![Bankruptcy Petition Filed By Canara Bank On Gayatri Projects - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/10/gayatri.jpg.webp?itok=lP8MAHe_)
న్యూఢిల్లీ: భారీగా పేరుకుపోయిన బాకీలను రాబట్టుకునేందుకు ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) సంస్థ గాయత్రి ప్రాజెక్ట్స్‌పై కెనరా బ్యాంక్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై తదుపరి విచారణను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) అక్టోబర్ 10న (నేడు) చేపట్టనుంది. గాయత్రి ప్రాజెక్ట్స్ సంస్థ బ్యాంకులకు దాదాపు రూ. 6,000 కోట్లు బకాయిపడింది. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) అత్యధికంగా రుణాలిచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment