స్పూఫ్ (ఎన్) లాఫ్ | spoof (N) lough | Sakshi
Sakshi News home page

స్పూఫ్ (ఎన్) లాఫ్

Published Sun, May 22 2016 3:06 AM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

స్పూఫ్ (ఎన్) లాఫ్

స్పూఫ్ (ఎన్) లాఫ్

పవన్‌కల్యాణ్: క్రూడాయిల్ రేటు పెరిగిందని పెట్రోల్ రేటు పెంచేశారు. ఇప్పుడు క్రూడాయిల్ రేటు తగ్గిందని పెట్రోల్ రేటు ఎంత తగ్గించారత్తా? తగ్గిన క్రూడాయిల్ రేటుకు పెట్రోల్ రేటుకు ఏమైనా సంబంధం ఉందా.? ఇది అన్యాయం కాదా.? ఇది మన అమాయకత్వమా.? లేక వాళ్ల మూర్ఖత్వమా.? ఎందుకు మనం సెలైంట్‌గా ఉండాలి?.......
(ఇంకా ఉంది)

బాహుబలి సినిమా కలెక్షన్స్‌పై జూ.ఎన్టీఆర్
జూ. ఎన్టీఆర్: ఆఫ్ట్రాల్ ఏంటి సార్.? ఆఫ్ట్రాల్ కాదు సార్. భారతదేశంలోనే రూ.50 కోట్లు మొదటి రోజే కలెక్ట్ చేసింది సార్. ఆఫ్ట్రాల్ కాద్సార్. 4 వేల థియేటర్లు సార్ .. రూ.130 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ సార్.. 10 వేల మంది ఎంప్లాయిస్ సార్. ఒక్క మహిష్మతి రాజ్యాన్ని 20 ఎకరాల్లో 1000 మంది వర్కర్స్, వందల మంది టెక్నీషియన్స్ 200 రోజుల్లో నిర్మించారు సార్. ఆఫ్ట్రాల్ ఏంటి సార్? .....

 (ఇంకా ఉంది)
పవన్‌కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో క్లైమాక్స్ సీన్‌లో నదియాతో ఆయన డైలాగులు ఇలా ఉండవు కదా?
జూనియర్ ఎన్టీఆర్ ఏమిటి? బాహుబలి గురించి పొగుడ్తూ మాట్లాడిన ఈ సన్నివేశం ఏమిటి?..  తదితర సందేహాలు వస్తున్నాయంటే స్పూఫ్ గురించి మీకు తెలీనట్టే ఎంతో లాఫ్ మిస్ అవుతున్నట్టే.

ప్రముఖులను మక్కీకి మక్కీ అనుకరిస్తూ ఆ అనుకరణకు కాస్త తనదైన చతురోక్తులు జోడిస్తే పగలబడేంత నవ్వొస్తుంది. ఆ నవ్వుల మీదనే ఆధారపడిన మిమిక్రీ ఆర్టిస్టులు సెలబ్రిటీలను అనుకరించడం నవ్వించడం, సర్వసాధారణమైన విషయమే. అయితే దీనికి తమదైన సృజన జోడిస్తున్న సరికొత్త ట్రెండ్ స్పూఫ్ ఫిల్మ్ మేకింగ్. తెలుగులో మాత్రమే విరివిగా కనిపిస్తున్న ఈ తరహా స్పూఫ్‌ల తయారీకి నగరం కేంద్రంగా మారింది.   - ఎస్.సత్యబాబు

అనుకరణలో కొత్త కోణం..
ఒక సినిమాలో బాగా హిట్టయిన సన్నివేశాన్ని తీసుకొని డైలాగులు తిరిగి రాసుకొని అనుకరణ కళాకారులతో దానిని రీరికార్డింగ్ చేయిస్తూ రిలీజ్ చేస్తున్నవే ఈ స్పూఫ్‌లు. ప్రస్తుతం పంచ్ డైలాగులు, సినిమాల్లో హీరోలు, హీరోయిన్‌లు, విలన్‌ల మధ్య చోటు చేసుకుంటున్న కొన్ని సూపర్‌హిట్ సంభాషణలు జనం నోట్లో బాగా నానుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటినే వీటికి ఎంచుకుంటున్నారు. వీటి తయారీకి నగరంలో ప్రత్యేకంగా  కొన్ని నిర్మాణ సంస్థలే పని చేస్తున్నాయంటే ఆశ్చర్యం కదూ. 

 సూపర్ హిట్...
సినిమాల్లోని హిట్ సీన్స్ తీసుకొని తమదైన రీతిలో రూపొందిస్తున్న హాస్య సన్నివేశాలకు వీక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. వీటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. వాట్సప్ ద్వారా కూడా బాగా షేర్ అవుతున్నాయి. దీంతో రూపకర్తలకు మంచి ఆదాయం వస్తోందని సమాచారం. ఇప్పటి వరకు విడుదల చేసిన వాటిలో ‘పెట్రోల్ బంక్‌కి దారేది?’ సూపర్ హిట్ అయింది. లక్షల్లో షేరింగ్‌లు సాధించింది. అలాగే పైరసీ అంశంతో జూ. ఎన్టీఆర్ రాఖీ సినిమా డైలాగ్స్‌కి పేరడీగా చేసిన స్పూఫ్‌కి మంచి స్పందన వచ్చింది. ‘కేవలం హాస్యంతోనే కాకుండా సందేశాత్మకమైన వాటితో కూడా వీక్షకులను ఆకట్టుకోవచ్చని పైరసీ మీద తీసిన స్పూఫ్‌తో నిరూపితమైంద’ని టాలీవుడ్ ప్రసిద్ధ అనుకరణ కళాకారుడు జితేంద్ర అన్నారు. సిటీలో రూపొందుతున్న చాలా స్పూఫ్‌లలో వినిపించే అనుకరణ గొంతు ఇతనిదే.

ప్రచారంలోనూ..
కార్పొరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారానికి వీటిని వినియోగించుకుంటున్నాయి. ఇటీవలే ఒక ప్రముఖ టెలికాం సంస్థ తమ అంతర్గత పంపిణీ కోసం ఏకంగా 15 సినిమా సన్నివేశాలు తీసుకొని పలు రకాల స్పూఫ్ వీడియోలు రూపొందించింది. అదే విధంగా పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌లు, సమావేశాల్లో వినియోగించేందుకు ఈ తరహా స్పూఫ్‌లు రూపొందిస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ,  వ్యాపార దృక్పథంతో తీస్తున్న సంస్థలు మాత్రం అనుమతులు పొంది పక్కాగా రూపొందిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న స్పూఫ్ ఫిల్మ్ మేకింగ్ రచయితలు, అనుకరణ కళాకారులకు ఆదాయ మార్గమైంది. 

సందేశమూ ఉండాలి..
ఇప్పటికే దాదాపు 40 స్పూఫ్‌లకు నా స్వరాన్ని అందించాను. హీరోలను అనుకరించడమనేది సాధారణ విషయమే అయినా, అప్పటికే ప్రేక్షకుల్లో బాగా ఆదరణ పొందిన సన్నివేశం, సంభాషణల్లో ఇతర అంశానికి సంబంధించిన డైలాగులు జొప్పించి మెప్పించడం అంత సులభం కాదు. ఇలాంటివి కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతతో రూపొందిస్తే అటు ప్రజలకు ఉపయోగంగానూ, ఇటు హీరోల ఇమేజ్  కాపాడే విధంగానూ ఉంటాయనేది నా అభిప్రాయం.     - జితేంద్ర, అనుకరణ కళాకారుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement