TeslaPhone: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెరతీయనున్నారు అంటూ ఒక వార్త వైరల్‌గా మారింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కిల్లర్ ఫీచర్స్‌తో కొత్త మొబైల్ ఫోన్ లాంచ్ చేయనున్నట్టు మస్క్ (పేరడీ) పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో టెస్లా ఫోను ఫోటోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు చాలామందిఆశ్చర్యంలో మునిగి పోయారు. ప్రశ్నల వర్షం కరిపించడంతో ఈ ట్వీట్ సంచలనంగా మారింది.
వెనుక టెస్లా పేరుతో, మోటాలిక్ లుక్‌లో ఆకర్షణీయంగా ఉండటం మరింత ఆసక్తికర చర్చకు దారి తీసింది. టెస్లా ఫోన్ వినియోగానికి ఆసక్తిగా ఉన్నారా అంటూ యూజర్లను ప్రశ్నించడంతో ముఖ్యంగా టెస్లా ఫోన్ పిక్ చూసిన కొంతమంది ట్వీపుల్ ప్రశ్నల, సందేహాలు వ్యక్తం చేశారు. నెలకు 100 డాలర్లతో స్టార్ లింక్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినియోగించే విధంగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తే తాను ఆసక్తిగా ఉన్నట్లు ఒక అభిమాని ట్వీట్ చేశారు. మార్స్(అంగారక) గ్రహం నుంచి కూడా ఉపయోగించుకోవచ్చని మస్క్ తెలిపారు. అంతేకాదు ఐఫోన్ 12 మినీ కంటే మెరుగ్గా ఉంటుందని హామి ఇవ్వడం గమనార్హం. సూపర్ స్టన్నింగ్ ఫోన్ ఫోటోతోపాటు, ఇందులో ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటుందనడంతో అందరూ తప్పులో కాలేశారు. ఆనక ఇది నకిలీ(పేరడీ) ఖాతా అని తెలిసి ‘డామిట్’ అనుకున్నారు.
ట్విటర్ ఐకానిక్ బర్డ్ లోగోను మార్చి 'X' గా మార్చి మస్క్ అందర్నీ ఆశ్చర్యపరిచ్చారు. స్పేస్ ఎక్స్ అధినేత ఎక్స్‌పై తనకున్న మోజును చాటు కున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టెస్లా ఫోన్ అనగానే మస్క్ (పేరడీ) పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో నకిలీ వార్తలు పెను సంచలనంగామారుతున్నాయి. ముఖ్యంగా ఏఐ ఎంట్రీ తరువాత ఈ ప్రమాదం మరింత పెరిగింది. అందుకే సోషల్‌మీడియాలో ప్రతీ అంశానికి నిశిత పరిశీలన, ఫ్యాక్ట్‌చెక్ అనేది చాలా కీలకం.
Would you use the Tesla Phone?
— Elon Musk (Parody) (@ElonMuskAOC) July 31, 2023
X comes pre-installed. pic.twitter.com/jSwTQcuDr2
Comments
Please login to add a commentAdd a comment