
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోహ్యాన్స్ లైఫ్‌సైన్సెస్‌ను తమ సంస్థలో విలీనం చేసుకునే ప్రతిపాదనకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదముద్ర వేసినట్లు సువెన్ ఫార్మా వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
దీనితో తమ ఉత్పత్తి సామర్థ్యాలు మరింతగా మెరుగుపడతాయని సువెన్ ఫార్మా చైర్మన్ వివేక్ శర్మ చెప్పారు. ఉమ్మడి సామర్థ్యాల దన్నుతో వచ్చే అయిదేళ్లలో 1 బిలియన్ డాలర్ల ఆదాయం స్థాయికి చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇందులో కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్, మాన్యుఫాక్చరింగ్ సేవల వాటా గణనీయంగా ఉంటుందని పేర్కొన్నారు.