింది. ♦ ప్రతి విలేజ్ క్లినిక్‌లో ఒక కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్, ఒక ఏఎన్ఎం, ముగ్గురు నలుగురు ఆశా వర్కర్లను నియమించారు. ♦ విలేజ్ క్లినిక్స్ భవనాలను 932 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వార్టర్‌తో సహా నిరి్మంచారు. వీటిల్లో 105 రకాల మందులు, 14 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ♦ ప్రతీ పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రతీ పీహెచ్‌సీకి విలేజ్ క్లినిక్స్‌ను అనుసంధానించారు. ♦ 104 మెబైల్ మెడికల్ యూనిట్‌తో సహా ఫ్యామిలీ డాక్టర్ సేవలను అందిస్తున్నారు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఓపీ సేవలను అందిస్తే.. మరో డాక్టర్ విలేజ్ క్లినిక్స్‌కు హాజరవుతున్నారు. ♦ ఫ్యామిలీ డాక్టర్ విధానంలో సాధారణ ఓపీలతో పాటు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నిర్వహణ, యాంటినేటల్ కేర్.. తల్లులు, నవజాత శిశువులకు పోస్ట్‌నేటల్ కేర్, అంగన్వాడీలు, పాఠశాలల సందర్శన, రక్తహీనత పరీక్షలు, పర్యవేక్షణ, మంచానికే పరిమితమైన రోగుల ఇళ్ల సందర్శన, పంచాయతీల సమన్వయంతో గ్రామ పారిశుధ్య పర్యవేక్షణ జరుగుతోంది. ♦ ఈ ఏడాది మే 3 నాటికి గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ సేవలను 97,11,224 మంది ప్రజలు వినియోగించుకున్నారు. రైతులకు అండగా ఆర్బీకేలు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు మంచి విధానమని, తద్వారా ప్రభుత్వం రైతుల సాగుకు అవసరమైన అన్ని రకాల ఇన్‌పుట్స్‌ను ఉంటున్న ఊళ్లలోనే పొందే అవకాశం కల్పిందని అంతర్రాష్ట్ర మండలి నివేదిక పేర్కొంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు వారికి పనికొచ్చే ఇతర సేవలనూ ఆర్బీకేలు అందిస్తున్నాయని తెలిపింది. అన్ని పంటలను ఈ–క్రాప్ ద్వారా నమోదు చేస్తూ, వాస్తవ సాగుదారు సమాచారాన్ని ప్రభుత్వం తెలుసుకుంటోందని.. తద్వారా నిజమైన సాగుదారులకు వైఎస్సార్ సున్నా వడ్డీ, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీలను అందిస్తోందని ప్రశంసించింది. రైతుల నుంచి పంటల కొనుగోలు కూడా ఆర్బీకేల్లోనే చేపడుతోందని తెలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నదాతలను అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపిస్తోందని కొనియాడింది. -
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు, పథకాలు, కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతోందని అంతర్రాష్ట్ర మండలి ప్రశంసలు..ఇంకా ఇతర అప్డేట్స్
-
సమాఖ్య స్ఫూర్తిని నిలబెడతారా?
ఆలస్యమైనా ఇన్నాళ్ళకు అవసరమైన చర్య చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. అంతర్ రాష్ట్ర మండలి (ఐఎస్సీ)ని ఎట్టకేలకు పునర్నిర్మిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రధానమంత్రి సారథ్యం వహించే ఐఎస్సీతో పాటు, హోమ్ మంత్రి అమిత్ షా ఛైర్మన్‌గా మండలి స్థాయీ సంఘాన్ని సైతం ప్రభుత్వం పునర్నిర్మించింది. ప్రధానితో పాటు అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలు, అడ్మినిస్ట్రే టర్లను ఐఎస్సీలో సభ్యుల్ని చేశారు. రాజ్యాంగపరంగా మనది వివిధ రాష్ట్రాల యూనియన్ అయినా, ఆచరణలో సమాఖ్య స్ఫూర్తి కొరవడుతోందని ఆరోపణలు వస్తున్న వేళ ఈ మండలి పునర్నిర్మాణం స్వాగతనీయం. కాకపోతే, దేశంలో సహకార సమాఖ్య పద్ధతిని ప్రోత్సహించి, అండగా నిలవాల్సిన మండలి ఆ పని చేస్తోందా? రాష్ట్రాల వాదన వినేందుకు క్రమం తప్పకుండా సమావేశమై, కౌన్సిల్‌నూ, జోనల్ కౌన్సిళ్ళనూ క్రియాశీలంగా ఉంచాల్సిన ప్రభుత్వాలు దాన్ని ఆచరిస్తున్నాయా? సర్కారియా కమిషన్ సిఫార్సుల మేరకు ఇప్పటికి సరిగ్గా 32 ఏళ్ళ క్రితం 1990 మేలో ఏర్పాటైన రాజ్యాంగబద్ధ సంస్థ – అంతర్ రాష్ట్ర మండలి. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉండే ‘వస్తు, సేవల పన్ను’ (జీఎస్టీ) మండలి కన్నా, పన్నుల ఆదాయ పంపిణీ చట్రాన్ని సిద్ధం చేసే నిపుణులు సభ్యులుగా ఉండే ఆర్థిక సంఘం కన్నా ఇది భిన్నమైనది. భారత రాజ్యాంగంలోని 263వ అధికరణం ఈ మండలి ఏర్పాటుకు ప్రాతిపదిక. ప్రధానమంత్రి నేతృత్వంలోని ఈ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. కొందరు కేంద్ర మంత్రులు శాశ్వత ఆహ్వానితులు. కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీలోని వివాదాస్పద అంశాలను పరిశీలించి సలహాలివ్వడం కౌన్సిల్ పని. కేంద్ర, రాష్ట్రాలకు ఉమ్మడి ప్రయోజనాలున్న అంశాలను లోతుగా చర్చించడం దాని విధి. వివాదాల పరిష్కారానికీ, ప్రభుత్వ విధానాలు – ఆచరణల మధ్య మెరుగైన సమన్వయానికి సిఫార్సులు చేసే బాధ్యత దానిదే. ఆశలు, ఆశయాలు బాగున్నా ఆచరణలో మాత్రం మండలి స్ఫూర్తిని పాలకులు ఎంతవరకు కొనసాగిస్తున్నారంటే అనుమానమే. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే తంతు. ఉదాహరణకు, ఐఎస్సీ ఏర్పాటైన నాటి నుంచి 2018 వరకు 28 ఏళ్ళ కాలంలో 12 సమావేశాలే జరిగాయి. పదో సమావేశం 2006లో జరగగా, ఆ తర్వాత దశాబ్ద కాలానికి 2016లో కానీ పదకొండోసారి సమావేశం కాలేదు. 2017లో 12వ భేటీ తర్వాత ఇప్పటి దాకా కౌన్సిల్ సమావేశమే అయినట్టు లేదు. ఐఎస్సీ స్థాయీ సంఘమైతే 2005 తర్వాత ఏకంగా పుష్కరకాలానికి 2017లో కానీ సమావేశం కాలేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఐఎస్సీ పునర్నిర్మాణం కేంద్ర, రాష్ట్రాల మధ్య పొరపొచ్చాలను పోగొట్టే చర్చలకు కొత్త ఊపునిస్తుందని ఆశిస్తున్నారు. నిజానికి కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై పలు కమిషన్లు విస్తృత సిఫార్సులు చేశాయి. వాటిలో అమలుకు నోచుకున్నవి తక్కువే. జస్టిస్ సర్కారియా సారథ్యంలోని కమిషన్ సైతం 1988లో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అనేక సిఫార్సులు చేసింది. ఆ కమిషన్ చేసిన 247 సిఫార్సుల్లో 35 సిఫార్సులను ఐఎస్సీ తోసిపుచ్చింది. జస్టిస్ మదన్ మోహన్ పుంఛీ సారథ్యంలో ఇదే అంశంపై 2007లో మరో కమిషన్ ఏర్పాటైంది. 2010లో ఆ కమిషన్ ఇచ్చిన 270కి పైగా సిఫార్సుల్లోనూ అధిక భాగం అటకె క్కాయి. ప్రభుత్వ చట్టాలపై రాష్ట్రపతి నిర్ణయానికి 6 నెలల గడువు, ప్రధాని – రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడిన ప్యానెల్ కలసి గవర్నర్‌ను నియమించడం లాంటి కీలక సిఫార్సులు పుంఛీ కమిషన్ చేసింది. రాజకీయంగా సున్నితమైన ఈ సిఫార్సులను పాలకులు సహజంగానే పక్కనపెట్టేశారు. కొంతకాలంగా కేంద్రం తమ హక్కులను హరిస్తోందని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తి పోయి, ఏక కేంద్రక ప్రభుత్వ దిశగా పాలకులు వెళుతున్నారని అనుమానిస్తున్నాయి. ఆర్థిక సమాఖ్య విధానానికీ తూట్లు పడ్డాయంటున్నాయి. జీఎస్టీ సహా వివిధ అంశాలను ఉదాహరిస్తు న్నాయి. రేపు జీఎస్టీ పరిహార చెల్లింపునకు పెట్టుకున్న వ్యవధి ముగిశాక, కేంద్రానికీ, రాష్ట్రాలకూ మధ్య ఆదాయాల వాటాలో భిన్నాభిప్రాయాలు రావడం ఖాయం. ఈ పరిస్థితుల్లో చర్చల ద్వారా ఘర్షణను నివారించి, సమాఖ్య భావన పరిఢవిల్లాలంటే, అంతర్ రాష్ట్ర మండలే శరణ్యం. 15వ ఆర్థిక సంఘం ఛైర్పర్సన్ ఎన్కే సింగ్ సహా నిపుణుల మాటా అదే. ఆదాయమిస్తున్న దక్షిణాదిని కొట్టి, బల హీన ఉత్తరాది రాష్ట్రాలకు పెడుతున్నారనే భావన ప్రబలకుండా చూసుకోవాల్సింది పాలకులే. మెరుగైన పనితీరు కనబరచడమే తమ నేరమైందని వాపోయే పరిస్థితి రాష్ట్రాలకు తేకూడదు. ప్రభుత్వాల మధ్య ఈ ఒరిపిడిని నివారించే కీలక సంస్థగా అంతర్ రాష్ట్ర మండలి ఎదగాలంటే, ముందు క్రమం తప్పకుండా సమావేశమయ్యేలా ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి. అలాగే, నిర్ణీత కాలా నికి జరిగే ఈ సమావేశాలు ఫలవంతం కావడం మరీ ముఖ్యం. అందుకోసం మండలికి ఒక శాశ్వత సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తే మంచిదని నిపుణుల భావన. భారత యూనియన్‌లో ఇప్పటికీ ఓ సంస్థాగతమైన ఖాళీ ఉంది. ప్రభుత్వాల మధ్య ఘర్షణ చేతులు దాటక ముందే, పన్ను ఆదాయాల పంపిణీలో అసమానతలు ఉన్నాయన్న ఆరోపణలు మరింత బలం పుంజుకోక ముందే ఆ ఖాళీని పూరించాలి. గడచిన రెండు సమావేశాల్లో సహకార సమాఖ్య విధానం, దాని స్ఫూర్తిపై సుద్దులు చెప్పిన కేంద్ర పాలకులు అదేదో ఆచరణలో చూపిస్తే రాష్ట్రాలు సంతోషిస్తాయి. ఆలస్యంగానైనా అంతర్ రాష్ట్ర మండలిని పునర్నిర్మించడం ఆ చర్యల్లో తొలి అడుగు అవుతుందని ఓ చిన్న ఆశ. -
ఐదుకోట్ల మందికి గ్యాస్ కనెక్షన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ లో అంతర్ రాష్ట్ర మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మొత్తం 17మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అలాగే, దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో ఫూంచ్ కమిషన్ సిఫారసులు, అంతర్గత భద్రత, సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్ర రాష్ట్రాల సయోధ్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ అన్నారు. దాదాపు పదేళ్ల తర్వాత అంతర్ రాష్ట్ర మండలి భేటీ అయింది. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాలని అన్నారు. దేశ అభివృద్ధికి రాష్ట్రాల సహకారం అవసరం అని చెప్పారు. కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలు బలపడాలని చెప్పారు. గ్యాస్ కనెక్షన్లు పెంచడం ద్వారా కిరోసిన్ వాడకం తగ్గించ వచ్చని, కిరోసిన ఆదా చేస్తే మిగిలే నిధుల్లో 75శాతం రాష్ట్రాలకు వాటాగా అందుతుందని చెప్పారు. 5కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు.