న్యూఢిల్లీ: సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(సీఈఎల్) విక్రయాన్ని తాజాగా ప్రభుత్వం రద్దు చేసింది. కంపెనీ కొనుగోలుకి బిడ్ చేసిన నండల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ డిజిన్వెస్ట్‌మెంట్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే దీనికి కారణమని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. నండల్ ఫైనాన్స్‌పై ఎన్‌సీఎల్‌టీలో దివాలా కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని బిడ్డర్ తెలియజేయకపోవడంతో రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు.
గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాఖ(డీఎస్‌ఐఆర్)కు చెందిన సీఈఎల్‌ను ఢిల్లీ సంస్థ నండల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్‌కు విక్రయించేందుకు అనుమతించింది. డీల్ విలువ రూ. 210 కోట్లుకాగా.. బిడ్డింగ్ సమయంలో ఎన్‌సీఎల్‌టీ కేసు వివరాలను నండల్ ఫైనాన్స్ వెల్లడించలేనట్లు ప్రభుత్వ అధికారి తెలియజేశారు. కాగా.. మరోపక్క పవన్ హన్స్‌లో వ్యూహాత్మక విక్రయ అంశంపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ కొనుగోలుకి గెలుపొందిన బిడ్డర్లలో ఒకటైన అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీ ఫండ్ ఎస్‌పీసీపై ఎన్‌సీఎల్‌టీ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసు వివరాలపై అప్పటికి స్పష్టత రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
Comments
Please login to add a commentAdd a comment