Varun Tej Ghani: Aditi Shankar Romeo Juliet Song Released Deets Inside - Sakshi
Sakshi News home page

Ghani: స్టార్‌ డైరెక్టర్‌ కూతురు పాడిన రోమియో జూలియట్‌ సాంగ్‌ విన్నారా?

Published Wed, Feb 9 2022 8:15 AM | Last Updated on Wed, Feb 9 2022 11:33 AM

Ghani: Aditi Shankar Romeo Juliet Song Released - Sakshi

వరుణ్‌ తేజ్, సయీ మంజ్రేకర్‌ జంటగా నటించిన చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలోని ‘రోమియో జూలియట్‌’ పాటను విజయవాడలో విడుదల చేశారు. దర్శకుడు శంకర్‌ కూతురు, నటి అదితీ శంకర్‌ ఈ పాటతో గాయనిగా మారారు.

అల్లు బాబీ మాట్లాడుతూ– ‘‘గని’ సినిమా అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చింది. తమన్‌ మంచి సంగీతం ఇచ్చాడు’’ అన్నారు. ‘‘ఈ పాటను నేనెప్పుడో ట్యూన్‌ చేసి పెట్టుకున్నాను.. అనుకోకుండా ‘గని’ కి కుదిరింది. అదితీ శంకర్‌తోనే ఈ పాట పాడించాలని ముందునుంచే అనుకున్నాను’’ అన్నారు తమన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement