Kalavathi Songs From Sarkaru Vaari Pata Gets 20M Views - Sakshi
Sakshi News home page

Kalaavathi Song: 20Mకి పైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న కళావతి సాంగ్‌

Published Tue, Feb 15 2022 6:41 PM | Last Updated on Tue, Feb 15 2022 7:38 PM

Kalaavathi Song From Sarkaru Vaari Pata Gets 20M Views - Sakshi

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వాలెంటైన్స్‌డేకు ఒకరోజు ముందుగా ఈ సినిమాలోని తొలి లిరికల్‌ సాంగ్‌ కళావతి సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

'వందో, ఒక వెయ్యో, ఒకలక్షో మెరుపులు దూకినాయా.. ఏందే ఈ మాయ, కమా కమాన్‌ కళావతి.. నువ్వే లేకుంటే అదోగతి' అంటూ సాగే లిరిక్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు ఈ పాట 20మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ని సాధించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సోషల్‌మీడియాలో సైతం ఈ సాంగ్‌కు భారీ రెస్పాన్స్‌ వస్తుంది. సిద్‌ శ్రీరామ్‌ పాడిన ఈ పాటకు అప్పుడే 943kకి పైగా లైక్స్‌ రావడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement