Pawan Hans
-
ఓఎన్జీసీ నుంచి పవన్ హన్స్‌కు భారీ ఆర్డర్
ప్రభుత్వ యాజమాన్యంలోని హెలికాప్టర్ సేవల ఆపరేటర్ పవన్ హన్స్ తాజాగా ఓఎన్జీసీ నుంచి భారీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఇందులో భాగంగా ఓఎన్జీసీ ఆఫ్–షోర్ కేంద్రాలకు సిబ్బందిని తరలించడానికి నాలుగు హెలికాప్టర్లను పవన్ హన్స్ సమకూరుస్తుంది. ఈ డీల్ విలువ రూ.2,141 కోట్లు. 10 ఏళ్లపాటు పవన్ హన్స్ ఈ సేవలను అందించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకున్నట్టు పవన్ హన్స్ వెల్లడించింది.ఇదీ చదవండి: హైదరాబాద్ ‘రియల్’ ట్రెండ్హెచ్ఏఎల్ తయారీ అత్యాధునిక ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్లను పవన్ హన్స్ వినియోగించనుంది. ‘దేశీయంగా తయారు చేసిన ధృవ్ ఎన్జీ అనేది అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) ఎంకే–3 యొక్క సివిల్ వేరియంట్. ఏఎల్‌హెచ్ ఎంకే–3ని ప్రస్తుతం భారత రక్షణ దళాలు ఉపయోగిస్తున్నాయి. ఈ సైనిక హెలికాప్టర్లు నిరూపితమైన ట్రాక్ రికార్డును కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు 335 కంటే ఎక్కువ హెలికాప్టర్లు రంగ ప్రవేశం చేశాయి. ఇవన్నీ కలిపి మొత్తం 3,75,000 గంటలపాటు గగనతల విహారం చేశాయి’ అని పవన్ హన్స్ తెలిపింది. సంస్థ వద్ద ప్రస్తుతం 46 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇవి చమురు, సహజ వాయువు అన్వేషణ, పోలీసు, కేంద్ర బలగాలు తరలింపు, యుటిలిటీ రంగంతోపాటు మారుమూల, కొండ ప్రాంతాలకు కనెక్టివిటీని అందిస్తున్నాయి. -
పవన్ 'బ్రో' విషయంలో సీరియస్ అయిన థమన్..!
టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మధ్యకాలంలో భారీగానే నెటిజన్ల నుంచి నెగెటివిటీని ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి ఆయన నుంచి వస్తున్న మ్యూజిక్‌ను తక్కువ చేస్తూ పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్‌కల్యాణ్- సాయిధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న 'బ్రో' సినిమాలోని 'మార్కేండయ' పాట విషయంలో కూడా ఆయనకు మాటల పడటం తప్పలేదు. ఈ సాంగ్‌లో మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదని థమన్పై ఫ్యాన్స్ నెగటివ్ కామెంట్లు చేశారు. (ఇదీ చదవండి: ప్రాజెక్ట్- కే యూనిట్ చీప్ ట్రిక్స్.. ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్) ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇలా స్పందించారు. ''బ్రో ' సినిమా కథ చాలా ప్రత్యేకమైనది. అన్ని సినిమాల్లా కాదు. అందుకే పరిధి మేరకు సంగీతం అందించాను. కానీ అది కొందరికి నచ్చింది.. మరికొందరికి నచ్చలేదు. అంతగా భారీ అంచనాలు ఫ్యాన్స్ పెట్టుకుంటే ఎలా? పెద్ద పాటలు చేయాలని నాకూ ఉంటుంది. కానీ కథలో ఆ అవకాశం ఉండాలి కదా?' అని తమన్ అసహనాన్ని వ్యక్తపరిచారు. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: సింగర్) కొన్ని సినిమాలకు కథకు తగ్గట్టే పాటలు ఇవ్వాలని ఆయన చెప్పారు. అన్ని సినిమాల్లోనూ మాస్ పాటలను పెట్టలేమని చెప్పుకొచ్చారు. 'మార్కండేయ' పాటను ఒక ప్రొవెర్బ్ రూపంలోనే చెప్పాలి. ఇవన్నీ భారీగా అంచనాలు పెట్టుకోవడం వల్ల వచ్చే సమస్యలు.. దానిని ఒక ఐటెమ్ సాంగ్లా చేయలేమన్నారు. కథ ఏం కోరుకుందో సినిమాలో కూడా అదే ఇచ్చానని థమన్ చెప్పుకొచ్చారు. పి.సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న బ్రో సినిమా జులై 28న విడదల కానుంది. -
ముచ్చటగా మూడోసారి.. ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకానికి బ్రేకులు!
న్యూఢిల్లీ: హెలికాప్టర్ సర్వీసుల పీఎస్‌యూ పవన్ హన్స్ లో వ్యూహాత్మక వాటా విక్రయానికి బ్రేక్ పడింది. బిడ్డింగ్‌లో విజయవంతమైన కన్సార్షియంలోని ఒక కంపెనీపై న్యాయపరమైన వివాదాలరీత్యా అనర్హతవేటు పడటం దీనికి కారణమని దీపమ్ పేర్కొంది. వెరసి పవన్ హంస్ ప్రయివేటైజేషన్ ప్రయత్నాలకు మూడోసారి చెక్ పడింది. బిడ్‌ను గెలుపొందిన స్టార్9 మొబిలిటీ ప్రయివేట్ లిమిటెడ్ కన్సార్షియంలోని అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీ ఫండ్ ఎస్‌పీసీపై పెండింగ్ కేసుల నేపథ్యంలో ప్రభుత్వం పవన్ హంస్ డిజిన్వెస్ట్‌మెంట్ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు దీపమ్ తెలియజేసింది. భాగస్వామ్య కంపెనీ పవన్ హంస్‌లో ప్రభుత్వానికి 51 శాతం, ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీకి 49 శాతం చొప్పున వాటా ఉంది. 2018లో షురూ: తొలుత పవన్ హన్స్ లో గల 51 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం 2018లో బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. అయితే ఓఎన్జీసీ సైతం 49 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడటంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 2019లో తిరిగి కంపెనీలో 100 శాతం వాటా విక్రయానికి బిడ్స్‌ను ఆహ్వానించినప్పటికీ స్పందన లభించకపోవడం గమనార్హం! ప్రభుత్వం 2020 డిసెంబర్లో మూడోసారి పవన్ హన్స్ విక్రయానికి తెరతీసింది. కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌ను ఆహ్వానించింది. 2022 ఏప్రిల్‌లో స్టార్9 మొబిలిటీ కన్సార్షియం గరిష్ట బిడ్డర్‌గా నిలిచింది. కన్సార్షియంలో అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీసహా.. బిగ్ చార్టర్ ప్రయివేట్ లిమిటెడ్, మహరాజ ఏవియేషన్ ప్రయివేట్ లిమిటెడ్ సైతం భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. -
సీఈఎల్ విక్రయానికి బ్రేక్
న్యూఢిల్లీ: సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(సీఈఎల్) విక్రయాన్ని తాజాగా ప్రభుత్వం రద్దు చేసింది. కంపెనీ కొనుగోలుకి బిడ్ చేసిన నండల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ డిజిన్వెస్ట్‌మెంట్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే దీనికి కారణమని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. నండల్ ఫైనాన్స్‌పై ఎన్సీఎల్టీలో దివాలా కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని బిడ్డర్ తెలియజేయకపోవడంతో రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాఖ(డీఎస్ఐఆర్)కు చెందిన సీఈఎల్‌ను ఢిల్లీ సంస్థ నండల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్‌కు విక్రయించేందుకు అనుమతించింది. డీల్ విలువ రూ. 210 కోట్లుకాగా.. బిడ్డింగ్ సమయంలో ఎన్సీఎల్టీ కేసు వివరాలను నండల్ ఫైనాన్స్ వెల్లడించలేనట్లు ప్రభుత్వ అధికారి తెలియజేశారు. కాగా.. మరోపక్క పవన్ హన్స్లో వ్యూహాత్మక విక్రయ అంశంపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ కొనుగోలుకి గెలుపొందిన బిడ్డర్లలో ఒకటైన అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీ ఫండ్ ఎస్‌పీసీపై ఎన్సీఎల్టీ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసు వివరాలపై అప్పటికి స్పష్టత రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. -
పవన్ హన్స్ అమ్మకానికి బ్రేక్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ పవన్ హన్స్ అమ్మకపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపి వేసింది. కంపెనీ కొనుగోలుకి ఎంపికైన కన్సార్షియంలోని అల్మాస్ గ్లోబల్‌కు వ్యతిరేకంగా ఎన్సీఎల్టీ జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో విక్రయాన్ని పక్కన పెట్టింది. తదుపరి చర్యలు తీసుకునేముందు ఎన్సీఎల్టీ ఆదేశాలపై చట్టపరమైన పరిశీలన చేపట్టినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీంతో బిడ్‌ను గెలుచుకున్నప్పటికీ లెటర్ ఆఫ్ అవార్డు(ఎల్వోఏ) జారీని చేపట్టబోమని తెలియజేశారు. పవన్ హన్స్ కొనుగోలుకి బిగ్ చార్టర్ ప్రయివేట్ లిమిటెడ్, మహరాజా ఏవియేషన్ ప్రయివేట్, అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీ ఫండ్ ఎస్‌పీసీతో కూడిన స్టార్9 మొబిలిటీ ప్రయివేట్ లిమిటెడ్ కన్సార్షియం బిడ్ గెలుపొందినట్లు ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది. పీఎస్‌యూ సంస్థ కొనుగోలుకి రూ. 211.14 కోట్ల విలువైన బిడ్‌ను స్టార్9 మొబిలిటీ దాఖలు చేసింది. ఇది ప్రభుత్వం నిర్ణయించిన రూ. 199.92 కోట్ల రిజర్వ్ ధరకంటే అధికం. అయితే కన్సార్షియంలో అల్మాస్ గ్లోబల్ అతిపెద్ద వాటాదారు కావడం గమనార్హం! స్టార్9 మొబిలిటీలో అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీ వాటా 49%కాగా.. బిగ్ చార్టర్ 26%, మహరాజా ఏవియేషన్ 25% వాటాలను కలిగి ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన కంపెనీ రిజల్యూషన్‌లో భాగంగా రుణదాతలకు చెల్లింపుల్లో విఫలమైనట్లు వెలువడిన వార్తలతో అల్మాస్ గ్లోబల్‌కు వ్యతిరేకంగా ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రెండో ప్రభుత్వ రంగ కంపెనీలో వ్మూహాత్మక వాటా విక్రయానికి బ్రేకులు పడినట్లయ్యింది. ఇంతక్రితం బిడ్ గెలుపొందిన సంస్థపై ఆరోపణల కారణంగా సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(సీఈఎల్) విక్రయం సైతం నిలిచిపోయింది. -
జూన్ నాటికి పవన్‌హన్స్ అమ్మకం
న్యూఢిల్లీ: హెలికాప్టర్ సేవల సంస్థ పవన్హన్స్ను స్టార్9 మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్‌కు జూన్ నాటికి అప్పగించడం పూర్తవుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. బిగ్ చార్టర్ ప్రైవేటు లిమిటెడ్, మహారాజ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్, ఆల్మాస్ గ్లోబల్ అపార్చునిటీస్ ఫండ్ ఎస్‌పీసీతో కూడిన కన్సార్షియమే స్టార్ 9 మొబిలిటీ. పవన్ హన్స్ కొనుగోలుకు రూ.211.14 కోట్లను కోట్ చేసి గరిష్ట బిడ్డర్‌గా ఈ సంస్థ నిలవడం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వ్ ధర రూ.199.92 కోట్లుగా ఉంది. స్టార్9 మొబిలిటీ కొన్ని అంశాల్లో అర్హతల ప్రమాణాలను చేరుకోలేదన్న ఆరోపణలను ఆ అధికారి ఖండించారు. ప్రభుత్వం కనీసం రూ.300 కోట్ల నెట్‌వర్త్ ఉండాలని నిర్ధేశించగా, గరిష్ట బిడ్డర్ స్టార్9 మొబిలిటీకి రూ.691 కోట్ల నెట్‌వర్త్ ఉన్నట్టు చెప్పారు. కన్సార్షియంలోని మహారాజ ఏవియేషన్ 2008లో ఏర్పాటు కాగా, బిగ్చార్టర్ 2014లో ఏర్పడినట్టు గుర్తు చేశారు. ఆల్మాస్ గ్లోబల్ అపార్చునిటీస్ ఫండ్ సైతం 2017 నుంచి పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ మూడు సంస్థలు భారతీయులకు చెందినవేనని పేర్కొన్నారు. చదవండి: ఓఎన్‌జీసీకే మెజారిటీ ఆయిల్, గ్యాస్ బ్లాకులు