Bro Movie Teaser: Netizens Satirical Trolls On Trivikram Over Pooja Hegde Ad Before Teaser - Sakshi
Sakshi News home page

Trolls On Bro Teaser: ఇదేం ట్రోలింగ్‌ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!

Published Sat, Jul 1 2023 8:41 AM | Last Updated on Sat, Jul 1 2023 10:23 AM

Bro Movie Teaser In Pooja Hegde Trolls On Trivikram - Sakshi

పవన్ ​ 'బ్రో' సినిమా.. టీజర్ తాజాగా రిలీజైన విషయం తెలిసిందే. ఆయన మేనల్లుడు తేజ్ కూడా ఇందులో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించాడు. అంతా బాగుంది కానీ ఈ టీజర్​ విషయంపై నెట్టింట్లో ట్రోల్ కూడా చేస్తున్నారు.

(ఇదీ చదవండి: ఆమెతో సుధీర్‌ నిశ్చితార్ధం.. మరీ రష్మి పరిస్థితి ఏంటి అంటూ..)

అదేంటంటే.. 'బ్రో' టీజర్​లో పూజా హెగ్డే గురించి. టీజర్‌ ప్రారంభంలో ఓ కమర్షియల్‌ యాడ్‌లో పూజా హెగ్డే కనిపిస్తుంది. ఆమెను యాడ్ చేయడానికే.. టీజర్​ను లేట్​గా రిలీజ్​ చేశారంటూ సోషల్‌ మీడియాలో పలువురు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ టీజర్​లో పెట్టడానికేనా .. మహేశ్​ 'గుంటూరు కారం' నుంచి పూజను తీసేశావ్‌ అంటూ త్రివిక్రమ్​పై సెట్టైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం సోషల్​మీడియా అంతా ఇదే చర్చ జరుగుతుంది.

పూజా లేకుండా త్రివిక్రమ్ సినిమాలు అస్సలు చేయలేరని, ఎక్కడో చోట ఆమె ఉండాల్సిందే అంటూ వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆయన అభిమానులు మాత్రం అసలే త్రివిక్రమ్​కు పూజా లక్కీ హీరోయిన్ అంటూనే ఇదేం ట్రోలింగ్‌ బ్రో.. ఇకనైనా ఆపేయండని సోషల్‌మీడియాలో కోరుతున్నారు.

(ఇదీ చదవండి: శృంగారం గురించి బోల్డ్‌ కామెంట్‌ చేసిన సీతారామం బ్యూటీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement