టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మధ్యకాలంలో భారీగానే నెటిజన్ల నుంచి నెగెటివిటీని ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి ఆయన నుంచి వస్తున్న మ్యూజిక్‌ను తక్కువ చేస్తూ పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్‌కల్యాణ్- సాయిధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న 'బ్రో' సినిమాలోని 'మార్కేండయ' పాట విషయంలో కూడా ఆయనకు మాటల పడటం తప్పలేదు. ఈ సాంగ్‌లో మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదని థమన్‌పై ఫ్యాన్స్ నెగటివ్ కామెంట్లు చేశారు.
(ఇదీ చదవండి: ప్రాజెక్ట్- కే యూనిట్ చీప్ ట్రిక్స్.. ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్)
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇలా స్పందించారు. ''బ్రో ' సినిమా కథ చాలా ప్రత్యేకమైనది. అన్ని సినిమాల్లా కాదు. అందుకే పరిధి మేరకు సంగీతం అందించాను. కానీ అది కొందరికి నచ్చింది.. మరికొందరికి నచ్చలేదు. అంతగా భారీ అంచనాలు ఫ్యాన్స్ పెట్టుకుంటే ఎలా? పెద్ద పాటలు చేయాలని నాకూ ఉంటుంది. కానీ కథలో ఆ అవకాశం ఉండాలి కదా?' అని తమన్ అసహనాన్ని వ్యక్తపరిచారు.
(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: సింగర్)
కొన్ని సినిమాలకు కథకు తగ్గట్టే పాటలు ఇవ్వాలని ఆయన చెప్పారు. అన్ని సినిమాల్లోనూ మాస్ పాటలను పెట్టలేమని చెప్పుకొచ్చారు. 'మార్కండేయ' పాటను ఒక ప్రొవెర్బ్ రూపంలోనే చెప్పాలి. ఇవన్నీ భారీగా అంచనాలు పెట్టుకోవడం వల్ల వచ్చే సమస్యలు.. దానిని ఒక ఐటెమ్ సాంగ్‌లా చేయలేమన్నారు. కథ ఏం కోరుకుందో సినిమాలో కూడా అదే ఇచ్చానని థమన్ చెప్పుకొచ్చారు. పి.సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న బ్రో సినిమా జులై 28న విడదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment